కమల్ హాసన్‌ ఇండియన్‌-2.. ఫస్ట్ సింగిల్‌ వచ్చేసింది! | Sakshi
Sakshi News home page

Indian 2 First Single: కమల్ హాసన్‌ ఇండియన్‌-2.. ఫస్ట్ సింగిల్‌ వచ్చేసింది!

Published Wed, May 22 2024 8:27 PM

Kamal Haasan Indian 2 First Single Out Now

కమల్‌హాసన్- శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్‌-2. భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. సౌరా అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని సోషళ్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్‌ సంగీతమందిస్తున్నారు.  ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement