డీఎల్‌పీఓ విచారణ | DLPO inquiry | Sakshi
Sakshi News home page

డీఎల్‌పీఓ విచారణ

Jul 22 2016 1:06 AM | Updated on Sep 4 2017 5:41 AM

మండలంలోని మేడిపల్లి, మాచన్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు ఎదుర్కుంటున్న నిధుల దుర్వినియోగం అభియోగాలపై గురువారం డీఎల్‌పీఓ రవి కుమార్‌ విచారణ చేశారు.

బొమ్మలరామారం : మండలంలోని మేడిపల్లి, మాచన్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు ఎదుర్కుంటున్న నిధుల దుర్వినియోగం అభియోగాలపై గురువారం డీఎల్‌పీఓ రవి కుమార్‌ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు, అభియోగాలు ఎదుర్కుంటున్న సర్పంచ్‌ల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. అనంతరం రికార్డులను సీజ్‌ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు శంకరయ్య, కష్ణ, ఎంపీటీసీ మేడబోయిన శశికళగణేష్, ఉప సర్పంచ్‌ మోటే రమేష్, వార్డు సభ్యులు దేవదాసు, ఎల్లమ్మ రత్నమాల,మంగ, మల్లేష్, రమేష్‌ పాల్గొన్నారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement