
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ‍్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో ఎలాంటి సమాధనం ఇవ్వకుండా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినట్లు సమాచారం. ఐదు రోజులుగా విచారిస్తున్న సిట్ అధికారుల కస్టడీ గడుపు నేటితో ముగిసింది. దీంతో శ్రీనివాస్‌ను కోర్ట్‌లో హాజరు పరిచారు. వరంగల్ సెంట్రల్ జైలుకు శ్రీనివాస్‌ను తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
ఇన్ని రోజుల కస్టడీలో శ్రీనివాస్ నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. అమ్మాయిల వరుస హత్యల ఘటనలో శ్రీనివాస్‌తో పాటు మరికొంత మంది హస్తం ఉన్నట్లు హాజీపూర్ గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని హజరుపర్చిన పోలీసులు