సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రకాశ్‌రాజ్ తాజాగా ఎక్స్ వేదికగా..‘మీరొస్తానంటె మేమొద్దంటామా?. రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?. లేదా సింగల్‌గా వస్తున్నారా?. అది చెప్పి రండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే ఆయన ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

“మీరొస్తానంటె మేమొద్దంటామా?
రండి దొర ..
కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?
లేదా సింగల్ గా వస్తున్నారా?
అది చెప్పి రండి . #justasking— Prakash Raj (@prakashraaj) June 4, 2026


