మీరే ఆదుకోవాలి మేడమ్‌! 

Kalpana family members met Collector Anitharama Chandran - Sakshi

కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ను వేడుకున్న ‘హాజీపూర్‌’ బాధిత కుటుంబాలు

సాక్షి, యాదాద్రి: సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన కల్పన కుటుంబ సభ్యులు కలెక్టర్‌ అనితారామ చంద్రన్‌ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్, మైసిరెడ్డిపల్లిని ఆదివారం జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సందర్శించారు. సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో దారుణంగా హత్యకు గురైన బాలికలు కల్పన, మనీషా, శ్రావణి కుటుంబాలను ఆమె పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా కల్పన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభంశుభం తెలియని తమ చిన్నారి అతి కిరాతకంగా హత్యకు గురైందని వారు వాపోయారు. నిరుపేదలమైన తమ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆమె వారిని ఓదారుస్తూ ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. రావాల్సిన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top