అమ్మ మరణం... ఆమె ఆఖరి కోరిక నెరవేర్చిన ప్రముఖ నటి | Sakshi
Sakshi News home page

Chhaya Kadam: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'లాపతా లేడీస్' నటి.. ఎమోషనల్ పోస్ట్

Published Wed, May 22 2024 2:25 PM

Laapataa Ladies Chhaya Kadam Emotional Post Cannes Film Festival

మొన్నీ మధ్య 'లాపతా లేడీస్' అనే ఓ సినిమా వచ్చింది. థియేటర్లలో కంటే ఓటీటీలో బాగా ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో మంజు మై అనే పాత్రలో ఆకట్టుకున్న ఛాయా కదమ్ అనే నటి.. ఇప్పుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఈమె ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఎమోషనల్ చేస్తోంది.

(ఇదీ చదవండి: నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత)

2009 నుంచి ఛాయా కదమ్ ఇండస్ట్రీలో ఉంది. 'లాపతా లేడీస్'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఈమె నటించిన మలయాళ మూవీ 'ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్' సినిమా, కేన్స్ చిత్రాత్సవంలో స్క్రీనింగ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ వెళ్లిన ఈమె.. చనిపోయిన తల్లి చీర, ముక్కు పుడక పెట్టుకుని వేడుకలో పాల్గొంది.

ఈ మేరకు తల్లికి సంబంధించిన గోల్డ్ కలర్ శారీ, ముక్కు పుడకతో కనిపించిన ఛాయా కదమ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. బతికుండగా తన తల్లిని విమానం ఎక్కించాలనుకున్నానని, కానీ ఇప్పుడు కేన్స్‌లో ఆమె చీర కట్టుకోవడం చాలా బాగుందని, ఇలా తన తల్లి కోరిక నెరవేరిందని భావోద్వేగానికి గురైంది.

(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?)

Advertisement
 
Advertisement
 
Advertisement