Hajipur Serial Murders
-
‘హాజీపూర్’ ఘటన; అమలు కాని హామీలు
బొమ్మలరామారం (ఆలేరు) : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది హాజీపూర్ ముగ్గురు బాలికల వరుస హత్యల సంఘటన. ఈ ఘోరం జరిగి 16 నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా అందించడంలో విఫలం అయింది. నల్లగొండ పోక్సో కోర్టు ఫిబ్రవరి 6న సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబ సభ్యులు కొంత ఊరట పొందారు. కాని నిందితుడికి ఉరి శిక్ష అమలు కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందిన పరిహారం తమను పరిహాసం చేస్తుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తుల ప్రధాన డిమాండ్ అయిన హాజీపూర్ గ్రామ సమీపంలోని వాగుపై బ్రిడ్జి నిర్మాణం హామీ ఇంకా అమలుకాలేదు. నెరవేరని డిమాండ్లు.. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం ప్రకటించింది. మూడు బాధిత కుటుంబాల వారు నిరుపేదలే.. లీగల్ సెల్ నుంచి సైతం నేటికీ ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. ఉపాధి కోసం ఉద్యోగం లేదు, శిథిలావస్థలో చేరుకున్న ఇళ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో బాధితులు ప్రభుత్వ సాయం వైపు ధీనంగా ఎదురుచూస్తున్నారు. దయనీయ స్థితిలో మైసిరెడ్డిపల్లి బాధిత కుటుంబం.. సైకో శ్రీనివాస్‌రెడ్డి దురాగతాలకు బలైన ముగ్గురు బాలికల కుటుంబాల వారు నిరుపేదలే. వీరిలో ఇద్దరు హాజీపూర్ గ్రామానికి చెందిన వారు కాగా, మరో అమ్మాయిది మైసిరెడ్డిపల్లి గ్రామం. ఈ కుటుంబాన్ని విధి వెక్కిరించి మరింత దయనీయంగా మారింది. మృతురాలికి ఉన్న ఒక్క తమ్ముడు దివ్యాంగుడు. ఇతనికి ప్రభుత్వం పరంగా నాణ్యమైన వైద్యం అందజేస్తామని పింఛన్ మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా నెరవేరలేదు. పింఛన్ కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా నేటికీ మంజూరు కాలేదు. ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉన్న ఇంటిలోనే కాలం వెల్లదీస్తున్నారు. అందిన సాయం లక్షలోపే.. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి అందిన సాయం రూ. లక్షలోపే ఉంది. బీసీ కార్పొరేషన్ నుంచి రూ. 50 వేల చొప్పున రుణ సాయంతోపాటు మరో రూ. 25 వేల చొప్పున ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 75 వేల ఆర్థిక సాయం మాత్రమే అందింది. కల్పన కుటుంబ సభ్యులు: పెద్దసార్లు కనికరించాలి కూతురు పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. సర్కారు నుంచి సాయం చేస్తామని మాటిచ్చి ఏడాది దాటింది. ఇకనైనా తమను ఆదుకునేలా పెద్దసార్లు కనికరించాలి. సైకో శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఉరితీయాలి. మా పిల్లల ఉసురు తీసునోన్ని ఇంకా ఎన్ని రోజులు మేపుతారో అర్థం కావడం లేదు. – తిప్రబోయిన మల్లేష్, బాధితురాలి తండ్రి, హాజీపూర్ మనీషా కుటుంబ సభ్యులు : ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాం ఘటన జరిగి 16 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాం. తమ్ముడు దివ్యాంగుడు కావడంతో నాకు ఉద్యోగం కల్పిస్తే మా కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరీ చేసి ఎక్స్‌గ్రేషియా అందజేయాలి. నిందితుడిని ఉరి తీసిన రోజే మాకు సంపూర్ణ న్యాయం జరిగినట్లు. – తుంగని మీనా, బాధితురాలి సోదరి, మైసిరెడ్డిపల్లి హామీలు అమలు కాలేదు మా కూతురు మృత్యువాత పడి ఏడాది దాటినా ప్రభుత్వ హామీలు అమలు కాలేదు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటారని ఎదురుచూస్తున్నాం. కాని కాలయాపన జరుగుతోంది. మమ్మల్ని ఆదుకునేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలి. నిందితుడిని ఉరి తీయకుండా ప్రజాధనంతో మేపుతున్నారు. శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీసినప్పుడే పిల్లల ఆత్మలు శాంతిస్తాయి. – పాముల నర్సింహ, బాధితురాలి తండ్రి, హాజీపూర్ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం హాజీపూర్ బాధితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి, లీగల్ సెల్ అథారిటీకి నివేదికలు పంపాం. బొమ్మలరామారం మండలంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు పనులు ప్రారంభించగానే బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపడుతాం. బాధిత కుటుంబంలోని ఒకరికి విద్యార్హతను నిర్ధారించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – కలెక్టర్ అనితా రామచంద్రన్ -
మర్రి, తెట్టె బావుల పూడ్చివేత
బొమ్మలరామారం: హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలను దారుణంగా హత్య చేసి పూడ్చి వేసిన మర్రి, తెట్టె బావులు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలకు సజీవ సాక్షం. అసాంఘిక చర్యలు జరిగిన నేపథ్యంలో కలెక్టర్ అనితా రామచంద్రన్‌ఆదేశాల మేరకు రెండు బావులను పూడ్చివేశారు. ప్రస్తుతం ఆ బావులు ఉన్న ప్రదేశం రూపురేఖలు మారిపోయాయి. -
హాజీపూర్: ఈ కారణం వల్లే వారు బలయ్యారు!
సాక్షి, యాదాద్రి: ‘బేటీ బచావో బేటీ పడావో’నినాదంతో బాలికల రక్షణ, చదువు కోసం ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఓ కిరాతకుడి చేతిలో బలయ్యారు. సరైన రవాణా వసతి లేకున్నా.. తమ కుమార్తెలను చదువు కోసం పొరుగున ఉన్న గ్రామాలకు పంపించాయి ఆ పేద కుటుంబాలు. కానీ లిఫ్ట్ ఇచ్చే పేరుతో ఓ రాక్షసుడు ఆ బాలికలపై ఘోరానికి ఒడిగట్టాడు. హాజీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మరో బాలికపై హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన విషయంలో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. రాజధానికి శివారునే ఉన్న బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు గ్రామాల మీదుగా భువనగిరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ముగ్గురు బాలికలు బలైపోయారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. స్పెషల్ క్లాసులకు వెళ్లి.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల నర్సింహా, నాగమణి దంపతుల కుమార్తె(14) మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆమె గతేడాది ఏప్రిల్ నెల 25న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లి సాయంత్రం 3 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 2019 మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన హాజీపూర్ గ్రామానికే చెందిన మరో బాలిక(18) మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని కేఎల్ఆర్ కాలేజీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో 2019 మార్చిలో శివరాత్రి పర్వదినం అనంతరం 6వ తేదీన కాలేజీకి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఇద్దరు బాలికలనూ హాజీపూర్‌కే చెందిన శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అత్యాచారం, హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. సాక్షి కథనంతో తెరపైకి మరో మిస్సింగ్ కేసు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక (11) 2015లో అదృశ్యమైంది. ఈ మిస్సింగ్ కేసులో పోలీసులు నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 2019 ఏప్రిల్ 29న ‘సాక్షి’దినపత్రికలో ఆ బాలిక మిస్సింగ్‌పై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసు లు కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా, ఆ బా లికనూ తానే పొట్టన పెట్టుకున్నట్లు ఒప్పుకొన్నాడు. ఉద్యోగానికి పంపుదామంటే ఊపిరి తీసిండు: పేద కుటుంబానికి చెందిన నేను కూతురిని చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొద్దామంటే సైకో శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు ఊపిరి తీసి నా ఆశలు ఆవిరి చేసిండు. శ్రీనివాస్‌రెడ్డికి బతికే హక్కు లేదు. కోర్టు తీర్పుతో పానం నిమ్మలమైంది. వాయిదాలు లేకుండా తొందరగా ఉరి తీసి మా పిల్లల పానాలు తీసిన బావిలోనే సైకోను పాతి పెట్టాలి. అప్పుడే పోకిరీలకు కనువిప్పు కలుగుతుంది. – తిప్రబోయిన మల్లేశ్, బాలిక తండ్రి -
ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి..
బొమ్మలరామారం: హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఉదయం నుంచి ఎదురుచూపులు సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందోనని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే త గిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఉరితీసిన రోజే సంతృప్తి:పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సం తృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. -
హాజీపూర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష
-
శాస్త్రీయ ఆధారాలతో రుజువు...
సాక్షి, యాదాద్రి: హాజీపూర్ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్ష ఖరారు చేయడం వెనుక తీవ్ర కసరత్తే జరిగింది. అత్యాచారాలు జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేకున్నా.. శాస్త్ర, సాంకేతికత, వైద్యరంగాన్ని ఉపయోగించుకుని కేసును ఛేదించి నిందితుడికి ఉరి శిక్షపడటంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. పాఠశాలకు వెళ్తున్న బాలికలను టార్గెట్ చేసి లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన వివరాలను పోలీసులు సమర్థంగా నిరూపించారు. నిందితుడి మొబైల్ కాల్‌డేటా, సాంకేతిక పరిజ్ఞానం, డీఎన్ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక సాయంతో ఈ మూడు కేసుల్లో చార్జీషీటు దాఖలు చేశారు. హాజీపూర్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, హత్యకు గురైన బాలికకు సంబంధించిన పుస్తకాల బ్యాగ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. సవాలుగా తీసుకున్న పోలీసులు హజీపూర్ బాలికల కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడిని వెం టనే పట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసి వ్యవసాయ బావుల్లో పూడ్చిపెట్టిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అరెస్టు విషయంలో ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక ఎస్సై వెంకటేశ్‌ను సస్పెండ్ చేశారు. కేసు విచారణ అధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నియమించారు. ఏప్రిల్ 29న శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి వరంగల్ జైలుకు తరలించారు. వివిధ శాఖల సహకారం రాచకొండ పోలీసులు.. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖలు, ఫింగర్ ప్రింట్స్, క్లూస్‌టీం, ఐటీ సెల్, వివిధ పాఠశాలల బాలికలు, సెల్‌ఫోన్ నెట్వర్క్ విభాగాలు, డీఎన్ఏ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీలు, ఇంకా వివిధ విభాగాల ఆధారాల ఆధారంగా చార్జిషీట్లు దాఖలు చేసి నేరాన్ని రుజువు చేశారు. రాచకొండ సిబ్బందికి డీజీపీ ప్రశంసలు సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హాజీపూర్ వరుస హత్యలు, అత్యాచార ఘటనల కేసులో బాధితులకు న్యాయం జరిగిందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. హంతకుడికి రెండు కేసుల్లో ఉరిశిక్ష, మరోకేసులో జీవిత ఖైదు పడిందన్నారు. ప్రాసిక్యూషన్‌తో పాటు కోర్టులో సాక్ష్యాలు సమర్పించడంలో సహకరించిన సాక్షులు, బాధిత కుటుంబీకులు, పౌర సమాజం, వేగంగా విచారణ పూర్తి చేసిన కోర్టుకు కృతజ్ఞతలు చెప్పారు. రికార్డు సమయంలో విచారణను పూర్తి చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో శ్రమించిన రాచకొం డ కమిషనర్ మహేశ్ భగవత్, యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి, భువనగిరి ఏసీబీ భుజంగరావుతోపాటు విచారణ బృందాన్ని అభినందించారు. కోర్టుకు సాక్ష్యాలను సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సీనియర్ పబ్లిక్‌ప్రాసిక్యూటర్ సి.చంద్రశేఖర్‌ను ఆయన మెచ్చుకున్నారు. త్వరితగతిన కేసును ఛేదించాం: భగవత్ నల్లగొండ క్రైం: హాజీపూర్ నేర సంఘటనలో కేసును త్వరితగతిన ఛేదించామని, బాధితులకు నష్ట పరిహారం అందేలా చూస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నేరస్తుడు శ్రీనివాస్‌రెడ్డి మైనర్లను తన బైక్‌పై తీసుకెళ్తానని నమ్మబలికి వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి బావిలో పడే శాడని తెలిపారు. జిల్లా కోర్టు చరిత్రలో 55 ఏళ్లలో డబుల్ కేసులో ఉరిశిక్ష పడటం ఈ కేసులోనే కావొ చ్చన్నారు. బాధిత కుటుంబాల కడుపుకోత, ఆవేదన ఎవరూ తీర్చలేనిదని.. చట్ట ప్రకారం నేరస్తుడి ని శిక్షించేందుకు అన్ని విధాలుగా తగిన సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించామని తెలిపారు. గ్రా మంలో నేటికీ పోలీసు పహారా ఉంచామన్నారు. -
చదువుకునేందుకు వెళ్లి బలయ్యారు..
సాక్షి, యాదాద్రి: ‘బేటీ బచావో బేటీ పడావో’నినాదంతో బాలికల రక్షణ, చదువు కోసం ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఓ కిరాతకుడి చేతిలో బలయ్యారు. సరైన రవాణా వసతి లేకున్నా.. తమ కుమార్తెలను చదువు కోసం పొరుగున ఉన్న గ్రామాలకు పంపించారు ఆ పేద కుటుంబాలు. కానీ లిఫ్ట్ ఇచ్చే పేరుతో ఓ రాక్షసుడు ఆ బాలికలపై ఘోరానికి ఒడిగట్టాడు. హాజీపూర్‌కి చెందిన ఇద్దరు, మైసిరెడ్డిపల్లికి చెందిన మరో బాలికపై హాజీపూర్‌కి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన విషయంలో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. రాజధానికి శివారునే ఉన్న బొమ్మలరామారం మండలం హాజీపూర్ మీదుగా భువనగిరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ముగ్గురు బాలికలు బలైపోయారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. స్పెషల్ క్లాసులకు వెళ్లి.. హాజీపూర్‌కి చెందిన పాముల నర్సింహా, నాగమణి దంపతుల కుమార్తె(14) మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్ స్కూల్ లో టెన్త్ చదువుతోంది. ఆమె గతేడాది ఏప్రిల్ నెల 25న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లి సాయంత్రం 3 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 2019 మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన హాజీపూర్‌కే చెందిన మరో బాలిక(18) మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని కేఎల్ఆర్ కాలేజీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ ఇద్దరు బాలికలనూ శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అత్యా చారం, హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. సాక్షి కథనంతో తెరపైకి మరో కేసు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక (11) 2015లో అదృశ్యమైంది. ఈ మిస్సింగ్ కేసులో పోలీసులు నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 2019 ఏప్రిల్ 29న ‘సాక్షి’దినపత్రికలో ఆ బాలిక మిస్సింగ్‌పై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసులు కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా, ఆ బాలికనూ తానే పొట్టన పెట్టుకున్నట్లు ఒప్పుకొన్నాడు. పానం నిమ్మలమైంది.. పేద కుటుంబానికి చెందిన నేను కూతురిని చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొద్దామంటే శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు ఊపిరి తీసి నా ఆశలు ఆవిరి చేసిండు. శ్రీనివాస్‌రెడ్డికి బతికే హక్కు లేదు. కోర్టు తీర్పుతో పానం నిమ్మలమైంది. వాయిదాలు లేకుండా తొందరగా ఉరి తీసి మా పిల్లల పానాలు తీసిన బావిలోనే సైకోను పాతి పెట్టాలి. అప్పుడే పోకిరీలకు కనువిప్పు కలుగుతుంది. – తిప్రబోయిన మల్లేశ్, బాలిక తండ్రి -
ఏ కేసులో ఎంత శిక్షంటే?
బాలిక–1 (కేసు నం.109) బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం, హత్య చేసిన కేసులో నేరం నిరూపణ కావడంతో.. ఉరి శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. కిడ్నాప్ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా. అత్యాచారం కేసులో.. 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ నేరాలకు పోక్సో చట్టం కింద మరో 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. బాలిక –2 (కేసు నం.110) బాలిక కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులోనూ ఉరి శిక్ష ఖరారైంది. మరో రూ.2 వేల జరిమానా విధించారు. కిడ్నాప్ చేసినందుకు 10 సంవత్సరాల జైలు, రూ.500 జరిమానా విధించారు. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. పోక్సో చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాలిక–3 (కేసు నం.111) ఈ బాలిక కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష (14 ఏళ్లు) పడింది. కిడ్నాప్ కేసులో 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. పోక్సో చట్టం కింద 7 ఏళ్ల జైలు, ఇదే చట్టంలోని సెక్షన్–12 కింద మరో 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలన్నీ ఏక కాలంలో అమలవుతా యని జడ్జి తీర్పునిచ్చారు. హాజీపూర్ కేసు డైరీ 2019 ఏప్రిల్ 25: హాజీపూర్‌కు చెందిన బాలిక మిస్సింగ్ ఏప్రిల్ 26: హాజీపూర్ మర్రిబావి పక్కన బాలిక స్కూల్ బ్యాగ్ గుర్తింపు. అదే రోజు పక్కనే గల తెట్టేబావిలో మృతదేహం వెలికితీత. ఏప్రిల్ 27: బాలిక మృతదేహానికి భువనగిరిలో పోస్టుమార్టం.. గ్రామానికి తరలింపు. అదేరోజు బొమ్మలరామారంలో రాస్తారోకో. ఘటనా స్థలాన్ని సందర్శించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్.. సీపీ సమక్షంలో అంత్యక్రియలు. ఏప్రిల్ 29: నెల కింద తప్పిపోయిన మరో బాలి క మృతదేహం తెట్టెబావి నుంచి వెలికితీత ఏప్రిల్ 30: మర్రిబావినుంచి ఇంకో బాలిక మృతదేహం అస్తికలు వెలికితీత. ఏప్రిల్ 30: నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అరెస్టు. జైలుకు తరలింపు మే 16, 17: మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష అమలు చేయాలని బొమ్మలరామారంలో బాధిత కుటుంబాల ఆమరణ దీక్ష జూలై 31: నల్లగొండలో పోక్సో కోర్టు ఏర్పాటు అక్టోబర్ 14: 111వ కేసులో సాక్షుల విచారణ ప్రారంభం. అక్టోబర్ 28: 109వ కేసులో సాక్షుల విచారణ.. నవంబర్ 4: 110వ కేసులో సాక్షుల విచారణ 2020 జనవరి 17: సాక్షుల విచారణ పూర్తి జనవరి 27: తీర్పు వాయిదా ఫిబ్రవరి 06: ఉరి, యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తుదితీర్పు . మృతురాలి సోదరి మీనా ఆనందభాష్పాలు అమ్మానాన్నలను చూసుకోవాలి శిక్ష తగ్గించాలని జడ్జిని కోరిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సాక్షిప్రతినిధి, నల్లగొండ: హాజీపూర్ బాలికల హత్య కేసుల్లో పోక్సో కోర్టు జడ్జి వి.విద్యానాథ్ రెడ్డి తీర్పు వెలువరించే ముందు ఒక్కో కేసు వివరాలను ప్రత్యేకంగా వివరించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఆ వివరాలు తెలియజేస్తూ.. అతడి అభిప్రాయాన్ని కోరారు. ఇదంతా మధ్యాహ్నం 2.04 గంటల నుంచి 2.17 గంటల వరకు కొనసాగింది. ►‘కేసు నంబర్ 109లో నువ్వు అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా నేరం రుజువైంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలన్నీ నువ్వే తప్పు చేసినట్లుగా రుజువు చేస్తున్నాయి. నువ్వు ఏమైనా చెప్పుకుంటావా’అని న్యాయమూర్తి.. శ్రీనివాస్‌రెడ్డిని అడిగారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. అంతా అబద్ధం. పోలీసులే నన్ను కొట్టి ఒప్పించారు’అని శ్రీనివాస్‌రెడ్డి న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. ►‘కేసు నంబర్ 110 విషయంలో.. లిఫ్ట్ ఇస్తానని తీసుకెళ్లి అమ్మాయిని అత్యాచారం చేసి, హత్య చేసి బావిలో పాతి పెట్టావు. ఈ నేరం కూడా నువ్వే చేసినట్లుగా రుజువైంది. నువ్వేమైనా చెప్పుకుంటావా..’అని న్యాయమూర్తి మరో బాలిక హత్య విషయంపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని అడిగారు. దీంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి.. ‘నాకు ఏ సంబంధం లేదు, నేను చేయలేదు. మా భూములు లాక్కున్నారు. మా ఇల్లు కూలగొట్టారు. మా అమ్మ, నాన్నలను నేనే చూసుకోవాలి. శిక్ష తగ్గించండి’అంటూ విలపించాడు. ►‘కేసు నంబర్ 111లో.. మరో బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశావు. ఈ నేరం కూడా నువ్వే చేసినట్లుగా రుజువైంది. దీనికి నువ్వు ఏమైనా చెప్పుకుంటావా’అని న్యాయమూర్తి అడిగారు. దీంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ‘నాకేం తెలియదు. పోలీసులు కొట్టి ఒప్పించారు. మా అమ్మా నాన్నలను నేనే చూసుకోవాలి. మా భూములు లాక్కున్నారు. ఇల్లు కూలగొట్టారు’అంటూ మళ్లీ అదే సమాధానం చెప్పాడు. ►దీంతో ‘మీ అమ్మానాన్నలు ఎక్కడున్నారో తెలుసా?’అని న్యాయమూర్తి అడిగారు. దీనికి తెలియదు అంటూ నిందితుడు సమాధానం చెప్పాడు. అసలు మీ అమ్మానాన్నలు బతికే ఉన్నారా అని న్యాయమూర్తి అడగగా.. దానికి కూడా తెలియదు అంటూ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు. శ్రీనివాస్‌రెడ్డిని గురువారం రాత్రి చర్లపల్లి జైలుకు తరలిస్తున్న పోలీసులు -
హాజీపూర్ కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ కేసుల్లో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడింది. నల్లగొండ లోని పోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎట్ట కేలకు పోలీ సులు నేర నిరూపణ చేశారు. ఇద్దరు బాలికల కేసుల్లో ఉరిశిక్ష, మరో బాలిక కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం జడ్జి సిద్ధ వేద విద్యానాథరెడ్డి గురువారం సాయంత్రం 6.24 గంటలకు తుదితీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిం చారు. ఈ కేసులో ప్రభుత్వం ప్రత్యే కంగా స్పెషల్ ప్రాసి క్యూటర్‌గా చంద్రశేఖర్‌ను నియమించగా, ఆయన రాచ కొండ కమిషనరేట్ పోలీసుల తరఫున వాదించారు. శ్రీనివాస్ రెడ్డి తరఫున వాదిం చడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో న్యాయ సహాయం అందిం చేందుకు లీగల్ సెల్ అథారిటీ ఠాగూర్‌ను న్యాయవాదిగా నియమించారు. శ్రీనివాస్‌రెడ్డికి ఎగువ కోర్టులోనూ ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 27నే తుది తీర్పు వెలువడాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల తీర్పు వాయిదా పడింది. గురువారం తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ప్రాంగణంలోనే ఉన్న బాలిక తండ్రి నర్సింహ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.. ‘మా కడుపు కోత తీరదు. ముద్దాయికి ఉరి శిక్ష పడటంతో న్యాయం జరిగింది. శిక్ష వేయించడంలో పోలీ సులు అన్న మాట నిలబెట్టుకున్నారు’అని వ్యాఖ్యానించారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డిని గురు వారం రాత్రి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. -
ఆ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడారు. హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడని, ముగ్గురు బాలికలను అతను అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించిందిన సీపీ భగవత్ చెప్పారు. అభంశుభం తెలియని బాలికలను శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకున్నాడని, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికలకు తన బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లేవాడని, తన వ్యవసాయ బావి వద్దకు వారిని తీసుకెళ్లి.. అత్యాచారం చేసి, హత్య చేసేవాడని వివరించారు. అతని వ్యవసాయ బావి వద్ద దొరికిన బాధిత బాలిక స్కూల్ బ్యాగ్ ఆధారంగా ఈ వరుస హత్యల కేసు మిస్టరీని ఛేదించామని, ఈ కేసు విచారణలో సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదిక కీలక పాత్ర పోషించాయని, ఈ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా నిరూపించామని తెలిపారు. కర్నూలులో ఓ మహిళను హత్య చేసిన కేసులోనూ శ్రీనివాస్‌రెడ్డి దోషి అని సీపీ భగవత్ చెప్పారు. -
హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు
-
హాజీపూర్ హత్యల కేసులో సంచలన తీర్పు
సాక్షి, నల్లగొండ: హాజీపూర్ హత్యల కేసులో పోక్సో స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హాజీపూర్ హత్యలకు సంబంధించిన మూడు కేసుల్లోనూ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ముగ్గురు చిన్నారి బాలికలపై అత్యాచారం జరిపి.. శ్రీనివాస్‌రెడ్డి అత్యంత దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఈ మూడు హత్యలకు సంబంధించి పోక్సో స్పెషల్ కోర్టు వేర్వేరుగా తీర్పులు వెలువరించింది. శ్రావణి, కల్పన కేసులలో హంతకుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధించిన కోర్టు.. మనీషా కేసులో జీవితఖైదు విధించింది. ఎఫ్ఐఆర్ నంబర్లు 110, 109 కేసుల్లో దోషికి ఉరిశిక్ష పడింది. ముగ్గురు బాలికలను కామాంధుడైన శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో గత నెల 17వ తేదీన వాదనలు ముగిశాయి. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. బాలికలపై అత్యాచారం, హత్యలకు సంబంధించి కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలు కేసులో కీలకంగా నిలిచాయి. హాజీపూర్ కేసులో మొత్తం 90 రోజుల్లో దర్యాప్తు పూర్తయింది. గత ఏడాది జూలై 31న నల్లగొండలోని పోక్సో స్పెషల్ కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 14 నుంచి ఈ కేసులలో కోర్టు విచారణ ప్రారంభించింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. గత ఏడాది ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన పాములు శ్రావణి కేసు మొదట వెలుగులోకి వచ్చింది. హాజీపూర్‌కు వెళ్లేదారిలోని తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకొని విచారించగా.. మనీషా, కల్పనలను శ్రీనివాస్‌రెడ్డే దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది. ఈ మూడు కేసులలో వేగంగా దర్యాప్తు చేపట్టిన యాదాద్రి పోలీసులు 90 రోజుల్లో కోర్టుకు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. బాధిత కుటుంబసభ్యుల హర్షం శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధించడంపై బాధిత బాలికల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగిందని, శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఉరితీయాలని, శిక్ష అమలులో ఏమాత్రం తాత్సారం చేయవద్దని కోరుతున్నారు. -
హాజీపూర్ హత్య కేసులో కాసేపట్లో తీర్పు
-
హాజీపూర్ హత్యల కేసులో నేడు తుది తీర్పు
-
హాజీపూర్ కేసు: వాయిదా పడ్డ తుదితీర్పు
సాక్షి, నల్గొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హజీపూర్ వరుస హత్యల కేసులో తీర్పు మరోసారి వాయిదా పడింది. జడ్జిమెంట్ కాపీ ఇంకా సిద్ధం కానందున ఫిబ్రవరి 6వ తేదీకి తీర్పు వాయిదా వేస్తున్నట్లు నల్గొండ కోర్టు సోమవారం ప్రకటించింది. దీంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు నల్గొండ జైలుకు తరలించారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టిన ఘటన గతేడాది సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు మూడు నెలల పాటు సుదీర్ఘ విచారణను చేపట్టింది. దాదాపు 300మంది సాక్షులను విచారించి.. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానున్న ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను విధించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించారు. అటు గ్రామస్థులు ఇటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న నల్గొండ ఫాస్ట్ కోర్టు తుది తీర్పును వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: సమత కేసులో తుదితీర్పు ఈ నెల 30కి వాయిదా హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే అంతా అబద్ధం సార్.. -
ఉత్కంఠ: ఆ రెండు కేసుల్లో నేడే తుది తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు కీలకమైన కేసుల్లో తుది తీర్పులు మరికాసేపట్లో వెలువడనున్నాయి. అందులో ఒకటి హాజీపూర్ కేసు కాగా.. రెండోది సమత కేసు. ఈ రెండు కేసుల్లోనూ సుదీర్ఘమైన విచారణ చేపట్టిన న్యాయస్థానాలు ఇవాళ తుది తీర్పును ప్రకటించనున్నాయి. నిందితులను ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. కోర్టు ఏ తీర్పును ప్రకటిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హాజీపూర్ వరుస హత్యల కేసు.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టిన ఘటన గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు మూడు నెలల పాటు సుదీర్ఘ విచారణను చేపట్టింది. దాదాపు 300మంది సాక్షులను విచారించి.. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానున్న ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను విధించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించారు. అటు గ్రామస్థులు ఇటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న నలగొండ ఫాస్ట్ కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. (అంతా అబద్ధం సార్..) హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే కాగా.. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసులో కూడా ఇవాళే తుది తీర్పు రానుంది. నవంబర్ 24 , 2019న తేదిన లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే బాధితురాలని ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక హత్యాచారం చేసి హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ రెండు కేసుల విచారణ పూర్తయి తుది తీర్పు ఇవాళ రానుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. సమతపై అత్యాచారం, హత్య: చార్జిషీట్ దాఖలు -
27న హాజీపూర్ కేసు తీర్పు
నల్లగొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్యకేసుకు సంబంధించి శుక్రవారం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును జడ్జి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో న్యాయమూర్తి విశ్వనాథరెడ్డి ముందు ప్రాసిక్యూషన్ తరఫున పీపీ కె.చంద్రశేఖర్ వాదించగా, నిందితుడి తరఫున న్యాయవాది ఠాగూర్ వాదనలు వినిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ వద్ద ముగ్గురు బాలికలపై అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసి బావిలో పాతిపెట్టిన ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దానిపై నల్లగొండలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ సాగింది. సాక్ష్యాలన్నింటినీ న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి చదివి వినిపించి అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అనంతరం కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది చంద్రశేఖర్ వాదిస్తూ, ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసింది శ్రీనివాస్‌రెడ్డే అని, అందుకు మెడికల్ రిపోర్టులు, సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండడం సరైంది కాదని, ఉరి శిక్ష విధించాలని అన్నారు. నిందితుడి తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లీగల్ ఎయిడ్ సంస్థ నియమించిన న్యాయవాది ఠాగూర్ శుక్రవారం తన వాదన వినిపించారు. హత్యలకు శ్రీనివాస్‌రెడ్డికి సంబం«ధం లేదని, సాక్ష్యాలు సక్ర మంగా లేవన్నారు. ఈనెల 8న కూడా ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 27వ తేదీకి వాయిదా వేశారు. -
హాజీపూర్ కేసు: ఈ నెల 27న తుది తీర్పు
సాక్షి, నల్గొండ: హాజీపూర్ వరుస హత్యల కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 27న పోక్సోకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ మేరకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిపై ముగ్గురు బాలికలపై హత్యాచారం కేసులు నమోదు కాగా, ఈ నెల 8 నాటికి ఒక కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. అయితే, మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే అంతా అబద్ధం సార్.. -
‘హాజీపూర్’ ఘటనపై పోలీసుల వాదనలు పూర్తి
నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో జరిగిన వరుస అత్యాచారాలు, హత్యల కేసులకు సంబంధించి పోలీసుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. రెండ్రోజులుగా నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి ముందు పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.చంద్రశేఖర్ ఓరల్ వాదనలు వినిపించారు. మూడు హత్యలకు సంబంధించి తొలి రోజు ఒక ఘటనకు సంబంధించి, రెండో రోజు మరో రెండు హత్యలకు సంబంధించి వాదనలు వినిపించారు. ఇద్దరు బాలికల హత్యలకు సంబంధించి వాదనలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఘటనకు సంబంధించి అన్ని రకాల ఆధారాలతోపాటు నిందితుడు తానే నేరం చేసినట్లుగా పోలీసుల ముందు ఒప్పుకున్న సాక్షులను కూడా కోర్టు ముందు ఉంచారు. దీంతో నిందితుడు శ్రీనివాస్ రెడ్డే హత్యలు, అత్యాచారాలు చేశాడని పీపీ చంద్రశేఖర్ వాదించారు. ఇలాంటి వారు సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు. క్రూరంగా అత్యాచారం, హత్య చేసిన నిందితుడు ఉరిశిక్షకు అర్హుడన్నారు. అనంతరం భువనగిరి యాదాద్రి జిల్లా ఏసీపీ భుజంగరావు నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను వివరిస్తూ తన వాదన వినిపించారు. దీంతో పోలీసుల తరఫు ఓరల్ వాదనలు పూర్తయ్యాయి. రాతపూర్వక వాదనల కోసం ఫైల్ దాఖలు చేయనున్నట్లు పీపీ చంద్రశేఖర్ తెలిపారు. నేడు నిందితుడి తరఫు ఓరల్ వాదనలు.. హాజీపూర్ హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తరఫున లీగల్ సెల్ నియమించిన న్యాయవాది ఠాగూర్ వాదనలు బుధవారం వినిపించనున్నారు. మూడు హత్యా కేసులకు సంబంధించి ఈ వాదనలు వినిపిస్తారు. మరోవైపు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష వేయాలంటూ మహిళా న్యాయవాదులు కోర్టు ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. -
హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే
సాక్షి, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో జరిగిన వరుస హత్యలపై సోమవారం నల్లగొండ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు న్యాయమూర్తి సాక్షుల వాంగ్మూలాలను నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించి అతని ద్వారా సమాధానాలు రాబట్టిన విషయం తెలిసిందే. శ్రావణి కేసుకు సంబంధించి జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి ఎదుట స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ తన వాదనలు వినిపించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిది మొదటినుంచీ నేర చరిత్రేనని సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలతోపాటు డీఎన్ఏ రిపోర్టులు, వేలిముద్రలు, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ బట్టి స్పష్టమవుతోందన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, మృతురాలి తల్లిదండ్రులు, ఇతరుల సాక్ష్యాలన్నీ పరిశీలిస్తే శ్రీనివాస్‌రెడ్డే హత్యలకు బాధ్యుడనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. డీఎన్ఏ టెస్టు ఆధారంగా మృతురాలి దుస్తులపై ఉన్న వీర్యం, నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి వీర్యంతో సరిపోలిందని, అదే విధంగా వేలిముద్రలు కూడా అతనివేనని తేలిందని అన్నారు. శ్రావణిని నమ్మించి తీసుకెళ్లి స్పృహ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు రిపోర్టుల ఆధారంగా తెలుస్తోందన్నారు. శ్రీనివాస్‌రెడ్డికి మూడు సెల్ నంబర్లు ఉన్నాయని, అవన్నీ ఇప్పటికీ అతని పేరు మీద, అతని ఫొటోతో ఆయా సెల్ కంపెనీల వద్ద ఉన్నాయని చెబుతూ.. వివరాలను కోర్టు ముందు ఉంచారు. అత్యాచారాలు, హత్యలు జరిగిన సందర్భంలో శ్రీనివాస్‌రెడ్డి సెల్ నంబర్ల సిగ్నల్స్ హాజీపూర్ సెల్‌టవర్ పరిధిలో ఉన్నాయని, ఆ కంపెనీల నుంచి సేకరించిన ఆధారాలను బట్టి స్పష్టమవుతోందన్నారు. శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్ర అని, ఇలాంటి వారు సమాజంలో ఉండడం మంచిది కాదని తన వాదనను వినిపించారు. చదవండి: అంతా అబద్ధం సార్.. -
ఓ కిరాతకుడి వాంగ్మూలం
-
అంతా అబద్ధం.. అసలు నాకు మగతనం లేదు
నల్లగొండ: ‘అంతా అబద్ధం సార్.. హాజీపూర్‌లో జరిగిన హత్యలకు, నాకు ఎలాంటి సం బంధమూ లేదు. పోలీసులే నన్ను ఇరి కించా రు. ఆ హత్యలకు సంబంధించి సాక్ష్యాలన్నీ అబద్ధమే. మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాలకు నాకు సంబంధం లేదు. పోలీసులు సిరంజి ద్వారా నాదగ్గర నుంచి వీర్యం తీసుకెళ్లారు. నాకు ఆండ్రాయిడ్ ఫోనే లేదు. బూతు బొమ్మలు చూశాననడం అబద్ధం’అంటూ హాజీపూర్ వరుస హత్యల కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. జడ్జి ఎదుట చెప్పాడు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో జరిగిన శ్రావణి, కల్పన, మనీషాల అత్యాచారం, హత్యలపై శుక్రవారం నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్ కోర్టులో న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి విచారణ నిర్వహించారు. 6 గంటల పాటు విచారణ సాగింది. ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది చంద్రశేఖర్, నిందితుడి తరఫున న్యాయవాది ఎస్.ఆర్. ఠాగూర్‌లు హాజరయ్యారు. కాగా ఇదివరకే మనీషా హత్యకు సంబంధించి సాక్ష్యాలపై విచారణ జరిగింది. శుక్రవారం శ్రావణి, కల్పనలకు సంబంధించి 72 మంది సాక్షులు చెప్పిన వాంగ్మూలాలను న్యాయమూర్తి ఒక్కొక్కటి చదివి నిందితుడికి విని పించారు. అతనినుంచి ఒక్కో దానిపై సమాధానం తీసుకొని రికార్డు చేశారు. ‘సాక్షులు అందరూ శ్రీనివాస్‌రెడ్డే నిందితుడని సాక్ష్యం చెప్పారు. దీనిపై ఏమి చెబుతావు’అని న్యాయమూర్తి అడగగా ‘నాకూ ఆ హత్యలకు సంబంధంలేదు. కావాలనే నన్ను ఇరికించారు’అంటూ సమాధానం చెప్పాడు. నీ తరఫున సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా, ‘మా అమ్మానాన్నలను పిలిపించండి’అంటూ సమాధానం చెప్పాడు. వారు ఎక్కడున్నారని అడగ్గా, వారి అడ్రెస్ కూడా తెలియదని తెలిపాడు. ‘నువ్వు ఇంతకుముందు పనిచేసిన వారి అడ్రస్ ఇవ్వు.. పిలిపిస్తాము’అని న్యాయమూర్తి అడగ్గా వారి అడ్రస్ కూడా లేదని చెప్పాడు. దీంతో న్యాయమూర్తి.. నువ్వు పని చేశానని చెప్పావు, పనిచేసే చోట అడ్రస్ తెలియకుండానే పనిచేశావా అని అడగ్గా, ‘తెలియదు, మా అమ్మానాన్ననే పిలిపించాలి ’అంటూ న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు . వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. అసలు నాకు మగతనం లేదు.. ‘నాలుగు సంవత్సరాల క్రితం కల్పన అనే అమ్మాయిని కూడా అత్యాచారం, హత్య చేసి బస్తాలో మూటకట్టి అదే మర్రిబావిలో పాతిపెట్టావు, అది కూడా అందరి ముందు నేనే పాతిపెట్టానని ఒప్పుకున్నావు’కదా అని న్యాయమూర్తి అడగ్గా ‘అంతా అబద్ధం.. నన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. బావి వద్దకు తీసుకెళ్లలేదు’అని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం చెప్పాడు. ‘మృతుల బట్టలపై ఉన్న వీర్యం నీదేనని పరీక్షలో తేలింది. నువ్వే అత్యాచారం చేశావు’అన్నప్పుడు ‘నాకు మగతనం లేదు’అంటూ సమాధానం చెప్పాడు. వైద్యులు నువ్వు ఫిట్‌గానే ఉన్నావని ‘నువ్వు పని చేసే చోట ఒక వేశ్యని తీసుకొచ్చి చంపి నీటి ట్యాంక్‌లో వేశావని, అప్పట్లో నిన్ను కర్నూల్లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేశారు కదా’అని అడగ్గా అది కూడా అబద్ధమేనని నిందితుడు సమాధానం చెప్పాడు. మర్రిబావి సమీపంలో ఓ చెట్టు దగ్గర ఉన్న బీరు సీసాలను ఫింగర్‌ప్రింట్స్ నిపుణులు పరీక్షలు చేస్తే ల్యాబ్‌లో నీ వేలిముద్రలేనని తేలిందని, దానికి నీ సమాధానం.. అంటూ జడ్జి అడగ్గా పోలీసులు బలవంతంగా బీరు సీసాను పట్టించారని చెప్పాడు. ‘నీకు నాలుగైదు ఫోన్ నంబర్లు ఉన్నాయి, నీ ఫోన్ లో చనిపోయిన శ్రావణి, కల్పన, మనీషాల ఫొటోలు ఉన్నాయి. నీఫోన్ సీజ్ చేసి డేటాను పరిశీలించగా నువ్వు బూతు బొమ్మలు చూసేవాడివని తేలింది, దానికి నీ సమాధానం ఏమిటి’అని అడగ్గా నిందితుడు ‘నాకు చిన్న ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లేదు.’అని చెప్పాడు. భూమి అమ్మలేదని కేసు పెట్టారు.. పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన 101 మంది సాక్ష్యాల విషయంలోనూ నిందితుడు.. అంతా అబద్ధం, పోలీసులు కావాలని చేశారని సమాధానం చెప్పాడు. , నీ మీద కేసు ఎందుకు పెట్టినట్లు’.. అని అడగ్గా ‘మా భూమి అమ్మలేదని కొందరు చేశారు. కావాలనే ఇరికించారు’అని చెప్పడం గమనార్హం. -
హాజీపూర్ కేసులో ముగిసిన నిందితుడి తరపు వాదన
-
హాజీపూర్ కేసు: ‘పోలీసులే అలా సృష్టించారు’
సాక్షి, నల్లగొండ :ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో హాజీపూర్ కేసు విచారణ శుక్రవారం చేపట్టారు. ఈ కేసులోని నిందితుడు మర్రి శ్రీనివాస రెడ్డిని పోలీసులు మరోసారి కోర్టులో హాజరు పరిచారు. డిసెంబర్ 26న మనీషా కేసులో నిందితుడి వాదన నమోదు చేయగా. ఈ రోజు ఉదయం శ్రావణి, మధ్యాహ్నం కల్పన కేసులో నిందితుడి వాదన న్యాయస్థానం వినగా.. శ్రావణి కేసులో 44 మంది, కల్పన కేసులో 30 మంది సాక్షుల వాదనను నిందితుడికి న్యాయమూర్తి వినిపించారు. అనంతరం అనంతరం న్యాయమూర్తి నిందితుడిని పలు ప్రశ్నలు అడగ్గా.. సెక్షన్ 313 కింద నిందితుడు తన వాదనను వినిపించాడు. తనకేం తెలియదని.. అంత అబద్ధమంటూ నిందితుడు పదే పదే చెప్పాడు. బైక్ పైన శ్రావణిని ఎక్కించుకుని వెళ్లినట్లు చెబుతున్నారని ప్రశ్నించగా తనకు అసలు బైక్ డ్రైవింగ్ రాదని చెప్పాడు. శ్రావణి దుస్తులపై తన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారని అడగ్గా.. పోలీసులే అలా సృష్టించారని నిందితుడు సమాధానమిచ్చాడు. అసలు కల్పన ఏవరో కూడా తెలియదని, పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని వాదించాడు. ఇంతక ముందు ఏ పని చేశావు.. ఎక్కడ పనిచేశావు.. యజమాని ఎవరు అని న్యాయమూర్తి అడగ్గా నిందితుడు వివరాలు చెప్పలేకపోయాడు. (హాజీపూర్ కేసు: ‘సువర్ణ ఎవరో తెలీదు’) అలాగే ఘటనా స్థలంలో దొరికిన బీరు బాటిళ్లపై తన వేలి ముద్రలు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. పోలీసులే బలవంతంగా పట్టించారని పేర్కొన్నాడు. తనను కొట్టి ఒప్పించారని, తన అమ్మ, నాన్నలను తీసుకు రావాలనిన్యాయమూర్తిని కోరాడు. తల్లిదండ్రులు ఎక్కడున్నారని ప్రశ్నించగా తనకు తెలియదని నిందితుడు తెలిపాడు. మరి కోర్టుకు ఎలా తెలుస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. చివరికి తదుపరి విచారణ 6వ తేదికి వాయిదా వేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిననట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా కల్పన కేసులో ఇంకా వాదన కొనసాగుతుంది. చదవండి : లేదు.. తెలియదు.. కాదు! -
నల్లగొండ కోర్టులో హాజీపూర్ హత్య కేసు విచారణ
-
లేదు.. తెలియదు.. కాదు!
నల్లగొండ: ‘మనీషాను తీసుకెళ్లావా.. అత్యాచారం జరిపి హత్య చేసి బావిలో పూడ్చిపెట్టావా?’అన్న జడ్జి ప్రశ్నలకు ‘లేదు.. తెలియదు.. కాదు..’అని నిర్భయంగా సమాధానమిచ్చాడు సైకో శ్రీనివాస్‌రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామా రం మండలం హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని గురువారం నల్ల గొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారించారు. ముగ్గురు బాలికల హత్యలకు సంబంధించి 101మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు ఇప్పటికే నమోదు చేసింది. ఈ క్రమంలో గురువారం మనీషా కేసుకు సంబంధించి నిందితుడి వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఒక్కో సాక్షి వాంగ్మూలాన్ని శ్రీనివాస్‌రెడ్డికి జడ్జి చదివి వినిపిం చారు. కాగా, వీటిపై జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు తాపీగా ‘తెలియదు.. కాదు’అని జవాబు ఇచ్చాడు. హత్యకు గురైన బాలికల దుస్తులపై స్మెర్మ్ ఆనవాళ్లు నీకు సంబంధించినవేనని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది కదా? అని అడగగా, ఎస్ఓటీ పోలీసులు సిరంజీలతో చల్లారని చెప్పుకొచ్చాడు. ఫోర్న్ చూస్తావా అన్న ప్రశ్నకు తన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదని చెప్పాడు. మనీషా హత్య జరిగిన రోజు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని, అందుకే టవర్ లొకేషన్ ఆ ప్రాంతంలో చూపించిందని తెలిపాడు. కర్నూల్లో జరిగిన సువర్ణ హత్యపై అడగ్గా, ఆమె ఎవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను జడ్జి జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు. ఆగస్టులో చార్జ్‌షీట్ దాఖలు గత ఏప్రిల్‌లో హాజీపూర్‌కు చెందిన శ్రావణి మిస్సింగ్ కేసుపై విచారణ చేస్తున్న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా శ్రావణితోపాటు కల్పన, మనీషాను కూడా అత్యాచారం చేసి చంపి పాతి పెట్టినట్టుగా ఒప్పుకున్నాడు. పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలన్నింటినీ పకడ్బందీగా సేకరించారు. ఆగస్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నల్లగొండలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో విచారణ సాగుతోంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో వందమంది సాక్షులను విచారించారు. కేసు విచారణ వారంరోజుల్లోగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని పీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. కనిపించని ఆందోళన కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి నిర్భయంగా సమాధానాలు చెప్పాడు. అతని ముఖంలో ఎటువంటి ఆందోళన కనిపించకపోవడం గమనార్హం. -
హాజీపూర్ కేసు: ‘సువర్ణ ఎవరో తెలీదు’
సాక్షి, నల్గొండ : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిపై జరుగుతున్న విచారణ ఫోక్సో స్పెషల్ కోర్టులో గురువారం ముగిసింది. తదుపరి విచారణను జనవరి 3కు న్యాయమూర్తి వాయిదా వేశారు. మనీషా కేసుకు సంబంధించి 29 మంది సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను జడ్జి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించారు. కానీ జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు అతని నుంచి ఎక్కువగా కాదు, లేదు, తెలియదు అనే సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది. జడ్జి ప్రశ్నలను అడిగే సమయంలో శ్రీనివాస్ రెడ్డి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. ఫోర్న్ వీడియోలు చూస్తావా అని జడ్జి ప్రశ్నించగా.. తన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదని సమాధానమిచ్చాడు. కర్నూలులో జరిగిన సువర్ణ హత్యతో నీకు ఏమైనా సంబంధం ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అసలు సువర్ణ ఎవరో తనకు తెలీదని నిందితుడు పేర్కొనడం జరిగింది. కాగా బాలికల దుస్తులపై ఉన్న స్పెర్మ్, రక్తపు మరకల ఆనవాళ్లు ఫోరెన్సిక్ రిపోర్టులో నీదే అని తేలింది.. దీనిపై నువ్వేమంటావు అని జడ్జి ప్రశ్నించగా.. ఎస్ఓటీ పోలీసులే వాటిని దుస్తులపై సిరంజిలతో చల్లారని నిందితుడు చెప్పినట్టు సమాచారం. హత్య జరిగిన రోజు తన ఫోన్ స్విచ్చాఫ్ చేశానని, అందుకే టవర్ లొకేషన్ ఆ ప్రాంతంలో చూపిందని నిందితుడు వెల్లడించాడు. అయితే ఈ కేసులో సాక్ష్యాలుగా తన అమ్మ, నాన్న, అన్నని తీసుకురావాలని నిందితుడు జడ్జిని కోరినట్లు తెలుస్తోంది. -
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజీపూర్ కేసు విచారణ
-
కోర్టుకు నిందితుడు శ్రీనివాసరెడ్డి
సాక్షి, నల్లగొండ: హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజరుపరిచారు. అదే విధంగా కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సైతం సమర్పించారు. ఈ క్రమంలో చివరిగా నిందితుడు శ్రీనివాసరెడ్డి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుంది. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ కేసును నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారిస్తోంది. గత రెండు నెలల కాలంలో ఈ కేసులో దాదాపు 300 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఈ క్రమంలో గురువారం చివరిసారిగా నిందితుడి వాంగ్మూలం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు.. శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని బాధిత కుటుంబాలు డిమాండు చేస్తున్నాయి. -
హాజీపూర్ కేసు.. మరో వారం రోజుల్లో తీర్పు!
సాక్షి, నల్గొండ : హాజీపూర్ వరుస హత్యల ఘటనలో మరో వారం రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గత కొన్ని రోజులుగా నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డి విచారణ ముగిసింది. అయితే నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని మరోసారి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో వచ్చే గురువారం శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చివరిసారిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు శ్రీనివాస్‌రెడ్డిని అభిప్రాయం తీసుకోనుంది. అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించనుంది. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. -
హాజీపూర్ నిందితుడిని కూడా అలానే చంపండి
సాక్షి, హైదరాబాద్: హాజీపూర్ వరుస హత్యలు చేసిన నిందితుడిని ఉరి తీయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘం నేతలు గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను కోరారు. ఈ మేరకు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేయాలని, తమ కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు అమ్మాయిలను దారుణంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటివి జిల్లాకో ఘటనలు జరుగుతున్నాయి. గవర్నర్ కూడా తన లిస్ట్‌లో హాజీపూర్ సమస్య ఉందని, తనకు మొత్తం తెలుసన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని సానుకూలంగా స్పందించార’ని పేర్కొన్నారు. బాధితురాళ్ల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలన్నారు. దిశ ఘటనలో నిందితులను ఎలా చంపారో శ్రీనివాస్‌ను కూడా అదే విధంగా చంపాలని గవర్నర్ కోరామని తెలిపారు. చదవండి: తుదిదశకు ‘హాజీపూర్’ విచారణ -
‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలి’
సాక్షి, యాదాద్రి భువనగిరి: హాజీపూర్ వరస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలని హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారంతా ‘శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలి’ అనే నినాదాలు చేస్తూ.. హాజీపూర్‌లో నిరసన చేపట్టారు. షాద్‌నగర్‌లో ‘దిశ’పై అత్యాచారం, హత్య చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు.. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలన్నారు. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్ విద్యార్థులను దారుణంగా అత్యాచారం, హత్య చేసిన చేసిన విషయం తెలిసిందే. షాద్‌నగర్ ఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను ఎన్కౌంటర్లో మట్టు బెట్టిన ప్రభుత్వం.. హాజీపూర్ ఘటనను ఎందుకు సీరియస్‌గా తీసుకోవడంలేదని ప్రశ్నించారు. దీంతో పాటు బొమ్మల రామారం పోలీసులను కలిసి శ్రీనివాస్‌రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలని కోరారు. ఈ నిరసనలో గ్రామస్తులు, బాధత కుటుంబ సభ్యులు, హాజీపూర్ గ్రామ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. సాక్షి, కొమురంభీం ఆసిఫాబాద్: చెంచు మహిళ టేకు లక్ష్మిని అత్యాచారం, హత్య చేసిన నిందితులను కూడా ఎకౌంటర్ చెయ్యాలని ఆదివాసీ, దళిత, మైనారిటీ, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేశాయి. దీంతోపాటు జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యూ ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌ను చేపట్టారు. టేకు లక్ష్మిబాయిని అత్యాచారం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని జైనూర్‌లో రాస్తారోకో చేశారు. అన్ని సంఘాల నాయకులు ర్యాలీ చేస్తూ.. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. జైనూర్లోని మార్కెట్లో కూడా బంద్‌ను నిర్వహించారు. -
‘దిశ’ ఘటన నేపథ్యంలో మళ్లీ తెరపైకి ‘హాజీపూర్’
సాక్షి, బొమ్మలరామారం: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో యువతులు, మహిళలు, బాలికలపై దారుణాలు నానాటికి పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆగ్రహం తారస్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లాలో దిశపై సామూహిక అత్యాచారం, హత్య, వరంగల్‌లో గాదం మానస అత్యాచారం, హత్యల నేపథ్యం, ముగ్గురు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి అతి దారుణంగా హత్యలు చేసిన నిందితుడు సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష పడడంలో జరుగుతున్న జాప్యంపై మండల ప్రజలు గుర్రుగా ఉన్నారు. మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే కఠిన శిక్షలు ఖారారు అయితేనైనా నేరం చేసే వారికి వెన్నులో వణుకు పుట్టేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఎవ్వరిని కదిలించినా సైకో శ్రీనివాస్ రెడ్డి దారుణాలనే గుర్తు చేసుకుంటున్నారు. కొందరు మహిళలు కంటతడి పెడుతూ మర్రి శ్రీనివాస్ రెడ్డిపై శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రంలో యువతులపై జరుగుతున్న దారుణాలపై హాజీపూర్ గ్రామంలో ప్రజలందరూ శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలపై చర్చించుకుంటున్నారు. అక్టోబర్ నుంచి హాజీపూర్ కేసు కోర్టులో విచారణ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు అక్టోబర్ 10వ తేదీన నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. బాధిత కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్తులు, జిల్లా పోలీస్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు 120 మందికి కోర్టు సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జూలై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే.. నేరాలకు పాల్పడే వారిపై చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల మాదిరిగా నేరం చేసిన వారికి తక్షణమే శిక్షలు పడే వ్యవస్థ రావాలి. కోర్టులు, పోలీసులు విచారణలంటూ జాప్యం చేస్తే చట్టంలో ఉన్న లోసుగులు నేరస్తులకు తప్పించుకునే వెసులుబాటు దొరుకుతుంది. హాజీపూర్ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే శిక్ష పడితే ఇతర ప్రాంతాల్లో నేరం చేయాలనే వ్యక్తులకు కనువిప్పు కలిగేది. – దాసరి జంగారెడ్డి, హాజీపూర్ బతకనివ్వొద్దు జైలుకు వెళ్లయినా సరే శ్రీనివాస్ రెడ్డిని చంపాలనే కసి ఉంది. ముగ్గురు పిల్లలను పాడు చేసిన వాళ్ల పానాలు తిన్న శ్రీనివాస్ రెడ్డిని జైలుకు వెళ్లిన సరే చంపేయాలన్నా కసిగా ఉంది. ఇలాంటి రాక్షసులను భూమి మీద బతకనివ్వొద్దు. శ్రీని వాస్ రెడ్డి దారుణాలలో కుటుంబ సభ్యుల పాత్ర ఉంది. వారికి ఉన్న ఆస్తులను అమ్మి గ్రామాభివృద్ధికి వినియోగించాలి. – గోండ్రు జయమ్మ హాజీపూర్ రక్షణ కరువైంది.. హాజీపూర్‌లో జరిగిన ఘోరాలు మరవలేకపోతున్నాం. తప్పు చేసినోన్ని ఎన్ని రోజులు మేపుతారు. నెలలు గడుస్తున్నా నేటికీ భయంగానే ఉంది. ఎక్కడ చూసినా ఆడోళ్లకు రక్షణ లేకుండా పోయింది. శ్రీనివాస్ రెడ్డికి శిక్ష పడితేనే కొంత ఉపశమనం కలుగుతుంది. సర్కారోళ్లు నేరస్తుల పట్ల కఠినంగా ఉండకనే కొత్తోళ్లు తయారవుతున్నారు. – పరిధ దుర్గమ్మ, హాజీపూర్ ప్రజలకు అప్పగిస్తే బాగుండు.. ఆడ పిల్లల ఉసురు తీసిన మర్రి శ్రీనివాస్ రెడ్డిని సంఘటన జరిగినప్పడే ప్రజలకు అప్పగిస్తే బాగుండే. ఊరోళ్లే సరైన శిక్ష వేసేటోళ్లు. జైళ్లలో కూసపెట్టి సాదుడు ఎందుకు ఇదివరకే సావ కొడితే ఆడోళ్ల దిక్కు చూసేటోళ్లు ఉండకపోదురు. ప్రజలందరికీ ఎప్పటికి గుర్తుండే శిక్షపడితే తప్పు చేసేటోళ్లకు సిగ్గొస్తది. – దాసరి చంద్రారెడ్డి, హాజీపూర్ ఉరిశిక్షే సరైంది నిందితుడు సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్షే సరైంది. అతని పేరు వింటేనే ఆడపిల్లలు ఉలిక్కి పడే పరిస్థితి ఉంది. గ్రామంతో పాటు మండల ప్రజలందరూ నిందితుడికి బహిరంగంగా శిక్ష విధించాలని కోరుతున్నారు. అతనికి పడిన శిక్షతోనే చిన్నారుల ఆత్మలు శాంతిస్తాయి. – పక్కీరు రాజేందర్‌రెడ్డి, హాజీపూర్ విచారణలో వేగం పెరిగింది హాజీపూర్ బాలి కల వరుస హత్య ల కేసులో విచారణలో వేగం పెరి గింది. ఈ కేసుల్లో ప్రథమంగా బలైన తుంగని కల్పన కేసు మూడేళ్ల క్రితం నాటిది కావడంతో కొంత జాప్యం జరి గింది. నేటికీ 100 మందికి పైగా సాక్షులను కోర్టు విచారణ చేసింది. మరికొంత మందిని విచారణ చేయాల్సి ఉంది. మరో రెండు వారాల పాటు కోర్డులో సాక్షుల విచారణ జరిగే అవకాశం ఉంది. అనంతరం నిందితుడికి కోర్డు శిక్షను ఖరారు చేయనుంది. మహిళలు, యువతులు పోలీసులు వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అవగాహన పెంచుకోవాలి. స్మార్ట్ ఫోన్లలో యువత మహిళల రక్షణ కోసమే రూపొందించిన హాక్–ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ మేరకు అన్ని కళాశాలల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఏసీపీ భుజంగరావు, హాజీపూర్ బాలికల హత్య కేసుల విచారణ అధికారి -
హాజీపూర్ కేసు నేడు కోర్టులో విచారణ
సాక్షి, బొమ్మలరామారం: పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు సోమవారం నల్లగొండ కోర్టులో విచారణకు రానుంది. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు కోర్టునుంచి సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన విషయం విధితమే. ఈ కేసుల్లో వరంగల్ సెం ట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జులై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఎలాంటి శిక్షలు ఖరారు చేస్తుందోనని మండలంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. చదవండి: సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు -
సోషల్ మీడియాలో హాజీపూర్ కిల్లర్ వార్త హల్చల్
సాక్షి, బొమ్మలరామారం (ఆలేరు) : రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ముగ్గురు బాలికల హత్య కేసు మరోసారి శనివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై ఇటీవల భువనగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కానీ శనివారం హాజీపూర్ ముగ్గురు బాలికల హత్యల కేసులో సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారని, కల్పన, శ్రావణి, మనీషాలపై హత్యకు ముందు అత్యాచారానికి పాల్పడినట్లుగా టెక్నికల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అందినదని, 300 మంది సాక్షలను విచారించి కోర్టుకు అవసరమైన బలమైన సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి కోర్టుకు అందజేయడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణకు మార్గం సుగమం అయినట్టుగా ఓ సమాచారం హల్చల్ చేసింది. వరంగల్ ఘటనలో నిందితుడు ప్రవీణ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించడంతో శ్రీనివాస్‌రెడ్డి ఎలాంటి శిక్షలు పడుతాయోనని ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు అధికారులు ఈ విషయమై సంప్రదించగా హాజీపూర్ హత్యల కేసులో జరుగుతున్న పరిణామాలను ఎవరో అత్యుత్సహంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారని, పోలీసుల విచారణను సైతం ఈ విధంగా ప్రచారం చేయడం సరికాదని ఓ సీఐ కేడర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. -
సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు
సాక్షి, హైదరాబాద్ : పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల నిందితుడు,హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. ముగ్గురు విద్యార్థినులను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాలపై ఉన్న రక్తపు మరకలు శ్రీనివాస్‌రెడ్డివిగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తేల్చింది. హత్య జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్‌రెడ్డి సెల్ సిగ్నల్స్‌ను పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి కేసులో పోలీసులు 300 మంది సాక్షులను విచారించారు. నేర నిరూపణ కావడానికి కావాల్సిన బలమైన సాక్ష్యాధారాలను అన్నిటినీ కోర్టుకు పోలీసులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలంలోని హజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాముల శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టెబావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. ఈఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీని వాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ ఘటనలపై గ్రామ ప్రజలు, ప్రతిపక్షాలు, బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. పోలీసు యంత్రాంగం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పర్యవేక్షణలో భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఇటీవల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రానుంది. -
మాకేదీ న్యాయం? :హాజీపూర్ వాసులు
సాక్షి, యాదాద్రి: పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల కేసులో నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఇచ్చే తీర్పు కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. వరంగల్‌లో 9నెలల చిన్నారిపై లైంగికదాడి చేసి హత్య చేసిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడంతో మరోసారి హజీపూర్ ఘటన తెరపైకి వచ్చింది. తమ పిల్ల ఉసురు తీసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆ గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సమాజంలో మరెవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదని కోర్టు ఇచ్చే తీర్పు కఠినంగా ఉండాలని వారు కోరుతున్నా రు. హన్మకొండ కోర్టులో తీర్పు వచ్చినంత తొం దరంగా హజీపూర్ కేసులో ఎందుకు రావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పర్యవేక్షణలో భువనగిరిజోన్ డీసీపీ నారాయణరెడ్డి ఇటీవల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30వ తేదీన పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రానుంది. చార్జి్జషీట్ దాఖలుతో.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాముల శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టెబావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. ఈఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కçస్టడీలో ఉన్న శ్రీని వాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ ఘటనలపై గ్రామ ప్రజలు, ప్రతిపక్షాలు, బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. పోలీసు యంత్రాం గం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండుసార్లు పోలీస్ కస్టడీకి హజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని మూడు హత్య కేసులపై పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారు. మొదటిసారి మే 8నుంచి 13వరకు, రెండోసారి జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. సత్వరమే తీర్పు ఇవ్వాలి అపహరణ, లైంగికదాడి, హత్యలు లాంటి కేసుల్లో సత్వరమే తీర్పు ఇవ్వాలి. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష వేయాలి. వరంగల్ నిం దితుడు ప్రవీణ్ కేసులో న్యాయం జరిగిందని, అలాగే శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేస్తే ప్రజలకు మనోధైర్యం కలుగుతుంది. ప్రజ లకు కోర్టుల మీద విశ్వాసం పెరుగుతుంది. ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించే వారికి కోర్టు తీర్పులు చెంపపెట్టుకావాలి. హజీపూర్ బాధితులకు న్యా యం జరగాలి. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలి. – కొడారి వెంకటేశ్, సామాజిక ఉద్యమకారుడు ఉరిశిక్ష విధించాలి 9నెలల చిన్నారి శ్రీహిత కేసులో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడం సరైందే. ముగ్గురు ఆడపిల్లలపై కిరాతకంగా వ్యవహరించిన మర్రి శ్రీనివాస్‌రెడ్డికి కూడా ఉరిశిక్షే విధించాలి. కోర్టు తీర్పును అమలు చేయకుండా ప్రభుత్వం నిందితుడి తరఫున అడ్వకేట్‌ను నియమించడం సరికాదు. –పాముల నర్సింహ, శ్రావణి తండ్రి శ్రీనివాస్‌రెడ్డిని ప్రాణాలతో ఉంచొద్దు ఆడ పిల్లలపై మృగంలా ప్రవర్తించిన సైకో శ్రీనివాస్‌రెడ్డిని ప్రాణాలతో ఉంచొద్దు. ఇలాంటి మనుషులు బతికుంటే భూమిపైన ఆడోళ్లకు భద్రత లేదు. సర్కారోళ్లు ఇంకా శ్రీనివాస్‌రెడ్డిని చంపకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుస్తలేదు. శ్రీనివాస్‌రెడ్డి చస్తనే మా పిల్లల ఆత్మలు శాంతిస్తాయి. – తుంగని భాగ్యమ్మ, కల్పన తల్లి బహిరంగంగా ఉరి తీయాలి మా బిడ్డలపై దారుణాలకు ఒడగట్టిన శ్రీనివాస్‌రెడ్డి బ హిరంగంగా అందురు చూస్తుండగానే ఉరి తీయాలి. శ్రీనివాస్‌రెడ్డి చావును చూసి పాపం చేయాలనుకునే వాళ్లకు భయం పుట్టాలి. ఆడపిల్లలను కనడమే పాపమైంది. ప్రభుత్వం శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష అమలు చేసి నేరస్తులకు భయం పెట్టాలి. లేకుండా సర్కారుపై నమ్మకం లేకుంటాపొతది. – తిప్రబోయిన మల్లేష్, మనీషాతండ్రి అక్టోబర్‌లో తుది తీర్పు హజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో అక్టోబర్‌లో తుది తీర్పు వస్తుంది. సెషన్స్ కోర్టు నల్లగొండలో వచ్చే నెల మొదటి వారంలో విచారణ ప్రారంభంకానుంది. నిందితుడిపై మూడు కేసులు ఒకేసారి నమోదు చేయడం, డీఎన్ఏ నివేదిక, విచారణలో భాగంగా పలు ఆధారాల సేకరించి చార్జిషీట్ దాఖలు చేశాం. – నారాయణరెడ్డి, భువనగిరిజోన్ డీసీపీ -
‘హాజీపూర్’ కేసులో చార్జ్‌షీట్ దాఖలు
సాక్షి, బొమ్మలరామారం(యాదాద్రి) : పెనుసంచలనం సృష్టించిన హాజీపూర్ ముగ్గురు బాలికల వరుస హత్యల కేసు నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి పై పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ మేరకు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ, కేసు విచారణ అధికారి భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సంచలన్మాకమైన ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసులలో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి విలేకరులకు తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిని శిక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. 90 రోజుల తరువాత తెరపైకి హత్యల కేసులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలను కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాములు శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకొని విచారించారు. ఈ ఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. మరో రెండు దారుణాలు వెలుగులోకి రావడంతో ఇద్దరు బాలికల అత్యాచారం, ఆపై హత్య ఘటనలపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉ న్న శ్రీనివాస్‌రెడ్డిపై బుధవారం నాటికి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఉరి శిక్షపడేనా ముగ్గురు బాలికలపై దారుణాలకు ఒడిగట్టిన సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షపడితేనే నేరాలకు పాల్పడే వ్యక్తులకు తగిన గుణపాఠం కలుగుతుందని గ్రామస్తుల ప్రధాన డిమాండ్. ఈ మేరకు అమరణ నిరాహార దీక్షలు, ఆందోళనలు సైతం చేశారు. బాలికల హత్య కేసులలో దర్యాప్తు పూర్తయిందని నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందోనని హాజీపూర్ గ్రామంతోపాటు మండలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. -
నల్లగొండ కోర్టుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో వరుస హత్యల కేసులో నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డికి పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నల్లగొండ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు భువనగిరి ఏసీపీ భుజంగరావు వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు పోలీసులు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనను హత్య చేసిన ప్రదేశంలో గాలించగా బాలిక స్కూల్ ఐడీ కార్డు లభించింది. అలాగే తిప్రబోయిన మనీషా ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ పడవేసిన ప్రాంతంలో వెతకగా, అధార్ కార్డు లభ్యమైంది. సెల్‌ఫోన్ జాడ దొరకలేదు. ముగ్గురు బాలికల హత్యలలో నిందితుడు ఒంటరిగానే దురాగతాలకు పాల్పడ్డాడా.. ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో మూడు రోజుల పోలీస్ కస్టడీలో విచారించినట్లు తెలిసింది. -
అశ్లీల వెబ్సైట్లతో కాలయాపన.. ఓ జంటను..
సాక్షి, నల్గొండ : హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి నేర చరితపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఫోన్లో అశ్లీల వెబ్సైట్ల సెర్చింగ్‌లే అధికంగా ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో తెలిసింది. సెల్ఫోన్లో అశ్లీల వెబ్‌సైట్‌తో కాలయాపన చేయడంతోనే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం తమ ప్రాంతంలో మామిడి తోటలు చాలా ఉన్నాయని.. తెలిసిన వారి తోటల్లో మిమ్మల్ని పనికి కుదర్చుతానని వరంగల్ నుంచి ఓ జంటను శ్రీనివాస్ తీసుకొచ్చినట్లు సమాచారం. వారిని కొంతకాలంగా తన వద్ద లిఫ్ట్ మెకానిక్ పనిలో సహాయం చేయించుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆ దంపతుల జాడ తెలియరాలేదని గ్రామస్తులు అంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు గత శనివారం పోలీస్ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో నిందితుడిని తిప్పినట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఆదివారం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో వెతకగా కల్పన, మనీషాలకు సంబంధించిన ఆధార్, స్కూల్ ఐడీ కార్డు లభ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం తుంగని కల్పన హాజీపూర్ నుంచి మైసిరెడ్డిపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మృతదేహాన్ని గన్నీ బ్యాగులో కుక్కి మర్రి బావిలో పడేశాడు. కల్పన స్కూల్ యూనిఫాం, టిఫిన్ బాక్స్‌నూ బావిలో పడేశాడు. తర్వాత అటువైపు వెళ్లిన శ్రీనివాస్‌కి కల్పన స్కూల్ ఐడీ కార్డు కనిపించడంతో పక్కనున్న చెట్ల పొదల్లోకి విసిరేశాడు. మనీషానూ మర్రి బావి వద్దకు తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మృతదేహన్ని బావిలో పూడ్చివేశాడు. మనీషా ఆధార్, సెల్‌ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్ సమీపంలోని కర్కలమ్మ కుంటలో పడేశాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల కర్కలమ్మ కుంటలో ఆదివారం పోలీసులు జల్లెడ పట్టారు. 4 గంటలపాటు వెతకగా మనీషా ఆధార్ కార్డు దొరికింది. కానీ సెల్‌ఫోన్ లభించలేదు. -
‘హాజీపూర్’ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
హాజీపూర్: ఆ ఇద్దరు ఎటు పోయారు?
బొమ్మలరామారం: హాజీపూర్ ఘటనలో నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డి కేసు లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు శనివారం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో నిందితుడిని తిప్పినట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఆదివారం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో వెతకగా కల్పన, మనీషాలకు సంబంధించిన ఆధార్, స్కూల్ ఐడీ కార్డు లభ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం తుంగని కల్పన హాజీపూర్ నుంచి మైసిరెడ్డిపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మృతదేహాన్ని గన్నీ బ్యాగులో కుక్కి మర్రి బావిలో పడేశాడు. కల్పన స్కూల్ యూనిఫాం, టిఫిన్ బాక్స్‌నూ బావిలో పడేశాడు. తర్వాత అటువైపు వెళ్లిన శ్రీనివాస్‌కి కల్పన స్కూల్ ఐడీ కార్డు కనిపించడంతో పక్కనున్న చెట్ల పొదల్లోకి విసిరేశాడు. మనీషానూ మర్రి బావి వద్దకు తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మృతదేహన్ని బావిలో పూడ్చివేశాడు. మనీషా ఆధార్, సెల్‌ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్ సమీపంలోని కర్కలమ్మ కుంటలో పడేశాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గల కర్కలమ్మ కుంటలో ఆదివారం పోలీసులు జల్లెడ పట్టారు. 4 గంటలపాటు వెతకగా మనీషా ఆధార్ కార్డు దొరికింది. కానీ సెల్‌ఫోన్ లభించలేదు. ఆ ఇద్దరు ఎటు పోయారు: శ్రీనివాస్‌రెడ్డి నేర చరితపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తమ ప్రాంతంలో మామిడి తోటలు చాలా ఉన్నాయని.. తెలిసిన వారి తోటల్లో మిమ్మల్ని పనికి కుదర్చుతానని వరంగల్ నుంచి ఓ జంటను శ్రీనివాస్ తీసుకొచ్చినట్లు సమాచారం. వారిని కొంతకాలంగా తన వద్ద లిఫ్ట్ మెకానిక్ పనిలో సహాయం చేయించుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆ దంపతుల జాడ తెలియరాలేదని గ్రామస్తులు అంటున్నారు. శ్రీనివాస్ ఫోన్లో అశ్లీల వెబ్సైట్ల సెర్చింగ్‌లే ఉన్నట్లు పరిశీలనలో తెలిసింది. సెల్ఫోన్లో అశ్లీల వెబ్‌సైట్‌తో కాలయాపన చేయడంతోనే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉండొచ్చని తెలుస్తోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హాజీపూర్ సైకో కిల్లర్‌కు మూడు రోజుల కస్టడీ
-
శ్రీనివాస్‌రెడ్డికి మూడు రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్ : హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడి శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం విచారించనున్నారు. అతన్ని విచారించేందుకు నల్గొండ జిల్లా కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించిందని రాచకొండ కమిషనరేట్ అధికారులు తెలిపారు. గతంలోనూ శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారులు వారంరోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే. నిందితుని నేర చరిత్రపై అధికారులు మరోసారి ఆరా తీయనున్నారు. ఇప్పటికే శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారించారు. నిందితుడు పనిచేసిన ప్రదేశాల్లో ఏమైనా నేరాలకు పాల్పడి ఉంటాడనే కోణంలోనూ విచారణ కొనసాగనుంది. శ్రావణిని హత్య చేసి బావిలో పాతిపెట్టే సమయంలో శ్రీనివాస్‌రెడ్డికి ఎవరైనా సహకరించారా అనే అనుమానాలపై కూడా వివరాలను సేకరించనున్నట్టు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : హాజీపూర్ సైకో కిల్లర్‌కు మూడు రోజుల కస్టడీ -
మర్రిబావిలో మరో రెండు మృతదేహాలు?
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్‌రెడ్డి.. తన మర్రి బావిలో మరో రెండు మృతదేహాలను పూడ్చిపెట్టాడనే ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి తనతో పాటు లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే దంపతులను హతమార్చి మర్రిబావిలోనే పూడ్చిపెట్టాడని గ్రామంలో చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ పోలీస్ కస్టడీ నల్లగొండ లీగల్: ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌రెడ్డిని 3 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నల్లగొండ అదనపు జిల్లా జడ్జి ఎస్‌వీవీఎన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని గతనెలలో వారంపాటు పోలీసు కస్టడీకి ఇచ్చిన కోర్టు.. మరో రెండు కేసుల విచారణ నిమిత్తం మూడు రోజులు కస్టడీకి అనుమతించింది. -
హాజీపూలో పర్యటించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు
-
కేసీఆర్ అహంకారం సగం తగ్గింది : వీహెచ్
సాక్షి, హైదరాబాద్ : హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్యలు చేస్తే ఇంతవరకు బాధితకుటుంబాలను ప్రభుత్వం పరామర్శించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ తన నియోజక వర్గంలో కార్యకర్త చనిపోతే వెళ్లి పాడే మోసిందని గుర్తు చేశారు. మరి, నీకు ఓట్లు వేసిన హజీపూర్ ప్రజలకు నువ్వు ఏం చేశావంటూ కేసీఆర్‌పై వీహెచ్ ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థులు 26 మంది ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌కు ఎలాంటి బాధ లేదన్నారు. ఫలితాలతో కేసీఆర్‌కు అహంకారం సగం తగ్గిందన్నారు. కేసీఆర్‌కు గర్వం పూర్తిగా తగ్గించాలని తిరుపతి దేవుడిని మొక్కుతున్నానని తెలిపారు. వారం లోపు కేసీఆర్ హజీపూర్కు వెళ్లి అక్కడ బాధితులను ఆదుకోవాలని, లేకపోతే మరోసారి ఆ ఊరికి వెళ్లి రోజంతా దీక్ష చేస్తానని హెచ్చరించారు. -
పోలీసుల నిర్లక్ష్యమే బాలికల హత్యలకు కారణం
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌లో చోటు చేసుకున్న బాలికల హత్యలకు కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని హైదరాబాద్ నగరశాఖ పౌర హక్కుల సంఘం నేతలు అన్నారు. మండలంలోని హాజీపూర్, మైసిరెడిపల్లి గ్రామాల్లో ఆదివారం వారు పర్యటించారు. బాధిత కుటుంబాలను కలసి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఇంటికొకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రఘునా«థ్, ప్రధాన కార్యదర్శి ఎండీ ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
హాజీపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్
బొమ్మలరామారం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ హత్యల ఘటనపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్ హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్యలు, బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనికి ట్విటర్లో స్పందించిన కేటీఆర్.. శనివారం బిట్టు శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడా రు. ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నామన్నా రు. సీఎం కేసీఆర్ సైతం హాజీపూర్ ఘటనపై సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. చట్ట పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠినమైన శిక్ష పడేందుకు చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. త్వరలోనే బాధితులను కలుస్తామని, ప్రజలందరూ దయచేసి సంయమనం పాటించాలని కోరారు. హాజీపూర్ సంఘటనపై ప్రతి ఒక్కరికీ బాధగా ఉందని, రాజకీయాలు వద్దని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతతో మాట్లాడి బాధితులను కలవాల్సిందిగా సూచిస్తామన్నారు. స్థానిక ఎస్ఐ, సీఐల నిర్లక్ష్యం వల్లే సమస్య జఠిలంగా మారిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా, రాచకొండ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడుతామన్నారు. తాను ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని బాధితులకు, గ్రామస్తులకు తెలియజేయాలని సర్పంచ్ బిట్టు శ్రీనివాస్‌కు కేటీఆర్ సూచించారు. -
హాజీపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్
సాక్షి, యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అత్యంత దారుణంగా హత్యలకు గురైన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ ఘటనలు బాధాకరమన్న ఆయన హాజీపూర్ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. కాగా హత్యకు గురైన చిన్నారుల కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుతూ... బొమ్మల రామారం మండలం మాల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్ చేసిన ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటన పట్ల సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. నెలాఖరులో హాజిపూర్ గ్రామాన్ని సీఎం,కేటీఆర్ సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్‌కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
హాజీపూర్ బాధితుల దీక్ష భగ్నం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్య కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున రాచకొండ పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బాధితుల బంధువులు, గ్రామస్తులు బాలికలను చంపి పూడ్చి పెట్టిన తెట్టెబావిలోకి దిగి మరోసారి నిరసనకు దిగారు. దీంతో కలెక్టర్ స్పందించి స్థానిక అధికారులు, నాయకులతో ఫోన్లో చర్చలు జరిపారు. బాధితులతో తాను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని కలెక్టరేట్‌కు రావాలని కోరారు. నిరసన చేస్తున్న వారు అందుకు అంగీకరించి బావిలోంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ వద్దకు వచ్చి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళ్తే.. హత్యకు గురైన ముగ్గురు బాలికల కుటుంబాలు, బంధువులు, గ్రామస్తులు బొమ్మలరామారంలో గురువారం నుంచి ఆందోళన చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరడంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా దీక్ష శిబిరంలో నిద్రిస్తున్న బాధితులను శనివారం తెల్లవారుజామున సుమారు రెండున్నర గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 మందిని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గుడిబావి చౌరస్తా వద్ద ఉన్న దీక్ష శిబిరాన్ని తొలగించి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు. దీక్షలో కూర్చుని అనారోగ్యం బారిన పడిన పక్కీరు రాజేందర్‌రెడ్డి, పాముల ప్రవీణ్‌లను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. వారి ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడ్డాక తిరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శనివారం ఉదయం మొదటి విడతలో 15 మందిని వదిలివేశారు. మిగతా వారిని తర్వాత వదిలేశారు. కొనసాగుతున్న పోలీస్ పికెట్ ఆందోళనలతో అట్టుడుకుతున్న హాజీపూర్ గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. వరుస హత్యలు వెలుగు చూసిన నాటినుంచి గ్రామంలో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. కాగా, శాంతియుతంగా కొనసాగుతున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారనే సమాచారంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుం ది. గ్రామంలోని మహిళలందరూ కలసి బొమ్మలరామారం మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేసేం దుకు సిద్ధమయ్యారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వ్యక్తులను విడిచి పెట్టారని తెలిసి ధర్నా ప్రయత్నా న్ని విరమించారు. పోలీసులు వదలిపెట్టాక బాలికల ను హత్య చేసిన బావిలోకి దిగి నిరసన చేట్టారనే సమాచారంతో తెట్టెబావి వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. తెట్టె బావిలోకి దిగిన బాధితులు ప్రభుత్వం తాము శాంతియుతంగా చేపట్టిన దీక్షను భగ్నం చేసిందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బాధిత కుటుంబాల సభ్యులు శ్రావణి, మనీషాలపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన తెట్టెబావిలోకి దిగి అరగంటకుపైగా నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించి బావి నుంచి బయటకు వచ్చారు. తర్వాత కలెక్టర్‌ను కలసి తమ డిమాండ్లను వివరించారు. బాధితుల డిమాండ్లను సావధానంగా విన్న కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డిలు చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నా కొడుకును ఉరి తీయాలి శ్రీనివాస్‌రెడ్డి తండ్రి బాల్‌రెడ్డి బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసులో తన కొడుకు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలని నిందితుడి తండ్రి బాల్‌రెడ్డి శనివారం మీడి యా ముందు కోరారు. శ్రీనివాస్‌రెడ్డి దురాగతాలు తమకు తెలియవన్నారు. గతంలో కర్నూల్లో ఓ కేసు విషయమై బెయిలుపై విడిపించామని తెలిపారు. శ్రావణి హత్యకు పాల్పడినప్పుడు మృతదేహాన్ని వెలికి తీస్తున్న సమయంలో తమతోపాటే తన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి బావి వద్దనే ఉన్నాడన్నారు. మృతదేహాన్ని వెలికి తీసే సమయంలో, మరుసటి రోజు అతని ముఖంలో ఎలాంటి భ యం, ఆందోళన కనిపించలేదన్నారు. ఏదైనా పనిచేయాలని చెబితే తనవైపు ఉరిమి చూసేవాడని బాల్‌రెడ్డి వెల్లడించారు. అనుమానంతో పోలీసులు ఇంటికి వస్తే ఈ హత్యలలో నీ హస్తం ఏమైనా ఉందా? అని అడిగితే.. ‘నీకేం భయం వద్దు. ఆ హత్యలతో నాకేం సంబంధం లేదు’అని బుకాయించాడన్నారు. ఆధారాలు లభించవు అన్నాడు శ్రావణి పోస్ట్‌మార్టంలో అన్ని విషయాలు బయటæపడతాయని తాను కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు శ్రీనివాస్‌రెడ్డి తనకేమీ పట్టనట్లుగా ఉన్నాడని అతని సోదరుడు మర్రి సుధాకర్‌రెడ్డి తెలిపారు. మృతదేహం కుళ్లిపోయిందని.. పోస్టుమార్టంలో కూడా ఆధారాలు లభించవని శ్రీనివాస్‌రెడ్డి బుకాయించాడని పేర్కొన్నారు. తన సోదరుడు ఇలాంటి క్రూరుడనే విషయం తెలిసి చాలా బాధపడుతున్నామని తెలిపారు. తాను కష్టపడి కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన సోదరుడు చేసిన పనికి తమను ఎవరూ రానివ్వడం లేదని, హైదరాబాద్ బస్టాండ్లలో తల దాచుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న బాధిత కుటుంబాలు బాధితుల డిమాండ్లు ఇవీ.. - నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిపై నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఉరిశిక్ష పడేట్టు చేయాలి. దీనిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కరించాలి. - ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. - బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. - హజీపూర్–మాచన్‌పల్లి మధ్యన శామీర్‌పేట వాగుపై బ్రిడ్జిని నిర్మించాలి. హజీపూర్, మైసిరెడ్డిపల్లి, తిరుమలగిరి, నాగినేనిపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి. - నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన భూమిని బాధిత కుటుంబాలకు పంచాలి. -
మేడిచెట్టుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి పూజలు
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడి అమానుషంగా చంపిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి దినచర్యలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఎవరితోనూ పెద్దగా స్నేహంగా ఉండని శ్రీనివాస్‌రెడ్డి గ్రామ సమీపంలోని శమాసుల బావి వద్ద గల మేడిచెట్టుకు నిత్యం పూజలు నిర్వహించేవాడు. శ్రీనివాస్‌రెడ్డి అరాచ కాలు వెలుగులోకి రాక ముందు నుంచే ఈ మేడిచెట్టుకు అతను పూజలు నిర్వహించేవాడని తెలుస్తోంది. మేడిచెట్టు ఉన్న ప్రాంతంలోనే వేప, రాగి చెట్లు కూడా ఉన్నాయి. ఏమైనా దోషాలు ఉంటే నివారణ కోసం చెట్లకు పూజలు చేయడం సాధారణం. మరి కొందరు తమకు అంతా శుభం జరగాలనే ఇలాంటి చెట్లకు పూజలు నిర్వహిస్తారు. అదే కోణంలో శ్రీనివాస్‌రెడ్డి మేడిచెట్టుతో పాటు రాగి, వేప చెట్లకు పూజలు చేయడాన్ని గ్రామస్తులు పట్టించుకోలేదు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత పూజలపై ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. మేడిచెట్టుపై మూడు పేర్లు శ్రీనివాస్‌రెడ్డి నిత్యం పూజచేసే మేడిచెట్టుపై మూడు పేర్లు చెక్కి ఉన్నాయి. అందులో ఒక పేరు మనీషాది కనిపిస్తోంది. మరో రెండు శ్రావణి, కల్పన పేర్లుగా భావిస్తున్నారు. రోజూ ఈ చెట్ల వద్దకు వచ్చే శ్రీనివాస్‌రెడ్డి నీళ్లు పోసి పసుపు, కుంకుమ బొట్లను చెట్టు మొదట్లో పెట్టి పూజలు చేసేవాడని సమాచారం. హత్యలు వెలుగులోకి వచ్చినా పూజలు.. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి మేడిచెట్టు, రాగి, వేప చెట్లకు చేస్తున్న పూజల వెనక బలమైన కారణం ఉందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాలలో మొదటగా వెలుగులోకి వచ్చిన శ్రావణి హత్య అనంతరం కూడా ఈ చెట్లకు పూజలు కొనసాగించాడని తెలిసింది. హాజీపూర్ గ్రామంతోపాటు మండల ప్రజలందరూ భువనగిరి జిల్లా ఆస్పత్రికి శ్రావణి మృతదేహంతో ధర్నాకు వెళ్తుంటే ఇతను మాత్రం ఈ మేడి, రాగి, వేప చెట్లకు పూజలు చేస్తూ గ్రామస్తుల కంట్లో పడ్డాడు. బాలికలపై దారుణాలకు ఒడికట్టింది శ్రీనివాస్‌రెడ్డేనని తెలియక ఈ అంశాన్ని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు. మూడు హత్యలకు పాల్పడి.. ఎలాంటి బెరుకు లేకుండా చెట్లకు పూజలు చేయడమేంటని హాజీపూర్ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్‌లో కలకలం
-
చెట్లపై చిన్నారుల పేర్లు.. హాజీపూర్‌లో కలకలం
సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రావణి, మనీషా, కల్పన అనే చిన్నారులను అత్యంత పాశవికంగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి హతమార్చాడు. ఈ సీరియల్ మర్డర్స్‌పై ఒకవైపు పోలీసులు విచారణ జరుపుతుండగా.. మరోవైపు హాజీపూర్ గ్రామస్తులు ఆ కామాన్మాదిని ఉరితీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తన పొలానికి తీసుకెళ్లి బాలికలపై అత్యాచారం జరిపి.. హతమార్చిన శ్రీనివాస్‌రెడ్డి.. తన పొలంలోని పాడుబడ్డ బావిలో బాలికల మృతదేహాలను విసిరేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాజీపూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మేడిచెట్టుపై మనీషా అనే పేరును రాసి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. మేడిచెట్టుపై మృతురాలైన బాలిక పేరు ఉండటం హాజీపూర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ రావి, మేడి, వేపచెట్లు పక్కపక్కనే ఉండడంతో.. వాటికి శ్రీనివాస్‌రెడ్డి గతంలో పూజలు చేస్తూ ఉండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల వరుస హత్యలు వెలుగుచూసిన నేపథ్యంలో ఇక్కడ మేడిచెట్టుపై మనీషా అనే పేరు చెక్కి ఉన్న విషయాన్ని తాజాగా గుర్తించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డే.. మేడిచెట్టుపై ఇలా చెక్కి ఉండాటని, బాలికలను హతమార్చిన తర్వాత వారి పేర్లను అతను చెట్ల మీద చెక్కుతున్నట్టు కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్‌లో కలకలం -
హాజీపూర్ సైకో కిల్లర్ మరో వారం కస్టడీ కొరుతూ పిటిషన్
-
హాజీపూర్ గ్రామస్తుల దీక్ష భగ్నం
-
హాజీపూర్ గ్రామస్తుల దీక్ష భగ్నం..!
యాదాద్రి భువనగిరి : ముగ్గురు బాలికలను పొట్టనబెట్టుకున్న సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలంటూ హాజీపూర్ గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దీక్ష చేస్తున్న30మందిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం (రెండోరోజు) ఆమరణదీక్ష కొనసాగించిన గ్రామస్తులు.. నిందితుడికి పడిన శిక్షలతో సమాజంలో నేరస్తులకు వెన్నులో వణుకు పుట్టాలని భీష్మించుకొని కూర్చున్నారు. బాలికలు శ్రావణి, మనీషా, కల్పన ఆత్మలు శాంతించాలంటే నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని, బాధిత కుంటుంబాకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలనే నినాదాలతో మండల కేంద్రంలోని గుడిబావి చౌరస్తా మారుమ్రోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యగా అరెస్టు చేసినుట్ట వెల్లడించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి : మానవ మృగాన్ని ఉరి తీయాలి..) -
టీఆర్ఎస్ నాయకుల్ని నిలదీసిన గ్రామస్తులు..!
యాదాద్రి భువనగిరి: బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో బాలికల వరస హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. హాజీపూర్ గ్రామస్తులు బొమ్మలరామారం చౌరస్తాలో గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారికి సంఘీభావం తెలపడానికి టీఆర్ఎస్ నేతలు రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. గత మూడు వారాలుగా గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా.. అని గ్రామస్తులు, బాధితులు వారిని నిలదీశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఏ ప్రకటనా చేయలేకపోయిందని టీఆర్ఎస్ నాయకులు సర్దిచెప్పే యత్నం చేయగా.. ఇప్పుడు కూడా కోడ్ అమలులోనే ఉందికదా అని గ్రామస్తులు ప్రశ్నించారు. ‘మీ సంఘీభావ యాత్రలతో పనిలేదు. స్థానిక ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్‌తో సమావేశం ఏర్పాటు చేయాలి’ అని వారు డిమాండ్ చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇన్నాళ్లు గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా -
ఇన్నాళ్లు గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా
-
సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిను ఉరి తీయాలి
-
సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని హజరుపర్చిన పోలీసులు
-
వరంగల్ సెంట్రల్ జైలుకు సైకో కిల్లర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో ఎలాంటి సమాధనం ఇవ్వకుండా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినట్లు సమాచారం. ఐదు రోజులుగా విచారిస్తున్న సిట్ అధికారుల కస్టడీ గడుపు నేటితో ముగిసింది. దీంతో శ్రీనివాస్‌ను కోర్ట్‌లో హాజరు పరిచారు. వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస్‌ను తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇన్ని రోజుల కస్టడీలో శ్రీనివాస్ నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. అమ్మాయిల వరుస హత్యల ఘటనలో శ్రీనివాస్‌తో పాటు మరికొంత మంది హస్తం ఉన్నట్లు హాజీపూర్ గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని హజరుపర్చిన పోలీసులు -
పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న హాజీపూర్ సైకో..!
-
ముప్పుతిప్పలు పెడుతున్న సీరియల్ కిల్లర్..!
సాక్షి, హైదరాబాద్ : హాజీపూర్ సైకో, సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి సిట్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారుల బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు ఎన్ని విధాల ప్రయత్నించినా నిందితుడు నోరుమెదపడం లేదని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి తీరుతో సిట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక హాజీపూర్‌లో క్రైం సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు పూర్తి చేసినట్టు సమాచారం. గ్రామస్తులు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో రాత్రి సమయంలోనే క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టు తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డి సెల్ఫోన్లో ఉన్న సమాచారంతోపాటు, కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 13 వరకు శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. -
యాదాద్రి జిల్లాలో మరో దారుణం
సాక్షి, వెంకటాపూర్: యాదాద్రి జిల్లాలో హాజీపూర్ ఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. తుర్కపల్లి మండలం వెంకటాపూర్‌లో ఒంటరి మహిళను దుండగులు పాశవికంగా హతమార్చారు. కర్రే అనురాధ అనే మహిళ స్థానికంగా బెల్టు షాప్ నిర్వహిస్తోంది. అర్థరాత్రి వేళ దుండగులు అనురాధ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హతమార్చారు. ఇంట్లోని నగలు, నగదు దోచుకు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ...ఆధారాలు సేకరిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళా మంత్రి లేకపోవడం వల్లే ఇదంతా..
సాక్షి, హైదరాబాద్ : బొమ్మల రామారం హాజీపూర్ ఘటన దేశ ప్రజలని దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో ఆయనను కలిసిన సందర్భంగా.. గత నాలుగు మాసాలుగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివరించినట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో వెయ్యికి పైగా మహిళలు అపహరణకు గురయ్యారన్నారు. వారి ఆచూకీ ఇప్పటివరకు దొరకకపోవడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు అమ్మాయిలను ఒక వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన అందరినీ కలచివేసిందన్నారు. అలాంటి నిందితులకు ఉరి శిక్షే సరైందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటుగా.. ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకపోవడం వల్లే మహిళలకు సరైన న్యాయం జరగడం లేదని విమర్శించారు. హాజీపూర్ హత్యోందంతంపై ఢిల్లీ వెళ్లి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని దత్తాత్రేయ వెల్లడించారు. -
పోలీసుల కస్టడీకి శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న అతడిని బుధవారం ఉదయం రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణాధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నియమించిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును లోతుగా విచారించేందుకు నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్‌రెడ్డి ఈ నెల 8 నుంచి 13 వరకు విచారణ కోసం పోలీస్ కస్టడీకీ అను మతి ఇచ్చారు. ఆ సమయంలో పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని ఏ విధమైన శారీరక, మానసిక హింసకు గురి చేయరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. నేర చరిత్రపై కొనసాగనున్న విచారణ.. క్రూరమైన హత్యలకు పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డి నేర చరిత్రపై పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. నిందితుడి స్వగ్రామం హాజీపూర్, బొమ్మలరామాం, హైదరాబాద్, వేములవాడ, కరీంనగర్, కర్నూలు ఇతర ప్రాంతాల్లో జరిగిన మిస్సింగ్ కేసులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారించే అవకాశాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు తెప్పించుకున్న పోలీసులు వాటితో శ్రీనివాస్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారించనున్నారు. ఫేస్బుక్ స్నేహితులపై ఆరా... శ్రీనివాస్‌రెడ్డికి ఉన్న ఫేస్బుక్ అకౌంట్లోని స్నేహితుల వివరాలపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అతడి నేర ప్రవృత్తికి ఎవరైనా బలైపోయారా అన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. కాగా శ్రీనివాస్ రెడ్డి ఫేస్బుక్ ఖాతాలో ఎక్కువమంది మహిళలకు సంబంధించిన స్నేహితులే ఉన్నారు. కస్టడీ విచారణలో ఫేస్బుక్ పరిచయాలు, వారిందరితో గల సంబంధాలు వారి ప్రస్తుత పరిస్థితిని విచారణలో అధ్యయనం చేయనున్నారు. -
పోలీసుల కస్టడీకి హాజీపూర్ నిందితుడు
-
హజీపూర్ ఘటనతో సీసీటీవీ ఆవశ్యకత..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హజీపూర్ ఘటనతో సీసీ కెమెరాల ఆవశ్యకత మరోసారి తెరపైకి వచ్చింది. బొమ్మలరామారం నుంచి హజీపూర్కు వెళ్లాల్సిన విద్యార్థిని శ్రావణిని అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి, దారుణం హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బొమ్మలరామారం బస్‌స్టాప్ వద్ద సీసీటీవీ కెమెరాలున్నా పనిచేయకపోవడంతోనే శ్రీనివాసరెడ్డి ఘాతుకాన్ని గుర్తించడంలో ఆలస్యం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని యాదాద్రి, భువనగిరి డివిజన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినా స్థానిక అధికారులు వాటిని నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి అటకెక్కాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ప్రతి మండలం, గ్రామ పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడమేగాక వాటిని ఆయా పోలీసు స్టేషన్లకు అనుసంధానించేందుకు సన్నాహాలు చేపట్టారు. ‘మహా’ కమిషనరేట్‌లో నిరంతర నిఘా... 5091.48 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్‌గా గుర్తింపు పొందిన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజ్గిరి, యాదాద్రి లా అండ్ అర్డర్ జోన్లు ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మిళితమైన ఈ కమిషనరేట్‌లో నేరాలను నియంత్రించేందుకు సీసీటీవీల అవసరాన్ని గుర్తించిన సీపీ అందుకు అనుగుణంగా ఆయా జోన్లలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, నేను సైతం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించే బాధ్యతను ఆయా జోన్ల డీసీపీలకు అప్పగించారు. తద్వారా చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు, చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పాటు సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులను పట్టుకోవడమేగాక, వారికి శిక్ష విధించడంలోనూ పోలీసులు సఫలీకృతులయ్యారు. యాదాద్రిపై ప్రత్యేక దృష్టి... యాదాద్రి ఆలయంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు జరుగుతుండటంతో సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్ డివిజన్లలో 941, 812, 1942 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. మొత్తంగా యాదాద్రి జోన్లో 4773 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే హజీపూర్ ఘటనతో వీటిలో చాలావరకు సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెలుగులోకి రావడంతో సీపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయా పోలీసుస్టేషన్ల అధికారులు సీసీటీవీ కెమెరాల మరమ్మతులు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో వాటిని ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. అలాగే మల్కాజ్గిరి జోన్లో 38,208 ఎల్బీనగర్ జోన్లో 34,779 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే హజీపూర్ ఘటనతో ఒక్కసారిగా మేల్కొన్న పోలీసు అధికారులు ఇప్పటికే బిగించిన సీసీటీవీ కెమెరాల పనితీరుతో పాటు కొత్త సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించారు. మూడు జోన్లలో కలిపి 77,760 సీసీటీవీ కెమెరాలుండగా వీటి సంఖ్యను రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ ఒక్క సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఈ నిఘానేత్రాలు ఏర్పాటు చేయడం వల్ల సంచలనాత్మక కేసులు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు, హత్యలు తదితర నేరాల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి. అయితే హజీపూర్ ఘటనతో యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఉన్న సీసీటీవీ కెమెరాల పనితీరుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం.–మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ -
హాజీపూర్ బాధితుల రక్త నమూనాల సేకరణ
బొమ్మలరామారం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని మర్రిబావి, తెట్టెబావులలో లభించిన కల్పన, మనీషాల మృతదేహాల నిర్ధారణ కోసం పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా సోమవారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులనుంచి రక్త నమూనాలను సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. -
మీరే ఆదుకోవాలి మేడమ్!
సాక్షి, యాదాద్రి: సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన కల్పన కుటుంబ సభ్యులు కలెక్టర్ అనితారామ చంద్రన్ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్, మైసిరెడ్డిపల్లిని ఆదివారం జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ సందర్శించారు. సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో దారుణంగా హత్యకు గురైన బాలికలు కల్పన, మనీషా, శ్రావణి కుటుంబాలను ఆమె పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కల్పన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభంశుభం తెలియని తమ చిన్నారి అతి కిరాతకంగా హత్యకు గురైందని వారు వాపోయారు. నిరుపేదలమైన తమ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆమె వారిని ఓదారుస్తూ ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. రావాల్సిన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
హాజీపూర్ బాధితులకు భరోసా
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌ను శనివారం కలిశాయి. సైకో శ్రీనివాసరెడ్డి చేతిలో క్రూరంగా హతమైన శ్రావణి, మనీషా కుటుంబసభ్యులు, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్పన కుటుంబీకులు నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారి కుటుంబపరిస్థితులు, జీవనోపాధులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలు ఏం చదువుతున్నార ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మానవతా దృక్పథంతో మనీషా, కల్పన కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ.25వేల చెక్కును అందజేశారు.కాగా సీపీ ఏప్రిల్ 27న హాజీపూర్ గ్రామానికి వెళ్లినప్పుడు శ్రావణి కుటుంబీకులకు రూ.25వేలు అందజేసిన సంగతి తెలిసిందే.ఈ మూడు కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడంతోపాటు జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధిని వచ్చేలా చూస్తానన్నారు. అలాగే మృతిచెందిన ఓ బాలిక తమ్ముడికి అవసరమైన వైద్య సాయం అందిస్తామని కూడా హమీఇచ్చారు. హాజీపూర్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు... నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలను సేకరించడంతో పాటు కేసు విచారణ పారదర్శకంగా సాగేందుకు విచారణాధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును నియమించామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. హాజీపూర్ గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటుచేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలను అమర్చేలా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. హాజీపూర్ నుంచి బీబీనగర్, భువనగిరికి వెళ్లేలా మరొక ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సీపీని బాధిత కుటుంబాలు కోరాయి. ఏదైనా ఘటనా జరిగిన వెంటనే డయల్ 100కు ఫోన్‌కాల్, 9490617111 నంబర్‌కు వాట్సాప్ చేయడంతో పాటు స్థానిక పోలీసులను సంప్రదించాలన్నారు. మరొకమారు హాజీపూర్‌లో సీపీ పర్యటించి అక్కడి గ్రామస్తుల్లో భరోసాను నింపనున్నారు. -
‘శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్ మృతుల కుటుంబాలతో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చర్చలు ముగిసాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ఔట్సోర్సింగ్ ద్వారా బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వారు ఎప్పుడైనా ఉద్యోగంలో చేరవచ్చన్నారు. ఇప్పటికే హాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాము.. దాంతో పాటు మరిన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సీసీ కెమరాలను మరమత్తు చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు. డీజీపీని కలిసిన టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు హాజీపూర్‌లో బాలికలను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన దారుణ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ఉన్నారని టీపీసీసీ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆమె డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. హంతకుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉన్నవారిని పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, పోలీసులతో సీఎం చర్చించి పూర్వాపరాలు వెలికి తీయాలని ఆమె కోరారు. హాజీపూర్ వంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి అదే జబ్బు..
అభం శుభం తెలియని బాలికలను దారుణంగా మట్టుబెట్టాడు నరహంతకుడు శ్రీనివాస్‌రెడ్డి ట్రాన్స్జెండర్లపై అకృత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తూ పట్టుబడ్డ కుమ్మరి వెంకట్ యాదవ్ప్రేమించిన సహచర మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్తనను ప్రేమించడం లేదన్న కోపంతో దారికాచి ఓ యువతిపై యాసిడ్ పోశాడో క్రూరుడుతెలుగు రాష్ట్రాల్లో రోజుకు దాదాపు డజనుకు పైగా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆందోళన కలిగించే దారుణాలు సమాజాన్ని భయపెడుతున్నాయి. బంజారాహిల్స్: నేరాలు చేసినవారు జైలుకు వెళ్లి కఠిన శిక్షలు అనుభవించి వచ్చినా వారి తీరులో మార్పు రావడం లేదు. వీరిలో మార్పు రాదా..! అంటే అదంత తేలిక కాదంటున్నారు మానసిక నిపుణులు. ఈ తరహా దారుణాలకు మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారే తెగబడుతున్నారని, వీరు జైలు నుంచి బయటకు వచ్చినా మళ్లీ అవే నేరాలకు పాల్పడతారని అంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, కుమ్మరి వెంకట్ యాదవ్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ను హత్య చేసిన రాకేష్‌రెడ్డి.. ఇలా ఎవరిని తీసుకున్నా వీరందరూ ‘పర్సనాలిటీ డిసార్డర్’(వ్యక్తిత్వ రుగ్మత) వ్యాధితో బాధపడుతున్నవారేనని ప్రముఖ మానసిక నిపుణురాలు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. గౌరీదేవి చెబుతున్నారు. ఇటీవలి దారుణాలపై ఆమె తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వ్యక్తిత్వ రుగ్మతతోనే దారుణాలు సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి లాంటి వారు ‘పర్సనాలిటీ డిజార్డర్’ వ్యాధితో బాధపడుతుంటారు. ఈ వ్యాధికి చికిత్స ఉండదు. జైలులో ఉంచి పరివర్తనలో మార్పు తీసుకురావాల్సిందే. ఒక వేళ బయటకు వచ్చినా అదే తప్పు, నేరాలు పదేపదే చేస్తుంటారు. వీరికి అనుబంధాలు, ఆప్యాయతలు ఉండవు. తమ కోరికలు తీర్చుకోవడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇవి జన్యుపరంగా కూడా వస్తాయి. ఇటీవల పత్రికల్లో చోటు చేసుకుంటున్న ఇలాంటి నేరాల్లో నేరస్తులంతా ఈ వ్యాధితో బాధపడుతున్నవారే. ఈ వ్యాధి ఉన్నవారు అందరితో నవ్వుతూ, కలివిడిగా ఉంటూనే తాము చేసే పనులు చేస్తుంటారు. వీరికి పెద్దగా అనుబంధాలు ఉండవు. ఎంతసేపై తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. మద్యానికి బానిసవడం, జల్సాగా, జులాయిగా తిరుగుతుంటారు. తప్పు చేశామన్న బాధ వీరిలో ఎప్పుడూ.. ఏ కోశానా కనబడదు. సామాజిక సంబంధాలు ఉండవు ఈ తరహా వారిని మానసిక శాస్త్రంలో ‘యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్’గా పేర్కొంటారు. వీరు తాము చేస్తున్న పని మంచిదిగానే భావిస్తుంటారు. తాము టార్గెట్ చేసిన వ్యక్తులను అంతమొందించేదాకా వదలరు. క్రిమినల్ సైకియాట్రిస్టులు సైతం వీరిని మార్చలేకపోతున్నారు. డ్రగ్స్, ఆల్కహాల్ ఈ రెండింటినీ కంట్రోల్ చేసుకునే శక్తి వీరిలో అస్సలు ఉండదు. 14 ఏళ్ల వయసు నుంచే వ్యాధికి దగ్గరవుతూ వస్తుంటారు. వీరిలో మార్పు కష్టమే..! పోలీసులు ఇలాంటి వారిని లోతుగా విచారించాలి. ఎప్పటి నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నారో తెలుసుకుని కారణాలు ఆరా తీయాలి. అయితే శ్రీనివాస్‌రెడ్డి లాంటి కరుడుగట్టిన హంతకుడు మారే ప్రసక్తే లేదు. నేను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు వచ్చేవారు. వారిని ప్రశ్నిస్తే ‘ఒకసారి జైలుకు వెళ్లాక ఏ నేరం చేసినా మళ్లీ వెళ్లేదే కదా! శిక్ష ఒకటే కదా’ అని చెప్పేవారు. అంటే వీరు ఆ నేరాన్ని మళ్లీ చేయడానికే నిర్ణయించుకున్నారు. పైశాచికానందం పొందే లక్షణం వీరిలో ఉంటుంది. జైలులోనే ఉంచి సంస్కారవంతంగా తీర్చిదిద్దడం ఒక్కటే చికిత్స. సమాజంలో మనిషి బతకాలంటే కొన్ని పద్దతులు ఉంటాయి. వీరు మాత్రం అందుకు విరుద్ధం. కుటుంబ విలువలు, నైతిక విలువలు వీరు పాటించరు. ఇష్టమొచ్చినట్లు బతుకుతుంటారు. ఇదే సమాజానికి హానికరంగా మారుతుంది.. అంటూ వివరించారు. -
కరుడుగట్టిన నిందితుల బ్యారక్‌కు శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు మైనర్లను పొట్టనబెట్టుకున్న శ్రీనివాస్‌రెడ్డిని ఇప్పుడు కరుడుగట్టిన నిందితులకోసం కేటాయించిన బ్యారక్‌లోని ప్రత్యేక సెల్లో పటిష్ట బందోబస్తు మధ్య వరంగల్ జైల్లో ఉన్నాడు. అతని నేరచరిత్ర ఆధారంగా సాధారణ ఖైదీలతో కలవనీయకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వరంగల్ కారాగార సూపరింటెండెంట్ మురళి బాబు శుక్రవారం తెలిపారు. శ్రీనివాసరెడ్డిని జైలుకు తీసుకువచ్చినపుడు అతనితో జైలు అధికారులు మాట్లాడారు. అడ్మిషన్ రిజిస్టర్లో పేరు నమోదు చేసుకునేటపుడు అతని వివరాలు అడిగినపుడు అతని ప్రవర్తన సాధారణంగా లేదని, అలాగని అసాధారణంగానూ లేదని మధ్యస్థంగా ఉందని జైలు అధికారులు తెలిపారు. ఇలాంటి మనస్తత్వంగల నేరస్తులు ఎప్పుడు ఏం చేస్తారో? ఎలా ప్రవర్తిస్తారో? చెప్పడం కష్టమనీ, ఇలాంటివారు ఇతరులపై లేదా జైలు సిబ్బందిపై దాడులు కూడా చేయవచ్చునని అందుకే, అతన్ని సాధారణ ఖైదీలతో కలవనీయకుండా ప్రత్యేక సెల్ కేటాయించామని అధికారులు వివరించారు. అతని ప్రవర్తనను గమనించేందుకు సెల్లో సీసీ టీవీ కెమెరాలనూ ఉంచామన్నారు. మామూలు ఖైదీలకైతే 200 నుంచి 300 మంది ఖైదీలకు కాపలాగా ఒక జవాన్ ఉంటాడు. కానీ, శ్రీనివాస్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా ఒక జవాన్‌ను కాపలాకు కేటాయించినట్లు అధికారులు వివరించారు. అతనికి ప్రతిరోజూ దినపత్రిక, రెండుపూటల భోజనం అందిస్తున్నామన్నారు. అతనికి అందించే దినపత్రికలో అతనికి చెందిన వార్తలను కత్తిరించి ఇస్తున్నామన్నారు. వేములవాడ, ఆదిలాబాద్, సిరిసిల్లలో పోలీసులు హాజీపూర్ కేసులో సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మర్రి శ్రీనివాసరెడ్డి గతంలో పనిచేసిన ఆదిలాబాద్, సిరిసిల్ల, వేములవాడలో సిట్‌పోలీసులు అతని గురించి ఆరా తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరి వద్ద పనిచేశాడు? ఎంతమంది స్నేహితులు ఉన్నారు. వేములవాడలో అతనితో చనువుగా మెలిగిన మహిళ ఎవరు? ఆమెను మాత్రం చంపకుండా ఎందుకు వదిలేశాడు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఫేస్బుక్ మిత్రుల పైనా.. శ్రీనివాస్‌రెడ్డి మహిళలకు రకరకాలుగా వలవేసి ఉచ్చులోకి లాగేవాడు. ఇందుకోసం ఫేస్‌బుక్‌ను కూడా వాడుకున్నాడు. 600మందికిపైగా ఉన్న అతని స్నేహితుల జాబితాల్లో కేవలం 50 మంది మాత్రమే పురుషులు, మిగిలిన వారంతా మహిళలే కావడం గమనార్హం. వీరిలో ఎవరెవ రితో చాటింగ్ చేశాడు. ఎలాంటి సంభాషణలు చేశాడు. వీడియోకాల్స్, మెస్సేజెస్ తదితర వివరా లను సేకరిస్తున్నారు. నిందితుడి మానసిక, నేరప్రవర్తనకు ఇవి నిదర్శనాలుగా నిలవనున్నాయి. ఫ్రెండ్స్‌లిస్టులో ఉన్నవారితో ఏమైనా సంబంధాలు నెరిపాడా? వారిలో ఎవరినైనా అంతమొందించాడా? అన్నది కూడా కేసు విచారిస్తోన్న ప్రత్యేక బృందం (సిట్) పరిశీలిస్తోంది. -
ఛార్జ్‌షీట్
-
హాజీపూర్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: శ్రీనివాసరెడ్డి చేసిన దురాగతాలతో హాజీపూర్ వణికిపోతోంది. ఎప్పుడు, ఏం బయటపడుతుందోనన్న ఆందోళన గ్రామస్థులను వెంటాడుతోంది. తమ మధ్యే అమాయకంగా తిరిగిన శ్రీనివాసరెడ్డి... ఓ నరరూప రాక్షసుడనుకోలేదన్నది జనం మాట. ఇప్పటివరకు స్వేచ్ఛగా వ్యవహరించిన పిల్లలు, పెద్దలు ఇప్పుడు చీకటి పడిందంటే ఆందోళన చెందుతున్నారు. రోడ్డు నుంచి బావి మీదుగా ఊరికి వచ్చేప్పుడు జనాన్ని భయం వెంటాడుతోంది. ఆరు రోజుల నుంచి ఇప్పటివరకు హాజీపూర్ ఎలా ఉంది? ఈ పరిస్థితులను తెలుసుకునేందుకు సాక్షి టీవీ గ్రామంలో పర్యటించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. హాజీపూర్ నుంచి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వప్న అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. హాజీపూర్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్‌ను ఇక్కడ చూడండి.. -
సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి బైక్ వీడియో వైరల్
శ్రీనివాస్‌రెడ్డి ఎప్పుడూ ఎవరితోనూ కలవడు. ఎవరికీ ఎక్కువగా కనిపించడు. కానీ, ఏదైనా అఘాయిత్యం చేసినప్పుడు మాత్రం అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తాడు. తద్వారా తనపై అనుమానం రాకుండా చూసుకుంటాడని తెలుస్తోంది. అదే క్రమంలో ఈ నెల 26వ తేదీన హఠాత్తుగా ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. ఊరి మధ్యలో ఉన్న చిన్న ఖాళీ ప్రదేశంలో పిల్లలు క్రికెట్ ఆడుతుంటే తాను కూడా ఆడాడు. మర్నాడు తన పాఠశాల మిత్రుడి పెళ్లికి భువనగిరి వెళ్లాడు. మిత్రులతో కలిసి విందులో పాల్గొని చిందులేశాడు. శ్రీనివాసరెడ్డిలో ఉత్సాహం చూసి తాము ఆశ్చర్యపోయామని.. ముభావంగా ఉండే అతను ఇంతలా ఆనందించడం తాము ఎప్పుడూ చూడలేదని చిన్ననాటి మిత్రులు తెలిపారు. అయితే, తాను చేసిన ఘోరం బయటపడకుండా, అనుమానం రాకుండా ఉండేందుకే తన స్వభావానికి విరుద్ధంగా శ్రీనివాస్‌రెడ్డి ప్రవర్తించాడని ఇప్పుడు అర్థమవుతోందన్నారు. 25న పాఠశాలకు వెళ్లివస్తున్న బాలికకు లిఫ్ట్ ఇచ్చి బావివద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. దీని వెనుక తానే ఉన్నట్లు ఎవరికీ అనుమానం రాకూడదనే... ఊర్లోకి వచ్చి క్రికెట్ ఆడినట్లు, తర్వాత రోజు మిత్రులతో కలిసి పెళ్లిలో చిందులు వేసినట్లు విశ్లేషిస్తున్నారు. తాజాగా అతను ఒక బైక్ మీద వెనుక కూర్చొని.. హల్చల్ చేస్తూ ప్రయాణిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్‌రెడ్డి మొహంలో ఎప్పుడూ ఎలాంటి భావం కనిపించదని... అతడితోపాటు పదో తరగతి వరకూ చదివినవాళ్లు చెబుతున్నారు. వాళ్ల క్లాస్‌లో 150 మంది ఉండేవారని, వారిలో ఏ ఒక్కరితోనూ శ్రీనివాస్‌రెడ్డి కలిసిపోయేవాడు కాదన్నారు. చదువుల్లో వెనుకబడి ఉండేవాడని, ఒక్కోసారి ఉపాధ్యాయులు కర్రతో కొడుతుంటే ఎన్ని దెబ్బలైనా తినేవాడు కానీ అతడి మొహంలో బాధ, భయం వంటి భావాలేవీ కనిపించేవి కాదంటున్నారు. ఊర్లోనూ ఎవరితో కలిసేవాడు కాదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంతటి తీవ్రనేర స్వభావం ఉన్న వ్యక్తి ఇన్నేళ్ల నుంచీ ఎందుకు ఖాళీగా ఉంటాడనేది ప్రశ్న. ఈ మధ్యకాలంలోనూ ఇలాంటి అఘాయిత్యాలు చేసి ఉండొచ్చని, అవేవీ బయటకు వచ్చి ఉండవని పోలీసులు అనుమానిస్తున్నారు. లిఫ్టు మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌రెడ్డి అనేక ప్రాంతాలు తిరుగుతుంటాడు. దీనిలో భాగంగానే కర్నూలు వెళ్లి అక్కడ ఒక యువతిని హత్యచేసి పీపాలో కుక్కాడు. ఫేస్బుక్ ఖాతాలో 631 మంది స్నేహితులు ఉంటే వారిలో పురుషులు 50 మంది కూడా లేరు. మిగతా యువతులంతా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారు. ఆ పరిచయంకొద్ది ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఏమైనా చేసి ఉంటాడా? అనేది అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో వేములవాడ, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో అదృశ్యమైన యువతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాంతోపాటు హాజీపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విచారిస్తున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి ద్వారా ఈ అనుమానాలన్నీ నివృత్తి చేసుకునేందుకు మరోమారు తమ అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఒక మహిళను వేధించడంతో ఊరివారంతా కలిసి శ్రీనివాస్‌రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అది శ్రీనివాస్‌రెడ్డి మనసులో బలంగా నాటుకుపోయిందని అతన్ని విచారించిన అధికారులు చెబుతున్నారు. ఎవర్నైనా బలవంతం చేసినప్పుడు వారు ఒప్పుకోకపోతే ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేసేవాడు కాదని...ఒకవేళ వారు బయటకెళ్లి చెబితే మళ్లీ కొడతారనే భయంతో అక్కడే హతమార్చేవాడని తెలిపారు. ఇదే అతడి మనస్తత్వమని శ్రీనివాస్‌రెడ్డిని విచారించిన ఓ అధికారి తెలిపారు. యాదాద్రి భువనగిరిజిల్లా హాజిపూర్‌లోని సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని పోలీసులు కస్టడీకి కోరనున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పథకం ప్రకారమే సిరియల్ హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ఫోన్ డేటా, ఫేస్బుక్ ఐడీని పోలీసులు పరిశీలిస్తున్నారు.నిందితుడు శ్రీనివాసరెడ్డి తరచూ కరీంనగర్ ప్రాంతాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. బొమ్మలరామారం బాలికల అదృశ్యం, హత్య ఘటనలపై తీవ్రంగా స్పందించిన రాచకొండ సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
వరంగల్ జైలుకు శ్రీనివాస్‌రెడ్డి
భువనగిరిఅర్బన్/వరంగల్: హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి భువనగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బొమ్మలరామారం పోలీసులు బుధవారం శ్రీనివాస్‌రెడ్డిని భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు. ప్రథమ శ్రేణి జూనియర్ సివిల్ జడ్జి టి.నాగరాణి ముందు హాజరుపర్చారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్ జైలుకుతరలించారు. వరుస హత్యలకు పాల్పడిన మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై హత్య, అత్యాచారం, సాక్ష్యాల గల్లంతు నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించే ముందు కోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస్‌రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం సాయంత్రం తమకు అప్పగించినట్లు వరంగల్ జైలు సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు. -
ఘోరం... దారుణం!
ఈ సమాజంలో ఆడపిల్లలు ఎంతటి అభద్రతతో బతుకీడ్వవలసి వస్తున్నదో చెప్పడానికి యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామం ఇప్పుడొక బండ గుర్తు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, ఎన్ని ఆటంకాలుంటున్నా పంటిబిగువున భరిస్తూ...ఎదిగితీరాలన్న పట్టుదలను ప్రదర్శించే చదువుల తల్లులకు కూడా ఆ గ్రామం ప్రతీక. ఎక్కడేం సమస్యలున్నాయో...ఏ సమస్యల్లో ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నదో పోల్చుకోలేని ప్రజాప్రతినిధుల నిర్లిప్త ధోరణికి ఆ నిస్సహాయ పల్లె ఒక విషాద సంకేతం. నిన్నటివరకూ తమ ఇంటిదీపాల్లా వెలుగులు పంచినవారు హఠాత్తుగా కనుమ రుగయ్యారని, వెతికిపెట్టి పుణ్యం కట్టుకోండయ్యా అని విలపించే తల్లిదండ్రుల్ని అసలే పట్టించు కోని పోలీసుల నిర్లక్ష్య వైఖరికి ఆ ఊరొక నిదర్శనం. హాజీపూర్‌లో అందరి కళ్లూ కప్పి నాలుగేళ్లుగా ఒక మానవ మృగం సాగించిన దారుణాలు విన్నప్పుడు ఎలాంటివారికైనా వెన్నులో చలిపుడు తుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది. రాష్ట్ర రాజధాని నగరం నుంచి గంటలోపే చేరగలిగిన ఒక చిన్న గ్రామానికి రవాణా సౌకర్యం లేని కారణంగా... ముగ్గురు చిట్టితల్లులు ఆ మృగం బారినపడ్డారని తెలిసినప్పుడు దిగ్భ్రాంతికలుగుతుంది. మర్రి శ్రీనివాసరెడ్డి అనే నరరూప రాక్షసుడికి చిక్కి తనువు చాలించిన ఆ పిల్లలను తల్చుకున్నప్పుడు ఎంతటివారికైనా దుఃఖం పొంగుకొస్తుంది. విస్మయం కలిగించే దుర్మార్గాలు ఒక్కొక్కసారి ఎంత యాదృచ్ఛికంగా బయటపడతాయో చెప్పడానికి ఈ సీరియల్ హత్యలే తార్కాణం. నాలుగేళ్లక్రితం హఠాత్తుగా కనుమరుగైన మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరోతరగతి బాలిక కల్పన గురించి పోలీసులు సక్రమంగా పట్టించుకుంటే ఈ వరస హత్యలుండేవి కాదు. అప్పట్లో శ్రీనివాసరెడ్డిపైనే అనుమానాలు కలిగినా సరైన ఆధారాలు లేక వదిలేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ అంతకుముందు ఒక వివాహితను వేధించిన ఉదం తంలో గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేశారు. దానిపై కేసు కూడా నమోదైంది. అలాగే కల్పన హత్య జరిగిన కొన్నాళ్లకు 2016లో కర్నూలులో ఒక సెక్స్‌వర్కర్‌ను హత్య చేసిన కేసులో అతడు ముద్దాయి. కల్పన హత్యకు ముందు జరిగిన ఉదంతాన్నిగానీ, తర్వాత జరిగిన హత్యనుగానీ పోలీసులు గమనంలోకి తీసుకుని ఉంటే అతడి దుర్మార్గాలకు అడ్డుకట్టపడేది. గత నెల 25న హాజీపూర్ గ్రామానికే చెందిన శ్రావణి బడికెళ్లి తిరిగివస్తూ అదృశ్యమైన ఉదంతంలో దర్యాప్తు చేస్తుండగా శ్రీనివాసరెడ్డి పొలంలోని పాడుబడ్డ బావి వద్ద ఆమె పుస్తకాల సంచీ లభ్యం కావడం, ఆ మర్నాడు బావిలో ఆమె మృతదేహం బయటపడటంతోపాటు మరో బాలిక అస్థి పంజరం కూడా లభ్యం కావడం వల్ల అతడిపై అనుమానం కలిగింది. బహుశా అంతక్రితం కల్పన మాయమైనప్పుడు వ్యవహరించిన రీతిలోనే అతగాడు అక్కడక్కడే తిరుగాడితే పోలీసులు అనుమానించేవారో లేదో! కానీ పరారీ కావడం వల్ల అనుమానాలు చిక్కబడ్డాయి. ఈ రెండు హత్యల సంగతి వెల్లడయ్యాకే మార్చి 9న మాయమైన మనీషా అనే డిగ్రీ విద్యార్థిని సైతం ఇతడి అకృత్యానికి బలైందని బయట పడింది. మనీషా అదృశ్యంపై ఫిర్యాదుచేస్తే కుటుంబం పరువు పోతుందన్న భయంతో కన్నవారు మౌనంగా ఉండిపోయారు. శ్రీనివాసరెడ్డిని మరింత లోతుగా విచారిస్తే ఇంకేం బయటపడతాయో మున్ముందు చూడాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమప్రాంతం గనుక, నక్సలైట్ల కదలికలు అధికంగా ఉండేవి కనుక ఇక్కడి పల్లెల్లో అందుకు తగ్గట్టే నిఘా ఉండేది. చీమ చిటుక్కుమంటే పోలీసులకు సమాచారం అందేది. కానీ హాజీపూర్ గ్రామం తీరుతెన్నులు చూస్తే ఇప్పుడలాంటి నిఘా ఉన్నట్టు కనబడదు. ఆ గ్రామం లోని కొందరు యువకులు మద్యానికి, గంజాయికి బానిసలు కావడం, శ్రీనివాసరెడ్డి తన పూర్వీ కుల ఇంటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చడం చూస్తే ఆ పల్లె దిక్కూ మొక్కూ లేని స్థితిలో పడిందని అర్ధమవుతుంది. ఊరి చివర ఒక పాడుబడిన బావి, ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం... ఆ దారి వెంబడే గ్రామానికి చెందిన పిల్లలు నిత్యం వెళ్లాల్సిరావడం వంటివి శ్రద్ధ పెట్టి గమనించి ఉంటే కనీసం అప్పుడప్పుడైనా ఆ ప్రాంతంపై నిఘా వేసి ఉంచాలని పోలీసులకు అనిపించి ఉండేది. ఒకప్పటి పెద్ద జిల్లాలు తెలంగాణ ఆవిర్భవించాక చిన్న జిల్లాలుగా మారాయి. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల ముంగిట్లో ఉంటే వారి సమస్యల్ని తెలుసుకోవడానికి, మరింత సమ ర్ధవంతమైన పాలన అందించడానికి వీలవుతుందన్నది జిల్లాల పునర్వ్యవస్థీకరణలోని ప్రధా నాంశం. కానీ అది ఆచరణలో మరింత పదునెక్కాలని హాజీపూర్ ఉదంతం తెలియజెబుతోంది. కొన్నేళ్లక్రితం మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలో అన్నారం, కొత్తపల్లి గ్రామాల పిల్లలు బస్సు సౌకర్యం లేని కారణంగా చదువు సాగడం లేదని ఆందోళన చేసి ఆ సౌకర్యాన్ని సాధించుకున్నారు. సమస్యలున్నా సర్దుకుపోవడం, రాజీపడటం ఎంత ప్రాణాంతకమో చెప్పడానికి హాజీపూర్ ఉదం తాలు తార్కాణం. పిల్లలు అదృశమయ్యారన్న ఫిర్యాదులు అందినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అలవాటైన పోలీసులకు ఇదొక గుణపాఠం. మాయమైన తమవారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు కాళ్లావేళ్లాప డినా మన దేశంలో పోలీసుల స్పందన అంతంతమాత్రమేనని చాన్నాళ్లనుంచి ఆరోపణలున్నాయి. పదేళ్లక్రితం ఈ విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది కూడా. ఏటా వేలాదిమంది పిల్లలు అదృశ్యమవుతున్నా... వారిలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా ఉంటున్నా వెతకడం మాట అటుంచి ఫిర్యాదులు స్వీకరించడానికే పోలీసులు సిద్ధపడటం లేదు. సకాలంలో స్పందించకపో వడం వల్ల దేశంలో ఏటా వేలాదిమంది పిల్లలు వ్యభిచార గృహాల బారినపడుతున్నారు. వెట్టిచా కిరీలో మగ్గిపోతున్నారు. పోలీసులతోపాటు పిల్లల సంరక్షణకు బాధ్యతవహించాల్సిన శాఖల్లోని సిబ్బంది అందరికీ పిల్లల విషయంలో ఫిర్యాదులొచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలి యజెప్పే శిక్షణనివ్వాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి నేరాలను నివారించడం సాధ్యమవుతుంది. -
శ్రీనివాసరెడ్డికి కర్నూలులోనూ నేరచరిత్ర..
కర్నూలు: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామాపురం మండలం హాజీపూర్ గ్రామంలో వరుస హత్యలకు పాల్పడిన మర్రి శ్రీనివాసరెడ్డికి కర్నూలులో కూడా నేరచరిత్ర ఉంది. నల్గొండ జిల్లాకు చెందిన ఇతను మూడేళ్ల క్రితం కర్నూలుకు వచ్చాడు. కొంత కాలం టీచర్స్ కాలనీలోని బల్వరీ అపార్టుమెంటులో నివాసముండేవాడు. ఈ సమయంలో లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసేవాడు. కర్నూలు భగత్‌సింగ్ నగర్లో నివాసముంటున్న కాశెపోగు మార్క్ అలియాస్ రాజు, గౌండా పని చేసే కాశెపోగు కళ్యాణ్, అపార్టు యజమాని కుమారుడు బల్వరీ అబ్దుల్ హఫీజ్ (గడ్డవీధి), ఎలై శ్యాం, మెకానిక్ అసిస్టెంట్ మండ్ల సురేష్ (భగత్‌సింగ్ కాలనీ) తదితరులతో కలిసి ఓ మహిళను హత్య చేసిన కేసులో కర్నూలులో జైలు జీవితం కూడా గడిపారు. హత్య ఎందుకు చేశారంటే..: 2016 డిసెంబర్ 27న కర్నూలు కొత్త బస్టాండు వద్ద విటుల కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళను శ్రీనివాసరెడ్డి మాట్లాడుకొని బల్వరీ అపార్టుమెంటు పెంట్ హౌస్‌కు తీసుకెళ్లాడు. మరో నలుగురితో కలిసి శారీరకంగా అనుభవించారు. డబ్బు విషయంలో శ్రీనివాసరెడ్డితో మహిళ గొడవ పడింది. దీంతో సమీపంలో ఉన్న ఐరన్‌రాడ్‌తో ఆమె తలపై బాదగా.. అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పెంట్ హౌస్‌పై ఉన్న వాడుకలో లేని నీటి ట్యాంకులో పడేసి మూతపెట్టి పరారయ్యారు. 2017 ఏప్రిల్ 12న అపార్టుమెంటు వాచ్‌మన్ బావమరిది అయిన చాకలి రాజు ట్యాంకును శుభ్రం చేసేందుకు మూత తెరిచి చూడగా అందులో మృతదేహం బయటపడింది. ఈ కేసులో మర్రి శ్రీనివాసరెడ్డితో పాటు మిగిలిన వారు కూడా జైలుజీవితం గడిపారు. తాజాగా హాజీపూర్‌లో వరుస హత్యల నేపథ్యంలో శ్రీనివాసరెడ్డిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కర్నూలులో మహిళ హత్య సంఘటనలో కూడా పాల్గొన్నట్లు అంగీకరించడంతో అందుకు సంబంధించి కేసు వివరాలను కనుగొనేందుకు తెలంగాణ నుంచి ఒక సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సోమవారం రాత్రి కర్నూలుకు వచ్చారు. రెండవ పట్టణ పోలీసుస్టేషన్లో కేసుకు సంబంధించిన రికార్డులు, సీడీ ఫైళ్లు తీసుకెళ్లారు. -
ముగ్గురినీ హతమార్చాడు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. 2015లో కల్పన హత్యను చేసిందీ శ్రీనివాస్ రెడ్డేనని పోలీసులు స్పష్టం చేశారు. శ్రావణి, మనీషాతో పాటు కల్పననూ తానే హత్య చేశానని శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. దీంతో కల్పన కేసులో చిక్కు ముడి వీడినట్లయింది. గ్రామస్తులపై ప్రతీకారం కోసమే కామాంధుడు, సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. మైనర్ బాలికలే లక్ష్యంగా క్రూరంగా అత్యాచారం చేసి హతమార్చాడని సీపీ తెలిపారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలు, మహిళల కదలికలపై శ్రీనివాస్ రెడ్డి రెక్కీ నిర్వహించేవాడని.. వారిని అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేసిన తర్వాతే అత్యాచారం చేసి చంపేసేవాడని వెల్లడైంది. కాగా.. బంధువుల ఇంట్లో దాక్కున్న సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని స్పెషల్‌పార్టీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, లిఫ్ట్ రిపేరు టూల్‌కిట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హాజీపూర్ ఘటన వివరాలను మహేష్ భగవత్ వెల్లడించారు. వివరాలు.. సీపీ మాటల్లోనే.. 2015 నాటి ఘటనలో.. 2015లో బొమ్మల రామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరోతరగతి విద్యార్థిని కల్పన (11) స్కూలు తర్వాత తన ఊరికి వెళ్తుండగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఆమెను నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను హతమార్చి గన్నీబ్యాగ్‌లో మృతదేహాన్ని పెట్టి సీతారామ్‌రెడ్డి వ్యవసాయ బావిలో పడేశాడు. దీనిపై బొమ్మలరామారం పోలీసుస్టేషన్లో అదృశ్యం కేసు నమోదైంది. ఈ ఘటనలోనూ శ్రీనివాస్‌రెడ్డిపైనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. పోలీసుల వద్ద సరైన ఆధారాలు లేవు. అయితే శ్రావణి, మనీషాల హత్య కేసు విచారణ సందర్భంగా కల్పనను కూడా హతమార్చింది తానేనని శ్రీనివాస్ రెడ్డి.. అంగీకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి9న కీసర మండలం చీర్యాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హాజీపూర్‌కు చెందిన విద్యార్థిని మనీషా (17) కళాశాల నుంచి ఇంటికొచ్చే క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి బైక్‌పై లిఫ్ట్ పేరుతో ఎక్కించుకొని బావి వద్దకు తీసుకువెళ్లి అపస్మారక స్థితికి వెళ్లేలా చేసి అత్యాచారం చేసి, అంతమొందించాడు. తరువాత మృతదేహాన్ని తన బావిలో పూడ్చిపెట్టాడు. అప్పట్లో స్థానిక పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈనెల 29వ తేదీన శ్రావణి హత్యకేసు విచారణ సందర్భంగా.. బావి వద్ద దుర్వాసన వచ్చింది. ఘటనాస్థలంలో దొరికిన ఆధార్‌కార్డు. అక్కడ లభించిన మృతదేహాం (ఎముకలు) ఆధారంగా ఆమెను మనీషాగా పోలీసులు గుర్తించారు. ఈకేసులో శ్రీనివాస్‌రెడ్డి నిందితుడిగా తేలింది. చితకబాదిన గ్రామస్తులపై కోపంతో.. హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి (28) సెల్ఫోన్లో అసభ్యకర చిత్రాలను చూడటంతోపాటు మద్యం, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. 2015లో మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బొమ్మల రామారం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం గ్రామస్తులు శ్రీనివాస్‌రెడ్డికి దేహశుద్ధి చేశారు. తనను చితకబాదిన గ్రామస్తులపై ఆయన పగ పెంచుకున్నాడు. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారం చేస్తూ హతమార్చాలని నిర్ణయించుకుని ఉన్మాదిగా మారాడు. హాజీపూర్ గ్రామం ప్రారంభంలోనే తన ఇల్లుండడంతో.. బయటకు వెళ్లే బాలికలు, మహిళల రాకపోకలు గమనిస్తుండేవాడు. శ్రావణి ఘటనతో దారుణాలు వెలుగులోకి ఈనెల 25న 9వ తరగతి విద్యార్థిని పాముల శ్రావణి (14) పాఠశాల నుంచి వచ్చి.. హాజీపూర్ వెళ్లేందుకు చెట్టుకింద బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ ఇస్తానని బైక్‌పై ఎక్కించుకొని తన వ్యవసాయ బావికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై కొట్టి అపసార్మక స్థితికి వెళ్లిన తరువాత బావిలో పడేశాడు. తరువాత శ్రీనివాస్‌రెడ్డి బావిలోకి దిగి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అంతమొందించాడు. బావి నుంచి తిరిగివచ్చే క్రమంలో శ్రావణి స్కూల్‌బ్యాగ్ కనబడడంతో అనుమానం రాకుండా బ్యాగ్‌ను వ్యవసాయ బావి వద్ద పడేసి వెళ్లిపోయాడు. శ్రావణి హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఈనెల 26వ తేదీన భువనగిరిలో స్నేహితుని పెళ్లికి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యాడు. పోలీసుల రాకతో పారిపోయాడు ఏప్రిల్ 26న పోలీసుల ప్రత్యేక బృందం హాజీపూర్ గ్రామానికి చేరుకొని బాలిక అదృశ్యం కేసుపై విచారణ చేస్తున్నట్టు గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి ఊరొదిలి పారిపోయాడు. విచారణలో భాగంగా వ్యవసాయ బావి వద్ద స్కూల్ బ్యాగ్, స్కూల్ ఐడీ కార్డు లభించడంతో శ్రావణి అదృశ్యం మిస్టరీ వీడింది. అత్యాచారం చేసి, హత్య చేశారని విచారణలో తేలడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతంగా చేశారు. గ్రామంలో గంజాయి, మద్యం సేవించే వారిని విచారించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్‌రెడ్డిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని గురించి ఆరా తీయగా ఆచూకీ లభించకపోవడంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరింది. ప్రత్యేక పోలీసు బృందాలు, భువనగిరి పోలీసులు, బోమ్మల రామారం పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఘట్కేసర్ సమీపంలోని రావిరాల గ్రామంలోని బంధువుల ఇంట్లో శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా శ్రావణి, మనీషాల హత్యపై నోరువిప్పిన శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత కల్పనను చంపిన విషయాన్నీ వెల్లడించాడు. అంతా సింగిల్‌గానే చేశాడు బాలికల సీరియల్ అత్యాచారాలు, హత్యలు శ్రీనివాస్‌రెడ్డి ఒక్కడే చేశాడు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు. గతంలో శ్రీనివాస్‌రెడ్డి పని చేసిన ఆదిలాబాద్, వేములవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. మనీషా, కల్పనల ఎముకలు మాత్రమే లభించడంతో వీటిని డీఎన్ఏ ద్వారా నిర్ధారించుకుంటామని పోలీసులు వెల్లడించారు. కల్పన మిస్సింగ్ సమయంలో.. పోలీసులు వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలనూ విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఫేస్బుక్లో శ్రీనివాస్‌రెడ్డికి వేములవాడకు చెందిన యువతితో వివాహాం జరిగినట్టు తెలియడంతో దీనిపై పోలీసులు దృష్టిపెట్టారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు. ‘శ్రావణి తండ్రికి ప్రభుత్వోద్యోగం కోసం కలెక్టర్ పరిశీలిస్తున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయంపైనా ప్రభుత్వంతో కలెక్టర్ మాట్లాడుతున్నారు. గ్రామంలో గంజాయి విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాం. బెల్టుషాపులను మూసివేయించాం. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి జీవిత ఖైదు పడేలా కేసులు నమోదు చేస్తాం’అని సీపీ తెలిపారు. -
లిఫ్ట్ పేరిట దారుణానికి ఒడిగట్టాడు
-
‘రివెంజ్ కోసమే హజీపూర్ హత్యలు’
సాక్షి, భువనగిరి : రివెంజ్ కోసమే నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి హజీపూర్‌లో వరుస హత్యలకు పాల్పడ్డాడని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డిపై 2015లో బొమ్మలరామారంలో ఓ అమ్మాయిని ఈవ్‌టీజింగ్ చేసినట్లు కేసు నమోదైందని, అప్పుడు పెద్దలు రాజీ చేశారన్నారు. ఆ సమయంలో గ్రామస్థులు అతన్ని కొట్టారని, ఇది మనసులో పెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి దానికి రివేంజ్‌గా ఈ వరుస హత్యలకు పాల్పడ్డాడని చెప్పారు. అతనిది పూర్తిగా సైకో బిహేవియరని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసు వివరాలను ఆయన మంగళవారం మీడియాకు వివరించారు. ‘ఏప్రిల్ 25న బొమ్మలరామరం మండలం హజీపూర్ నుంచి శ్రావణి అనే అమ్మాయి అదృష్యమైనట్లు కేసు నమోదైంది. మరుసటి ఉదయం.. హజీపూర్‌లోని ఓ బావి దగ్గర శ్రావణి స్కూల్ బ్యాగు దొరికింది. డాగ్‌స్క్వాడ్ ద్వారా అదే ప్రాంతంలో శ్రావణి మృతదేహన్ని గుర్తించాం. ఆ గ్రామ సర్పంచ్, అమ్మాయి తండ్రి నన్ను కలవడం జరిగింది. అందరం ఆ గ్రామానికి వెళ్లాం. అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డి బావిలో అమ్మాయి శవం ఉందని నిర్ధారించాం. అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించగా.. అత్యాచారం జరిపి హత్య చేసినట్లు తేలింది. డబ్బులు విషయంలో వేశ్యను చంపి.. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలు పెట్టాం. గతంలో మర్రిశ్రీనివాస్ రెడ్డిపై కర్నూలు టూటౌన్లో కేసు నమోదైనట్లు సమాచారం అందింది. 2017లో సెక్స్‌వర్కర్ అమ్మాయిని అత్యాచారం చేసి హత్యా చేసినట్లు అతనిపై కేసు నమోదైంది. కర్నూల్లో నలుగురు స్నేహితులతో కలిసి గదికి వ్యభిచారిని తీసుకొచ్చి డబ్బుల విషయంలో గొడవపడి అక్కడ ఆమెను దారుణంగా చంపి పరారయ్యాడు. అక్కడి పోలీసులు గ్రామానికివచ్చి మరి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పైగా అతను ఏప్రిల్ 26నే మాయం అయ్యాడు. అక్కడ కొందరు గంజాయి తాగుతున్నారని వారిని కూడా విచారించాం. చివరిగా శ్రీనివాస్ రెడ్డిపై అనుమానం వచ్చింది. పోచంపల్లి సమీపంలోని రావిరాల గ్రామంలో అతని కజిన్ దగ్గర షెల్టర్ తీసుకున్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లి పట్టుకున్నాం. లిఫ్ట్ ఇచ్చి.. బావిలో తోసేసి.. ఏప్రిల్ 29 ఉదయం భువనగిరి రూరల్ ఎస్సైకి బావి నుంచి దర్వాసన వస్తుందని ఫిర్యాదు అందితే.. మళ్లీ పరిశీలించాం. ఆ బావిలో ఆధార్ కార్డుతో పాటు, కాలేజీ ఐడెంటీ కార్డు దొరికింది. అందరి సమక్షంలో మరో మృతదేహాన్ని వెలకితీయడం జరిగింది. ఆధార్‌కార్డు, కాలేజీ ఐడేంటీ ద్వారా బీకాం సెకండీయర్ విద్యార్థిని మనీషా అని గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను సంప్రదిస్తే.. శివరాత్రి నుంచి కనబడలేదని, గతంలో కూడా ఇలానే వెళ్లిందని చెప్పారు. మనీషా, శ్రావణి మృతదేహాలు.. శ్రీనివాస్ రెడ్డి బావిలోనే దొరికాయి. దీంతో అతన్ని మా రీతిలో విచారణ జరిపితే నేరం అంగీకరించాడు. ఏప్రిల్ 25న 11.30 సమయంలో స్కూల్ నుంచి వచ్చి టర్నింగ్ వద్ద దిగిన శ్రావణి కొద్దిసేపు పక్కనే ఉన్న చెట్టు కింద నిలబడింది. అటుగా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి ఆమెకు లిఫ్ట్ ఇచ్చి బావి దగ్గరకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. బావిలోకి నెట్టేసి.. అనంతరం దిగి అత్యాచారం జరిపాడు. ఏం తెలియనట్టు 26న తన క్లాస్‌మెట్ పెళ్లికి వెళ్లాడు. పోలీసులు అందరు గ్రామంలోకి రాగానే పరారయ్యాడు. మనీషా, కల్పనలను అలానే.. మార్చి9న లిఫ్ట్ పేరిట బావి దగ్గరకు తీసుకెళ్లి మనీషాను అత్యాచారం చేసి పాతిపెట్టాడు. 2015లో మరో బాలిక కల్పన.. తప్పిపోయింది. అప్పట్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఆ కేసు గురించి ప్రశ్నించగా అది కూడా తానే చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు. బాడీని సంచిలో ప్యాక్ చేసి సీతారాం రెడ్డి బావిలో పడేసినట్లు చెప్పాడు. ఆ మృతదేహం కోసం అక్కడ వెతకడం జరిగింది. మాకు కొన్ని ఎముకలు లభించాయి. వాటి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి నాలుగు అత్యాచారా, హత్య కేసు కేసుల్లో సంబంధం ఉంది. కర్నూల్లో మరో ముగ్గురితో కలిసి చేయగా.. హజీపూర్లోనే మూడు హత్యలను మాత్రం ఒక్కడే చేసినట్లు తెలిపాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కస్టడీలో తీసుకుని విచారిస్తాం. ఎక్కడెక్కడా ఉన్నాడో అక్కడేమైనా దారుణాలకు ఒడిగట్టాడా? అనే కోణంలో విచారణ జరుపుతాం.’ అని మహేశ్ భగవత్ పేర్కొన్నారు. -
కల్పన మృతదేహం వెలికితీత!
సాక్షి, బొమ్మలరామారం : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని బావి నుంచి చిన్నారి కల్పన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో వెతికిన పోలీసులు.. ఎట్టకేలకు కల్పన ఆస్తికలను గుర్తించారు. ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఒకే బావిలో లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనీషా బ్యాగు దొరికిన మరో బావిలో కల్పన మృతదేహం ఉండి ఉండవచ్చునని అనుమానంతో పోలీసులు వెతికారు. ఆ బావిలోనే కల్పన మృతదేహం లభించింది. ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల కల్పన నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. ఆ చిన్నారిని కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు మానవమృగం శ్రీనివాస్‌రెడ్డి తాజాగా పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇదేవిధంగా శ్రావణి, మనీషాలను కూడా అత్యాచారం చేసి.. శ్రీనివాస్‌రెడ్డి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. సిట్ ఏర్పాటు హజీపూర్ వరుస హత్యల కేసులో దర్యాప్తు విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు కోసం ఏసీపీ భుజంగరావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. భువనగిరి ఇన్స్పెక్టర్తోపాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లను ఈ సిట్‌లో నియమించారు.