'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్‌మెంట్ యూట‌ర్న్‌పై రైనా | Sakshi
Sakshi News home page

'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్‌మెంట్ యూట‌ర్న్‌పై రైనా

Published Wed, May 22 2024 6:34 PM

I am Suresh Raina, not Shahid Afridi: Suresh Raina

టీమిండియా మాజీ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ లెజెండ‌రీ ఆట‌గాడు సురేష్ రైనా త‌న రిటైర్మెంట్ యూ ట‌ర్న్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి త‌ప్పుకున్న రైనా.. ప్ర‌స్తుతం ఐపీఎల్‌-2024లో కామెంటేట‌ర్‌గా బీజీబీజీగా ఉన్నాడు. 

ఈ క్ర‌మంలో అహ్మ‌దాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ మ‌ధ్య జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1 మ్యాచ్‌కు రైనా  భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రాతో కలిసి హిందీ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాడు.

కోల్‌క‌తా  బ్యాటింగ్ సంద‌ర్భంగా ఎనిమిదో ఓవ‌ర్‌లో ఆకాష్ చోప్రా నుంచి రైనాకు త‌న  రిటైర్మెంట్ యూ ట‌ర్న్‌కు సంబంధించి ఓ ప్ర‌శ్న ఎదురైంది. రిటైర్మెంట్‌ను ఏమైనా వెన‌క్కి తీసుకునే ఆలోచనలో ఉన్న‌వా అంటూ రైనాను చోప్రా ప్ర‌శ్నించాడు. 

అందుకు బ‌దులుగా రైనా "నేనేమి షాహిద్ అఫ్రిదిని" కాదు అంటూ నవ్వుతూ సమాధనమిచ్చాడు. కాగా పాకిస్తాన్ మాజీ ఆల్-రౌండర్ షాహిద్ అఫ్రిది తన రిటైర్మెంట్‌ను మూడు సార్లు వెనక్కి తీసుకున్నాడు.
చ‌ద‌వండి: Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి తలనొప్పి! ఒక రకంగా..
 

Advertisement
 
Advertisement
 
Advertisement