రూ. 60 లక్షలు : థాయ్‌ మహిళ-యూపీవాలా సోషల్‌ మీడియా లవ్‌ | Thailand Woman Allegedly Duped Of Rs 60 Lakh By Kanpur Man She Met Online, Travels To India Seeking Justice | Sakshi
Sakshi News home page

రూ. 60 లక్షలు : థాయ్‌ మహిళ-యూపీవాలా సోషల్‌ మీడియా లవ్‌

Oct 7 2026 3:05 PM | Updated on Oct 7 2026 3:43 PM

Thai Woman Marries  UP Man Lends 60 LakhsThen Discovers His 1st Marriage

సోషల్ మీడియాలో మెల్లిగా స్నేహంగా ప్రారంభమైంది. అలా ఆ పరిచయం  త్వరలోనే ప్రేమగా మారింది.   చివరికి తన ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంది.   ఆ తరువాత లబోదిబో మంది.  ఇది ఏదో సినిమా కథ కాదు, కాన్పూర్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న థాయ్‌లాండ్ మహిళ నిజ జీవిత గాథ.

థాయ్‌లాండ్‌లో రెస్టారెంట్,  క్యాంటీన్ నడుపుకుంటూ జీవిస్తోంది అప్సార్ (Upsorn),  సోషల్ మీడియా ద్వారా  ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన లెదర్ వ్యాపారి ఇర్ఫాన్‌తో  పరిచయం ఏర్పడింది. వారి ఆన్‌లైన్ చాట్‌లు క్రమంగా రొమాంటిక్ రిలేషన్‌షిప్‌గా మారాయి. ఒక రోజు ప్రియురాల్ని కలవడానికి   ఏకంగా థాయ్‌లాండ్‌ వెళ్లాడు ఇర్ఫాన్‌. ఆమె పరిస్థితిని, స్థితిగతులను గమనించాడు. ఆమెను నమ్మించి, రెండేళ్ల క్రితం ఆమెను థాయ్‌లాండ్‌లో వివాహం చేసుకున్నాడు. దీంతో తన అదృష్టానికి తనకు తానే మురిసి పోయింది అప్సార్. కానీ ఇర్ఫాన్‌ ప్లాన్‌ మరోలా ఉంది. నెమ్మదిగా తన పథకాన్ని అమలు చేశాడు. వ్యాపారం, అవసరాలు అంటూ ఆమె దగ్గర డబ్బులు లాగడం మొదలుపెట్టాడు.  దీంతో భర్తే  కదా అనే ఉద్దేశంతో తన సంపాదనతోపాటు, బంధువుల దగ్గర అప్పు  తీసుకొని మరీ  కాలక్రమేణా  దాదాపు రూ. 60 లక్షలు  అప్సార్‌కి  ముట్టజెప్పింది. ఆ తరువాత ఇక ఇర్ఫాన్‌ ఆమెతో అన్ని సంబంధాలను తెంచుకుని భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ఆమెతో సంబంధాలను కట్‌ చేసుకోవాలని చూశాడు.

ఇదీ చదవండి: నో షూస్‌, నో సూట్..1600 మీటర్ల రన్‌, అదీ చీరలో
తన భర్త నుంచి నెలల తరబడి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, భర్తను వెదుక్కుంటూ ఇండియాకు వచ్చింది. అక్టోబర్ 6న  కాన్పూర్‌లోని ఇర్ఫాన్‌ ఇంటికి చేరింది. అక్కడ మెకు దిగ్భ్రాంతికరమైన నిజం తెలియడంతో షాక్‌ అయింది.  ఇర్ఫాన్‌కు 12 ఏళ్ల క్రితమే  పెళ్లి అయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు.

దీంతో తననెందుకు మోసం చేశావని నిలదీసింది., తన డబ్బు తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. తనతో ఉండాలన్నా లేదా తన డబ్బు తిరిగి రావాలన్నా, ఇస్లాం మతంలోకి మారి బుర్ఖా ధరించాలని  షరతు పెట్టాడు. అంతేకాదు ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు.  దీంతో ఆమె వేరే దారి లేక స్థానిక పోలీసులను ఆశ్రయించింది.   అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) శివ సింగ్‌ను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకుంది.. మతమార్పిడి కోణంతో సహా ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చర్యలు చేపట్టారు. కేసు  నమోదు చేసిన పోలీసులు ఇర్ఫాన్‌ను అరెస్ట్ చేశారు. వివాహ పత్రాలు, రూ. 60 లక్షల బదిలీకి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, అలాగే మహిళపై మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement