చేతిలో మూడు చిత్రాలు.. మరో కథకు ఓకే చెప్పిన హీరో! | Kollywood Hero Jayam Ravi Ready To Acts In Another Film, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Jayam Ravi: ఆయన డైరెక్షన్‌లో చేసేందుకు జయంరవి గ్రీన్ సిగ్నల్!

Published Thu, May 30 2024 3:15 PM

Kollywood Hero Jayam Ravi Ready To Acts In Another Film

కోలీవుడ్ హీరో జయంరవి గతేడాది పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రాలతో హిట్‌ సాధించారు. ఆ తరువాత ఆయన కెరీర్‌లో సరైన హిట్‌ పడడం లేదు. అయితే అంతకు ముందు కంటే జయంరవి ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాదలిక్క నేరమిలై చిత్రాన్ని పూర్తి చేశారు. అంతే కాకుండా బ్రదర్, జీనీ చిత్రాలు అతని చేతిలో ఉన్నాయి. వీటితో పాటు తన సోదరుడు మోహన్‌రాజా దర్శకత్వంలో తనీఒరువన్‌ –2 చేయాల్సి ఉంది.

ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో పాండిరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి జయంరవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. సూర్య హీరోగా ఎదర్కుం తుణిందవన్‌ చిత్రం చేసిన పాండిరాజ్‌ ఆ తరువాత ఇప్పుటి వరకూ మరో చిత్రం చేయలేదు. నిజానికి ఆ చిత్రం కమిర్షియల్‌గా పెద్దగా హిట్‌ కాలేదు. ఆ తరువాత నటుడు విశాల్‌ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగినా, అది వాస్తవ రూపం దాటలేదు.

కాగా.. తాజాగా పాండిరాజ్‌ చెప్పిన కథ నటుడు జయంరవికి నచ్చినట్లు సమాచారం. జయంరవి హీరోగా సుజాతా విజయకుమార్‌ హోమ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మించిన సైరన్‌ చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఆ బ్యానర్‌లో మరో చిత్రం చేయాలని జయంరవి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పాండిరాజ్‌ చెప్పిన కథ హోం మూవీ మేకర్స్‌ సంస్థ నిర్వాహకులకు నచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసిన తరువాత జయంరవి ఈ చిత్రానికి సిద్ధం అవుతారని తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement