ప్రియుడితో కలిసి మొగుడ్ని లేపేసి, గుండెపోటు నాటకం : చివరికి | Woman Boyfriend Kill Husband In Meerut Phone Chat Exposes Plot | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి మొగుడ్ని లేపేసి, గుండెపోటు నాటకం : చివరికి

Oct 7 2026 5:41 PM | Updated on Oct 7 2026 5:58 PM

Woman Boyfriend Kill Husband In Meerut Phone Chat Exposes Plot

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తరువాత తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. కానీ నేరం చేసిన వాళ్ల గుట్టు ఎప్పటికైనా రట్టు కాక తప్పదు. భర్త ఫోన్‌లోని చాట్‌, భార్య వివాహేతర సంబంధాన్ని, ప్రియుడితో కలిసి పన్నిన  పన్నాగాన్ని  బయటపెట్టింది.  ఏం జరిగిందంటే..

ఈ సంఘటన మీరట్‌లోని లోహియా నగర్‌లో జరిగింది. మృతుడు 30 ఏళ్ల తాలిబ్ కాగా, 27 ఏళ్ల ఇల్మా బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. మూడేళ్ల పాప కూడా ఉంది. సెప్టెంబర్‌లో హత్య జరిగిన రోజు, తాలిబ్ పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని బంధువులకు చెప్పింది. అలా మంచంపై పడుకుని, ఇలా కొద్ది క్షణాల్లోనే  ప్రాణాలొదిలేశాడని తన పెద్దన్నయ్య అక్రమ్‌, ఇతర బంధువులను నమ్మించింది. దీంతో కుటుంబ సభ్యులు ఇది సహజ మరణమేనని భావించి అతడి కర్మకాండల్ని పూర్తి చేశారు. ఇల్మా తాలిబ్ మొబైల్‌ను దాచి పెట్టేసింది. ఇక ఈ విషయం ఎవరికీ తెలియదు అనుకుంది. 

అక్టోబర్ 1న తాలిబ్ బంధువు రైస్ ఇల్మా ఇంటికి  వచ్చాడు. ఆ తరువాత తాలిబ్‌ది సహజ మరణం కాదని అనుమానం కలిగింది. ఇంతలో బట్టల కింద దాచి పెట్టిన మృతుడి మొబైల్‌ను గుర్తించాడు. ఆ ఫోన్‌లో తాలిబ్‌కు, అమాన్‌కు మధ్య జరిగిన సంభాషణ లభించింది. అందులో తాలిబ్ తన భార్యతో మాట్లాడవద్దని అమాన్‌ను హెచ్చరించిన మెసేజ్‌లను  గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో, ఇల్మా తన భర్తను తానే హత్య చేసినట్లు అంగీకరించింది. 

ఇదీ చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

తాలిబ్ తనను కొట్టేవాడని ఇల్మా  హత్య జరిగిన తీరును వివరించింది.  సెప్టెంబర్ 28న తనపై దాడి జరిగిన తర్వాత, ఆమె తన ప్రియుడు అమాన్‌కు ఫోన్ చేసింది. అమాన్ తన స్నేహితుడితో కలిసి వచ్చి, ముగ్గురూ కలిసి తాలిబ్‌ను కొట్టారు. ఆ తర్వాత అమాన్ ఒక చున్నీతో తాలిబ్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అమాన్ ఇల్మాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.

ఇదీ చదవండి: రూ. 60 లక్షలు : థాయ్‌ మహిళ-యూపీవాలా సోషల్‌ మీడియా లవ్‌

దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఇల్మాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కోత్వాలి సర్కిల్ ఆఫీసర్ సంగ్రామ్ సింగ్  తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్‌కు నివేదించామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి: నో షూస్‌, నో సూట్..1600 మీటర్ల రన్‌, అదీ చీరలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement