చంద్రబాబుకు అమ్ముడుపోయిన మంద కృష్ణకు బుద్ధి చెబుతాం  | Round Table Meeting of AP Madiga Sanghas | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు అమ్ముడుపోయిన మంద కృష్ణకు బుద్ధి చెబుతాం 

Mar 29 2024 4:31 AM | Updated on Mar 29 2024 4:31 AM

Round Table Meeting of AP Madiga Sanghas - Sakshi

ముప్పై ఏళ్లుగా మాదిగలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు 

ఎన్నికలు వచ్చే సరికి జాతిని తాకట్టు పెడుతున్నాడు 

ఈ నెల 30న గుంటూరు సభకు ఎలా వస్తాడో చూస్తాం 

ఇకపై మంద కృష్ణ ఆటలను సాగనివ్వం   

మాదిగల ద్రోహులు బాబు, మంద కృష్ణలకు గుణపాఠం తప్పదు 

ఏపీ మాదిగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతల ధ్వజం  

సాక్షి, అమరావతి: వర్గీకరణ పేరుతో ముప్‌పై ఏళ్లుగా మాదిగలకు వెన్నుపోటు పొడుస్తున్న మంద కృష్ణ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు తమ జాతిని తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతాడని మాదిగ సంఘాలు మండిపడ్డాయి. చంద్రబాబుకు ప్యాకేజీకి అమ్ముడుపోయిన మంద కృష్ణ ఈ నెల 30న గుంటూరులో జరిగే సభకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించాయి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్‌ హాలులో ఆంధ్రప్రదేశ్‌ మాదిగ సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం గురువారం జరిగింది. రాష్ట్రంలోని 25 మాదిగ సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మనువాద బీజేపీ, మోసకారి చంద్రబాబు కూటమికి ఎందుకు ఓటెయ్యాలని పలువురు మాదిగ సంఘాల నేతలు ప్రశ్నించారు. మనువాద విష కౌగిలికి మాదిగలను చేర్చేందుకు మంద కృష్ణ ప్రయత్నిస్తున్నాడని, చంద్రబాబుతో అక్రమ సంబంధం నెరపుతున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తానని హామీ ఇచ్చిన బీజేపీ పదేళ్లు అయినా పట్టించుకోలేదని, వర్గీకరణను అడ్డుపెట్టుకుని చంద్రబాబు మాదిగల ఓట్లతో రాజకీయ లబ్ధి పొందుతున్నాడని మండిపడ్డారు.

ఇకపై మంద కృష్ణ ఆటలు సాగనివ్వబోమని, అతని ఎత్తులను కచ్చితంగా తిప్పి కొడతామని మాదిగ నేతలు హెచ్చరించారు. మాదిగల ద్రోహులు బాబు, మంద కృష్ణలకు గుణపాఠం చెబుతామన్నారు. రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్ణయాలను సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు. 

బాబు దగా చేస్తే.. జగన్‌ మేలు చేశారు 
నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్‌ సమాఖ్య అధ్యక్షులు పరిశపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ద్వారా చంద్రబాబు హయాంలో మాదిగలకు 22 వేల ఉద్యోగాలొచ్చాయని మంద కృష్ణ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడన్నారు. ముప్‌పై ఏళ్లుగా టీడీపీ చంకలో దూరిన మంద కృష్ణ రాష్ట్రంలోని మిగిలిన పార్టీలకు మాదిగలను దూరం చేసి జాతికి తీరని ద్రోహం చేశాడన్నారు.

చంద్రబాబు పాలనలో మాదిగలకు జరిగిన మేలు ఏమిటో ఒక్కటి కూడా మంద కృష్ణ చెప్పలేడన్నారు. ఓట్లు పొందుతున్న చంద్రబాబు తగినన్ని సీట్లు కేటాయించలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు పది సీట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. చంద్రబాబు హయాంలో పది శాతం మాదిగ కుటుంబాలకు మేలు జరిగితే గొప్పలు చెప్పుకునేవారని, అదే సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో 90 నుంచి 96 శాతం మాదిగ కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు.

ఊరి చివర ఉండే వెలివాడల్లోని తమ ఇళ్ల వద్దకే వచ్చి సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఎస్సీ శ్మశాన వాటికల సమస్యను అర్థం చేసుకుని ప్రతి ఊరిలో ఒక ఎకరం చొప్పున కేటాయించేలా ప్రభుత్వం చర్య తీసుకుందన్నారు. మాదిగలకు నిజమైన మేలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మద్దతు ఇవ్వడం తమ ధర్మం అన్నారు.  

ఏ హక్కుతో ఏపీకి వస్తావ్‌ 
ఎమ్మార్పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. మాదిగలకు ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మంద కృష్ణ మద్దతివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్‌ కార్డు, ఓటు హక్కు కూడా లేని మంద కృష్ణకు ఏ హక్కు ఉందని ఎన్నికలు వచ్చే సరికి మాదిగ జాతి మొత్తాన్ని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని ప్రశ్నించారు.

ప్యాకేజీకి అమ్ముడుపోయిన మంద కృష్ణ తన తీరు మార్చుకోకపోతే ఈ నెల 30న నిర్వహిస్తున్న సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. గుంటూరులో ఎలా అడుగుపెడతాడో చూస్తామని, నీ సంగతి తేలుస్తామని అల్టిమేటం ఇచ్చారు. మాదిగలను అంబేడ్కర్‌ వాదం నుంచి మనువాదం వైపు నడిపే మంద కృష్ణ ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు.

మాట్లాడిన వారిలో సువర్ణరాజు(ఏపీ ఎమ్మార్పీఎస్‌), చెరుకూరి కిరణ్‌(మాదిగ కార్పొరేషన్‌ సాధన సమితి), కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌(మాదిగ మహాసేన), మంద క్రిష్ణయ్య(ఆర్‌ఎంఆర్‌పీఎస్‌), గడ్డం బాపిరాజు(ఐఎన్‌ఎఫ్‌ఓఆర్‌ఎం), పొన్నెకంటి రమే‹Ù(మాదిగ దండోర), జానయ్య (జైభీమ్‌ ఎమ్మార్పిస్‌), ఈపూరి ఆదాం(బహుజన పరిరక్షణ సమితి), జుజ్జవరపు రవిప్రకా‹Ù(దళితసేన), మల్లవరపు నాగయ్య(అమరావతి ఎమ్మార్పిఎస్‌), వరదరాజులు(నేషనల్‌ ఎమ్మార్పీఎస్‌), పులిదాసు(ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి), బి.మేరీ కుమారి ఉన్నారు. 

మాదిగలకు మేలు చేసిన జగన్‌  
మాదిగలను చంద్రబాబు దగా చేస్తే సీఎం వైఎస్‌ జగన్‌ మేలు చేశారని మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు స్పష్టం చేశారు. మాదిగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సంఘీభావంగా హాజరైన వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదిగలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారన్నారు. మాదిగలను అడ్డుపెట్టుకుని అన్ని రకాలుగా లబి్ధపొందిన మంద కృష్ణ మోసాలు ఇక సాగవన్నారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్‌ మాదిగ జాతిని చంద్రబాబుకు తాకట్టు పెడితే సహించేదిలేదన్నారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ వెంటే మాదిగలు ఉన్నారని స్పష్టం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement