ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ మధ్య చిచ్చు పెట్టిన సమంత పోస్ట్‌! | IPL 2024: Samantha Latest Instagram Post Goes Viral Ahead Of RR Vs RCB Eliminator Match | Sakshi
Sakshi News home page

IPL 2024: ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ మధ్య గొడవ పెట్టిన సమంత!

Published Wed, May 22 2024 2:10 PM

IPL 2024: Samantha Latest Instagram Post Goes Viral

సినిమాలకు గ్యాప్‌ ఇచ్చినా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది సమంత. నిత్యం ఏదో ఒక పోస్ట్‌ పెడుతూ ఫ్యాన్స్‌ అలరిస్తుంది. తన పర్సనల్‌ విషయాలను సైతం షేర్‌ చేసుకుంటుంది. తన పోస్టులతో అప్పుడప్పడు యువతకు ఓ మెసేజ్‌ కూడా అందిస్తుంది. అలాగే ఒక్కోసారి‌ చిలిపి పోస్ట్‌లు కూడా పెడుతూ.. ఫ్యాన్స్‌ని అయోమయంలో పడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్‌ ఒకటి ఇటు సామ్‌ అభిమానులతో పాటు అటు క్రికెట్‌ లవర్స్‌ని కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. సమంత పెట్టిన పోస్ట్‌ ఏంటి?

ఐపీఎల్‌ 2024 క్లైమాక్స్‌కి చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. క్యాలిఫయిర్‌ 1లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం సాధించి ఫైనల్‌కి చేరుకుంది. సన్‌ రైజర్స్‌ ఫైనల్‌కు చేరాలంటే.. క్వాలిఫయిర్‌ 2 తప్పక గెలవాల్సి ఉంటుంది. దీని కంటే ముందు నేడు(మే 22) రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌ బెర్త్‌ కోసం సన్‌రైజర్స్‌లో పోటీ పడాల్సి ఉంటుంది.

(చదవండి: ‘కల్కి’ ప్రమోషన్స్‌కి అన్ని కోట్లా..? ఓ పెద్ద సినిమానే తీయొచ్చు!)

ఇలా ఐపీఎల్‌ ఆట చాలా ఆసక్తికరంగా సాగుతున్న వేళ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో 'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' ఓ పోస్ట్‌ పెట్టింది. 'మీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం మద్దతు ఇస్తాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ ఆ పోస్ట్‌ కింద రాసుకొచ్చింది. దీంతో సమంత ఆర్సీబీ మద్దతుగా ఈ పోస్ట్‌ పెట్టిందని కొంతమంది నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఎస్‌ఆర్‌హెచ్‌కు సపోర్ట్‌ చేస్తూ ఈ పోస్ట్ చేసిందని కామెంట్‌ చేస్తున్నారు. సామ్‌ పోస్ట్‌ని షేర్‌ చేస్తూ మాకంటే మాకు సపోర్ట్‌ చేస్తుందంటూ ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా గొడవపడుతున్నారు.  ఇంకొంత మంది నెటిజన్స్‌ అయితే ఇది క్రికెట్‌కు సంబంధించినది కాదని, తన అభిమానుల కోసమే అలా రాసుకొచ్చిందని అంటున్నారు.  సమంత సందిస్తే తప్ప ఆ పోస్ట్‌ అర్థం ఏంటి? ఎవరునుద్దేశించి చేశారనే విషయాలు తెలియవు. మరి సామ్‌ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement