breaking news
bommalramaram
-
హాజీపూర్ బాధితుల రక్త నమూనాల సేకరణ
బొమ్మలరామారం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని మర్రిబావి, తెట్టెబావులలో లభించిన కల్పన, మనీషాల మృతదేహాల నిర్ధారణ కోసం పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా సోమవారం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులనుంచి రక్త నమూనాలను సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. -
డీఎల్పీఓ విచారణ
బొమ్మలరామారం : మండలంలోని మేడిపల్లి, మాచన్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు ఎదుర్కుంటున్న నిధుల దుర్వినియోగం అభియోగాలపై గురువారం డీఎల్పీఓ రవి కుమార్ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు, అభియోగాలు ఎదుర్కుంటున్న సర్పంచ్ల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. అనంతరం రికార్డులను సీజ్ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శంకరయ్య, కష్ణ, ఎంపీటీసీ మేడబోయిన శశికళగణేష్, ఉప సర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు దేవదాసు, ఎల్లమ్మ రత్నమాల,మంగ, మల్లేష్, రమేష్ పాల్గొన్నారు.