ఆ వీడియో ఫేకా? ఒరిజినలా?: మంత్రి అంబటి | Ambati Rambabu Comments On Macherla MLA Pinnelli Video, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆ వీడియో ఫేకా? ఒరిజినలా?: మంత్రి అంబటి

May 23 2024 5:48 AM | Updated on May 23 2024 12:06 PM

Ambati Rambabu Comments On Macherla MLA Pinnelli video

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో నిజమైతే రిలీజ్‌ చేయాల్సింది ఎవరు?

ఈసీనో, అధికారులో విడుదల చేయాలి.. అది లోకేశ్‌ ఎక్స్‌ ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చింది? 

దీనిపై ఎన్నికల కమిషన్‌ సమగ్ర విచారణ చేపట్టాలి:  మంత్రి అంబటి

సత్తెనపల్లి: ‘పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో దారుణాలు జరిగాయి. అధికారులు, పోలీసు­లను అడ్డుపెట్టుకుని టీడీపీ మూకలు పేట్రేగిపో­యాయి. బూత్‌ క్యాప్చరింగ్‌ చేశారు. దొంగ ఓట్లు వేసుకున్నారు. ఈవీఎంలను పగులగొట్టేందుకు యత్నించారు. వైఎస్సార్‌­సీపీకి ఓటు వేస్తారనుకున్న ఓటర్లను అడ్డుకున్నారు. కొట్టి బయటకు పంపించారు. వీటన్నింటిపై వైఎ­స్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు అధికా­రులకు, ఇటు పోలీసు­లకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి స్పందనా లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉన్నట్లుండి చిత్రంగా ఒక వీడియో రిలీజ్‌ అయ్యింది. 

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం పగలకొడుతున్నట్లు అందులో ఉంది. దీన్ని ఎవరు లీక్‌ చేశారు? ఇది ఫేకా, ఒరిజినలా తేల్చాలి’ అని  రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం రాత్రి ఆయన మీడి­యాతో మాట్లాడారు. ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్‌ అయిందో అర్థం కావడం లేదన్నారు. వాస్త­వం­గా ఇలాంటిదేదైనా ఉంటే ఎలక్షన్‌ కమిషన్‌ రిలీజ్‌ చేయాలని చెప్పారు. ‘దీన్ని లోకేశ్‌ ఎక్స్‌ (ట్వి­టర్‌)లో పెట్టారంట! ఎలా చేరింది లోకేశ్‌ ట్వి­టర్‌­లోకి? ఈ వీడియో ఫేకా? ఒరిజినలా? కన్‌క్లూ­జన్‌ ఎవిడెన్సా.. కాదా.. ఆలోచించాలి కదా.. కలెక్టర్‌ అన్న రిలీజ్‌ చేయాలి, ఎలక్షన్‌ కమిషన్‌కు సంబంధించిన వారన్నా రిలీజ్‌ చేయాలి. 

వీరెవరూ కాకుండా ఇది డైరెక్ట్‌గా తెలుగుదేశ«ం అధినేత కొడుకైన లోకేశ్‌ ట్విట్టర్‌లోకి ఎట్లా వెళ్లింది?’ అని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అధికారులు, ఎ­న్ని­కల కమిషన్‌లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలగటం సహజం అని స్పష్టం చేశారు. ఒక వేళ అది నిజంగా జరిగి ఉంటే, సంబంధిత అధికారులు వి­డు­­దల చేసి ఉంటే చట్టం తన పని తాను చేసు­కు­నే­ద­న్నారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్‌ అ­ని­పిస్తోందని చెప్పారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..

ఆ వీడియోలన్నీ రిలీజ్‌ చేయాలి
‘పాల్వాయిగేట్‌ బూత్‌లో టీడీపీ మూకలు ఎంత దారుణంగా వ్యవహరించారో పిన్నెలి రామకృష్ణారెడ్డి చాలా క్లియర్‌గా ఎస్టాబ్లిష్‌ చేశారు అక్కడ. అది  నేను కూడా మీకు చూపిస్తా (వీడియో ప్రద­ర్శించారు). వైఎస్సార్‌సీపీకి చెందిన వారని భావి­స్తున్న ఓటర్లు ఆ బూత్‌లోకి వెళ్లి స్వేచ్ఛగా ఓటు వేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి. బూత్‌ బయట హింసించి తరిమేస్తు­న్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిపోర్టు చేశారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీకీ అనుకూ­ల­మైనటువంటి బూత్‌ల దగ్గర గొడవ జరుగు­తున్నా పోలీసులు పట్టించుకోకుండా ఉండే పరి­స్థితి. ఇది వాస్తవం. చాలా నియోజకవర్గాల్లో బూత్‌ క్యాప్చరింగ్‌ జరి­గాయి. 

నా నియోజకవర్గంలో కూడా బూత్‌ క్యాప్చరింగ్‌ జరిగి టీడీపీ వాళ్లు ఓట్లు వేసుకున్నారు. వెట్‌ క్యామ్‌ ఓపెన్‌ చేయండి అంటే పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలూ లేవు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టారని ప్రచారంలో ఉన్న  వీడియో ఫేక్‌ వీడియోనా? కరెక్ట్‌ వీడియోనా? కరెక్ట్‌ వీడియో అయితే లోకేశ్‌ దగ్గర ఎలా రిలీజ్‌ అయ్యింది. దీనిపై ఎన్నికల కమిషన్‌ ఏం యాక్షన్‌ తీసుకుంది? నేరం చేసినట్టుగా భావించేలా అలా ఫేక్‌గా చేయడం తప్పు. నిజంగా నేరం చేసిన వారిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతు­న్నాయని మేం ఆందోళన చెందుతున్నాం. 

ఎక్కడైతే బూత్‌ క్యాప్చరింగ్‌ జరిగిందో ఆ వీడియోస్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ బయట పెట్టాలి. ఒక చోట కాదు.. అనేక చోట్ల మేం ఫిర్యాదు కూడా చేశాం. ఆ వీడియోలన్నీ రిలీజ్‌ చేయాలి’ అని మంత్రి అంబటి డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో అక్రమాలపై తాము ఈసీకి అనేక రకాలుగా ముందస్తుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తుదకు ఆ అక్రమాలను అందరూ కళ్లారా చూడటంతో కొందరు అధికారులను సస్పెండ్‌ చేశారని, మరికొందరిని మార్చారని చెప్పారు. తద్వారా తప్పు జరిగిందనే భావన సర్వత్రా వ్యాపించిందన్నారు.

రీ పోలింగ్‌ పిటిషన్‌పై నేడు విచారణ
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం నార్నెపాడులో 236, 237 పోలింగ్‌ కేంద్రాలు, దమ్మాలపాడులోని 253, 254 పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వెబ్‌ కెమెరాలను పరిశీలించి రీ పోలింగ్‌ జరపాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారు పట్టించుకోక పోవడంతో రీ పోలింగ్‌ జరపాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement