ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి సెక్యూరిటీ గార్డే దిక్కు | Blood tests with security guard for two days | Sakshi
Sakshi News home page

ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి సెక్యూరిటీ గార్డే దిక్కు

Oct 13 2025 5:15 AM | Updated on Oct 13 2025 5:15 AM

Blood tests with security guard for two days

రెండ్రోజులుగా ఆయనతోనే రక్తపరీక్షలు

గగ్గోలు పెడుతున్న రోగులు

ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): స్థానిక సీహెచ్‌సీలో వైద్య సిబ్బంది కొరతతో ఇక్కడి సెక్యూరిటీ గార్డే రోగులకు రక్త పరీక్షలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రెండ్రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెల­కొనడంతో బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ముంచంగిపుట్టు సీహెచ్‌సీ­లో వైద్యులు, సిబ్బంది కొరతతో సక్రమంగా వైద్యసేవలు అందడంలేదని.. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల గిరిజ­నుల పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైందని.. ఆసుపత్రికి రావాలంటే భయపడే పరిస్థితులు దాపురించాయని రోగులు గగ్గోలు పెడుతున్నారు. 

ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోని సీహెచ్‌సీ, పీహె­చ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని.. లేకపోతే సెక్యూరిటీ గార్డులు, కిందస్థాయి సిబ్బంది అందించే సేవలలో ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తు­న్నారు. ఇదిలా ఉంటే.. ఇతరులు రక్త పరీక్షలు చేస్తుండగా కొందరు వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement