చెట్లపై చిన్నారుల పేర్లు.. హాజీపూర్‌లో కలకలం | Murdered Girl Name on Hajipura Tree | Sakshi
Sakshi News home page

చెట్లపై చిన్నారుల పేర్లు.. హాజీపూర్‌లో కలకలం

May 18 2019 6:29 PM | Updated on May 18 2019 7:03 PM

Murdered Girl Name on Hajipura Tree - Sakshi

సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రావణి, మనీషా, కల్పన అనే చిన్నారులను అత్యంత పాశవికంగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి హతమార్చాడు. ఈ సీరియల్‌ మర్డర్స్‌పై ఒకవైపు పోలీసులు విచారణ జరుపుతుండగా.. మరోవైపు హాజీపూర్‌ గ్రామస్తులు ఆ కామాన్మాదిని ఉరితీయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.  

తన పొలానికి తీసుకెళ్లి బాలికలపై అత్యాచారం జరిపి.. హతమార్చిన శ్రీనివాస్‌రెడ్డి.. తన పొలంలోని పాడుబడ్డ బావిలో బాలికల మృతదేహాలను విసిరేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హాజీపూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మేడిచెట్టుపై మనీషా అనే పేరును రాసి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. మేడిచెట్టుపై మృతురాలైన బాలిక పేరు ఉండటం హాజీపూర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇక్కడ రావి, మేడి, వేపచెట్లు పక్కపక్కనే ఉండడంతో.. వాటికి శ్రీనివాస్‌రెడ్డి గతంలో పూజలు చేస్తూ ఉండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల వరుస హత్యలు వెలుగుచూసిన నేపథ్యంలో ఇక్కడ మేడిచెట్టుపై మనీషా అనే పేరు చెక్కి ఉన్న విషయాన్ని తాజాగా గుర్తించారు.  నిందితుడు శ్రీనివాస్‌రెడ్డే.. మేడిచెట్టుపై ఇలా చెక్కి ఉండాటని, బాలికలను హతమార్చిన తర్వాత వారి పేర్లను అతను చెట్ల మీద చెక్కుతున్నట్టు కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
శ్రీనివాస్ చర్యలతో హాజీపూర్‌లో కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement