రాష్ట్రవ‍్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న అతడిని బుధవారం ఉదయం రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణాధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నియమించిన విషయం తెలిసిందే.