Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Political Fight Between Congress And BJP At North East Delhi Seat
BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?..

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో అంద‌రినీ ఆక‌ర్షిస్తున్న సీటు ఈశాన్య ఢిల్లీ. హ్య‌ట్రిక్‌పై క‌న్నేసిన బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీపై, యువ‌నాయ‌కుడు క‌న్హ‌య్య కుమార్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది. గ‌త ఎన్నిక‌ల్లో బెగుస‌రాయ్‌లో ఓడిపోయిన క‌న్హ‌య్య‌కుమార్‌ను రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలో పోటీకి దింప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 20శాతం ముస్లింలు, 11శాతం ఎస్సీల స‌మీక‌ర‌ణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ప్ర‌యోగానికి దిగింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.ఈశాన్య ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. నార్త్ ఈస్ట్ సీటు భారతదేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అత్యధిక జనాభా పూర్వాంచల్‌కు చెందినవారే. ఈ లోక్‌సభ స్థానంలో అనేక అనధికార కాలనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్‌తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా, ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుండి వలస వచ్చిన వారి జనాభా ఎక్కువగా ఉంది.ఈ లోక్‌సభ స్థానంలో భ‌జ‌న్‌పురా, బురారీ, తిమర్‌పూర్, సీలంపూర్, ఘోండా, బాబర్‌పూర్, గోకల్‌పూర్, సీమాపురి, రోహతాస్ నగర్, ముస్తఫాబాద్, కరవాల్ నగర్‌లతో కలిపి 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 16.3 శాతం షెడ్యూల్డ్ కులాలు, 11.61 శాతం బ్రాహ్మణులు, 20.74 శాతం ముస్లింలు, 4.68 శాతం వైశ్య (బనియా), 4 శాతం పంజాబీ, 7.57 శాతం గుర్జార్ మరియు 21.75 శాతం ఓబీసీ కమ్యూనిటీ వారి వాటాను కలిగి ఉంది.గ‌తంలో 2009 లోక్‌సభ ఎన్నిక‌ల్లో బీజేపీపై కాంగ్రెస్‌ 59.03 శాతం ఓట్లతో భారీ ఆధిక్యం సాధించగా బీజేపీకి 33.71 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 నుంచి వ‌రుస‌గా బీజేపీ విజ‌య‌కేతనం ఎగ‌రేస్తోంది. 2014లో సినీ నటులు మనోజ్ తివారీకి 45.38 శాతం ఓట్లతో గెలుపొంద‌గా, 2019లో 53.86 శాతం రెండోసారి విజ‌య‌కేత‌నం అందుకున్నారు. ఈ సీటులో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది.ఒకవైపు రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్ అయితే, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ జేఎన్‌యూ స్టూడెంట్ లీడ‌ర్‌గా దేశ‌వ్యాప్తంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుకుగా కనిపించారు. ఈ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే తుక్‌డేతుక్‌డే గ్యాంగ్ నాయ‌కుడ‌ని బీజేపీ.. క‌న్హ‌య్య కుమార్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి మారేందుకు ఈ ఎన్నిక మ‌నోజ్ తివారీకి కీల‌కంగా మార‌నుంది. ఇప్ప‌టికే రెండుసార్లు గెలిచి స‌త్తా చాటిన తివారీ మూడోసారి హ్యాట్రిక్ సాధించ‌డం ద్వారా ఢిల్లీ బీజేపీ అగ్ర‌నాయ‌కుడిగా త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవ‌కాశం ఉంది. ఢిల్లీ బీజేపీకి నాయ‌కుడు లేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడుతున్న పార్టీకి తివారీ సార‌థ్యం వ‌హించ‌డానికి ఇదొక అవ‌కాశమ‌నే అంచ‌నాలొస్తున్నాయి.ఇటు షీలా దీక్షిత్ త‌ర్వాత ఢిల్లీకి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లీడ‌ర్ క‌రువ‌య్యారు. క‌న్హ‌య్య కుమార్ గ‌నుక ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిస్తే ఆయ‌న కూడా ఢిల్లీ కాంగ్రెస్‌కు ఫ్యూచ‌ర్ సీఎం లీడ‌ర్‌గా ఎదిగే అవ‌కాశ‌ముంది. మ‌రి ఈసారి ఢిల్లీ ఈశాన్యంలో క‌మ‌లం ఉద‌యిస్తుందా? హ‌స్త రేఖ‌లు మార‌తాయా? అన్న‌ది ఓట‌రు చేతిలో ఉంది.

Ap Elections 2024 May 21 Political Updates Telugu
May 21st: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 21st AP Elections 2024 News Political Updates11:32 AM, May 21st, 2024ఎస్సీలంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారు: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజుఆ అక్కసుతోనే దళితులపై దాడులు జరిపారువదినా మరిది అయిన పురందేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారుపోలీసు అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిపారుఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పని చేస్తున్నాయిచంద్రబాబు తన మనమడికి 6 నెలల వయసున్నపుడే వందలకోట్లు జమ చేశాడుపాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారుసీఎం జగన్‌ను ఓడించే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవుపేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారుపేదల పిల్లలు ఐక్య రాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారుఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబుబీసీల తోకలు కత్తిరిస్తానంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబుబీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారుఎస్సీలంతా జగన్ వైపే ఉన్నారు10:43 AM, May 21st, 2024కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక150 పేజీల ప్రాథమిక నివేదికను సీఈసీకి పంపిన ఏపీ సీఎస్ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదికపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో.. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన సిట్1370 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, 124 మంది అరెస్ట్ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ నివేదికఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్ల చేర్చే విషయంపై సిఫార్సు చేసిన సిట్8:40 AM, May 21st, 2024దుష్ప్రచారం చేయడం డాక్టర్‌ లోకేశ్‌కు అలవాటే: ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ వాసుదేవరెడ్డి వెల్లడికోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టుపలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్‌ పైనా నిషేధంఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధా­విగా చలామణి అవుతున్నారుఅయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందిగుంటూరు మెడికల్‌ కాలేజీలో 1983లో లోకేశ్‌ గ్రాడ్యుయేట్‌ అయ్యాడుగ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్‌ మొదలెట్టాడుఅప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్‌ చేయడం లోకేశ్‌కు అలవాటుప్రాక్టీస్‌ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజ­­మాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడుఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్, అదానీ మీద వాషింగ్టన్‌ డీసీ కోర్టులో కేసులు ఫైల్‌ చేశాడుఇండియా నుంచి కంటై­నర్‌లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్‌ నుంచి స్పైవేర్‌ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరో­పణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించిందివైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్‌ కారకుడయ్యాడు2006లో వర్జీనియా బోర్డ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లోకేశ్‌ మెడికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసిందిఅనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్‌ చేశారుఅయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలిమేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్‌ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన‌ సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల‌ మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్ష‌న్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్‌ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్‌ స్కామ్‌లోనూ బాబు దుబాయ్‌ బంధంఈసారి అదే షెల్‌ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్‌ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్‌ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్‌ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి

KKR vs SRH They Are Going in Final As Calm Very Dangerous Side: Wasim Akram
KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్‌ చేరే తొలి జట్టు ఇదే!

ఐపీఎల్‌-2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌ చేరే తొలి జట్టును ఖరారు చేసే క్వాలిఫయర్-1లో మాజీ చాంపియన్లు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మంగళవారం తలపడనున్నాయి.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ లెజెండరీ పేసర్‌ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్‌ చాలా ప్రమాదకర జట్టు అంటూ ప్రత్యర్థి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను హెచ్చరించాడు.అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం‘‘పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం వారి బౌలింగ్‌ లైనప్‌. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు.అలాంటి బౌలర్లు ఉన్న జట్టు ఏదైనా కచ్చితంగా విజయాలు సాధిస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే వరుణ్‌ చక్రవర్తి 18, హర్షిత్‌ రాణా 16, ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్‌, సునిల్‌ నరైన్‌ చెరో 15, మిచెల్‌ స్టార్క్‌ 12 వికెట్లు పడగొట్టారు.ప్రమాదకర జట్టు ముఖ్యంగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్క్‌ ఉండటం వారికి ప్రధాన బలం. కేకేఆర్‌ ఎలాంటి హడావుడి లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. ఫైనల్‌ చేరేందుకు అర్హతలు ఉన్న ప్రమాదకర జట్టు అని కచ్చితంగా చెప్పగలను.ఇక ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క బ్యాటర్‌ కూడా కీలక సమయంలో ఏదో ఒక మ్యాచ్‌లో రాణిస్తూనే ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నా ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించరు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలుక్వాలిఫయర్‌-1 నేపథ్యంలో ఫైనల్‌ చేరే తొలి జట్టుగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌(ఇంగ్లండ్‌) జట్టుకు దూరం కావడం కచ్చితంగా ప్రభావం చూపుతుందని వసీం అక్రం అభిప్రాయపడ్డాడు. కాగా వసీం అక్రం గతంలో కేకేఆర్‌ జట్టుతో కలిసి పనిచేశాడు.‌‌ ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్‌- సన్‌రైజర్స్‌ పరస్పరం తలపడ్డాయి. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ 4 పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్‌ను ఓడించింది.చదవండి: MI: ఈ సీజన్‌లో నిరాశే మిగిలింది.. అయితే: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్‌

Karnataka Police Investigation Over Bangalore Rave Party
బెంగళూరు రేవ్‌ పార్టీపై వెలుగులోకి సంచలన విషయాలు..

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. రేవ్‌ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మరోవైపు.. బెంగళూరు రేవ్‌ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, ‘సన్‌సెట్‌ టూ సన్‌రైజ్‌ విక్టరీ’ పేరుతో వ్యాపారి, క్రికెట్‌ బూకీ వాసు వ్య‍క్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. బర్త్‌ డే పార్టీలో డ్రగ్స్‌ వినియోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్‌ పార్టీ జరిగేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌ మొత్తానికి అరుణ్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. వాసు బర్త్‌డే పార్టీకి డగ్ర్‌ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్‌, రాజ్‌ కూడా రావడంతో డ్రగ్స్‌ వాడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రేవ్‌ పార్టీ ఇచ్చిన క్రికెట్‌ బూకీ వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, రేవ్‌ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్‌లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా రెండు రోజులుగా బెంగళూరు జీఆర్‌ ఫామ్‌హాస్‌లో మకాం వేసినట్టు సమాచారం. ఇక, నిన్న రేవ్‌ పార్టీపై రైడ్‌ సందర్భంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్‌, సిద్ధిఖీ, రణధీర్‌, రాజ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రేవ్‌పార్టీలో 150 మంది ఉన్నారని డాగ్‌ స్క్వాడ్‌ను​ పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. ‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరిట రేవ్‌ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ACB Searches CCS ACP Umamaheswara Rao's House
హైదరాబాద్‌లో దాడుల కలకలం.. ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

సాక్షి, హైదరాబాద్‌: సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అశోక్‌నగర్‌లో ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు.ఇబ్రహీంపట్నం రియల్‌ మర్డర్‌ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయిన సంగతి తెలిసిందే. డబుల్‌ మార్డర్‌ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి.

Scarlett Johansson Accused Open Ai
వివాదంలో చాట్‌జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌

ఓపెన్‌ ఏఐ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల‍్ట్‌మన్‌ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్‌జీపీటీ స్కై వాయిస్‌ను నిలిపి వేశారు.యాపిల్‌ సిరి వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ తరహాలో చాట్‌ జీపీటీ యూజర్లకు వాయిస్‌ అసిస్టెంట్‌ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ పనిచేస్తున్నారు. స్కై వాయిస్‌ పేరుతో తెచ్చే ఈ ఫీచర్‌లో ప్రముఖుల వాయిస్‌ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్‌ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్‌ చేసుకుంటే చాట్‌ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్‌ కాకుండా వాయిస్‌లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్‌ను దీన్ని డెవలప్‌ చేసే సమయంలో శామ్‌ ఆల్ట్‌మన్‌.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా, హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్‌ను కాపీ చేసి చాట్‌జీపీటీ స్కైవాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్‌ జాన్సన్‌.. ఓపెన్‌ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్‌ ఆల్ట్‌మన్‌ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్‌జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్‌ జాన్సన్‌ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్‌ జాన్సన్‌ ఏమన్నారంటే తన వాయిస్‌ను ఓపెన్‌ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్‌ ముద్దుగమ్మ స్కార్లెట్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ చాట్‌జీపీటీ వాయిస్‌ ఆప్షన్‌ కోసం గతేడాది సెప్టెంబర్‌లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్‌మన్ తనలాగే వినిపించే 'చాట్‌జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్‌ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్‌ఏఐ అయితే స్కార్లెట్‌ జాన్సన్‌ వ్యాఖ్యల్ని శామ్‌ ఆల్ట్‌మన్ ఖండించారు. చాట్‌జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్‌ వాయిస్‌ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్‌ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్‌లలో స్కై వాయిస్‌ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్‌కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు.

Special Story On AI Technology Use In 2024 General Elections
ఎన్నికలు vs ఏఐ

ఈ వేసవి ఎంత వేడిగా వుందో ప్రస్తుత ప్రపంచ రాజకీయ వాతావరణం అంతే వేడిగా వుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలలో ఎన్నికలు పూర్తి కాగా మరికొన్ని దేశాలలో త్వరలో జరగనున్నాయి. ఇదే మే నెలలో దక్షిణాఫ్రికాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా నవంబరులో అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. ఇంతటి మహాయజ్ఞంలో ఇప్పుడు మానవ మేధస్సు కంటే ఎక్కువగా ఎన్నికల్లో ఏఐ (అర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) పాత్ర పెరిగింది.ఏఐ అంటే ఏంటీ?ఆర్టీఫిషియల్ ఇంటెలిజన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో కూడిన యంత్రాంగం. అంటే మనిషి లానే ఆలోచించి ఇంకా చెప్పాలంటే మనిషి కన్నా వందల రెట్లు వేగంగా ఆలోచించి జవాబులు చెప్పే యాంత్రిక సాధనం. ఈ సాంకేతిక విప్లవం ఇప్పుడు ఎన్నికలలో విపరీతంగా వాడుకలోకి వచ్చింది. అభ్యర్ధులు తమ ప్రచారం కోసం ఏఐ వాడకాన్ని విపరీతంగా పెంచేశారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రజల మనోభావాలను ఇట్టే పసిగట్టేయడానికి, సోషల్‌ మీడియాలో పోస్టులను విశ్లేషించడానికి, ప్రచార వ్యూహాలను, క్యాంపెయిన్లను రూపొందించడానికి ఏఐ సాంకేతికతను విపరీతంగా వాడేశారు. అక్కడితే ఆగిపోయారా.. అంటే లేదు అని చెప్పాలి. లెక్కకు మిక్కిలి ఫేక్‌ వీడియోలు, ఫేక్‌ ఫోటోలను అసలు కంటే మిన్నగా ఏఐతో రూపొందిస్తున్నారు.ఏఐ ఎలా పని చేస్తోంది?ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ (AI) మానవ మేధస్సు నుంచి వేగంగా నేర్చుకుంటుంది. సమస్య - పరిష్కారం, ఎలాంటి అవసరాలు వస్తాయి? ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి? ఆలోచించడానికి, అనుకరించడానికి, పోల్చుకోడానికి దేన్ని పరిశీలించాలి? వీటన్నింటిని ఒక కోడింగ్‌ పద్ధతిలో AI తనలో దాచుకుంటుంది. ఒకసారి AI పూర్తిగా నేర్చుకుంది అంటే.. తన దగ్గర ఉన్న డాటా నుంచి అద్భుతాలు సృష్టిస్తుంది. మానవులు ఆలోచించేదానికంటే వేగంగా, ఎన్నో అంశాలను పరిశీలించి జవాబులు చెబుతుంది. ఇది ఎంత సహజంగా ఉంటుందంటే.. సాధారణ మనుష్యులు గుర్తించలేదు. నమూనాలను గుర్తించడం, అంచనాలను రూపొందించడం, కొత్త సమాచారాన్ని స్వీకరించడం ఇవన్నీ అత్యంత సులువుగా చేస్తుంది.ఎన్నికలలో ఏం చేసింది?ముఖ్యంగా డేటాను విశ్లేషించడానికి ఏఐని అన్ని పార్టీలు వాడాయి. అలాగే ప్రచార వ్యూహాలను మెరుగుపరచడానికి, ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు కూడా ఏఐ వాడేశారు. సోషల్‌ మీడియాను మానిటరింగ్ చేయడం, ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది తెలుసుకోవడం, కీలక సమస్యలను గుర్తించడం, దానికి అనుగుణంగా ప్రచారాన్ని మార్చుకోవడం, తమ ఎజెండాను ప్రజలు ఒప్పుకునేలా చేయడం వంటి వాటిని ఏఐ సాయంతో పార్టీలు చేసేశాలయి. అలాగే చారిత్రక డేటా, పోలింగ్‌ డేటా తదితర సంబంధిత అంశాల ఆధారంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి AIను వాడారు.ఇటీవల అమెరికాలో న్యూహాంప్‌షైర్‌లోని ఓటర్లు ప్రైమరీలలో ఓటు వేయవద్దని నేరుగా ప్రెసిడెంట్‌ బైడ్‌న్‌ నుంచి కాల్ వచ్చింది. అలాగే పాకిస్తాన్ ఎన్నికల సమయంలో ఇమ్రాన్‌ లైవ్‌ చాట్‌లు అందరినీ ఆశ్చర్యపరిచాయి, జైల్లో ఉన్న ఇమ్రాన్‌ వీడియోల్లో లైవ్‌లో జనం అడిగిన ప్రశ్నలకు ఎలా సమాధానాలిచ్చారో అర్థం కాక ఆశ్చర్యపోయారు చాలా మంది.భద్రత కోసం ఏఐఎన్నికల ప్రక్రియలో మోసాన్ని అరికట్టేందుకు ఏఐను వాడారు. అలాగే సాంకేతికత వ్యవస్థ ధృడంగా ఉండేందుకు హ్యాకింగ్‌ బారి నుంచి కాపాడుకునేందుకు ఏఐని వాడుకున్నారు. ఫేక్‌ వీడియోలను అరికట్టడానికి, తప్పుడు పోస్టింగ్‌లను నిరోధించడానికి ఏఐని వాడారు. సిసి కెమెరాల విశ్లేషణను, పోలింగ్‌ డాటా అప్‌డేట్స్‌కు ఏఐను వాడారు.కొత్త, కొంగొత్తస్పీచ్, టెక్స్ట్అనాలిసిస్‌లో ఏఐ వాడకం బాగా పెరిగింది. మనతో ప్రధాని మోదీ మాట్లాడుతున్నట్టుగానో, లేక అభ్యర్థి స్వయంగా మనకు ఫోన్‌ చేసి పలకరించినట్టుగానే మాడ్యుల్స్‌ తయారు చేశారు. AI-పవర్‌ నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (NLP) పద్ధతులను ఏఐ వాడి అనుసరించారు. ఓటర్ ఎంగేజ్‌మెంట్‌, చాట్‌బోట్‌లలో వీపరీతంగా ఏఐని దించేశారు. వర్చువల్ అసిస్టెంట్లు రియలిస్టిక్‌గా మారిపోయాయి. ఓటర్లతో పరస్పరచర్చలు జరిపాయి. అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాయి. పైగా ఇవన్నీ చాలా సులభంగా జరిగిపోయాయి. యాక్సెసిబిలిటీ, వాయిస్‌ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్‌ తదితర ఫీచర్లతో ఓటర్లు గుర్తించలేనంతగా సర్వీసులనిచ్చాయి.ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రెండు బిలియన్ల మంది ప్రజలు ఎన్నికల్లో పాల్గొన్నారు, పాల్గొంటున్నారు. ఏఐ వల్ల అంతా మంచేనా అంటే ఒప్పుకోలేం. ఏఐ వల్ల ఎంత మంచి ఉందో, అంతకు రెట్టింపు ముప్పు ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని దేశాలు కలిసిరావాలి. యంత్ర మేధస్సు మంచిదే కానీ, ఆ వలయంలోనే మనుష్యులు మునిగిపోకూడదు. ఎన్నికలలో ఎన్నికయ్యే నాయకుడు ప్రజల నాడీ అయి ఉండాలి కానీ ఆర్టీఫిషియల్ బాడీ అవకూడదు. మనం దేవుడిని భౌతికంగా చూడలేం కాని దివ్యత్వాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే యంత్ర మేధస్సు మనం చెబితే ఆచరించాలి తప్ప మన భావోద్వేగాలలో భాగం కాకూడదు.- హరికృష్ణ ఇంటూరు, సాక్షి యూట్యూబ్‌

Anand Deverakonda Comments On Family Star Movie
'ఫ్యామిలీస్టార్‌'ను వాళ్లు కావాలనే టార్గెట్‌ చేశారు: ఆనంద్‌

ఆనంద్‌ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో తన సోదరుడు విజయ్‌ దేవరకొండ నటించిన ఫ్యామిలీస్టార్‌ చిత్రం గురించి ఆయన కామెంట్‌ చేశాడు.కొద్దిరోజుల క్రితం విడుదలైన 'ఫ్యామిలీస్టార్‌'కు కావాలనే నెగెటివ్‌ టాక్‌తో ప్రచారం చేశారు. ఆ సినిమా విడదల‌ కావడానికి 48 గంటల ముందు నుంచే పబ్లిక్‌ మాట్లాడిని పాత వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. గతంలో విజయ్‌ సినిమాలకు సంబంధించిన మాటలను తీసుకొచ్చి ఫ్యామిలీస్టార్‌ రిజల్ట్‌, రివ్యూలు అంటూ తప్పుడు థంబ్‌ నెయిల్స్‌ పెట్టారు. అలాంటి సమయంలో ప్రేక్షకుల్లో కూడా కాస్త నిరుత్సాహం కనిపించింది. కనీసం సినిమా చూసిన తర్వాత అయినా అలా రివ్యూస్‌ ఇచ్చి ఉంటే.. నిజంగానే ప్రేక్షకులకు మూవీ నచ్చలేదేమోనని అనుకునే వాళ్లం. అలాంటిది ఫ్యామిలీస్టార్‌ విడుదలకు ముందే కావాలని టార్గెట్‌ చేసి కొందురు ఎందుకు ఎటాక్‌ చేశారో తెలియడం లేదు. ఇలాంటి పద్ధతి చిత్ర పరిశ్రమకు చాలా ప్రమాదకరం. ఇలాంటి పని ఎందుకు, ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు సైబర్‌క్రైమ్‌కు వారికి ఫిర్యాదు కూడా చేశాం. భవిష్యత్‌లో విజయ్‌ నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి. అవన్నీ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. అని ఆయన అన్నారు.

Threats To Businessman Daughter In The Name Of Telangana Dgp
తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు కలకలం సృష్టించాయి. డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేస్తామంటూ యువతిని అగంతకుడు బెదిరించాడు. వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్‌ కాల్‌చేసి కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.+92 కోడ్‌తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు చెబుతున్నారు. ఇది పాకిస్తాన్ కోడ్ అంటున్న సైబర్ పోలీసులు.. ఇలాంటి ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

BJP Sends Show Cause Notice To MP Jayant Sinha
కేంద్ర మంత్రికి బీజేపీ షోకాజ్‌ నోటీసులు

రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హాపై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుంచి మనీష్ జైస్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. పార్టీపరమైన సంస్థాతగ పనులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని జార్ఖండ్‌ బీజేపీ జనరల్‌ సెక్రటరీ ఆదిత్య సాహూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. సోమవారం జరిగిన ఐదో విడత పోలింగ్‌లో జయంత్‌ సిన్హా తన ఓటు హక్కు వినియోగించుకోకపోవటంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహించి ఆయనపై చర్యలకు పూనుకుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మార్చిలో జయంత్‌ సిన్హా.. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించిన విషయం తెలిసిందే.‘‘లోక్‌సభ ఎన్నికల్లో భాగం పార్టీ అధిష్ణానం హజారీబాగ్‌లో మనీష్‌ జైశ్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి మీరు( జయంత్‌ సిన్హా) పార్టీ సంస్థాగత పనులు, ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. కనీసం పోలింగ్‌లో ఓటు కూడా వేయలేదు. మీ ప్రవర్తనతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని నోటీసులో ఆదిత్య సాహు పేర్కొన్నారు. అదే విధంగా రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ కోరింది. అయితే ఇప్పటివరకు ఈ నోటీసుకుల స్పందించకపోవటం గమనార్హం.మర్చి 2న జయంత్‌ సిన్హా.. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. భారత్‌, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులను ఎదుర్కొవడానికి తన వంతుగా కృషి చేయటంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన హజారీబాగ్‌ స్థానంలో బీజేపీ అధిష్టానం మనీష్‌ జైశ్వాల్‌ను బరిలోకి దించింది. అయితే ఈసారి ఎన్నికల్లో హజారీబాగ్‌ స్థానంలో జయంత్ సిన్హాకు మరోసారి టికెట్‌ ఇవ్వకుండా పక్కనపెట్టాలని బీజేపీ భావించిందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement