అరంగేట్రంలోనే చెలరేగిన నమన్‌ ధిర్‌.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..? | Indian bowlers restricted west indies to 171 runs in 1st T20I | Sakshi
Sakshi News home page

అరంగేట్రంలోనే చెలరేగిన నమన్‌ ధిర్‌.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..?

Oct 6 2026 8:48 PM | Updated on Oct 6 2026 8:53 PM

Indian bowlers restricted west indies to 171 runs in 1st T20I

source: X

భారత స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నమన్‌ ధిర్‌ అరంగేట్రంలోనే చెలరేగిపోయాడు. విండీస్‌తో ఇవాళ జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన ధిర్‌.. ఈ మ్యాచ్‌లో ఏకంగా 3 వికెట్లు (3-31) పడగొట్టాడు. తద్వారా ప్రజ్ఞాన్‌ ఓజా (4-21), అక్షర్‌ పటేల్‌ (3-17) తర్వాత అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.  

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ విండీస్‌ను కట్టడి చేసినట్లే చేసి, చివరికి ఓ మోస్తరు స్కోర్‌ చేయనచ్చింది (19.1 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్‌). హోప్‌ (52), రూథర్‌ఫోర్డ్‌ (56) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసినప్పటికీ.. హొప్‌, రూథర్‌ఫోర్డ్‌ వీలు చిక్కినప్పుడంతా భారీ షాట్లు ఆడి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా రూథర్‌ఫోర్డ్‌ ఇన్నింగ్స్‌ చివర్లో భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 

ఓ దశలో 150 పరుగుల మార్కు కూడా తాకలేదనుకున్న విండీస్‌ స్కోర్‌, రూథర్‌ఫోర్డ్‌ పుణ్యమా అని 171 పరుగులకు చేరింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో హోప్‌, రూథర్‌ఫోర్డ్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్‌తో పాటు అకీల్‌ హొసేన్‌ (15) ఒకటి అరా షాట్లు ఆడాడు.

భారత బౌలర్లలో నమన్‌ ధిర్‌తో పాటు కుల్దీప్‌ యాదవ్‌ (2-33), అక్షర్‌ పటేల్‌ (2-26), అర్షదీప్‌ సింగ్‌ (1-34) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మయాంక్‌ యాదవ్‌ (1-40) ప్రమాదకరంగా కనిపించిన రూథర్‌ఫోర్డ్‌ను ఔట్‌ చేసినప్పటికీ పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. 

ఇదీ చదవండి: జడేజా కంటే అక్షర్‌ బెటర్‌.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement