Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm Jagan Tweet On YSRCP Completes 5 Years Of Govt
AP: ఐదేళ్ల ప్రజాపరిపాలనపై సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: సరిగ్గా ఐదేళ్ల క్రితం చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారు.గత ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం సాధించింది. 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఐదుసంవత్సరాలు పూర్తైన సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘ దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి… pic.twitter.com/6EOA8CGend— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2024కాగా151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా.. అదే ఏడాది మే 30న ‘జగన్‌ అనే నేను’.. అంటూ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలన అందించారు. ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి జనం దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

 TDP Shock To Janasena Polavaram Assembly Constituency
అక్కడ గాజు గ్లాస్‌ ముందే పగిలిందా..?

ఎన్నికల ఫలితాల డేట్‌ దగ్గరపడేకొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో పోటీ చేసిన గ్లాస్ పార్టీ ఏజెన్సీలోని పోలవరంలో కూడా బరిలో దిగింది. టిక్కెట్ ఆశించిన టీడీపీ నేతలు గ్లాస్‌ను పగలగొట్టాలని ముందు డిసైడ్ అయిపోయారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ఈసారి కూడా గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. పెరిగిన ఓటు శాతం కూడా తమకే అనుకూలమని వైఎస్‌ఆర్‌సీపీ అంటోంది. గ్లాస్ పార్టీ గల్లంతు ఖాయం అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. పోలవరంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్‌ బలంగా ఉంది. పోలవరంలో పాగా వేసిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ ఇక్కడ బాగా ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య...వైఎస్‌ఆర్‌సీపీ ఏర్పడ్డాక...టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. అయితే ఈసారి పోలింగ్‌కు ముందే కూటమి చేతులెత్తేసినట్లయింది. కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు బరిలో నిలిచారు. జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ ముఖ్య నేతలు అనేకమంది తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ నాయకులు ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనలేదు. టీడీపీ బరిలో ఉంటే..వైఎస్‌ఆర్‌సీపీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగేదని..జనసేన కావడంతో ఓటమి ముందే ఖరారైందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి విజయం లాంఛనమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.పోలవరం నియోజకవర్గంలో 85.98 శాతం పోలింగ్ నమోదైంది. అయితే విజయంలో మహిళల తీర్పే కీలకం కానుంది. ఓటు వేసినవారిలో పురుషుల కంటే సుమారు 6,208 మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రతీ గ్రామంలోనూ అత్యధికంగా మహిళా ఓటర్లే క్యూలో కనిపించారు. గంటలకొద్దీ క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఇక వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ శాతంతో పోటీలో నిలిచిన వారు ఎవరికివారు గెలుపు తమదే అంటూ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాల పట్ల ఆయన నాయకత్వం పట్ల ప్రజలకు సంపూర్ణంగా విశ్వాసం కలిగిందని.. ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కట్టబోతున్నారని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుక బడిన పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ ప్రాంతం నేడు మారిన రూపురేఖలతో అబ్బురపరుస్తోంది. గతంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రూపం మారి కార్పొరేట్ స్కూళ్ళ కంటే గొప్పగా అలలారుతున్నాయి. నాడు కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వాస్పత్రులు నేడు ఆధునిక సౌకరర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయి. గ్రామాల్లో నూతన సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్‌, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి.పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ సుమారు రూ. 665.77 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నించలేదు. అసలు గిరిజనుల ఆవాసాలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని గిరిజనులు భావిస్తున్నారు. జగన్ నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్ కే ఓటేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

Twist In Andhra Pradesh Postal Ballot Counting Row
ఈసీ డబుల్‌ గేమ్‌!

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నిబంధనల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు గురువారం తెలిపింది. ఈ మెమోలపై వైఎస్సార్‌సీపీ కోర్టుల్ని ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ విచారణలో ఉండగానే.. ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇవాళంతా హైడ్రామా నడిచింది.పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం చేసి, స్టాంప్‌ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది(2023) జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులే ఈ రాజకీయ దుమారానికి కారణం అయ్యాయి.ఏపీ సీఈవో ఇచ్చిన మెమో సారాంశం..పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్‌ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దు. నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు (స్పెసిమెన్‌) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలి. డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం ఉంటే చాలు!. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్‌ అధికారి సంతకం (స్పెసిమెన్‌)తో సరిపోల్చుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.వైఎస్సార్‌సీపీ అభ్యంతరాలు ఏంటంటే..పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా ఈనెల 25న ఓ మెమో, 27న మరో మెమో జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఆర్‌ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ వాటిల్లో పేర్కొన్నారాయన. అయితే ఈ మెమో పై వైఎఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది కూడా.డబుల్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘంఈలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సీఈసీ ఇవాళ స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికలసంఘానికి ఏం చెప్పిందంటే.. ఫాం 13ఏపై అటెస్టేషన్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్‌, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా రిటర్నింగ్‌ అధికారులు గుర్తించాలి. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే కదా అటెస్టేషన్‌ అధికారి ఫాం 13ఏపై సంతకం చేస్తారు. అయితే ఈ లోపు కేంద్ర ఎన్నికల సంఘం మరో ట్విస్ట్‌ ఇచ్చింది. ఏపీ సీఈవో ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో జూన్‌ 4వ తేదీన పోస్ట్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఎలా జగరనుందా? అనే ఆసక్తి నెలకొంది.‘‘పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) 25న ఇచ్చిన మెమోలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాం. 27వ తేదీనాటి మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం’’:::ఏపీ హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీని సైతం కలిసిన వైఎస్సార్‌సీపీ సభ్యులుఅటెస్టింగ్‌ అధికారుల స్పెసిమెన్‌ సం­తకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్ని­కల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేసింది. ఇది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్‌. నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా ఉండేలా నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో మీనా జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

T20 World Cup 2024 Full Schedule Venues Live Streaming Details
T20 WC: మొత్తం షెడ్యూల్‌, సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. వెస్టిండీస్‌తో కలిసి ఈ ఏడాది మెగా ఈవెంట్‌ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. తద్వారా కొత్త స్టేడియాల్లో పొట్టి ఫార్మాట్‌లో ఐసీసీ టోర్నమెంట్‌ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.మరి టీ20 వరల్డ్‌కప్‌-2024 పూర్తి షెడ్యూల్‌, సమయం, వేదికలు, లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర విశేషాలు తెలుసుకుందామా?!గ్రూప్‌ దశలో...👉జూన్‌ 1: అమెరికా వర్సెస్‌ కెనడా- టెక్సాస్‌(భారత కాలమానం ప్రకారం జూన్‌ 2 ఉదయం ఆరు గంటలకు ఆరంభం)👉జూన్‌ 2: వెస్టిండీస్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా- గయానా(రాత్రి ఎనిమిదిన్నర గంటలకు)నమీబియా వర్సెస్‌ ఒమన్‌- బార్బడోస్‌(జూన్‌ 3 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 3: శ్రీలంక వర్సెస్‌ సౌతాఫ్రికా- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ ఉగాండా- గయానా(జూన్‌ 4 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 4: ఇంగ్లండ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌- బార్బడోస్‌(రాత్రి ఎనిమిది గంటలకు)నెదర్లాండ్స్‌ వర్సెస్‌ నేపాల్‌- డల్లాస్‌- రాత్రి తొమ్మిది గంటలకు)👉జూన్‌ 5: ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌- న్యూయార్క్‌- (రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్‌ ఒమన్‌- బార్బడోస్‌- (జూన్‌ 6 ఉదయం ఆరు గంటలకు)పపువా న్యూగినియా వర్సెస్‌ ఉగాండా- గయానా- (జూన్‌ 6 ఉదయం ఐదు గంటలకు)👉జూన్‌ 6- యూఎస్‌ఏ వర్సెస్‌ పాకిస్తాన్‌- డల్లాస్‌(రాత్రి తొమ్మిది గంటలకు)నమీబియా వర్సెస్‌ స్కాట్లాండ్‌- బార్బడోస్‌(జూన్‌ 7 అర్ధరాత్రి 12. 30కి ఆరంభం)👉జూన్‌ 7- కెనడా వర్సెస్‌ ఐర్లాండ్‌- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్‌ బంగ్లాదేశ్‌- డల్లాస్‌(జూన్‌ 8 ఉదయం ఆరు గంటలకు)న్యూజిలాండ్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌- గయానా(జూన్‌ 8 ఉదయం ఐదు గంటలకు)👉జూన్‌ 8- నెదర్లాండ్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌- బార్బడోస్‌- (రాత్రి 10 30 నిమిషాలకు)వెస్టిండీస్‌ వర్సెస్‌ ఉగాండా- గయానా(జూన్‌ 9 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 9- ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)ఒమన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌- అంటిగ్వా(రాత్రి 10.30 నిమిషాలకు)👉జూన్‌ 10- సౌతాఫ్రికా వర్సెస్‌ బంగ్లాదేశ్‌- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్‌ 11- పాకిస్తాన్‌ వర్సెస్‌ కెనడా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్‌ నమీబియా- అంటిగ్వా(జూన్‌ 12 ఉదయం ఆరు గంటలకు)శ్రీలంక వర్సెస్‌ నేపాల్‌- ఫ్లోరిడా(జూన్‌ 12 ఉదయం ఐదు గంటలకు)👉జూన్‌ 12- యూఎస్‌ఏ వర్సెస్‌ ఇండియా- న్యూయార్క్‌(రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌- ట్రినిడాడ్‌(జూన్‌ 13 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 13- బంగ్లాదేశ్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌- సెయింట్‌ విన్సెంట్‌(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా- ట్రినిడాడ్‌(జూన్‌ 14 ఉదయం ఆరు గంటలకు)ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఒమన్‌- అంటిగ్వా(జూన్‌ 14 అర్ధరాత్రి 12.30 నిమిషాలకు)👉జూన్‌ 14- యూఎస్‌ఏ వర్సెస్‌ ఐర్లాండ్‌- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఉగాండా-ట్రినిడాడ్‌(జూన్‌ 15 ఉదయం ఆరు గంటలకు)సౌతాఫ్రికా వర్సెస్‌ నేపాల్‌(జూన్‌ 15 ఉదయం ఐదు గంటలకు)👉జూన్‌ 15- ఇండియా వర్సెస్‌ కెనడా- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)‌నమీబియా వర్సెస్‌ ఇంగ్లండ్‌- అంటిగ్వా(రాత్రి 10.30కి)ఆస్ట్రేలియా వర్సెస్‌ స్కాట్లాండ్‌- సెయింట్‌ లూసియా(జూన్‌ 16 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 16- పాకిస్తాన్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్‌ నెదర్లాండ్స్‌- సెయింట్‌ లూసియా(జూన్‌ 17 ఉదయం ఆరు గంటలకు)బంగ్లాదేశ్‌ వర్సెస్‌ నేపాల్‌- సెయింట్‌ విన్సెంట్‌(జూన్‌ 17 ఉదయం ఐదు గంటలకు)👉జూన్‌ 17- న్యూజిలాండ్‌ వర్సెస్‌ పపువా న్యూగినియా- ట్రినిడాడ్‌ (రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌- సెయింట్‌ లూసియా(జూన్‌ 18 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 19- ఏ2 వర్సెస్‌ డీ1 సూపర్‌-8 గ్రూప్‌-2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)బీ1 వర్సెస్‌ సీ2- సెయింట్‌ లూయీస్‌(జూన్‌ 20 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 20- సీ1 వర్సెస్‌ ఏ1- బార్బడోస్‌(రాత్రి ఎనిమిది గంటలకు)బీ2 వర్సెస్‌ డీ2- అంటిగ్వా(జూన్‌ 21 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 21- బీ1 వర్సెస్‌ డీ1- సెయింట్‌ లూసియా(రాత్రి ఎనిమిది గంటలకు)ఏ2 వర్సెస్‌ సీ2- బార్బడోస్‌- (జూన్‌ 22 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 22- ఏ1 వర్సెస్‌ డీ2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్‌ బీ2- సెయింట్‌ విన్సెంట్‌(జూన్‌ 23 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 23- ఏ2 వర్సెస్‌ బీ1- బార్బడోస్‌(రాత్రి ఎనిమిది గంటలకు)సీ2 వర్సెస్‌ డీ1- అంటిగ్వా(జూన్‌ 24 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 24- బీ2 వర్సెస్‌ ఏ1- సెయింట్‌ లూయీస్‌(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్‌ డీ2- సెయింట్‌ విన్సెంట్‌(జూన్‌ 25 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 26- సెమీ ఫైనల్‌ 1- ట్రినిడాడ్‌(జూన్‌ 27 ఉదయం ఆరు గంటలకు)👉జూన్‌ 27- సెమీ ఫైనల్‌ 2- గయానా(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్‌ 29- ఫైనల్‌- బార్బడోస్‌(రాత్రి ఏడున్నర గంటలకు).లైవ్‌ స్ట్రీమింగ్‌(ఇండియాలో)👉స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో ప్రత్యక్ష ప్రసారం(టీవీ)👉డిస్నీ+హాట్‌స్టార్‌(డిజిటల్‌)చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్‌ ఏంటి?.. పూర్తి వివరాలు

Perni nani Slams EC Dobule Game Over Postal Ballot Memos
‘మెమో వెనక్కి అంటే.. తప్పుచేసినట్లేకదా!’

కృష్ణా, సాక్షి: కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ ఎన్నికల సంఘాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తిడికి లొంగిపోయి పని చేస్తున్నాయన్నారు ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో ఎన్నికల సంఘం డబుల్‌ గేమ్‌పై, న్యాయస్థానాల్లో తాజా పరిణామాలపైనా ఆయన స్పందించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనా నిబంధనలను మీరారు. స్టాంప్‌ వేయకపోయినా.. డిజిగ్నేషన్‌ లేకపయినా ఫర్వాలేదని మెమో జారీ చేశారు. చట్టాన్ని మీరి మరి రూల్స్‌ తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. .. అందుకే మేం కోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశాం. దేశంలో ఎక్కడా లేని రూల్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. తాను ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఈవో ఎంకే మీనా కోర్టుకు తెలిపారు. మెమో వెనక్కి అంటే.. ఆయన తప్పు చేసినట్లే కదా. ఆ మెమోను ఈసీ సమర్థించడం అన్యాయం. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వెసులుబాటుపై కోర్టులో పోరాడుతున్నాం. కచ్ఛితంగా న్యాయం గెలిచి తీరుతుంది. చంద్రబాబు, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయస్థానంలో గెలుపు ధర్మానిదే.. .. బీజేపీ ఒత్తిడికి లొంగిపోయే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంగతి ఎప్పటి నుంచో చెబుతున్నాం. టీడీపీ తప్పులపై ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్‌లలో వార్తలు వస్తే చాలూ.. వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. టీడీపీపై పొరపాటున కేసులు పెడితే ఆ జిల్లా కలెక్టర్లను, ఆర్వోలను బెదిరిస్తున్నారు. .. వైఎ‍స్సార్‌సీపీపై సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారు. టీడీపీ, బీజేపీలపై కేసులు పెట్టొద్దనే సంకేతాలిస్తున్నారు అని ఆరోపించారాయన.

Madhav Shingaraju Comments On Buddha Venkanna's Words That Nara Lokesh should Become Chief Minister
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!

‘‘మేము ఏకగ్రీవంగా చెబుతున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో.. దానికి సరిగ్గా ఆపోజిట్‌గా మరొక వేదిక ఏర్పాటు చేసి, అదే రోజు నారా లోకేశ్‌ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్‌ చేయాలి. ఇది మా డిమాండ్‌.’’ఈ డిమాండ్‌ చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కాదు! ఇటీవల చంద్రబాబు కటౌట్‌ను రక్తంతో కడిగిన ఆ పార్టీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న!! నాయకుడు అధినాయకుడిని డిమాండ్‌ చేయటం ఏంటి? పైగా లోకేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్‌ చేయటం ఏంటి? అందునా.. ఏక కాలంలో ఎదురెదురుగా రెండు వేదికలను ఏర్పాటు చేసి – ఈ వేదికపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎదురు వేదికపై చినబాబు పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగాలని కోరటం ఏమిటి? ఎందుకు ‘బుద్ధన్న’ అలా అన్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?లోకేశ్‌ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన్నిప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్ధా వెంకన్న డిమాండ్‌. అంటే.. ఇండైరెక్టుగా లోకేశ్‌ను సీఎంను చేయాలని సూచించటమా? లేక చినబాబుకు దగ్గర కావాలన్న వ్యూహమా? లేదంటే, చంద్రబాబు సూచన మేరకే అలా డిమాండ్‌ చేసి ఉంటారా? ఇవేవీ కాదంటే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఆయన అలా ఏమైనా అన్నారా? ఏదేమైనా టీడీపీలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఆసక్తికరమైన పరిణామం... బుద్ధా వెంకన్న డిమాండ్‌.టీడీపీ అధికారంలోకి వస్తుందా, రాదా అన్నది అటుంచి.. అసలు బుద్ధన్న ఇలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు అని ఆ పార్టీలోని నాయకులే అయోమయంగా ముఖాలు చూసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏదైనా గందరగోళం మొదలైందా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆలోచిస్తున్నది లోకేశ్‌ బాబు అధ్యక్షుడు అవుతాడా కాడా అని కాదు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అని. ఓటమి అంటే చంద్రబాబుకు భయం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయరు. పొత్తు కోసం చూస్తారు. పొత్తు కుదరకపోతే కొత్త ఎత్తులు ఏవైనా వేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమిని కట్టారు కనుక... ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలా అని ఆయన ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కొత్తగా ఏర్పడే జగన్‌ ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటానికి రామోజీ తో కలసి ఏదైనా వ్యూహాన్ని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేం. గెలుపు కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరు. ఓడిపోయినా కూడా... ఏమైనా చేయించగలరు!ఈ నేపథ్యంలో గత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన స్వయంకృతాపరాధాలు, ఆయన్ని గెలిపించిన ఎత్తులు, పొత్తులు; గెలుపు వంటి ఓటములు, ఓటమి వంటి గెలుపుల గురించి చూడటం అవసరం.చంద్రబాబుకు మొదటి అతి పెద్ద ఓటమి 2004లో ఎదురైంది. అంతకు ముందు 1999లో జరిగిన ఎన్నికలు ఆయన్ని పార్టీలో తిరుగులేని నేతగా నిలబెట్టాయి. అక్కడి ఉంచి నేరుగా, మళ్లీ లేవలేనంతగా 2004లో కిందికి పడేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనంలో సైకిల్‌ కొట్టుకుపోయింది. స్కూల్‌ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయటం మాత్రమే కాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు. జన్మభూమి కార్యక్రమాలకు తమను ఉపయోగించుకోవటం వారికి ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వోద్యోగుల పని విధి విధానాలలో కొత్తగా తెచ్చిన మార్పులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభావం చూపెట్టాయి.ఇంతకన్నా ముఖ్యం.. విద్యుత్‌ చార్జీలు, నీటి చార్జీల పెంపు. దీనిపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తే... హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో జరిగిన ధర్నాలో నిరసనకారులైన రైతులపై చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించారు. పోలీస్‌ కాల్పులలో రామకృష్ణ, విష్ణువర్థన్‌ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. బాబు పాలనలో మాయని మచ్చగా మిగిలిన ఉదంతం అది. ఇక 1995–2004 మధ్య రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం, అప్పుడే వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పాదయాత్ర! 2004 ఎన్నికల్లో ఆ రెండూ తమదైన ప్రభావం చూపి, బాబు ఓటమికి కారణం అయ్యాయి.ఇవికాక, మరికొన్ని కారణాలు కూడా ఆనాటి చంద్రబాబు ఘోర పరాజయానికి ఆజ్యం పోశాయి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు కనిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్‌ –2020 కలలు బెడిసికొట్టాయి. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి ఆయన ఆ కలలు కన్నారు. అవి సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్యవేత్తలను ఆకట్టుకుని ఉంటే ఉండొచ్చు. కానీ కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు భ్రమ పడ్డారు. గెలుపై ధీమాగా ఉన్నారు. చివరికి బోర్లా పడ్డారు. వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, పేదరికం నిర్మూలనపైనా ఆయన దృష్టి సారించకపోవటం కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.అంతకు ముందు 1999 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన మాట నిజమే అయినా అది ఏమాత్రం చంద్రబాబు ఘనత కాదు. కార్గిల్‌ యుద్ధ ప్రభావం గెలుపునకు దోహదపడింది. పాకిస్థాన్‌తో కార్గిల్‌ యుద్ధంలో గెలిచిన అనంతరం.. సాధారణ సమయానికి భిన్నంగా, కొన్ని నెలల ఆలస్యంగా సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది సెప్టెంబరులో జరిగాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో టై–అప్‌ అయ్యారు. తాము గెలిస్తే, కేంద్రంలో బీజేపీకి బయటి నుండి మద్ధతు ఇస్తామన్న హామీతో ఆయన ఆ ఎన్నికలకు వెళ్లారు.కార్గిల్‌ యుద్ధంలో గెలుపు వాజ్‌పేయిని గొప్ప నాయకుడిగా నిలబడితే ఆ నాయకుడితో చేయి కలపడం చంద్రబాబుకు గొప్పగా కలిసొచ్చింది. మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 సీట్లకు, బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తే తెలుగు దేశం 180 సీట్లలో గెలిచింది. అయినప్పటికి మునుపటి కన్నా 36 సీట్లు తగ్గాయి. బీజేపీకి మాత్రం అంతకుముందు కన్నా 9 సీట్లు పెరిగాయి. అంటే.. వాజ్‌పేయి ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ బీజేపీ ప్రభావంతోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించింది తప్ప అది చంద్రబాబు చరిష్మా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం కార్గిల్‌ ప్రభావం.2004 ఎన్నికల తర్వాత వరుసగా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకు కారణంగా చంద్రబాబు ఎలాంటి సాకులు చెప్పినా.. అసలు కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విశ్లేషణలో కనిపిస్తుంది.‘‘2009లో మా పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం పీఆర్‌పీ పార్టీ, లోక్‌సత్తా పార్టీలు కొత్తగా రావటం. దాంతో యాంటీ కాంగ్రెస్‌ ఓటు చీలటం జరిగింది. రెండవది – టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఈ హైదరాబాద్‌లో గానీ, రంగారెడ్డి జిల్లాలో గానీ మాకు ఏం సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్లు, రాష్ట్రం సపరేట్‌ కాకూడదని ఎక్కువమంది జనం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒకే ఒక్క సీటు రావటం జరిగింది. అందువల్ల మేము ఘోరంగా ఓడిపోవటం జరిగింది. యాంటీ కాంగ్రెస్‌ ఓటు చిరంజీవి, జయప్రకాష్‌ నారాయణ్‌ చీల్చుకోవటం కూడా మా ఓటమి కారణం. అప్పటికి కూడా కాంగ్రెస్‌ పార్టీ యొక్క ఓట్‌ బ్యాంకు దాదాపు 13 శాతం తగ్గింది. 2004లో 51 శాతం ఉన్న ఓట్‌ బ్యాంకు వాళ్లకు 38 శాతం అయింది. మేము 37 శాతంతో ఓడిపోయాం. ఒక్క పర్సెంట్‌ ఓట్ల తేడాతోనే మేము 2009 ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయాం. 92 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్‌ 155 మాత్రమే గెలిచింది. వాళ్లకు 35 సీట్లు తగ్గినయ్‌. మాకు దాదాపు 45 సీట్లు పెరిగాయి. రాజశేఖర రెడ్డి విజృంభించి ప్రచారం చేయటం కూడా జనంలో కొంత భయం కల్పించింది’’ అన్నారు ముద్దు కృష్ణమ నాయుడు.2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. వారి పొత్తు ఫలించి తెలుగుదేశానికి 25 సీట్లు, బీజేపీకి 7 సీట్లు పెరిగినప్పటికీ, వైఎస్సార్‌సీపీ ప్రభావంతో తెలుగు దేశం పార్టీ 117 సీట్లుకు మించి సాధించలేకపోయింది. ఆ మాత్రమైనా మోదీ హవాతో కొట్టకొచ్చిన సీట్లు, ఓట్లు మాత్రమే అవి.2019 గురించి ఇక చెప్పేదేముంది? వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ 175కి 151 సీట్లు గెలుచుకుని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, స్పెషల్‌ స్టేటస్‌పై యు–టర్న్, అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా మెల్లిగా నడిపించటం, కాపు ఓట్లు చీలుస్తాడని అనుకున్న పవన్‌ కల్యాణ్‌ హీరో ఫ్యాక్టర్‌ పని చేయకపోవటం, అవినీతి.. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి అందవలసిన నిధుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించి ఎన్‌.డి.ఎ. నుంచి బయటికి రావటం కూడా టీడీపీని దెబ్బకొట్టేసింది. దానికి మించి పార్టీలో చంద్రబాబు ‘వన్‌ మ్యాన్‌ షో’ పార్టీని ఒంటరిని చేసింది.ఈ అనుభవం రీత్యా మళ్లీ ఈ తాజా ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు ఫలిస్తుందా, మొదటికే మోసం తెస్తుందా అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతలో, ఆయన్ని బలపరుస్తుండే మీడియాలో కలవరం రేకెత్తిస్తోంది. అందుకే ఎన్నికలు ముగిసి, ఫలితాలు ఇంకా రాకముందే తెలుగు దేశం నాయకులు, రామోజీ రావు.. ‘గెలుపు కూటమిదే’ అని నినదిస్తున్నాయి. ఒకటి గమనించారా? ‘గెలుపు తెలుగుదేశానిదే’ వారు అనటం లేదు. – మాధవ్‌ శింగరాజు

Man Killed Women For Rejecting His Love In Eluru Satrampadu
ఏలూరు జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో యువతి గొంతు కోసి..

సాక్షి, ఏలూరు: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.వివరాలు.. ఏలూరు మండలం సత్రంపాడు ఎమ్మార్సీ కాలనీకి చెందిని జక్కుల రత్న గ్రేసి(22) ప్రైవేటు పాఠశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ తొట్టిబోయిన ఏసురత్నం(23) అనే యువకుడు వెంటబడుతున్నాడు. ఈ క్రమంలో ఈనె 26న మరో యువకుడితో గ్రేసికి కుటుంబ సభ్యులు నిశ్చితార్దం జరిపించారు.విషయం తెలుసుకున్న ఏసురత్నం.. కోపంతో యువతిని కలవాలని ఆమె ఇంటి పక్కకు పిలిచి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడిచేశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతీ అక్కడికక్కడే మృత్యవాతపడింది. అనంతరం ఏసురత్నం కూడా పీక కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Silent layoffs in Indian IT sector over 20000 techies lose jobs
సైలెంట్‌ లేఆఫ్‌లు.. 20 వేల మంది టెకీలు ఇంటికి..

ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. లేఆఫ్‌ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు అధికారికంగా తొలిగించాయి. అప్రకటింతగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్‌ కోల్పోయారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్‌ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ‘సైలెంట్‌’గా ఉద్యోగాలు కోల్పోయారు.ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్‌లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను ‘సైలెంట్‌ లేఆఫ్‌’ విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది.ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్‌ లేఆఫ్‌" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి.

Tollywood Famous Producer Mother passes Away
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్‌ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) కన్నుమూశారు. హృదయ సంబంధిత వ్యాధితో ఆమె తుదిశ్వాస విడిచారు.కాగా.. సూర్యదేవర నాగేంద్రమ్మ (90)కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు సంతానం. రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. రేపు ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్‌లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఈ శుక్రవారమే రిలీజ్‌ కానుంది. ఈ సమయంలో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

AP ECET Results 2024 Released
ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్‌

ఏపీ ఈసెట్‌ ఫలితాలు కోసం రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement