పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి
తుమ్మల పర్యటన
దమ్మపేట: మండల పరిధిలోని పూసుకుంట గ్రామంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారని గండుగులపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన వెలువడింది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వాస్పత్రికి వితరణ
రూ. 8 లక్షల విలువైన వైద్యపరికరాలు, సామగ్రి అందజేత
చర్ల: మండలంలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన, అమెరికాలో స్థిరపడిన అల్లూరి శ్రీని వాసరాజు కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణ చేశారు. రూ.5లక్షల విలువైన వైద్య పరికరాలు, రూ.3లక్షల విలువైన భవన మరమ్మతుల సామగ్రిని అందజేయగా, శుక్రవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ పుట్టి పెరిగిన గ్రామంపై మమకారంతో దాతృత్వం చూపడం అభినందనీయమన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీధర్, ఎన్‌ఆర్‌ఐ కుటుంబీకులు పాల్గొన్నారు.
చుంచుపల్లి
తహసీల్దార్‌కు పదోన్నతి
చుంచుపల్లి: చుంచుపల్లి తహసీల్దార్‌గా పనిచేస్తున్న పానెం కృష్ణకు డిప్యూటీ కలెక్టర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2023 సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడకు వచ్చారు. సీనియారిటీ ప్రకారం ప్రభుత్వం పదోన్నతి కల్పించగా, పోస్టింగ్‌కు ఆదేశాలు రావాల్సి ఉంది.
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం


