ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్‌ అరుదైన ఫీట్‌ | India Becomes 1st Team Defeat England In Edgbaston ODIs In Last 12 Years, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్‌ అరుదైన ఫీట్‌

Jul 15 2026 8:54 AM | Updated on Jul 15 2026 10:22 AM

India Becomes 1st-Team-Defeat England-Edgbaston-ODIs-Last 12 Years

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో విజయం ద్వారా టీమిండియా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలి విజయంతో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించగా, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. గత 12 ఏళ్లలో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన వన్డేలో ఇంగ్లండ్‌ను ఓడించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో 2015 నుంచి తాము ఆడిన ఏడు వన్డేల్లో ఇంగ్లండ్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. 2014లో ఇదే ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది కూడా టీమిండియానే. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ కంచుకోటను మరోమారు గిల్ కెప్టెన్సీలోని టీమిండియానే బద్దలు కొట్టడం విశేషం.

👉మరో రికార్డు ఏంటంటే.. ఇంగ్లండ్‌పై వన్డేల్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. తన లాంగ్ స్ట్రీక్‌ను భారత జట్టు విజయవంతంగా కొనసాగిస్తోంది. గతంలో మూడు వివిధ సందర్భాల్లో ఇంగ్లండ్‌పై వన్డేల్లో వరుసగా ఐదేసి విజయాలు నమోదు చేసింది.

👉 కోహ్లి, రోహిత్ విఫలమైన వేళ టీమిండియా వన్డేల్లో 250 ప్లస్ స్కోరును ఛేదించడం 2016 నుంచి ఇది రెండోసారి మాత్రమే. 2022లో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 260 పరుగుల టార్గెట్‌ను టీమిండియా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌లు 17 పరుగులు చేసి ఔటయ్యారు.

చదవండి: తొలి వ‌న్డేలో రిటైర్డ్ హ‌ర్ట్‌.. గిల్ గాయంపై కీల‌క అప్‌డేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement