ఆస్పత్రికి షారూఖ్‌ ఖాన్‌.. అసలేం జరిగిందంటే? | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: ఆస్పత్రికి షారూఖ్‌ ఖాన్‌.. అసలేం జరిగిందంటే?

Published Wed, May 22 2024 7:24 PM

Shah Rukh Khan Admitted In Hospital Due To Dehydration Post IPL Match

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఐపీఎల్‌ ప్లే ఆఫ్‌కు మ్యాచ్‌కు హాజరైన షారుక్‌ డీహైడ్రేషన్‌కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కూడా అయ్యారు.

కాగా.. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు షారూఖ్‌ ఖాన్‌ హాజరయ్యారు. కోల్‌కతా జట్టుకు యజమానిగా ఉన్న షారూఖ్‌ ఖాన్‌ టీమ్‌కు మద్దతుగా స్డేడియంలో సందడి చేశారు. దీంతో అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బకు గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లిన బాద్‌షా చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో షారుక్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement