హాజీపూర్‌ కేసు: ‘పోలీసులే అలా సృష్టించారు’

Hazipur Murder Case Trial Updates - Sakshi

సాక్షి, నల్లగొండ :ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో హాజీపూర్ కేసు విచారణ శుక్రవారం చేపట్టారు. ఈ కేసులోని నిందితుడు మర్రి శ్రీనివాస రెడ్డిని పోలీసులు మరోసారి కోర్టులో హాజరు పరిచారు. డిసెంబర్ 26న మనీషా కేసులో నిందితుడి వాదన నమోదు చేయగా. ఈ రోజు ఉదయం శ్రావణి, మధ్యాహ్నం కల్పన కేసులో నిందితుడి వాదన  న్యాయస్థానం వినగా.. శ్రావణి కేసులో 44 మంది, కల్పన కేసులో 30 మంది సాక్షుల వాదనను నిందితుడికి న్యాయమూర్తి వినిపించారు. అనంతరం అనంతరం న్యాయమూర్తి నిందితుడిని పలు ప్రశ్నలు అడగ్గా.. సెక్షన్‌ 313 కింద నిందితుడు తన వాదనను వినిపించాడు. తనకేం తెలియదని.. అంత అబద్ధమంటూ నిందితుడు పదే పదే చెప్పాడు. బైక్‌ పైన శ్రావణిని ఎక్కించుకుని వెళ్లినట్లు చెబుతున్నారని ప్రశ్నించగా తనకు అసలు బైక్‌ డ్రైవింగ్‌ రాదని చెప్పాడు. శ్రావణి దుస్తులపై తన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారని అడగ్గా.. పోలీసులే అలా సృష్టించారని నిందితుడు సమాధానమిచ్చాడు. అసలు కల్పన ఏవరో కూడా తెలియదని, పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని వాదించాడు. ఇంతక ముందు ఏ పని చేశావు.. ఎక్కడ పనిచేశావు.. యజమాని ఎవరు అని న్యాయమూర్తి అడగ్గా నిందితుడు వివరాలు చెప్పలేకపోయాడు. (హాజీపూర్‌ కేసు: ‘సువర్ణ ఎవరో తెలీదు’)

అలాగే ఘటనా స్థలంలో దొరికిన బీరు బాటిళ్లపై తన వేలి ముద్రలు ఉన్నట్లు తేలిందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. పోలీసులే బలవంతంగా పట్టించారని పేర్కొన్నాడు. తనను కొట్టి ఒప్పించారని, తన అమ్మ, నాన్నలను తీసుకు రావాలనిన్యాయమూర్తిని కోరాడు. తల్లిదండ్రులు ఎక్కడున్నారని ప్రశ్నించగా తనకు తెలియదని నిందితుడు తెలిపాడు. మరి కోర్టుకు ఎలా తెలుస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. చివరికి తదుపరి విచారణ 6వ తేదికి వాయిదా వేశారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిననట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా కల్పన కేసులో ఇంకా వాదన కొనసాగుతుంది.

చదవండిలేదు.. తెలియదు.. కాదు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top