ఆర్సీబీ ఇంటికి.. ఎలిమేనిటర్‌లో రాజస్తాన్‌ ఘన విజయం | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ ఇంటికి.. ఎలిమేనిటర్‌లో రాజస్తాన్‌ ఘన విజయం

Published Wed, May 22 2024 7:08 PM

IPL 2024 Eliminator: Rajasthan Royals vs Royal challengers bangalore Live updates and Highlights

ఆర్సీబీ ఇంటికి.. ఎలిమేనిటర్‌లో రాజస్తాన్‌ ఘన విజయం

ఐపీఎల్‌-2024లో ఫైనల్‌ చేరేందుకు అడుగుదూరంలో రాజస్తాన్‌ రాయల్స్‌ నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఎలిమేనిటర్‌లో 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్‌-2కు రాజస్తాన్‌ అర్హత సాధించగా.. ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. 

ఈ మ్యాచ్‌లో 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్‌(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్‌ పరాగ్‌(36), హెట్‌మైర్‌(26), పావెల్‌(16)పరుగులతో రాణించారు. 

ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌ రెండు వికెట్లు.. ఫెర్గూసన్‌, కరణ్‌ శర్మ, గ్రీన్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్‌(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్‌(32) పరుగులతో రాణించారు. 

మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి కీల​క ఆటగాళ్లు నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు, ట్రెంట్ బౌల్ట్,సందీప్ శర్మ, చాహల్ తలా వికెట్ సాధించారు.

 

13 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 111/3
13 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో రియాన్‌ పరాగ్‌(18), జురెల్‌(8) పరుగులతో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌..
సంజూ శాంసన్‌ రూపంలో రాజస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన సంజూ.. కరణ్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జురెల్‌ వచ్చాడు. 11 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 98/3

రెండో వికెట్‌ డౌన్‌..
81 పరుగుల వద్ద రాజస్తాన్‌ రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్‌.. గ్రీన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పరాగ్‌ వచ్చాడు.

దూకుడుగా ఆడుతున్న రాజ‌స్తాన్‌

173 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ దూకుడుగా ఆడుతోంది. 8 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్టానికి 74 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వీ జైశ్వాల్‌(42), శాంస‌న్‌(11) ప‌రుగుల‌తో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన రాజ‌స్తాన్‌..

173 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 20 ప‌రుగులు చేసిన కాడ్‌మోర్‌..ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 6 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్టానికి 47 ప‌రుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(25), శాంస‌న్‌(1) ప‌రుగుల‌తో ఉన్నారు.

రాణించిన ఆర్సీబీ బ్యాట‌ర్లు.. రాజ‌స్తాన్ టార్గెట్ ఎంతంటే?
రాజస్తాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్వాలేదన్పించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్‌(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్‌(32) పరుగులతో రాణించారు. 

మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి కీల​క ఆటగాళ్లు నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు, ట్రెంట్ బౌల్ట్,సందీప్ శర్మ, చాహల్ తలా వికెట్ సాధించారు.

ఐదో వికెట్ డౌన్‌.. పాటిదార్ ఔట్‌
122  ప‌రుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 34 ప‌రుగులు చేసిన ర‌జిత్ పాటిదార్‌.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి దినేష్ కార్తీక్ వ‌చ్చాడు.

కష్టాల్లో ఆర్సీబీ.. మాక్స్‌వెల్‌ డకౌట్‌

బెంగళూరు మరో వికెట్‌ కోల్పోయింది. 97 పరుగుల వద్ద వరుస బంతుల్లో కెమెరూన్‌ గ్రీన్(27), మాక్స్‌వెల్‌(0) డకౌటయ్యాడు. దీంతో ఆర్సీబీ 12.4 ఓవర్లలో 97/4 పరుగులు చేసింది. 

విరాట్‌ కోహ్లీ అవుట్

బెంగళూరుకు షాక్ తగిలింది. విరాట్‌ కోహ్లీ (33) పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. యుజ్వేందర్‌ చాహల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లకు 58/2 పరుగులతో ఉంది.

పవర్‌ ప్లేలో తగ్గిన దూకుడు

పవర్‌ ప్లే ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(30), కెమెరూన్ గ్రీన్‌ (1) ఉన్నారు.

తొలి వికెట్ డౌన్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్‌.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్టానికి 37 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(18), గ్రీన్‌(0) ప‌రుగుల‌తో ఉన్నారు.

నిల‌క‌డ‌గా ఆడుతున్న ఆర్సీబీ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిల‌క‌డ‌గా ఆడుతోంది. 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 34 ప‌రుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్‌(18), విరాట్ కోహ్లి(16) ప‌రుగుల‌తో ఉన్నారు

.ఐపీఎల్‌-2024లో ఎలిమినేట‌ర్ పోరుకు రంగం సిద్ద‌మైంది. అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఎలిమినేట‌ర్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్తాన్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగ‌గా.. రాజ‌స్తాన్ ఓ మార్పు చేసింది. హెట్‌మైర్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు.రాజ‌స్తాన్ అత‌డిని ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ఉప‌యోగించ‌నుంది.

తుది జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
 

Advertisement
 
Advertisement
 
Advertisement