కొత్తగూడెంఅర్బన్: రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా విజయవాడ రైలు రద్దైనట్లు భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వరకు రాకపోకలు సాగించే రైలును ఈ నెల 27వ తేది నుంచి 30వ తేదీ వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
కేరళ అపెక్స్ బ్యాంక్‌లో డీసీసీబీ బృందం
ఖమ్మంవ్యవసాయం: కేరళ విజ్ఞాన యాత్రలో ఉన్న డీసీసీబీ పాలకవర్గం బాధ్యులు బుధవారం అక్కడి అపెక్స్ బ్యాంకును సందర్శించారు. అలెప్పీలోని బ్యాంకు ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఇస్తున్న రుణాలపై అధ్యయనం చేశారు. తొలుత టెక్కడి ప్రాంతంలోని మార్కెటింగ్ సొసైటీలను సందర్శించిన బృందం సభ్యులు సుగంధ ద్రవ్యాల వ్యాపారంపైనా ఆరా తీశారు. సుగంధ ద్రవ్యాల సేకరణ, మార్కెటింగ్ వివరాలు తెలుసుకున్నారు.