‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌ | Sakshi
Sakshi News home page

‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌

Published Thu, May 23 2024 4:13 AM

TDP Yellow gangs rigged by threatening voters at Palwai Gate

పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌ 

వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చితకబాది బూత్‌ల నుంచి ఈడ్చివేత

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై పోలింగ్‌ బూత్‌లలో దౌర్జన్యం 

పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి 

రిగ్గింగ్‌ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు 

వెబ్‌ కాస్టింగ్‌ పరిశీలించి రిగ్గింగ్‌ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాశీనత.. పల్నాడులో ఏడు చోట్ల 

ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం 

అవసరమైన మేరకు ఎడిటింగ్‌.. 

వారం తరువాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేశ్‌ ఎక్స్‌ ఖాతా నుంచి విడుదల 

భద్రంగా ఉండాల్సిన వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు  

రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం  

సాక్షి, నరసరావుపేట / రెంటచింతల:  మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేటులోని పోలింగ్‌ బూత్‌లో ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మే 13న  రెంటచింతల మండలం పాల్వాయిగేటు 201, 202 పోలింగ్‌ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలను బెదిరించి టీడీపీ గూండాలు భయానక వాతావరణం సృష్టించారు. పోలింగ్‌ సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధి­కారితోపాటు పల్నాడు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు పిన్నెల్లి పలుసార్లు ఫోన్‌ చేసినా వారు స్పందించలేదు. 

తమ పార్టీ పోలింగ్‌ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చి దాడు­లు చేయడంతోపాటు టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేస్తు­న్నారనే సమాచారం అందడంతో  పిన్నెల్లి అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను ఆయన ప్రతిఘటించారు. ఈ క్ర­మం­లో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పచ్చ ముఠాలు పల్నాడు ప్రాంతంలో దాదాపు ఏడు చోట్ల ఈవీఎంల విధ్వంసాలకు తెగబడగా దీన్ని అడ్డుకున్న పిన్నెల్లి వీడియోను మాత్రమే బహిర్గతం చేయడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు స్పష్టమవుతోంది.  

ఈసీకి మొర పెట్టుకున్నా... 
పాల్వాయిగేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లి పోలింగ్‌ కేంద్రాలలో గతంలో పలుమార్లు టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.  ఆయా కేంద్రాలలో పటిష్ట బందోబస్తు కల్పించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని పిన్నెల్లి  పలు దఫాలు ఈసీ, కలెక్టర్, ఎస్పీలను అభ్యరి్థంచినా స్పందించలేదు. పోలింగ్‌ రోజు కూడా రెండుసార్లు ఈసీకి మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. పాల్వాయి గేట్‌ పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ అరాచకాలకు సహకరించేందుకు 50 ఏళ్లకు పైగా వయసున్న పోలీసు కానిస్టేబుల్‌కే విధులు కేటాయించారు.  

వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చితకబాది.. 
పాల్వాయి గేట్‌ కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ పోలింగ్‌ ఏజెంట్లుగా ఉన్న చింతా సుబ్బారావు, డేరంగుల శ్రీను, చల్లా సుబ్బయ్యలను టీడీపీ నేతలు కొట్టి బయటకు ఈడ్చేశారు. ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డ మహిళలను భయకంపితుల్ని చేసి తరిమేశారు. అనంతరం అక్కడ టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. స్థానికులతో కలసి మరోసారి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్‌ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించారు. దీన్ని అడ్డుకోవాలని పోలింగ్‌ అధికారులను అభ్యరి్థంచారు. టీడీపీ మూకల అరాచకాలను ఎన్నికల అధికారుల దృష్టికి తెచి్చనా స్పందించలేదు. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్‌ అంజిరెడ్డి, మరికొందరిపై టీడీపీ నేతలు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాలను ధ్వంసం చేశారు. ఓటర్లు, ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్‌ చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. 

ఆ వీడియో ఒక్కటే.. వారం తరువాత 
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు మొత్తం ఏడు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఒక్క పాల్వాయి గేటు వీడియో మినహా మిగతావి ఏవీ బయటకు రాలేదు. అది కూడా వారం తరువాత తాపీగా విడుదల చేయడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈవీఎంలు ధ్వంసమైన మిగిలిన ఆరు వీడియోలను  ఎన్నికల సంఘం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోను తాము రిలీజ్‌ చేయలేదని పోలీసులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పలువురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడిన తరువాత విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్‌ ‘ఎక్స్‌’ ఖాతా నుంచి వీడియో పోస్టు కావడం గమనార్హం. 

ఈసీ ఆదీనంలో ఉండాల్సిన వీడియో లోకేష్‌ చేతికి ఎలా వచి్చందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈసీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పాల్వాయి గేట్‌ పోలింగ్‌ బూత్‌లో టీడీపీ మూకలు రిగ్గింగ్‌ చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం ఏమిటి? ఫిర్యాదులు అందినా ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలకు ఈసీ జవాబు చెపాల్సి ఉంది. మాచర్ల నియోజకవర్గంలో వంద శాతం వెబ్‌ కాస్టింగ్‌ జరుగుతోంది. 202 పోలింగ్‌ బూత్‌లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలిసినా ఉదాశీనంగా ఉండటంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి.  

తుమృకోటలో దాడులు.. ఈవీఎంలు ధ్వంసం 
రెంటచింతల మండలం తుమృకోటలో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ముస్లిం మైనార్టీలపై టీడీపీ నేతలు దాడి చేశారు. 203, 204, 205 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. రీపోలింగ్‌ జరపకుండా సాయంత్రం 4 గంటల సమయంలో కొత్త ఈవీంఎలతో తిరిగి పోలింగ్‌ కొనసాగించారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్‌ చేశారు. ఈ వీడియోలను ఎన్నికల సంఘం బయటపెట్టలేదు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ పాలకిర్తి శ్రీనివాసరావుపై టీడీపీ అగ్రవర్ణ నేతలు దాడి చేసి పోలింగ్‌ కేంద్రం నుంచి ఈడ్చేసి అక్రమ కేసు బనాయించారు. 

ఈసీ డేటా భద్రమేనా?
సాక్షి, నరసరావుపేట: పాల్వాయి గేట్‌ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం «ధ్వంసం వీడియోపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అది సీసీ ఫుటేజేనా? లేక మార్ఫింగ్‌ చేసిన వీడియోనా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీడియో కుడివైపు పైభాగంలో మొబైల్‌ 5జీ సిగ్నల్, 65 శాతం బ్యాటరీ పర్సంటేజ్, అలారం ఇండికేషన్స్‌ కనిపించడం గమనార్హం. వీడియోలో మొత్తం నిడివి 23.52 గంటలు ఉండగా 12.06 గంటల వద్ద తమకు అవసరమైన మేరకు రెండు నిమిషాల పాటు మొబైల్‌లో రికార్డు చేసినట్టు స్పష్టమవుతోంది. 

ఎంతో భద్రంగా ఉండాల్సిన పోలింగ్‌ వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు అలుముకుంటున్నాయి. ఈ వీడియో తొలుత నారా లోకేష్‌ ఎక్స్‌ ఖాతా, టీడీపీ సోషల్‌ మీడియా గ్రూప్‌లలో కనిపించింది. అంటే వారి ద్వారానే బయటకు వచి్చనట్టు తేలిపోతోంది. గ్రాఫిక్స్‌కు పెట్టింది పేరైన పచ్చ ముఠాల వీడియోను నిర్థారించుకోకుండా, ఎలా బయటకు వచి్చందనే విషయాన్ని పట్టించుకోకుండా ఈసీ కేసు నమోదుకు ఆదేశించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.  

53 గ్రామాల్లో దాడులు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి / సాక్షి, నరసరావుపేట:  పల్నాడులోని 53 గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై, ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి.  ఆస్తులను ధ్వంసం చేశాయి. పోలింగ్‌ నాడు టీడీపీ నాయకులు హింసాకాండకు పథకం రూపొందించినట్లు మంత్రి అంబటి,  పిన్నెల్లి తదితరులు ఎన్నికల యంత్రాంగానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించలేదు.  

వీడియోను మొబైల్‌లో రికార్డు చేశారని చెప్పడానికి గల ఆధారాలు..  

ఆ వీడియో వెనుక అసలు నిజాలు..
⇒ మే 13న పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఓటర్లను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. 
⇒ పాల్వాయి గేట్‌లోని అన్ని బూత్‌లను ఆక్రమించి పచ్చ ముఠాలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. 
⇒ బ్రహా్మరెడ్డి కుట్రలను ముందే పసిగట్టి మే 11న పిన్నెల్లి ఈసీకి లేఖ రాశారు. 
⇒ సమస్యాత్మక ప్రాంతమైన మాచర్లలో 
భారీగా పోలీసులను మోహరించాలని పిన్నెల్లి కోరారు. 
⇒ టీడీపీ అరాచకాలకు పాల్పడినందున రీ పోలింగ్‌ నిర్వహించాలని లేఖలో పిన్నెల్లి కోరారు.
⇒ ప్రజాస్వామ్యాన్ని టీడీపీ ఖూనీ చేసినందున రీ పోలింగ్‌ జరపాల్సిందేనని అభ్యరి్థస్తూ పిన్నెల్లి మరో లేఖ రాశారు.  
⇒ టీడీపీ కుట్రలపై మే 11న ఒక లేఖ, పోలింగ్‌ జరిగిన మే 13న రెండు లేఖలను పిన్నెల్లి ఈసీకి రాశారు.  
⇒ 11 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయినట్లు ఎన్నికల అధికారి ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరీ చెప్పారు. 
⇒ టీడీపీ గూండాలు 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు?
⇒ నారా లోకేష్‌ ఫిర్యాదుతో 8 రోజుల తరువాత ఒక వీడియో విడుదల చేసి అరెస్టుకు ఆదేశాలిచ్చారు.

దాడి చేసి.. రిగ్గింగ్‌
202 పోలింగ్‌ బూత్‌లోకి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రవేశించి నాతో పాటు డేరంగులు శ్రీను, చల్లా సుబ్బయ్యలపై దాడి చేశారు. చితకబాది పోలింగ్‌ బూత్‌ బయటకు లాక్కొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు. అక్కడున్న పోలీసులు, పోలింగ్‌ అధికారులు ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మేం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాం. అక్కడకు వచి్చన పిన్నెల్లి, ఆయన అనుచరులపై పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి.  
–చింతా సుబ్బారావు, ఇన్‌చార్జి సర్పంచి,వైఎస్సార్‌సీపీ ఏజెంట్, పాల్వాయి గేట్‌

పల్నాడు గ్రామాల్లో టీడీపీ దురాగతాలు..
⇒ మాచర్ల రూరల్‌ మండలం: కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు 
⇒ రెంటచింతల: రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు 
⇒ కారంపూడి: ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి 
⇒ దుర్గి: ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి 
⇒ వెల్దుర్తి: లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట 
⇒ గురజాల: కేసానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, మాచవరం, బ్రాహ్మణపల్లి, పెదఅగ్రహారం, జానపాడు.  
⇒ నరసరావుపేట: నరసరావుపేట పట్టణం, దొండపాడు, పమిడిపాడు. 
⇒ సత్తెనపల్లి: పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుండ్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్ల. 
⇒ వినుకొండ: నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం. 
⇒ పెదకూరపాడు: ఎర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు. 
⇒ చిలకలూరిపేట: అప్పాపురం  

Advertisement
 
Advertisement
 
Advertisement