పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్‌.. త్వరలోనే లేఆఫ్స్‌ | Sakshi
Sakshi News home page

పేటీఎం ఉద్యోగులకు భారీ షాక్‌.. త్వరలోనే లేఆఫ్స్‌

Published Wed, May 22 2024 2:34 PM

Ceo Vijay Shekhar Sharma ​hint Likelihood Of Layoffs In Future

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం ఉద్యోగులకు షాకివ్వనుంది. త్వరలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆ సంస్థ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ తన కంపెనీలోని షేర్‌ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగులకు చెల్లించే జీతాల ఖర్చులు గణనీయంగా పెరిగాయని, కాబట్టే సంస్థ ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక పెట్టుబడులు కొనసాగుతుండగా ఉద్యోగుల ఖర్చులను తగ్గించేందుకు కూడా సంస్థ చర్యలు తీసుకుంటుందని, ఈ నిర్ణయంతో సంస్థకు ఏటా రూ. 400-500 కోట్ల వరకు ఆదా అవుతుందని పేటీఎం సీఈఓ చెప్పారు.  

రాబోయే సంవత్సరానికి, మేం బిజినెస్‌ సేల్స్‌ విభాగంతో పాటు రిస్క్ అండ్‌ కంప్లైయన్స్ ఫంక్షన్లలో పెట్టుబడులు కొనసాగిస్తూనే.. లేఆఫ్స్‌తో ఖర్చులను తగ్గించుకుంటున్నట్లు.. ఫలితంగా ఏడాదికి రూ.400 నుంచి రూ. 500 కోట్లు ఆదా అవుతుందని మేం ఆశిస్తున్నట్లు విజయ్‌ శేఖర్‌ శర్మ వెల్లడించారు.  

అంతేకాదు కంపెనీ తన కస్టమర్ కేర్‌ను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోందని, ఆదాయాన్ని పెంచుకుంటూనే ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ తన కంపెనీ షేర్‌ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.  

Advertisement
 
Advertisement
 
Advertisement