నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత | Sakshi
Sakshi News home page

Namitha: ఆ రెండు సినిమాలు నాకు వరస్ట్ ఎక్స్‌పీరియెన్స్

Published Wed, May 22 2024 1:41 PM

Namitha Reveals Worst Experience In Tamil Movie Industry

హీరోయిన్ల జీవితం బయటకు చూడటానికి బాగానే ఉంటుంది. కానీ లోపల మాత్రం వేరేగా ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా సరే చాలామంది బ్యూటీస్ తమ బాధల్ని బయటకు చెప్పుకోరు. ఎందుకంటే కొత్త సినిమాలు రావేమోనని భయం. సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతుంటారు. ఇప్పుడు అలానే హీరోయిన్ నమిత.. తనకు కెరీర్‌లో ఎదురైన దారుణమైన మోసాల్ని రివీల్ చేసింది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

'మూవీ పేరు చెప్పను కానీ ధనుష్ హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఓ నిర్మాత నా కాల్షీట్ తీసుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి ఆయన కజిన్ హీరోగా నటించాడు. ఆ విషయం నాకు తెలియగానే చాలా బాధపడి సగంలోనే ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశా. ఆపై ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. దీని గురించి అప్పట్లో నిర్మాతల మండలి, నటీనటుల మండలిలో ఫిర్యాదు కూడా చేశాను. అలానే మలయాళంలో పేరున్న నిర్మాత ఉన్నారు కదా అని ఓ ప్రాజెక్ట్ సైన్ చేశా. కానీ దాన్ని వేరే నిర్మాత తీసుకోవడంతో చాలా ఇబ్బందులు పడుతూనే ఆ మూవీ పూర్తి చేశాను' అని నమిత తనకెదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టింది.

గుజరాత్‌లో పుట్టి పెరిగిన నమిత.. 'సొంతం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది. 2020లో చివరగా ఓ చిత్రంలో నటించిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బీజేపీ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన గురించి పలు విషయాల్ని బయటపెడుతోంది.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య)

Advertisement
 
Advertisement
 
Advertisement