హాజీపూర్‌ కేసు.. మరో వారం రోజుల్లో తీర్పు! | Hajipur Case Fast Track Completed Trials | Sakshi
Sakshi News home page

హాజీపూర్‌ కేసు.. మరో వారం రోజుల్లో తీర్పు!

Dec 24 2019 1:06 PM | Updated on Dec 24 2019 1:10 PM

Hajipur Case Fast Track Completed Trials - Sakshi

సాక్షి, నల్గొండ : హాజీపూర్‌ వరుస హత్యల ఘటనలో మరో వారం రోజుల్లో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గత కొన్ని రోజులుగా నల్గొండ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డి విచారణ ముగిసింది. అయితే నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని మరోసారి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో వచ్చే గురువారం శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చివరిసారిగా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు శ్రీనివాస్‌రెడ్డిని అభిప్రాయం తీసుకోనుంది. అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించనుంది.

కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement