హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడి శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం విచారించనున్నారు. అతన్ని విచారించేందుకు నల్గొండ జిల్లా కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించిందని రాచకొండ కమిషనరేట్ అధికారులు తెలిపారు. గతంలోనూ శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారులు వారంరోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే.