ముప్పుతిప్పలు పెడుతున్న సీరియల్‌ కి​ల్లర్‌..! | Hajipur Serial Killer Srinivas Reddy Not Responding For SIT Questions | Sakshi
Sakshi News home page

ముప్పుతిప్పలు పెడుతున్న సీరియల్‌ కి​ల్లర్‌..!

May 11 2019 5:14 PM | Updated on May 11 2019 10:00 PM

Hajipur Serial Killer Srinivas Reddy Not Responding For SIT Questions - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: హాజీపూర్‌ సైకో, సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి సిట్‌ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారుల బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు ఎన్ని విధాల ప్రయత్నించినా నిందితుడు నోరుమెదపడం లేదని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు.

శ్రీనివాస్‌ రెడ్డి తీరుతో సిట్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక హాజీపూర్‌లో క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు పూర్తి చేసినట్టు సమాచారం. గ్రామస్తులు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో రాత్రి సమయంలోనే క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసినట్టు తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ఫోన్‌లో ఉన్న సమాచారంతోపాటు, కాల్‌ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 13 వరకు శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారులు విచారించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement