మూడోసారి తండ్రి కాబోతున్న హీరో? వీడియో వైరల్‌ | Are Sivakarthikeyan, Aarthi Expecting Third Child? | Sakshi
Sakshi News home page

బేబీ బంప్‌తో స్టార్‌ హీరో సతీమణి? ముచ్చటగా మూడోసారి..

May 30 2024 8:04 PM | Updated on May 30 2024 8:39 PM

Are Sivakarthikeyan, Aarthi Expecting Third Child?

కాగా శివకార్తికేయన్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే 2010లో ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్‌ దాస్‌ జన్మించారు.

హీరో శివకార్తికేయన్‌ త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. శివకార్తికేయన్‌- ఆర్తి దంపతులకు ఇదివరకే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలాకాలం తర్వాత వీరు మూడో బిడ్డ కోసం ప్లాన్‌ చేశారన్నది లేటెస్ట్‌ గాసిప్‌. తాజాగా ఓ అభిమాని తనయుడి బర్త్‌డేకు శివకార్తికేయన్‌ భార్య ఆర్తి, కూతురు ఆరాధనతో సహా వెళ్లాడు. 

జూనియర్‌ శివకార్తికేయన్‌?
అయితే ఈ వీడియోలో ఆర్తికి కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. దీంతో జనాలు అది బేబీ బంప్‌ అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలో మరో జూనియర్‌ శివకార్తికేయన్‌ రాబోతున్నాడని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. కాగా శివకార్తికేయన్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే 2010లో ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్‌ దాస్‌ జన్మించారు.

పెళ్లి తర్వాతే సినిమాల్లోకి..
శివకార్తికేయన్‌ హీరో మాత్రమే కాకుండా సింగర్‌ అన్న విషయం తెలిసిందే! ఆ మధ్య ఆరాధాన సైతం కనా అనే కన్నడ మూవీలో వాయడి పేట పుల్ల అనే సాంగ్‌ ఆలపించి సెన్సేషన్‌ అయింది. ఇక శివకార్తికేయన్‌ సినిమాల విషయానికి వస్తే అతడు నటించిన అమరన్‌ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో అతడు మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌గా కనిపించనున్నాడు. తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌తో ఓ చిత్రం చేయనున్నాడు.

 

 

చదవండి: పిచ్చి కూతలు కూసేముందు నీ కాపురమేమైందో చూసుకో: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement