
బొమ్మలరామారం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని మర్రిబావి, తెట్టెబావులలో లభించిన కల్పన, మనీషాల మృతదేహాల నిర్ధారణ కోసం పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా సోమవారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులనుంచి రక్త నమూనాలను సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.