మాక్స్‌వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే | Sakshi
Sakshi News home page

IPL 2024: మాక్స్‌వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే

Published Wed, May 22 2024 9:12 PM

Glenn Maxwell goes level with Dinesh Karthik for most ducks in IPL

ఐపీఎల్‌-2024లో కీల‌క మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆట‌గాడు గ్లెన్ మాక్స్‌వెల్ తీవ్రనిరాశ‌ప‌రిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మ‌దాబాద్‌ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ డకౌటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాక్సీ.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 

ఈ క్రమంలో మాక్స్‌వెల్‌ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్‌ కార్తీక్‌తో కలిసి సమంగా నిలిచాడు. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో మాక్స్‌వెల్‌‌ 18 సార్లు డకౌట్‌ కాగా.. కార్తీక్‌ కూడా 18 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. 

ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(17) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాక్సీ(32) నాలుగో స్ధానంలో నిలిచాడు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement