మర్రిబావిలో మరో రెండు మృతదేహాలు? 

Another two dead bodies in Marri Baavi - Sakshi

బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్‌రెడ్డి.. తన మర్రి బావిలో మరో రెండు మృతదేహాలను పూడ్చిపెట్టాడనే ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి తనతో పాటు లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేసే దంపతులను హతమార్చి మర్రిబావిలోనే పూడ్చిపెట్టాడని గ్రామంలో చర్చించుకుంటున్నారు.

శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ పోలీస్‌ కస్టడీ 
నల్లగొండ లీగల్‌: ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌రెడ్డిని 3 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నల్లగొండ అదనపు జిల్లా జడ్జి ఎస్‌వీవీఎన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని గతనెలలో వారంపాటు పోలీసు కస్టడీకి ఇచ్చిన కోర్టు.. మరో రెండు కేసుల విచారణ నిమిత్తం మూడు రోజులు కస్టడీకి అనుమతించింది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top