తండ్రి బర్త్‌ డే.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ! | Isha Malviya Gives Swanky New Car On Father Birthday | Sakshi
Sakshi News home page

Isha Malviya: తండ్రికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. అదేంటంటే!

May 30 2024 7:35 PM | Updated on May 30 2024 8:02 PM

Isha Malviya Gives Swanky New Car On Father Birthday

బాలీవుడ్ భామ, బిగ్‌బాస్‌ బ్యూటీ ఇషా మాల్వియా సీజన్‌-17లో మెరిసింది. ఆమె చివరిసారిగా 'పావోన్ కి జుట్టి' అనే ఆల్బమ్ సాంగ్‌లో కనిపించింది. ఈ పాటకు ఆడియన్స్‌ నుంచి విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన తండ్రికి బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆయన పుట్టిన రోజు కావడంతో కారును బహుమతిగా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కాగా.. బిగ్‌బాస్- 17లో చివరిసారిగా కనిపించిన ఇషా మాల్వియా ప్రస్తుతం మాజీ బాయ్‌ఫ్రెండ్ సమర్థ్ జురెల్‌తో బ్రేకప్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి విడిపోవడంపై తన తోటి కంటెస్టెంట్‌, మరో నటి రింకూ ధావన్‌ విమర్శలు చేసింది. ఇషాను మరో ఆరు నెలల్లో కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కనిపిస్తుందని అవహేళనగా మాట్లాడింది. తాజాగా రింకూ ధావన్ ‍చేసిన కామెంట్స్‌పై ఇషా మాల్వియా ఘూటుగా స్పందించింది. ముందు నీ లైఫ్‌ ఎలా ఉందో చూసుకో అంటూ ఇచ్చిపడేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement