వరంగల్‌ జైలుకు శ్రీనివాస్‌రెడ్డి | Srinivas Reddy To Warangal jail | Sakshi
Sakshi News home page

వరంగల్‌ జైలుకు శ్రీనివాస్‌రెడ్డి

May 2 2019 1:45 AM | Updated on May 2 2019 1:45 AM

Srinivas Reddy To Warangal jail - Sakshi

హజీపూర్‌ వరుస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువెళ్తున్న పోలీసులు

భువనగిరిఅర్బన్‌/వరంగల్‌: హాజీపూర్‌ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి భువనగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. బొమ్మలరామారం పోలీసులు బుధవారం శ్రీనివాస్‌రెడ్డిని భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు. ప్రథమ శ్రేణి జూనియర్‌ సివిల్‌ జడ్జి టి.నాగరాణి ముందు హాజరుపర్చారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్‌ జైలుకుతరలించారు.

వరుస హత్యలకు పాల్పడిన మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై హత్య, అత్యాచారం, సాక్ష్యాల గల్లంతు నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించే ముందు కోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస్‌రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం సాయంత్రం తమకు అప్పగించినట్లు వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌ మురళీబాబు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement