
సాక్షి, తాడేపల్లి: సరిగ్గా ఐదేళ్ల క్రితం చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారు.గత ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం సాధించింది. 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఐదుసంవత్సరాలు పూర్తైన సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘ దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి… pic.twitter.com/6EOA8CGend— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2024
కాగా151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా.. అదే ఏడాది మే 30న ‘జగన్ అనే నేను’.. అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలన అందించారు. ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి జనం దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.