'జ్యోతిష్యం బలంగా నమ్ముతా.. తెలుగులో నటించడం నా అదృష్టం' | Devara Actress Janhvi Kapoor Says She Believes In Astrology, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: 'జ్యోతిష్యాన్ని నమ్ముతా.. రాశి ఎలా ఉందో చెక్ చేసుకుంటా'

Published Wed, May 22 2024 3:55 PM

Devara Actress Janhvi Kapoor Says She Believes In Astrology

దేవర భామ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి  త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరు అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌కు హాజరైంది ముద్దుగుమ్మ. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను జ్యోతిష్యాన్ని నమ్ముతానని.. రాశి అనుకూలంగా ఉందా లేదా అని చాలాసార్లు చెక్ చేసుకుంటానని జాన్వీ కపూర్‌ తెలిపింది.

జాన్వీ మాట్లాడుతూ..'మనమందరం రాశులను చెక్‌  చేసుకుంటాం. నేను కూడా అలాగే చేస్తా. ఇప్పటికీ చాలాసార్లు రాశి అనుకూలంగా ఉందా అని చూసుకుంటా. ఎందుకంటే నేను జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతాను. ఒకవేళ నా రాశి సరిపోకుంటే ఆ వ్యక్తితో మాట్లాడటం మానేస్తాను." అంటూ చెప్పుకొచ్చింది.

కాగా.. మిస్టర్ అండ్  మిసెస్ మహి చిత్రంలో రాజ్‌కుమార్ రావ్‌కు జంటగా నటించారు. రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ సరసన దేవరలో జాన్వీ కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె తంగం అనే పాత్రలో కనిపించనుంది. ఎన్టీఆర్‌ సినిమాలో నటించడం తన అదృష్టమని తెలిపింది. దేవర సినిమా సెట్‌లో పనిచేయడం నాకు చాలా ఇష్టమని పేర్కొంది. సెట్‌లోని నాపై ఎంతో అభిమానం చూపించారని.. సినిమా పట్ల వారి అంకితభావానికి ఆశ్చర్యపోయానని వెల్లడించింది. ఈ చిత్రంలో నటించే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు జాన్వీ కపూర్ కృతజ్ఞతలు తెలిపింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement