ప్రిక్వార్టర్స్‌లో సింధు | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సింధు

Published Thu, May 23 2024 3:06 AM

Sindhu in pre quarters

సిక్కి రెడ్డి–సుమీత్‌ జోడీ కూడా ముందంజ

కౌలాలంపూర్‌: భారత స్టార్‌ షట్లర్‌ విజేత పీవీ సింధు మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ సింధు 21–17, 21–16తో క్రిస్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

భారత్‌కే చెందిన అషి్మత చాలిహా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి జోడీ కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో సిక్కి–సుమీత్‌ 21–15, 12–21, 21–17తో లుయి చుర్‌ వే– ఫు చి యాన్‌ (హాంకాంగ్‌)లపై గెలిచారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కిరణ్‌ జార్జి (భారత్‌) 21–16, 21–17తో టకూమా ఒబయాషి (జపాన్‌)పై నెగ్గాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement