TS Special
-
గౌతముడు నడయాడిన నేల!
జూలపల్లి (పెద్దపల్లి): చుట్టూ పచ్చని పంట పొలాలు.. సమీ పంలోనే గలగల పారే హుస్సేన్‌మియా వాగు.. పక్కనే అతిప్రాచీన కోటలు.. మధ్య ఎత్త యిన కట్టడం.. అదే ధూళికట్టలో శాతవాహ నులు నిర్మించిన బౌద్ధ స్తూపం.. ఎంతో ఆక ర్షణీయంగా కనిపిస్తున్న కోటలు, బౌద్ధ స్తూపం అభివృద్ధికి నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తూ.. ఇక్కడ చారిత్రక ప్రాశస్త్యానికి మంత్రముగ్ధులవుతున్నా.. పాలకులకు పట్టడం లేదు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి – ఎలిగేడు మండలాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలనే డిమాండ్ పెరుగుతోంది.ధూళికోటే.. ధూళికట్ట..శాతవాహనులు దశాబ్దాల క్రితం ధూళికోట (ధూళికట్ట)ను రాజధానిగా చేసుకుని పాలించారన్నది చరిత్రకారుల కథనం. ఇక్కడే బౌద్ధ స్తూపం నిర్మించగా, గౌతమ బుద్ధుడు «ధ్యానం చేసినట్లు చెబుతున్నారు. 1972లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అతి ప్రాచీన గ్రామ ఆనవాళ్లు, ఆధారాలు లభించాయి. ధూళికట్ట శివారులోని కోట ప్రాంతంలో తవ్వకాలు చేప ట్టిన పురావస్తు శాఖ.. ఇక్కడ లభించిన వస్తు వులను హైదరాబాద్‌లోని మ్యూజియానికి తర లించి భద్రపరిచింది. వడ్కాపూర్ శివారులోని 741, 742 సర్వే నంబర్లలో పురావస్తు శాఖ తవ్వకాలు జరపగా.. బౌద్ధ స్తూపం, బుద్ధుడు, నాగశేషు, కొన్ని విగ్రహాలు లభించాయి. వాటిని కూడా మ్యూజియంలో భద్రపరిచారు. బౌద్ధ స్తూపం 0.19 గుంటల విస్తీర్ణంలో ఉంది. పురావస్తు శాఖ తరపున అభివృద్ధి చేసేందుకు వడ్కాపూర్ రైతులను ఒప్పించి.. మరో ఎనిమిది ఎకరాలను కొనుగోలు చేశారు.అమలుకు నోచని హామీలు..బౌద్ధ స్తూపం, పరిసరాలను అభివృద్ధి చేస్తా మని అప్పటి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.50 లక్షలు కేటాయించారు. అధికారులు ప్రణాళికలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహించడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.ఏటా బుద్ధుని జయంతి..బౌద్ధ స్తూపం వద్ద 2003 నుంచి ఏటా గౌతమ బుద్ధుని జయంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దాతల సాయంతో బౌద్ధ దమ్మ ప్రచార పరిషత్ సభ్యులు ప్రత్యేక కార్యక్రమా లు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు బౌద్ధ భిక్షువులతోపాటు పలు ప్రాంతాల నుంచి బౌద్ధులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.కనీస సౌకర్యాలు కరువు..ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్లు నెరవేరడం లేదు. ధూళికట్ట ఎల్లమ్మ ఆలయం నుంచి స్తూపం వరకు రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరైనా.. రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రోడ్డు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వసతి గదులు అందుబాటులోకి రాకుండా పోయాయి. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నల్ల మనోహర్‌రెడ్డి సొంత నిధులు వెచ్చించి ఈ ప్రాంతంలో ధ్యానముద్ర నిర్మించారు. అందులో గౌతమ బుద్ధుని పాల రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.పర్యాటకాభివృద్ధి చేయాలిఅతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఉన్న ధూళికట్ట ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. పర్యాటకానికి ఆటంకంగా ఉన్న వడ్కాపూర్ నుంచి బౌద్ధ స్తూపం, ధూళికట్ట రేణుకా ఎల్లమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మించాలి. ఏటా నిర్వహించే ఉత్సవాలు, ప్రార్థనలకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి.– మొగురం రమేశ్, మాజీ సర్పంచ్, వడ్కాపూర్ -
కట్టు.. బొట్టు.. శ్రమైక జీవనం.. తరం వెళ్లిపోతోంది
తరం వెళ్లిపోతోంది. పాలనురగకు తీసిపోని ధవళవర్ణపు(తెలుపు) వస్త్రధారణ, హుందాతనానికి గుర్తుగా నిలిచే తాత మీసం, ఆత్మగౌరవాన్ని కళ్లకు కట్టే బామ్మ బొట్టు, శ్రమైక జీవనం, ప్రేమతో పలకరించి, మన కలలను నిజం చేసిన పెద్దల తరం, కష్టాల సుడిగుండాలు చుట్టిముట్టినా తొణకని గంభీర స్వరం మూగబోతోంది. ధర్మనిష్ఠ పాటిస్తూ కుటుంబాలకు నాగరికత నేర్పిన నాటి తరం.. ఇక తీపి గుర్తుగా మిగిలిపోతోంది. తాత, అమ్మమ్మ, నానమ్మ ఇలా.. కాలక్రమేణా ఒకనాటి పెద్దలందరూ వయోభారంతో కనుమరుగవుతున్నారు.హుజూరాబాద్: పూటగడవని రోజుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు న్నా.. పస్తులుంటున్నా ఇంటి గుట్టు బయట పడనిచ్చేవారు కాదు. చిరిగిన దుస్తులు ధరించిన నాటి ఇంటి పెద్ద తన సంతానానికి ఆ లోటు రాకుండా చూసేవారు. పచ్చడి మెతుకులే పరమాన్నంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తాము పడే బాధలు పక్కింటివారితో కూడా చర్చించేవారు కాదు. రోజువారీ పనికి సమయంతో పనేంటనే భావన వారికి ఉండేది. ఉమ్మడి కుటుంబాలే..అప్పట్లో అత్యధికంగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఒక్కో ఇంట్లో పగలూ రాత్రి కలిసి 20 కిలోల వరకు ఆహార ధాన్యాలు వండివార్చే వారంటే అతిశయోక్తి కాదు. ఒక కుటుంబంలో 10 నుంచి 20 మంది వరకు ఉన్నా భేషజాలు ఉండేవి కావు. నీతి, నియమాలే కట్టుబాట్లుగా కుటుంబ పెద్ద చెప్పించే వేదంగా ఉండేది. పిల్లలకు పెళ్లి చేయాలంటే ఉమ్మడిగానే నిర్ణయం తీసుకునేవారు. ఏ ఒక్క బంధువునీ మర్చిపోకుండా తరచూ ఇంటికి ఆహ్వానించి, వారం రోజుల వరకు వెళ్లనిచ్చేవారు కాదు. ఇప్పుడేం జరుగుతోంది?నేటితరంలో కొంతమంది ఆధునిక పోకడలతో ముందుకెళ్తున్నారు. అనాలోచిత నిర్ణయాలు, అహం, ఇతరులను తక్కువగా చూసే ధోరణి చాలామందిలో కనిపిస్తున్నాయి. చిన్న కుటుంబాలుగా విడిపోతూ, గొడవ పడుతూ గౌరవించుకోవడం లేదు. కుటుంబసభ్యులందరూ కలవడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టపడటం లేదు. కడుపున పుట్టిన బిడ్డలు కొందరు చేరదీయకపోవడంతో పెద్దలు అనాథాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్న దుస్థితి కనిపిస్తోంది. జీవితాంతం కష్టపడినవారు వృద్ధాప్యంలో పలకరింపుకైనా నోచుకోక మౌనంగా రోదిస్తున్నారు. విడిగా ఉండేందుకే ప్రాధాన్యంఉమ్మడి కుటుంబంలో ఉండేందుకు కొంతమంది ఇష్టపడటం లేదు. ఫలితంగా వారిపై పెద్దల నియంత్రణ ఉండటం లేదు. ఎక్కడో ఉన్న సినీనటులు ఈరోజు ఏంచేశారో చెప్పగలుగుతున్నారు. ఇంట్లోవారు ఎప్పుడు ఏంచేస్తున్నారో చెప్పలేని పరిస్థితి. మాట్లాడుతున్న తీరుతో రక్త సంబంధీకులకు దూరమవుతున్నారు. ఇతరులతో పోల్చుకుంటూ రాబడికి మించి ఖర్చు చేస్తున్నారు. యువత వ్యసనాలకు బాని సవుతోంది. 30 ఏళ్లొచ్చినా పెళ్లి మాట ఎత్తడం లేదు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో శ్రద్ధాంజలితీరికలేని జీవితంలో.. ఒక వ్యక్తి మరణిస్తే వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మెస్సేజ్ పెట్టి, వదిలేస్తున్నారు. చనిపోయినవారిని చూసేందుకు సైతం వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి.నైతిక విలువలు నేర్పాలిప్రభుత్వం నూతన విద్యావిధానంలో నైతిక విలువలు, మానవ విలువలను పాఠ్యాంశంగా చేర్చాలి. పాఠశాల స్థాయిలోనే సంస్కృతి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతపై పిల్లలకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఉమ్మడి కుటుంబ ప్రాముఖ్యతపై ప్రతీ ఇంట్లో కుటుంబసభ్యులందరూ చర్చించుకో వాలి. పర్యావరణ విధ్వంసం వల్ల వచ్చే ఉపద్రవా ల కన్నా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమైతే కలిగే అనర్థాలపై ప్రభుత్వం, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు ప్రచారం చేయాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.వ్యవసాయం.. గంజి, మెతుకులువ్యవసాయానికి యంత్రాలు లేని నాటి కాలంలో తెల్లవారకముందే సాగు పనుల్లో నిమగ్నమై, దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరేవారు. పగలంతా పడిన కష్టాన్ని మరిచి, మిణుకుమిణుకుమంటూ వెలిగే నూనె దీపాల వెలుగులో ఇంటిల్లిపాది కూర్చొని, కాచిన గంజిలో మె తుకులు కలిపి తినేవారు. ఇంటి నిర్మాణం చేపట్టాలంటే మట్టి, కలపను ఎడ్లబండ్లపై తీసుకువచ్చేవారు. జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా భూమి, ఇల్లు మాత్రం అమ్మకానికి పెట్టేవారు కాదు. తల్లిదండ్రులు, పంటలు, పశుసంపదను ప్రేమగా చూసుకునేవారు.ఆ రోజులే మంచిగుండే..నాటి రోజులు మంచిగుండే. పండుగచ్చిందంటే కుటుంబ సభ్యులందరం కలిసి అప్పాలు చేసుకునేటోళ్లం. ఫోన్లు లేకున్నా ఆనందంగా ఉండేటోళ్లం. చుట్టాలు వస్తే సంబురం. మంచి, చెడు మాట్లాడుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మనుషుల మధ్య ప్రేమ లేదు.– కేతిరి రాజయ్య, దమ్మక్కపేట, హుజూరాబాద్ఇప్పటోళ్లను చూస్తే భయమైతందినాటి రోజుల్లో సంస్కృతి సంప్రదాయాలు, పెద్దల మాటకు కట్టుబడి బతికినం. ఇప్పటోళ్లను చూస్తే భయమైతంది. చిన్న విషయానికే కోపానికి వస్తున్నరు. పెద్దలంటే గౌరవం లేదు. చిన్నప్పటి నుంచే పిల్లలను సక్రమంగా పెంచాలి.– మూగల సంజీవరెడ్డి, ఆదర్శ రైతు, ధర్మరాజుపల్లి, హుజూరాబాద్ప్రేమ, క్రమశిక్షణ ఉండాలిఒక కుటుంబంలోని పెద్దలందరూ ప్రేమ, క్రమశిక్షణతో ఉండాలి. గొడవ పడటం, గౌరవ మర్యాదలు పాటించకపోవడం వంటివి చేయొద్దు. ఇవి పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. – ఎల్.వర్షి, ప్రభుత్వ మానసిక వైద్య నిపుణుడు, హుజూరాబాద్ -
ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!
సాక్షి, పెద్దపల్లి: గుడి ఉంటే దేవుడు ఉండాలి. దర్శనం చేసుకునేందుకు భక్తులు రావాలి. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాలి. కానీ, ఈ గుడిలో దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు రారు. వెడ్డింగ్ ఫొటోషూట్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌లు, పిక్నిక్ల కోసం వచ్చే సందర్శకులు, పర్యాటకులతోనే గుడి కళకళలాడుతోంది. ఆ గుడి ఏంటి? విశేషాలు, చరిత్ర తెలుసుకోవాలంటే పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్ ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఆండాలమ్మ గుడి కోసం.. 13వ శతాబ్దంలో జైనుల కాలంలో పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్.. రాఘవాపూర్ సంస్థానా«దీశుల ఆదీనంలో ఉండేది. ఆయా సంస్థానాధీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు, ఆయన కుమారుడు లక్ష్మీకాంతరావు గుడికి అంకుర్పారణ చేసినట్లు చరిత్రకారులు, గ్రామస్తులు చెబుతున్నారు. తొలుత రంగనాయకస్వామి ఆలయాన్ని నిర్మించారు. దీనికి అనుబంధంగా 500 అడుగుల దూరంలో ఆండాలమ్మ దేవాలయం నిర్మించారు. ఈ రెండింటి మధ్య రోప్ వే నిర్మించి, దీనిద్వారా అమ్మవారిని రంగనాయకస్వామి ఆలయానికి తీసుకొచ్చి.. కల్యాణవేడుక జరిపించాలన్న ఆలోచనతో గుడి నిర్మించారు. దాని నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి హఠాత్తుగా మృతి చెందటంతో.. ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. అనంతరం వారి వారసులు సైతం అమ్మవారి విగ్రహం ఏర్పాటపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో.. విగ్రహం లేకుండానే గుడి మిగిలిపోయింది. ఎత్తయిన కొండల మధ్య.. అద్భుత శిల్ప కళాసౌందర్యంతో.. దట్టమైన అడవి, చుట్టూ ఎత్తయిన పచ్చని కొండల నడుమ గుడి దర్శనమిస్తోంది. ప్రధాన గోపురంలో అమ్మవారు, గర్భగుడికి ఇరువైపులా దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు, అందమైన మండపం నిర్మించారు. గోపురంపై జీవకళ ఉట్టిపడేలా చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి. మండపానికి కొద్దిదూరంలో ఆలయానికి మరింత శోభను తీసుకొచ్చేలా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. అయితే, దేవత విగ్రహం లేకపోవడం, రంగనాయకుల స్వామి గుడి పరిధిలోని 439 ఎకరాల దేవాదాయ భూములు కాలక్రమంలో అన్యాక్రాంతమవడంతో.. ఈ గుడిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఇటీవల పల్లె ప్రకృతివనం కార్యక్రమంలో ఆండాలమ్మ గుడిచుట్టూ ఉన్న మూడెకరాల్లో మొక్కలు నాటి పార్క్ ఏర్పాటు చేశారు. దీంతో పురాతన ఆలయాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రదేశం వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌ల చిరునామాగా మారింది.అభివృద్ధి చేయాలిమా తాతల కాలంలో రాఘవపూర్ సంస్థానాదీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు ఆండాలమ్మ గుడి నిర్మించాడు. విగ్రహ ప్రతిష్ఠ సమయంలో.. ఎవరో చనిపోవడంతో అలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుడిని అభివృద్ధి చేస్తే బావుంటుంది.– అందె పోచమల్లు, గ్రామస్తుడుఅరకొర సౌకర్యాలు ప్రాచీన సంస్కృతి, శిల్పకళ ఉట్టిపడేలా గుడి నిర్మించారు. అనివార్య కారణాలతో ఆండాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. ప్రస్తుతం అరకొర సౌకర్యాలు ఉన్నాయి. అయినా, వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్‌ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు, దర్శకులు వస్తున్నారు. ఈ గుడితోపాటు పక్కనే ఉన్న రంగనాయకులస్వామి ఆల యం, సబ్బితం జలపాతం, రామగిరి ఖిలాతో టూరిజం సర్క్యూట్ నిర్మించి, అభివృద్ధి చేస్తే బాగుంటుంది. – నల్లగొండ కుమార్, స్థానికుడు -
భూమ్మీద అడవుల లెక్క ఇదీ..
⇒ 2022లో ప్రపంచవ్యాప్తంగా నరికివేతకు గురైన అడవులు.. 41 లక్షల హెక్టార్లు (సుమారు కోటి ఎకరాలు). ⇒ అంటే ప్రతి ఒక్క నిమిషానికి నరికివేత జరిగిన విస్తీర్ణం.. 11 ఫుట్‌బాల్ గ్రౌండ్లతో సమానం ⇒ ఏడాదిలో తగ్గిపోయిన అడవుల వల్ల భూమి వాతావరణంలోకి అదనంగా చేరిన కార్బన్ డయాక్సైడ్.. 2.7 గిగాటన్నులు ⇒ఇది భారతదేశం మొత్తంలో ఒక ఏడాది పాటు బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు వినియోగిస్తే వెలువడే కార్బన్ డయాౖMð్సడ్‌తో సమానం. ⇒ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) –2021 నివేదిక ప్రకారం మన దేశ విస్తీర్ణంలో అడవుల శాతం.. 21.72% ⇒ దేశంలో 2019తో పోలిస్తే 2021 నాటికి అదనంగా పెరిగిన అడవులు.. 1,540 చదరపు కిలోమీటర్లు.. -
యూజీసీ సిఫార్సులు ఆచరణ సాధ్యమేనా?
సాక్షి, ఎడ్యుకేషన్: ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన సంస్కరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, పీజీలో ప్రవేశాలు మొదలు.. కోర్సుల వ్యవధి వరకు యూజీసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తే ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయి. అయితే ఈ సిఫార్సులపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు సత్ఫలితాల నివ్వడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటు న్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం ‘మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులేషన్స్–2024’ పేరుతో యూజీసీ ఈ నెల ఐదో తేదీన ముసాయిదాను విడుదల చేసింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి, ఈ నెల 23వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలు రాసింది. యూజీసీ సిఫార్సులపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఏటా రెండు సార్లు ప్రవేశం..యూజీసీ సిఫార్సుల్లో ముఖ్యమైనది.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏటా రెండు సార్లు (జూలై / ఆగస్ట్, జన వరి/ఫిబ్రవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహించటం. ఇది విద్యా ర్థులకు కొంత మేలు చేసే అంశమేనని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య అభ్యసించే విషయంలో సమయం వృథా కాకుండా ఈ ప్రతిపాదన మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే..ఈ ప్రతిపాదన అమలుచేయాలంటే ఫ్యాకల్టీ, ఇతర బోధన సదుపాయా లను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్ప టికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. హెచ్‌ఈసీతో బీటెక్ చదవగలరా?యూజీసీ మరో సిఫార్సు.. అకడమిక్ నేపథ్యం ఏదైనా.. విద్యార్థులు ఉన్నత విద్యలో తమకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం కల్పించడం. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్‌లో హెచ్ఈసీ చదివిన విద్యార్థి.. బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌లలో (జేఈఈ, ఈఏపీసెట్ తదితర) ఉత్తీర్ణత సాధించి బీటెక్‌లో చేరొచ్చు. దీనిపై వ్యతిరేక అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యా ర్థులు.. గణితం, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే బీటెక్‌లో రాణించడం సాధ్యం కాదని అంటున్నారు. బహుళ ప్రవేశ, నిష్క్రమణ అవకాశంయూజీసీ ప్రతిపాదనల్లో మరో కీలకమైన అంశం బహుళ ప్రవేశ, నిష్క్రమణ (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) విధానం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో కోర్సు నుంచి వైదొలగే అవకాశం, ఆ తర్వాత మళ్లీ అదే కోర్సులో.. తదుపరి తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కల్పించటం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. కానీ.. ఇలాంటి విధానం ఫలితంగా విద్యార్థుల్లో ఉన్నత విద్య స్ఫూర్తి కొరవడే ప్రమాదం ఉందని, ఇది జాబ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. స్కిల్ కోర్సులు, అప్రెంటిస్షిప్స్ఉన్నత విద్యలో స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్స్ను సమీకృతం చేసేలా మరో ప్రతిపాదన చేశారు. బ్యాచిలర్ డిగ్రీలో మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం పూర్తి చేసుకున్న వారు.. మరో 50 శాతం క్రెడిట్స్ కోసం స్కిల్ కోర్సులను, అప్రెంటిస్‌షిప్‌ను, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్కిల్ కోర్సులను అందించే క్రమంలో.. రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.ఒకే సమయంలో రెండు డిగ్రీలుఅకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విధానంలో ఒకే సమయంలో రెండు డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అభ్యసించే విధానాన్ని కూడా యూజీసీ ప్రతిపాదించింది. విద్యార్థులు తాము చేరిన కోర్సు/విద్యా సంస్థతోపాటు మరో ఇన్స్టిట్యూట్లో లేదా మరో అభ్యసన విధానంలో అర్హత మేరకు మరేదైనా బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీలో చేరొచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మన విద్యా వ్యవస్థకు సరితూగేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండున్నరేళ్లకే బ్యాచిలర్ డిగ్రీరెండున్నరేళ్లకే డిగ్రీ పూర్తి చేసుకునేలా యూజీసీ ప్రతి పాదన చేసింది. యాక్సెలెరేటెడ్ డిగ్రీ ప్రోగామ్ పేరుతో ప్రతి విద్యా సంస్థలోని మొత్తం విద్యార్థుల్లో పది శాతం మందికి ఈ అవకాశం కల్పించాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగామ్స్ విషయంలో మూడేళ్లలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ యాక్సలెరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానంలో.. టీచింగ్–లర్నింగ్ కోణంలో సమస్య ఉత్పన్నమవుతుందని, విద్యార్థులు ఒత్తిడికి గుర వుతారని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని రెండున్నరేళ్లలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన యూ జీసీ.. పీజీ విషయంలో మాత్రం మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వారినే అర్హులుగా నిర్దేశించాలని సూచించింది. దీంతో.. రెండున్నరేళ్లకు లేదా మూడేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పీజీ ప్రవేశాల అర్హతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తక్షణ అమలు సాధ్యం కాదు..యూజీసీ ప్రతిపాదనలు, సిఫార్సులను తక్షణం అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అయిదు నుంచి పదేళ్ల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ప్రభు త్వ విద్యా సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో కొంత మేర వీటిని వెంటనే అమలు చేసే వీలుంది. – ప్రొఫెసర్. డి.ఎన్. రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీఆహ్వానించదగ్గ పరిణామంయూజీసీ తాజా సిఫార్సులను ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విషయంలో అదనపు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం అవసరమైన వనరులను ఉన్నత విద్యా సంస్థలు కల్పించాలి. – ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రొ వైస్ ఛాన్స్లర్ అడ్వయిజర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీదశల వారీగా అమలు చేయాలిగ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సంస్కరణలు అవస రమే.. కానీ అమలు విషయంలో ఫ్యాకల్టీ కొరత సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కోణంలో పలు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విధానంలో బీటెక్, సైన్స్ కోర్సుల్లో రాణించడం కష్టంగానే ఉంటుంది. – ప్రొఫెసర్. వి. బాలకిష్టారెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి -
పంట చేనులో అయ్యప్ప మాలధారుడి మృతి
భైంసాటౌన్(నిర్మల్): పంట చేనులో పనిచేస్తుండగా ఓ అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి అనుకోకుండా అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా కుప్పకూలాడు. అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. సాయినాథ్ (38) అనే వ్యక్తి ఇటీవల అయ్యప్ప మాల వేయగా, శనివారం గ్రామంలోని పంట చేనులో పనిచేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా చేనులోనే కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మృత్యువు ఎప్పుడో ముందే చెబుతుంది
వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియదనేది సామెత. కానీ విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత వర్షాలు ఎప్పుడు వస్తాయో ముందే తెలుసుకుంటున్నాం. మరి అదే తరహాలో మృత్యువు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలుసుకోగలిగితే.. డెత్ డే ఫలానా రోజు అని ముందే అవగతమైతే ఎలా ఉంటుంది? మరణం ఎప్పుడో తెలిసిపోతే ఆ భయంతోనే సగం చచ్చిపోతాం బాబోయ్ అని అనుకునేవాళ్ల కోసం కాకుండా.. మన జీవితంలో ఆ రోజు ఎప్పుడో తెలుసుకుందాం అనే ఔత్సాహికుల కోసం ఓ వినూత్న యాప్ అందుబాటులోకి వచ్చింది. అన్నీ ముందుగానే అంచనా వేస్తున్నాం.. మరణాన్నీ ముందే తెలుసుకోలేమా అనే ఆలోచనతో బ్రెంట్ ఫ్రాన్సన్ అనే డెవలపర్ ‘డెత్ క్లాక్’పేరుతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. అలా అని.. దీనికి దివ్యమైన శక్తులేమీ లేవు. అది అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా సదరు వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో కచ్చితంగా అంచనా వేసి చెబుతుంది అంతే. ఇందులో కృత్రిమ మేధ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) కీలకపాత్ర పోషిస్తుంది. దాదాపు 1,200 మంది ఆయుర్దాయాలపై వివిధ కోణాల్లో అధ్యయనం జరిపి దీన్ని రూపొందించారు. ఈ ఏడాది జూలైలో డెత్ క్లాక్ అందుబాటులోకి రాగా.. మూడు నెలల్లోనే 1.25 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని తమ చివరిరోజు గురించి తెలుసుకున్నారు.ఇది ఎలా పని చేస్తుందంటేడెత్ క్లాక్ యాప్‌లో వయసు, లింగం, జాతి వంటి ప్రాథమిక సమాచారంతోపాటు కుటుంబ చరిత్ర, మానసిక ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల గురించి సమాధానాలు నమోదు చేయాలి. అలాగే రోజువారీ జీవనశైలి, వ్యాయామం, ధూమపానం, మద్యం అలవాట్ల గురించి అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. ఆహారపు అలవాట్లతో పాటు నిద్రశైలి గురించీ వివరించాలి. అప్పుడు ఆ యాప్.. ఆయా వివరాల ఆధారంగా అధునాతన అల్గారిథమ్‌ల సాయంతో మరణం ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించి చెబుతుందన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎంత కచ్చితమైన వివరాలు నమోదు చేస్తే, అంత కచ్చితమైన ఫలితం వస్తుంది. దీనివల్ల ఏం ఉపయోగంరేపు ఏదైనా అపాయం జరుగుతుందని ముందు తెలుసుకుంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకోవచ్చు.. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే మృత్యువు ఫలానారోజు పలకరిస్తుందని ముందే తెలిస్తే.. జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది కదా అనేది ఈ యాప్ రూపకర్తల వాదన. డెత్ డేట్‌ను చెప్పడమే కాదు.. ఆయుర్దాయం పెంచుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఈ యాప్ ఇస్తుంది. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవడం, ధూమపానం, మద్యపానం మానేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి టిప్స్ చెబుతుంది.వాటిని పాటించడం ద్వారా డెత్డేట్ను పొడిగించుకోవచ్చన్న మాట. కాగా, ఆరోగ్య స్పృహ ఉన్నవారు, ఆర్థిక ప్రణాళికదారులు డెత్ క్లాక్‌పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. తమ చివరి తేదీని బట్టి చేయాల్సిన పనులు పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందనే భావన వారిలో ఉండటమే ఇందుకు కారణం. మీకూ ఈ భావన ఉంటే ఓసారి ట్రై చేయండి. పోయేదేముంది? మహా అయితే 40 డాలర్లు (దాదాపు రూ. 3,400). ఎందుకంటారా? ఈ యాప్‌లోని అన్ని ఫీచర్లూ పని చేయాలంటే అంత మొత్తం వెచ్చించక తప్పదు మరి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు విలీనం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 పంచాయితీలు సమీప మున్సిపాలిటీల్లో వీలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇప్పటికే హైకోర్టు కొట్టేవేయడంతో పంచాయతీల విలీనానికి మార్గం సుగమమైంది. దీంతో గవర్నర్ అమోదంతో గెజిట్ జారీ అయ్యింది.ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న మొత్తం 51 గ్రామ పంచాయతీలను విలీనానికి మంత్రివర్గం సబ్ కమిటీ సిఫారసు చేయగా, సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది.కాగా, హైదరాబాద్ చుట్టూ ఉన్న 51 గ్రామ పంచాయతీలను పరిసర మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి దాయార, కీసర, బోగారం, యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.ఆయా గ్రామాలను మున్సిపాలిటీల నుంచి తొలగించి పంచాయతీలుగానే కొనసాగించాలని రాంపల్లి దాయారకు చెందిన మాజీ వార్డు మెంబర్ ముక్క మహేందర్, మాజీ సర్పంచ్ గంగి మల్లేశ్, మాజీ ఉప సర్పంచ్ కందాడి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది పూస మల్లేశ్, బి. హనుమంతు, మొల్గర నర్సింహ వాదనలు వినిపించారు.పైన పేర్కొన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలుపుతూ సెప్టెంబర్ 2, 2024న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.3ను వెంటనే రద్దు చేసి.. ఆ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడమంటే భారత రాజ్యాంగంలోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనలోని పార్ట్–9ని ఉల్లంఘించటమేనని వాదించారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. విలీనానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లలో మెరిట్స్ లేవంటూ కొట్టివేసింది. -
పుష్ప రాజ్ మేనియా.. టీచర్‌కి షాక్!
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఎక్కడ చూసిన "పుష్ప" మేనియా ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర జనం బారులు తీరుతున్నారు. ఇక స్కూళ్లలోనూ కూడా ‘పుష్ప’ హవా నడుస్తోంది.. అందులో ఒక స్కూల్లో అయితే, ఒక విద్యార్థి రాసిన లీవ్ లెటర్ వైరల్‌గా మారింది. ఎందుకో తెలుసా...?. ఆ స్టూడెంట్‌కి "పుష్ప: ది రూల్" సినిమా అంటే పిచ్చి! అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా! సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని "తపన" పట్టుకుంది. కానీ స్కూల్ కి వెళ్ళాలి! ఏం చేయాలి? ఆలోచించి ఆలోచించి, ఒక "ధైర్యమైన" నిర్ణయం తీసుకున్నాడు. మాష్టారు గారికి ఒక లెటర్ రాశాడు.అందులో ఏముందో తెలుసా..?.. "సార్, నేను పుష్ప సినిమాకు వెళ్తున్నాను. ఎందుకంటే ఆ హీరో నా ఫేవరెట్. దయచేసి నాకు లీవ్ ఇవ్వండి." అంతే! నిజాయితీగా లీవు అడిగేశాడు. లెటర్ చదివిన టీచర్ కి మొదట షాక్..! తర్వాత ఆనందం! "ఇంత నిజాయితీగా లీవు అడిగే విద్యార్థిని ఇంతవరకు చూడలేదు" అనుకున్నారు. తన శిష్యుడు నిజం చెప్పాడు అని గర్వంగా ఫీల్ అయి..,ఏం చేశారంటే, ఆ లెటర్ ని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేశారు!. "పుష్ప" సినిమా కన్నా ఆ లెటర్ వైరల్ అయిపోయింది.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా? -
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో జీహెచ్ఐఏఎల్ ఒప్పందం
తెలంగాణ యువతకు ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ను పెంచేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ విమానయాన శిక్షణా కార్యక్రమాలతో పాటు.. సర్టిఫికేషన్లను అందిస్తుంది. ఇది శ్రామిక నైపుణ్యాలను బలోపేతం చేయడానికి.. విమానయాన రంగంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించినట్లు జీహెచ్ ఐఎఎల్ వెల్లడించిందిఈ సందర్భంగా జిహెచ్ ఐఎఎల్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. "విమానయాన పరిశ్రమకు నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం చాలా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా యువత ఉద్యోగావకాశాలు పొందుతారు. విమానయాన రంగానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఈ కార్యక్రమం నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తుందని, రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలకు దారితీసే ప్రతిభా అంతరాలను పరిష్కరిస్తుందన్నారు. ప్రొఫెషనల్ క్యూరేటెడ్ కోర్సుల ద్వారా విమానయాన రంగంలో ఉన్నత శ్రేణి నైపుణ్యాలను అందించేందుకు జీఎంఆర్, వైఐఎస్యూల సంయుక్త కృషి రాష్ట్ర విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.అకడమిక్ క్రెడిట్లతో కూడిన సాంకేతిక నైపుణ్యాలు విద్యార్థులకు నిలువు మార్గాలు కల్పించడంతో పాటు అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో తక్షణ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ వైస్ ఛాన్సలర్ విఎల్ విఎస్ ఎస్ సుబ్బారావు అన్నారు. ఈ భాగస్వామ్యం రాష్ట్రం.. దేశం కోసం విమానయాన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేయడానికి జిహెచ్‌ఐఎఎల్ యొక్క నిబద్ధతకు నిదర్శనం. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు
హైదరాబాద్, సాక్షి: రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో.. మరో నాలుగు నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు.. ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ సైతం వేశారు. మరోవైపు ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల (ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు) బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీపీ, ఇప్పటికే నిందితుల నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపించారు. -
ఇంటికో సైనికుడు.. ఆర్మీ అంటే వీరికి ప్రాణం
యాభై కుటుంబాలతో చూడటానికి చిన్న గ్రామమైనా.. ఆదర్శంలో మాత్రం పెద్దది. దేశ సేవకోసం మేము సైతం.. అంటూ ఆ గ్రామ యువత కదిలారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25మందికిపైగా సైన్యంలో చేరి దేశ రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నేటి యువత కూడా సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతోంది. ఇదీ.. మర్కూక్ మండలం గంగాపూర్ ప్రత్యేకత. ఇక్కడి ప్రజల జీవన విధానంపై ఈ ఆదివారం ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం.. యెన్నెల్లి సురేందర్–గజ్వేల్: రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ‘రాజ్‌పుత్’లతో గంగాపూర్ గా ఆవిర్భవించింది. చాలా ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం 50కిపైగా రాజ్‌పుత్‌ల కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ‘రాజ్‌పుత్’లో దేశభక్తి ఎక్కువ. అందువల్లే ఇక్కడి యువత సైన్యంలో చేరుతుంటారు. ఇప్పటికే 25మంది సైన్యంలో పనిచేస్తుండగా.. కొందరు పదవీ విరమణ పొందారు. గ్రామానికి చెందిన పంచిగారి యశ్వంత్ సింగ్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. నోచోనియా భవానీసింగ్, పంచిగారి నరేష్సింగ్, పంచిగారి రూప్సింగ్, అత్తర్‌సుమ నర్సింగ్, జుగ్రాజ్ గణేష్‌సింగ్, నోన్‌వార్ గణేష్‌సింగ్, నోన్‌వార్ భవానీసింగ్, నోన్‌వార్ సత్యనారాయణసింగ్, రామ్చరణ్సింగ్లు ఆర్మీలో పనిచేస్తున్నారు. యూసుఫ్ఖాన్పల్లిలోనూ... ఈ గ్రామానికి ఆనుకొని ఉన్న యూసుఫ్ఖాన్పల్లిలోనూ మరో 20కుపైగా రాజ్‌పుత్‌ల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామం నుంచి కూడా మరో 15మంది ఆర్మీలో పనిచేస్తున్నారు. మిగతావారు వ్యవసాయం, ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గంగాపూర్ ప్రస్తుతం యూసుఖాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకే వస్తుంది. రాజేంద్రనగర్ఎస్ఐగా.. ఇదే గ్రామానికి చెందిన జుగ్రాజ్ నారాయణసింగ్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కాగా పంచిగారి రామ్‌సింగ్, అత్తర్‌సుమ అనంతరామ్సింగ్, నోచునోయి హిరామన్, అనంతరామ్సింగ్, అత్తర్‌సుమ రాజారామ్‌సింగ్, ప్రకాష్సింగ్లు సైతం ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరే కాకుండా మరో ఏడుగురికిపైగా సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. మరికొంత యువకులు ఇండియన్ ఆర్మీలో చేరడానికి ఉత్సాహంతో ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం వ్యవసాయమే వీరికి జీవనాధారం. తాతముత్తాతల నుంచి సంక్రమించిన భూమిలో సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. యువత ఆర్మీలో చేరుతుండగా.. కొందరు స్థానికంగా కంపెనీలు, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నిరుపేదలు ఏటా రైతుల వద్ద భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేస్తుంటారు. అలాగే కూలీపనులకు కూడా వెళ్తుంటారు. దేశ సేవంటే ఇష్టం మా ఊరు ఇచ్చిన ప్రేరణతోనే నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాను. చిన్నప్పటి నుంచి నాకు దేశ సేవంటే మహా ఇష్టం. నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాను. మా గ్రామంలో చాలా మంది ఆర్మీలో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. మా ఊరే అందరికీ ఆదర్శం. – పంచిగారి యశ్వంత్ సింగ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాజస్థాన్ ఇక్కడివారితో కలిసిపోయాం తాతముత్తాలు గంగాపూర్‌కు వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడివారితో కలిసి పోయాం. వారే మాకు ఆత్మీయులు. ఏ వేడుక అయినా అందరం కలిసి చేసుకుంటాం. వ్యవసాయం జీవనాధారం. ఎంతోమంది పిల్లలు ఆర్మీలో చేరడం సంతోషం. – శంకర్‌సింగ్, గంగాపూర్ ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది దేశ సేవ చేసేందుకు ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది. 2023లో ఆర్మీలో చేరాను. మా గ్రామంలో నాతోపాటు ఎంతోమంది ఉన్నారు. వారి సలహాలు, సూచనలతో ఉద్యోగంలో చేరి సేవ చేస్తున్నాను. – పంచిగారి నరేశ్ సింగ్, ఆర్మీ పైలెట్ శిక్షణ ఇస్తే మరింత మేలు దేశ సేవ చేసే అదృష్టం ఆర్మీలో దక్కుతుంది. మా గ్రామం నుంచి ఎక్కువ మంది ఆర్మీలో చేరడం గర్వంగా ఉన్నది. వారి స్ఫూర్తితో ప్రతి ఏటా కొందరు యువకుల ఆర్మీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి శిక్షణ ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – దుర్జన్‌సింగ్, ప్రైవేట్ లెక్చరర్, గంగాపూర్ -
ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. గత నెల మూడోవారం నుంచే నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కూడా కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో పౌరసరఫరాల సంస్థ బిజీగా ఉంది. మార్చి 25వ తేదీ నుంచే అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రారంభించిన 443 కొనుగోలు కేంద్రాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఒకటి రెండు రోజుల తర్వాత కోతలు పెరిగి ..ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేనా..? కొన్నేళ్లుగా ధాన్యం సేకరణ ప్రక్రియలో మిల్లర్ల జోక్యం పెరిగింది. కొనుగోలు కేంద్రాలలోనే తరుగు పేరుతో క్వింటాల్‌కు 5 కిలోలకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి అదనంగా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. తీరా ధాన్యం మిల్లులకు పంపిన తర్వాత కూడా రంగు మారిందని, తాలు, తేమ అధికంగా ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు నేరుగా రైతులకు ఫోన్లు చేయించి వేధించి తరుగు తీయడం పరిపాటిగా మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం తప్ప, కొర్రీలు పెడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మిల్లులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కూడా తరుగు, హమాలీ పేరుతో కిలోల కొద్దీ ధాన్యం రైతుల నుంచి దోచుకునే విధానానికి స్వస్తి పలకాలని రైతులు కోరుతున్నారు. అందుబాటులో 14 కోట్ల గన్నీ సంచులు రాష్ట్రంలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా, ఈసారి దిగుబడి, ధాన్యం విక్రయాల తీరును బట్టి చూస్తే 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులలోపే ధాన్యం సేకరణ జరిగే అవకాశముందని పౌరసరఫరా వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈసారి వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది. అందులో ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులను పౌరసరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఈ గన్నీ బ్యాగులు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఇవి సరిపోతాయి. మిగతా గన్నీ బ్యాగులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా, వాటి అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. -
రేవంత్ ఇంటి దగ్గర్లోనూ ఓ వార్‌రూమ్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు. మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా (ఎల్ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు. -
పైపైనే గంగ.. లేదు బెంగ
మెదక్‌జోన్: మండే ఎండలకు చాలాచోట్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. బోర్లు మూలన పడ్డాయి. కానీ మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ రైతు పొలంలో 25 ఏళ్ల క్రితం తవి్వన ఐదు గజాల బావిలో మాత్రం నీటి ఊటలు తరగడం లేదు. మండు వేసవిలో సైతం ఆ నీటితో ఆరు ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నాడు.ళీ మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన బద్దం వెంకట్రాంరెడ్డికి గ్రామ శివారులో 6ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పాతికేళ్ల క్రితం తన భూమిలో కేవలం 5 గజాల లోతు బావిని తవ్వించాడు. అందులో విపరీతమైన నీటిధారలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆ రైతు తన పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు. బావి తవి్వన స్థలంలో 2 ఎకరాలు ఉండగా.. కొంత దూరంలో 4 ఎకరాలు ఉంది. బావిలో మోటార్ బిగించి పైపులైన్ వేసి ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మామిడి తోట, ఎకరంలో పలు రకాల కూరగాయ పంటలు సాగు చేస్తున్నాడు. 24 గంటలు మోటార్ నడిచినా.. ఐదు గజాల బావిలో మోటార్ బిగించిన రైతు వెంకట్రాంరెడ్డి 24 గంటల పాటు మోటార్ నడిపించినా నీటి ఊటలు ఏ మాత్రం తగ్గడం లేదు. పొలం పక్కన మరికొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వారు బావులు తవ్వినా వాటిలో కొద్దిపాటి నీరు మాత్రమే వచి్చంది. వెంకట్రాంరెడ్డి బావిలో మాత్రం 24 గంటల పాటు మోటార్ నడిచినా నీరు తగ్గడం లేదు. ఏ కాలంలోనైనా నిండుగా.. ఏకాలంలోనైనా మా బావిలో నీరు నిండుగా ఉంటుంది. కరెంట్ ఉన్నంత సేపు మోటార్ నడుస్తూనే ఉంటుంది. పంటకు నీటి తడులు అవసరం లేనప్పుడు మాత్రమే మోటార్ బంద్ చేస్తాం. – బద్దం వెంకట్రాంరెడ్డి, రైతు, శమ్నాపూర్ -
అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన వడ్డీలు, ఈ రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఎస్పీవీల ద్వారా 2023– 24 నాటికి తీసుకున్న అన్ని రుణాలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 2024–25లో తీసుకోవాల్సిన రుణాలు, 2025 మార్చి 31 నాటికి వాటి ఖాతాల నిల్వల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరారు. ఆర్టీకల్ 293(3) ప్రకా రం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించి అప్పులు తీసుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలో కోరారు. ఆర్థిక శాఖ వివరాలు కోరిన ఈ జాబితాలో డిస్కంలు, స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, ఐటీఈఅండ్‌సీ, టీఎస్ఐఐసీ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, యూఎఫ్ఐడీసీ, టీడీడబ్ల్యూఎస్సీఎల్ (మిషన్ భగీరథ), రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్డీసీఎల్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్, కాళేశ్వరం తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. -
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
ఇక గడువు పొడిగించం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు, తమకు మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రం జారీ చేసిన అదనపు విధివిధానాల (టీఓఆర్)పై స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్ఓసీ) దాఖలు చేసేందుకు జూన్ చివరి దాకా గడువు పొడిగించాలన్న ఏపీ విజ్ఞప్తిని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 తిరస్కరించింది. ఈ నెల 29లోగా ఎస్ఓసీని దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాతి నుంచి రెండు వారాల్లోగా ఎదుటిపక్షం దాఖలు చేసే ఎస్ఓసీపై కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ట్రిబ్యునల్ విధించిన మార్చి 20 గడువు నాటికి తెలంగాణ ఎస్ఓసీ దాఖలు చేయగా ఏపీ ఇంకా దాఖలు చేయలేదు. మే 15 నుంచి 17 వరకు తదుపరి విచారణ నిర్వహిస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతోపాటు ఇతర కేటాయింపులను.. ఏపీ, తెలంగాణ మధ్య పునఃపంపిణీ కోసం కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు విధివిధానాలను (టీఓఆర్) జారీ చేస్తూ కేంద్రం 2023 అక్టోబర్ 10న గజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సోమవారం ఢిల్లీలో సమావేశమై అదనపు టీఓఆర్‌పై విచారణ చేపట్టింది. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు వాదనలు వినిపించారు. ఏపీ గడువు పొడిగింపు అభ్యర్థనను తెలంగాణ వ్యతిరేకించింది. ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి ఉన్నందున స్టేట్మేంట్ ఆఫ్ కేసును దాఖలు చేయలేమన్న ఏపీ వాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కోడ్ అమల్లో ఉన్నా ఎస్ఓసీ దాఖలు చేశామని పేర్కొంది. కేసుల విచారణపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని, కాలయాపన కోసమే ఏపీ గడువు పొడిగింపు కోరుతోందని ఆరోపించింది. వాదనలు అనంతరం ఏపీ వాదనలను ట్రిబ్యునల్ తిరస్కరించింది. 1,050లో 789 టీఎంసీలు మావే: తెలంగాణ ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 1,050 టీఎంసీల వాటాలో 798 టీఎంసీలను తమకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు సమర్పించిన ఎస్ఓసీలో తెలంగాణ కోరింది. నిర్మాణం పూర్తై వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టనున్న ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత (డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. -
జర జాగ్రత్త.. అవి ఓఆర్ఎస్లు కాదు.. ప్యాకేజ్డ్ జ్యూస్‌లే!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్. అయితే దీని చికిత్సకు తక్షణ పరిష్కారంగా బాధితులు మెడికల్ షాపుల నుంచి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్)ను పోలిన వాటిని వాడుతూ మరింత అనారోగ్యం పాలవుతున్న ఉదంతాలు హైదరాబాద్‌లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య మరింతగా కనిపిస్తోంది. దీనికి కారణం బాధితులు వినియోగించినవి నిజమైన ఓఆర్ఎస్లు కాకపోవడమేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులు వినియోగిస్తున్న వాటిలో అనేకం నిజానికి ఓఆర్ఎస్లు కావని... అవి కేవలం ప్యాకేజ్డ్ పండ్ల రసాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేమితో వాటిని వినియోగించడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయమే.. ఆకస్మిక అనారోగ్యం తద్వారా నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల శరీరం నుంచి లవణాలు,నీరు అధికంగా కోల్పోవడాన్నే డీహైడ్రేషన్‌గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ఏర్పడడం వల్ల శరీరంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. అది అనంతరం ఫిట్స్ రావడానికి లేదా కిడ్నీ ఫెయిల్ కావడం వంటి తీవ్ర సమస్యలకు కూడా దారితీయొచ్చు. ఈ ప్రమాదాల్ని నివారించడానికి బాధితులకు వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. డీహైడ్రేషన్ ద్వారా మనం కోల్పోయిన నీటిని, లవణాలను భర్తీ చేసేదే ఓఆర్ఎస్. అలవాటులో పొరపాటుగా... కానీ భాగ్యనగరంలో అనేక మంది డీహైడ్రేషన్‌కు గురవగానే ఓఆర్ఎస్లుగా భావించి వాటిని పోలిన పేర్లతో ఉండే వాటిని వినియోగిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కనిపించే వాటిని ఓఆర్ఎస్ఎల్ అని, రీబ్యాలెన్స్ విట్ ఓఆర్ఎస్ మొదలైన పేర్లతో కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటిని ఓఆర్ఎస్గా వాడకూడదని చిన్న అక్షరాల్లో ఓ మూలకు రాస్తుండటంతో చాలా మంది వాటిని గమనించక ఓఆర్ఎస్గా భావించి వాడుతున్నారు. రివర్స్ రిజల్ట్... పండ్ల రసాలను ఓఆర్ఎస్గా భ్రమింపజేసేలా లేబుల్ అతికించి విక్రయించడంపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి అధిక చక్కెరను కలిగి ఉంటాయని, అతిసారాన్ని తగ్గించే బదులు మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర శాతం అధికంగా ఉండే జ్యూస్‌ల వాడకం వల్ల మనం ఏ ప్రయోజనం ఆశించి వాటిని తీసుకుంటున్నామో వాటికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అంటే విరేచనాలు, వాంతులు మరింతగా పెరుగుతాయని వివరిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా కీలకం... కేవలం డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాను అనుసరించి తయారైన ఓఆర్‌ఎస్‌లనే వాడాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఓపీ) వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాíÙయం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ మాత్రమే ఉంటాయని... కాచి చల్లార్చిన లీటర్ నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి 24 గంటల వ్యవధిలో తాగితే డయేరియా వల్ల కలిగే నిర్జలీకరణాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అవగాహన కల్పించాలి.. ఈ సమస్యపై కొన్నేళ్లుగా రకరకాల వేదికలపై పోరాడుతున్నా. అసలైన ఓఆర్ఎస్ను పోలిన లేబుల్స్‌తో ఉన్న ప్యాకేజ్డ్ జ్యూస్‌లను వాడటం వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. దీనిపై వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలు -
ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఉగాది సందర్భంగా ప్రయాణికులకు మెట్రో శుభవార్త అందించింది. సూపర్ సేవర్ హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు పొడిగించింది. ఉగాది పండగ నేపథ్యంలో మరో 6 నెలలపాటు ఆఫర్లు పొడిగిస్తున్నట్లు మైదరాబాద్ మెట్రో సోమవారం ప్రకటించింది. కాగా సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లు మార్చి 31, 2024న ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. కాగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు ద్వారా ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రోజుల్లో రూ.59కే ప్రయాణించవచ్చు. మెట్రోలో నగరంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా అపరిమతంగా ప్రయాణం చేసే సౌలభ్యం ఉంది. ఇక సూపర్ ఆఫర్ పీక్ అవర్ ఆఫర్ అంటే ఉదయం 6 నుంచి 8 వరకు, రాత్రి 8 నుంచి చివరి మెట్రో వరకు ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ కింది సాధారణ కార్డు ద్వారా టికెట్ తీసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నారు. . వీటితోపాటు మెట్రో స్టూడెంట్ పాస్‌లపై రాయితీ కూడా అందుబాటులో ఉంది. -
KamaReddy: ఊరంతా చుట్టాలే !
సాక్షి, కామారెడ్డి: ఆ ఊర్లలో కుటుంబాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఇంటి పేరు వేరైనా, దాదాపు అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉండే ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఏవైనా విభేదాలొస్తే అక్కడే పరిష్కరించుకుంటారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆ నాలుగు ఊళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి, భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి, లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊళ్లలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నా... ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ కలిసే ఉంటారు. ఏమైనా విభేదాలొస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఆ గ్రామాల నుంచి గొడవలతో పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన ఘటనలు తక్కువే. నాగారం గ్రామం మున్నూరుకాపుల కొటాల్పల్లి... కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి గ్రామంలో 101 కుటుంబాలు ఉండగా జనాభా 425. ఇక్కడ అన్నీ మున్నూరుకాపు కులానికి చెందిన కుటుంబాలే ఉన్నాయి. 255 ఎకరాల వ్యవసాయ భూము లున్నాయి. అందరూ వ్యవసాయం అందునా ఆకు కూరలు పండించడంలో సిద్ధహస్తులు. మున్నూరు కాపు కులానికి చెందిన జొనకంటి, కల్లూరి, ఆకుల, బచ్చగారి ఇంటిపేర్లతో కుటుంబాలు ఉన్నాయి. దాదాపు అన్ని కుటుంబాలకు వ్యవసాయ భూమి ఉంది. అందరూ వ్యవసాయం చేస్తారు. అయ్యవారిపల్లి గ్రామం ముదిరాజ్‌ల అయ్యవారిపల్లి.... భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి 2018 లో పంచాయతీగా ఏర్పడింది. 128 కుటుంబాలుండగా 683 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని అన్ని కుటుంబాలు ముదిరాజ్ కులానికి చెందినవే ఉన్నాయి. వర్షాధారంపై పంటలు సాగు చేస్తారు. బోర్లు ఉన్న రైతులు వాటిపై ఆధారపడి వరి, ఇతర పంటలు సాగుచేస్తారు. భూములు లేని వాళ్లు కొందరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళతారు. కొటాల్పల్లి గ్రామం పొలాల మధ్యన నాగారం... లింగంపేట మండలం నాగారం అనే కుగ్రామంలో 22 కుటుంబాలు, 120 మంది జనాభా ఉన్నారు. అందరూ ముదిరాజ్ సామాజికవర్గం వారే. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. కోర్పోల్ పంచాయతీకి అనుబంధ గ్రామం ఇది. కుల వృత్తుల వారితో పనులు ఉంటే కోర్పోల్ గ్రామానికి వెళ్లి చేయించుకుంటారు. ఊరు చుట్టూ పచ్చని పంటలు ఉంటాయి. అందరూ వ్యవసాయం చేస్తారు. అన్ని కుటుంబాల వాళ్లతో బంధుత్వం ఉంది. చుట్టూ అడవి.. నడుమ నర్సాపూర్.... గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామం అడవి మధ్యన ఉంటుంది. ఇక్కడ 72 కుటుంబాలు ఉన్నా యి. 298 మంది జనాభా ఉన్నారు. అందరూ ముది రాజ్ వర్గం వారే. వ్యవసాయంపైనే ఆధారపడి జీవ నం సాగిస్తుంటారు. వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తారు. బోర్లు, బావులు ఉన్న వారు వరి తదితర పంటలు వేస్తున్నారు. ఎవరి పనుల్లో వారుంటారు... అందరం ఒకే కులం వాళ్లం. కలిసిమెలిసే ఉంటాం. ఎవరి పనుల్లో వారు తీరికలేకుండా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరల సాగులో మా ఊరుకు ఎంతో పేరుంది. – బాలయ్య, కొటాల్పల్లి, కామారెడ్డి మండలం అందరం కలిసిమెలిసి ఉంటాం... మా ఊరిలో ఎవరి పని వాళ్లు చేసుకుని బతుకుతారు. ఎలాంటి గొడవలు ఉండవు. పొలం ఉన్న వాళ్లు వ్యవసాయం చేస్తారు. పొలం లేని వాళ్లు పొరుగూళ్లకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని వస్తారు. ఒకే కులానికి చెందిన వాళ్లమే కావడంతో చాలా పనులు మాకుగా మేమే చేసుకుంటాం. – చిన్న రాజయ్య, అయ్యవారిపల్లి, భిక్కనూరు మండలం 3 కుటుంబాలతో ఏర్పడిన గ్రామం మా తాతల కాలంలో 3 కు టుంబాలతో గ్రామం ఏర్పడింది. తరువాత పెరిగి కుటుంబా ల సంఖ్య 22కు చేరుకుంది. అందరం ఒకే కుటుంబం నుంచి వ చ్చిన వాళ్లం. గొడవలు లేకుండా అందరం వ్యవసాయం చేసుకుని బతుకుతుంటాం. – చింతకుంట లక్ష్మీనారాయణ, నాగారం, లింగంపేట మండలం -
Summer Care : నింగి నుంచి నిప్పులు!
భానుడు భగభగా మండుతున్నాడు. నిప్పులు కక్కుతూ.. ప్రతాపం చూపిస్తున్నాడు. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వడగాలులు వీస్తున్నాయి. ఎండలు మండుతుండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఈనెల 9 వరకు ఇదేపరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఉదయం 10 గంటలకే కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. ఎండలకు వడగాల్పులు తోడు కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లాలోనే నమోదైంది. 18 మండలాల్లోని 20 గ్రామాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటిపోయింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. 50 డిగ్రీలకు పెరిగే ప్రమాదం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు తీవ్రమైన వేడిగాలులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలకు తీసుకోవాల్సిన అవసరం వెల్లడించారు. అప్రమత్తమైన యంత్రాంగం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు తీవ్రమైన వేడిగాలుల వల్ల వడదెబ్బకు గురికాకుండా అవగాహన కల్పించాలని పలు చోట్ల కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో వచ్చే సంబంధిత వ్యాధులపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు, ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో టాస్క్‌పోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించే పనిలో పడ్డారు. సంక్షేమ హాస్టళ్లు ,పాఠశాల, కళాశాల విద్యార్థులలో వడదెబ్బ పై అవగాహన కల్పించాలని, పని ప్రదేశాల్లో కూలీలకు తాగు నీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉపాధి కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పనిచేసే వారి కోసం తాగునీరు నీడ ఏర్పాటు చేయాలని, మూగ జీవాల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. వడదెబ్బ లక్షణాలు డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు, శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, చెమట పట్టకపోవడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింత, ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితికి వెళ్లడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకితే చేపట్టాల్సిన చర్యలు వడదెబ్బ తాకిన వారిని వెంటనే నీడ కలిగిన చల్లని ప్రదేశానికి తరలించాలి. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ ద్రావణం తాగించాలి. వాంతులు, విరేచనాలు వంటివి సంభవించినా వైద్యులను సంప్రదించాలి. వడదెబ్బతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రోగికి నీరు తాగించవద్దు. వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. ఉదయం సాయంత్రం సమయాల్లోనే బయటకు వెళ్లాలి. బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఎండ వేడిమి తగలకుండా పలుచనైన, వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలి. రోజుకు కనీసం 15 గ్లాసుల నీటిని తాగాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరి నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. భోజనం మితంగా తీసుకోవాలి. మాంసాహారం తీసుకోవద్దు. ఇంటిని వీలైనంత మేర వీలైనన్ని మార్గాల్లో చల్లగా ఉంచుకోవాలి. చల్లని రంగు పానీయాలను తాగొద్దు రోడ్లపై ఉండే ఆహారం పడకపోవచ్చు మద్యం సేవించవద్దు -
పది పరీక్ష రాశారా? మా కాలేజీలో చేరండి
‘హలో.. నమస్కారమండి.. మీ పాప/బాబు పదో తరగతి అయిపోయింది కదండి.. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు.. మాది కార్పొరేట్ కాలేజ్. ఐఐటీ.. మెయిన్స్.. అడ్వాన్స్.. ఏసీ.. నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లున్నాయి. ఇప్పుడు జాయిన్ అయితే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం.. రిజల్ట్స్ వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి.. మీ ఇష్టం.. ఆలోచించుకొండి..’ ఇది జిల్లాలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్. ఇలా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకొని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి. ఆదిలాబాద్‌టౌన్: తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ నాలి చేసైనా మంచి కళాశాలలో చదివించాలనే ఆ లోచనలో ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. అందించేది అరకొర విద్యే అ యినప్పటికీ.. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రౌచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులు సైతం అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫలితాలు రాక ముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునేలా.. ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్వోలు వి ద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజ మాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధన ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వరాదు. కానీకాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈవిధంగా వ్యవహరిస్తున్నా యి. హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకు పీఆర్వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళా శాలల్లో ఇచ్చే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, తదితర విషయాలను వివరిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. టార్గెట్ పెడుతూ.. కొన్ని యాజమాన్యాలు పీఆర్వోలను ప్రత్యేకంగా ని యమించుకొని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నా యి. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటీవ్లు సైతం అందజేస్తున్నాయి. మరోవైపు సంబంధి త కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర అ ధ్యాపకులు, సిబ్బంది తప్పకుండా ప్రతి ఒక్కరు 25 చొప్పున ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. ప్రవేశాలు చేసిన వారికి మాత్రం ఇన్సెంటీవ్, కొంత కమీ షన్ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్ కళాశాలకు రూ.5వేల వరకు, హాస్టల్ క్యాంపస్ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2500 అందజేస్తున్నా రు. కాగా, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నది కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 13 మోడల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబాపూలే, ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు 45 ప్రైవేట్ కళాశాలలు 14 భారీగా ఫీజులు.. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌కు సంబంధించి జిల్లా నుంచి ఏటా వెయ్యి నుంచి 2వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఐఐటీ, నీట్, ఏసీ సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో ఏడాదికి రూ.3లక్షలు, సాధారణ చదువుకు రూ.1లక్ష 50వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు సైతం రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కారు కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నాం. స్కాలర్షిప్ కూడా పొందవచ్చు. – రవీంద్రకుమార్, డీఐఈవో -
తెలంగాణ: దంచికొడుతున్న ఎండలు.. వడగాలుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత తోడవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. -
వంద రోజుల పాలన పోలీస్ రాజ్యమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంద రోజుల కాంగ్రెస్ పాలనలో పోలీసుల రాజ్యమే కనిపించిందని రాష్ట్రంలోని ప్రజా సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. ప్రతి అంశంలోనూ పోలీసుల జోక్యం పెరిగిందని, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా మీడియాతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏర్పాటయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని పదేపదే చెప్పారని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారని, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశ్రాంత అధ్యాపకురాలు రమా మేల్కోటే అధ్యక్షతన శనివారం ‘నిగాహ్’రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వందరోజుల్లో అనుసరించిన కార్యక్రమాలు, చేసిన పనులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వక్తలు విశ్లేషించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న పౌరహక్కుల నేతలపై గత ప్రభుత్వం ఉపా చట్టాలను అమలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి మార్గాన్నే అనుసరిస్తోందని ఆరోపించారు. పదిరోజులుగా అన్ని మీడియాల్లో పతాకస్థాయిలో వస్తున్న ఎస్ఐబీ దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగుతోందని, అత్యంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న ఎస్‌ఐబీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని సీనియర్ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బలం పెంచుకునేందుకు బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే పనిలో పడిందని, కానీ ప్రజాసమస్యల పరిష్కారంపై అంతగా దృష్టి పెట్టడం లేదని మరో సంపాదకుడు కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన వ్యవస్థ మారినట్లు కాదని, మార్పు కోసం అన్నివర్గాలు ఉద్యమించాలని పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, దేవులపల్లి అజయ్, కె.సజయ తదితరులు పాల్గొన్నారు. -
518 ఎకరాలు.. హాంఫట్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 11 గ్రామాల పరిధిలో.. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది. అత్య ధికంగా బ్యాతోల్‌లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్కల్లో 57 కాశీపూర్‌లో 41 ఎకరాలు, ఉత్తర్‌పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్‌లో మార్చేసి.. అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్భూములను ధరణి పోర్టల్‌లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్. -
Weather: జాగ్రత్త.. ఈసారి ఎండల మంటలే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. అంటే వచ్చే రెండు నెలలు ఎండల మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈసారి భగభగలు తప్పనట్టే.. దేశవ్యాప్తంగా ఈ వేసవికాలంలో భానుడి భగభగలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగవచ్చని పేర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ కూడా దీనిపై ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీయవచ్చని కూడా అంచనా వేసింది. పరిస్థితులు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం (మార్చి చివరివారంలో) ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైనే నమోదు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశి్చమ భారత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత.. ఆరు బయట జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటం మరింత సమస్యగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్‌లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. ‘దక్షిణం’లో తీవ్ర వర్షాభావం.. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అదనంగా నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రిపూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక–అభివృద్ధిశాఖ పేర్కొంది. ఈ మేరకు ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏప్రిల్‌లో మరింత ఎక్కువ ఎండలు.. గతేడాది కంటే వేగంగా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల పాటు ఎండ వేడి ఎక్కువగా ఉన్నా వడగాడ్పులు వీచే అవకాశం లేదు. ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మూడు రోజులపాటు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదై, మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు అలర్ట్‌లను జారీ చేస్తాం. ఏప్రిల్ నుంచి వేసవి ముగిసేవరకు ఉష్ణోగ్రతల అంచనాలు, జాగ్రత్తలపై రోజువారీగా బులిటెన్ విడుదల చేస్తాం. – నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతల తీరు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 40.8 25.5 భద్రాచలం 40.0 25.0 నిజామాబాద్ 39.9 25.0 ఖమ్మం 39.6 24.0 నల్లగొండ 39.5 24.2 హైదరాబాద్ 39.2 24.6 మహబూబ్‌నగర్ 39.2 25.0 మెదక్ 39.2 21.1 దుండిగల్ 39.1 22.2 హకీంపేట్ 39.0 20.1 రామగుండం 38.6 24.6 హన్మకొండ 38.0 22.5 ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏదైనా పని కోసం బయటికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తరచూ నీళ్లు తాగాలని, డీహైడ్రేషన్ తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇంకా వైద్యులు సూచనలు ఇవీ.. బయటికి వెళ్లేవారు తెలుపు, లేత రంగుల పలుచటి కాటన్ వ్రస్తాలు ధరించాలి. తలపై టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలి. ఎండ వేడిలో అధికంగా పనిచేయకూడదు. ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేదతీరాలి. అధిక వేడి వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లొద్దు. -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ట్యాపింగ్ టీమ్ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిత్యం కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్సీ పాత్రపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇజ్రాయిల్‌లో అధునాతన పరికరాలు కొని హైదరాబాధ్‌కు రప్పించడంలో ఎమ్మెల్సీ కీలక పాత్ర వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మెల్సీ తన పలుకుబడితో రవిపాల్‌తో ట్యాపింగ్ డివైజ్‌లను తెప్పించినట్లు గుర్తించారు. అదే విధంగా ఎస్ఐబీ కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి. ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. చదవండి: ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. -
కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అధికార కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కవితను అరెస్ట్ చేయలేదు. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు పగబట్టి కవితను అరెస్ట్ చేశారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటది ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని హైదరాబాద్‌లో ఎవరూ నమ్మలేదని అన్నారు. దానం అవకాశవాది పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశాడని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడని, ఆయనకు ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రెండు పడవల మీద నడవడం మంచిది కాదని హితవు పలికారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దానంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అనర్హత వేటు వేయకపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి అయన్ను అనర్హుడిగా ప్రకటింపజేస్తామని చెప్పారు. మనకు పోటీ బీజేపీతోటే.. ‘సికింద్రాబాద్ లో మనకి పోటీ బీజేపీతోనే. కాంగ్రెస్ మనకు పోటీ కాదు. కిషన్ రెడ్డి సికింద్రబాద్‌లో ఎంపీగా ఉండి చేసిందేమీ లేదు. అంబర్ పేటలో పోటీ చేయకుండా భయపడి వెళ్ళాడు. ఈ సారి కిషన్ రెడ్డికి సానుభూతి లేదు. కరోనా సమయంలో కుర్ కురేలు పంచాడు. అతన్ని చాలామంది కిషన్ రెడ్డి అనటం లేదు. కుర్ కురె రెడ్డి అంటున్నారు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి మాత్రం రైల్వే స్టేషన్లో లిఫ్టులు ప్రారంభం చేస్తున్నాడు. అంబర్ పేట ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్లు పూర్తి చేయించలేని పరిస్థితిలో కిషన్ రెడ్డి ఉన్నాడు . బీఆర్ఎస్ జైత్రయాత్ర ఇక్కడి నుంచే మళ్లీ ప్రారంభం సికింద్రాబాద్‌లో విఫలమైన ఎంపీ కిషన్ రెడ్డి, ఎటు అధికారం ఉంటే అటు పోయే దానం నాగేందర్, వ్యక్తిత్వం, సాయపడే గుణం ఉన్న పద్మారావు పోటీలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. కిషన్ రెడ్డిని ఓడించి ప్రధాని మోదీకి స్పష్టమైన సందేశం పంపాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. పద్మారావు గౌడ్ గెలుపుతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని చెప్పారు.. కాంగ్రెస్‌కు 40 కూడా రావు.. బీజేపీ, మోదీని ఆపాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ప్రాంతీయ పార్టీల నేతలతోనే సాధ్యం. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా.. బీజేపీనా అర్థం కావడం లేదు. చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటే.. రేవంత్ బడే భాయ్ అంటారు. నరేంద్ర మోదీ చోటా భాయ్ రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్‌ను పొగుడుతారు. రేవంత్ బీజేపీ పాట పాడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డినే. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని సీఎం ఎందుకు చెప్పడం లేదు? లంకెబిందెల కోసం అర్ధరాత్రి దొంగలు తిరగతారు. పేగులు మెడలో వేసుకుంటా అంటారు.. ముఖ్యమంత్రివా, బోటీ కొట్టేవారా? జేబులో కత్తెర పెట్టుకొని తిరిగే వాళ్ళు పక్కా జేబు దొంగలు. జేబులో కత్తెర ఉంటే ఏమైనా అయితే జాగ్రత్త. భయపడేవాళ్లు లేరు లిక్కర్ స్కాంలో అన్ని బయట పెడతామని కిషన్ రెడ్డి అంటున్నారు... కోర్టుకు ఇవ్వండి ఎవరు వద్దన్నారు? పనిచేయ చేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నారు, తప్పు జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకోండి. భయపడే వాళ్లు లేరు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు రూ 2,500 కోట్లు సిద్దం చేశారు. అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారు? హైదరాబాద్ లో 8 లక్షల కుటుంబాలకు మంచినీటి బిల్లుల భారం మోపారు... బీఆర్ఎస్ తరపున పోరాడతాం. కాంగ్రెస్ నమ్ముకొన్నది అబద్దాల ప్రచారం మాత్రమే. జై శ్రీరాం ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం భావ్యం కాదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
పంటల బీమాకు కేంద్రం ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోనూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి రానుంది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలంటే తక్షణమే పథకాన్ని అమలు చేసే కంపెనీలను టెండర్ల ద్వారా ఆహ్వానించాలి. దీనికి నోటిఫికేషన్ జారీ చేయాలి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. పంటల బీమా పథకం ప్రారంభం అనేది ఎంతోమంది రైతులను ప్రభావితం చేయనున్నందున ఈసీ అనుమతి లేనిదే ముందుకు సాగలేమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకుంటే ఈ పథకం వచ్చే సీజన్ నుంచి అమలు అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. క్లస్టర్ల వారీగా అమలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో ఈ పథకం నుంచి 2020లో బయటకు వచ్చింది. అయితే ఏదో ఒక పంటల బీమా పథకం ఉండటమే మేలన్న భావన కొందరు రైతుల్లో ఉంది. దీంతో చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాన్నే అమలు చేయనుంది. దీంతో ప్రకృతి వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేసింది. ఆ ప్రకారమే ఈసారి కూడా ముందుకు సాగే అవకాశాలున్నాయి. ప్రీమియం ఇలా... వానాకాలం సీజన్లో సాగుచేసే ఆహారధాన్యాల పంటలకు 2 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. – పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు మాత్రం 5 శాతం రైతులు ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లాలను బట్టి, అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ప్రీమియం రేటు మారుతుండేది. అయితే ఈసారి రైతు వాటా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించారు. కాబట్టి రైతులంతా ఈ పథకంలోకి వస్తారు. మరోవైపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. దీనికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీమా అమలుకు సూచనలు పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని పలువురు అధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. – బీమా కంపెనీలు ప్రీమియం ధరలను ఏటేటా భారీగా పెంచుతుంటాయి. ఈ పద్ధతి మార్చాలి. – కంపెనీలు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం లేదు. జిల్లా స్థాయిలో అధికారులు ఉండటం లేదు. దీంతో రైతులకు బీమాపై అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. – కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ప్రీమియం చెల్లించిన మూడువారాల్లోగా రైతులకు పరిహారం ఖరారు చేయాలి. గతంలో నెలల తరబడి ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. – రైతుల ఫిర్యాదులు వినడానికి, పరిష్కరించడానికి కచ్చితమైన యంత్రాంగం జిల్లా, రాష్ట్రస్థాయిలో నెలకొల్పాలి. – చిన్నచిన్న అంశాలను ఆధారం చేసుకొని పంటల బీమాను రైతులకు అందకుండా చేస్తున్నారు. ఇది పథకం అమలును నీరుగారుస్తుంది. – వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనల కారణంగా బీమా నష్టపరిహారం పొందడం గగనంగా మారింది. వీటిని మార్చాలి. -
Phone tapping case: బెదిరింపుల దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం. అనుకోకుండా దొరికిన అవకాశంతో.. ప్రభాకర్‌రావుతో పాటు హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ రావు తదితరులు.. విదేశాల నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల వరకు వాటిని కేవలం విపక్షాలపై నిఘా కోసమే వాడారు. అయితే వారి ఫోన్లు రికార్డు చేస్తుండగా వెలుగులోకి వచ్చిన అంశాలను గమనించిన తర్వాత, వాటిని ఆర్థిక లబ్ధికి అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని దీని కోసం వినియోగించారు. బెదిరింపుల దందా ప్రారంభించేందుకు ప్రభాకర్‌రావు తనవారైన మరింత మందిని ఎస్ఐబీలోకి తీసుకువచ్చారు. ఎలక్టోరల్ బాండ్లూ కొనిపించారు.. ప్రభాకర్‌రావు బృందం టార్గెట్ చేసిన వారిలో పలువురు ఫార్మా కంపెనీల యజమానులు, బడా బిల్డర్లు, నగల దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. వీరి గురించిన సమాచారం తెలిసిన తర్వాత వారి కార్యాలయాలు, నివాసాల సమీపంలోకి ట్యాపింగ్ ఉపకరణాలతో బృందాలను పంపేవారు. బృందాల్లో ఉన్నవారు బాధితుల ఫోన్లలో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేసుకుని వచ్చి ప్రణీత్‌రావుకు అప్పగించేవారు. వీటిని విశ్లేషించేందుకు పర్వతనగర్‌లోని వార్‌రూమ్‌లో ఓ ప్రత్యేక బృందం పని చేసేది. ఇలా ఆయా వ్యాపారుల వ్యక్తిగత జీవితాలు, బలహీనతలు తదితరాలను గుర్తించే ప్రణీత్‌రావు.. విషయాన్ని ప్రభాకర్‌రావుతో పాటు రాధాకిషన్‌రావు దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆపై రంగంలోకి దిగే వీరి సైన్యాలు వారిని బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. బెదిరింపులకు లొంగని కొందరు వ్యాపారుల వాట్సాప్‌లకు ట్యాపింగ్‌లో బయటపడిన సంభాషణల ఆడియోలను పంపి లొంగదీసుకున్నట్లు తెలిసింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్టోరల్ బాండ్ల విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా చేసినట్లు సమాచారం. ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే.. సాక్షి, యాదాద్రి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రధాన నింతుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్ఐగా, భువనగిరిలో సీఐగా విధులు నిర్వర్తించారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. వీరి దందా వెలుగు చూసిన నేపథ్యంలో వారితో ఆ సమయంలో అంటకాగిన పోలీస్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. టెక్నాలజీ వాడకంలో భుజంగరావు దిట్ట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని గుర్తించడంలో అప్పుడు డీఎస్పీగా ఉన్న నాయిని భుజంగరావు ట్యాపింగ్ సహా టెక్నాలజీ వాడకంలో తన నైపుణ్యాన్ని వినియోగించారు. కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. వాటి ఆధారంగా జిల్లా కోర్టు నింతునికి ఉరి శిక్ష విధించింది. 2021లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్ ఫర్ ఎక్స్లెంట్ ఇన్వెస్టిగేషన్ (అద్భుత పరిశోధన)తో సత్కరించింది. ప్రస్తుతం ఆయన జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. డీజీపీ స్థాయి వారి ఫోన్లూ ట్యాప్ ఈ ట్యాపింగ్ టీమ్ పోలీసు విభాగంలోని వారిని కూడా వదిలిపెట్టలేదు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఆయనకంటే తక్కువ, ఎక్కువ హోదాల్లో ఉన్న వారి ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. పలువురు ఐపీఎస్‌లతో పాటు ఐఏఎస్ అధికారుల పైనా నిఘా ఉంచినట్లు తెలిసింది. నగర పోలీసు కమిషనర్‌గా పని చేసి డీజీపీగా వెళ్లిన ఓ అధికారి సైతం ప్రభాకర్‌రావు చర్యల్ని అడ్డుకోలేకపోయారు. దీంతో ఆయన ఓ దశలో సాధారణ ఫోన్, వాట్సాప్‌లు కాకుండా సిగ్నల్ యాప్ వాడాలని ఎస్పీలు, ఇతర అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు అప్పట్లో ఐజీలు, డీఐజీలుగా పని చేసిన వాళ్లు కూడా దీని ద్వారానే ఎస్పీలతో సంప్రదింపులు జరిపారంటే వారి అభద్రతా భావాన్ని అంచనా వేయవచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా శనివారం అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను తదుపరి దర్యాప్తు నిమిత్తం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
గోవా క్యాంప్‌లో కేటీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ తీవ్రంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లను గోవాకు తరలించారు. ఈ క్రమంలో గోవా క్యాంప్‌లో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సమావేశం కావడం హాట్‌టాపిక్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పార్టీ చూసుకుంటుందని హామీ ఇచి్చనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా పార్లమెంట్ పోరులో ముందంజలో ఉంటామని.. ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచి్చనట్టు తెలిసింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 1,439 ఓట్లు ఉన్నాయని.. ఇందులో వెయ్యికి పైగా ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన వారేనని.. నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపు ఖాయమని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. వారిలో ఆత్మస్థైర్యం నింపేలా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. కేటీఆర్ వెంట మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నెల 28న పోలింగ్ జరగనుండగా.. ఆయా పారీ్టలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు తరలించాయి. బీఆర్ఎస్ గోవా, ఊటీ.. కాంగ్రెస్ గోవాతో పాటు ఏపీ, కర్ణాటకలో శిబిరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. 100 మంది వరకు స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్న బీజేపీ సైతం కొడైకెనాల్లో క్యాంప్ ఏర్పాటు చేయడం పోరు తీవ్రతకు అద్దం పడుతోంది. బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి యువ పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి పోటీపడుతున్నారు. -
‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్ వాల్యూయేషన్) ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా స్పాట్ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తినట్టు ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలోనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటే హాలులో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి ఇచ్చేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్లో నమోదు చేయాలని బోర్డు సూచించింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, కార్పొరేట్ కాలేజీల ప్రలోభాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని బోర్డు అధికారులు తెలిపారు. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మూల్యాంకనంలో 20 వేల మంది ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో అధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. పది రకాల పరీక్షల తర్వాతే ఆన్‌లైన్‌లోకి.. సమాధాన పత్రాలు మూల్యాకనం చేసిన అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే మార్కులను ఆన్లైన్లో ఫీడ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు సమాధాన పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమాధానం గుర్తించే విషయంలో ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్ దాన్ని పరిశీలించడం వల్ల విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. సగటు పరిశీలన తర్వాత, రెండు పరీక్షలు నిర్వహించి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసుకుని నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
కొత్త గురుకులాలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త గురుకులాల ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతో గురుకులాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడానికి వేచిచూడాల్సిందేనని విద్యారంగ నిపుణులు చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా గురుకుల సొసైటీల అంశాన్ని ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత మేనిఫెస్టోలోని హామీల అమలుపై దృష్టి సారించి. కొత్త గురుకులాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని బీసీ గురుకుల సొసైటీని ఆదేశించింది. ఇందులో భాగంగా కొత్త గురుకులాల ఏర్పాటు అవసరమున్న మండలాల వారీగా బీసీ గురుకుల సొసైటీ ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 292 బీసీ గురుకులాలు.. రాష్ట్రంలో 594 మండలాలున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 594 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ప్రస్తుతం 292 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బాలుర, ఒక బాలికల గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా జిల్లా కేంద్రాల్లో ఒకట్రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కొత్తగా మరో 302 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి. క్షేత్రస్థాయిలో డిమాండ్‌కు తగినట్లుగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న 292 బీసీ గురుకుల పాఠశాలలను మండలాల వారీగా విభజించి.. కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే కోణంలో పరిశీలన జరిపిన అధికారులు, మండలాల వారీగా ప్రాధాన్యత క్రమంలో జాబితాను తయారు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో కూడా ప్రాథమిక ప్రతిపాదనలను సమర్పించారు. ప్రస్తుతం గురుకులాల ఏర్పాటు అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ కొనసాగనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నప్పటికీ భవనాల గుర్తింపు, నిర్వహణ ఏర్పాట్లు చేసేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త గురుకులాల ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాదిలో వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అధికారులు చెబుతున్నారు. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్ రావుఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నేతలతో టచ్‌లోకి వెళ్లిన రాజకీయ, వ్యాపారులను ప్రణీత్‌రావు గ్యాంగ్ బెదిరించినట్లు తెలిసింది. వ్యాపార వేత్తల వాయిస్‌ను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఆడియోలు బయటకు రావొద్దంటే బీఆర్ఎస్ నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రణీత్ రావు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. బెదిరింపు ఆడియోలను వ్యాపారుల ముందు పెట్టి వారిచేత ప్రణీత్ గ్యాంగ్ ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించినట్లు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపారులు అత్యధికంగా బీర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్లు కొన్నట్లు తేలింది. చదవండి: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది. రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. చదవండి: ట్యాపింగ్ కేసులో ముగ్గురికి రిమాండ్ -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు రియాక్షన్ ఇది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు సంచలనాలతో రాజకీయ ప్రకంపనలకు సిద్ధం కాబోతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అయితే.. ఈ మొత్తానికి ప్రధాన సూత్రధారి అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారికి ‘టచ్’లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుపై వేటు.. అరెస్ట్ తర్వాత పత్తా లేకుండా పోయిన ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారితో సంభాషణ జరిపినట్లు తాజా సమాచారం. మా ఇళ్లలో ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు? అని ఆ సందర్భంలో ఆయన సదరు ఉన్నతాధికారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘‘ఎంతైనా మనం మనం పోలీసులం ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా చేస్తున్నారో.. గత ప్రభుత్వంలో మేం కూడా అలాగే చేశాం’’ అని ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను కేన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని.. జూన్ లేదంటే జులైలో తిరిగి హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే ప్రభాకర్‌రావు అడిగిన కొన్ని ప్రశ్నలకు సదరు ఉన్నతాధికారి స్పందించకుండా.. మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్‌కు సమాధానం రాసి పంపాలని సూచించారట. దీంతో.. ప్రభాకర్‌రావు సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాల ప్రకారం.. నాటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డిపై నిఘా వేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించడంతో ఎస్ఈబీ డీఎస్పీ ప్రణీత్‌రావు రంగంలోకి దిగారు. రేవంత్ ఇంటి సమీపంలోనే ప్రణీత్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఆరాలు తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో తిరుపతన్న, భుజంగరావు(తాజాగా అరెస్టైన అదనపు ఎస్పీలు) కీలకంగా వ్యవహరించారు. తిరుపతన్న ఆ డేటాను ఎప్పటికప్పుడు ప్రభాకర్‌రావుకు పంపించారు. అయితే.. ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు రావడంతో మొత్తం హార్క్డిస్క్లు, సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని ప్రణీత్‌కు ప్రభాకరే సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడం.. ప్రణీత్‌రావుపై సస్పెన్షన్ వేటు పడడంతో అప్రమత్తమైన ప్రభాకర్‌రావు ఫ్యామిలీ ట్రిప్ పేరిట చెన్నైకి చేరి.. అటు నుంచి అటే అమెరికాకు వెళ్లారు. ఇక.. ప్రభాకర్‌రావు నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ మాజీ పోలీస్ అధికారిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కూడా. ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పేర్లను ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులే కీలక సంస్థ దారులు... ఆ ఇద్దరూ చెప్తేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు అందించేవారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు, రాధా కిషన్ ఇచ్చేవారని తేలింది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు పేరును ఏ2గా చేర్చింది దర్యాప్తు బృందం. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రభాకర్ రావు అండ్ టీం.. కేవలం విపక్ష నేతల ఫోన్లే కాదు.. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసింది. ఈ జాబితాలో 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రముఖ జ్యువెల్లరీ వ్యాపారులతో పాటు హవాలా వ్యక్తులు సైతం ఉన్నారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావులు వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసి.. బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బు గుంజినట్లు నిర్ధారణ అయ్యింది. -
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కస్టడీ ద్వారా కీలక విషయాల్ని రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరించింది. ఏడు రోజుల విచారణలో ఆయన నుంచి ప్రధాన పాత్రధారులెవరనేది దాదాపుగా నిర్ధారించుకున్న అధికారులు.. ఇప్పుడు రాజకీయ నేతలపై ఫోకస్ చేసినట్లు సమాచారం. విచారణ సమయంలో ప్రణీత్‌రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి పశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలకు నేడో, రేపో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. తద్వారా ప్రణీత్ చెప్పిన విషయాలకు సంబంధించి వాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించాలని.. వాళ్లిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు నడిపించిన ట్యాపింగ్ రాకెట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కొందరు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చారు. ఇక.. ఇప్పటికే ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంతో అంటకాగిన మాజీ పోలీస్ బాస్‌లు పరారీలో ఉండగా.. ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగ్‌రావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. -
ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 43.2%
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43.2 శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూలవేతనంపై అంతమేర కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు. ప్రభుత్వం సవరించిన ఇంటిఅద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తాజా వేతన సవరణతో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తించనున్న విషయం తెలిసిందే. హెచ్ఆర్ఏ భారీగా తగ్గిపోవటంతో ఉద్యోగుల వేతనంపై పెద్ద ప్రభావమే చూపనుంది. హెచ్ఆర్ఏలో కోత వల్ల, కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు కొంత ఆందోళనతో ఉన్నారు. కానీ, ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందనుండటంతో.. ఆ వెలితి కొంత తీరినట్టేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 82.6 శాతం ఉంది. ఇప్పుడు 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణను అమలులోకి తెస్తున్నందున, అప్పటికి ఉన్న 31.1 శాతం డీఏ ఉద్యోగుల మూల వేతనంలో కలిసి పోతుంది. అది పోయిన తర్వాత 51.5 శాతం డీఏ ఉంటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మూలవేతనంపై లెక్కించరని తెలుస్తోంది. వేతన సవరణ పద్ధతిలో భాగంగా దాన్ని న్యూట్రలైజ్ చేసి కొత్త డీఏను ఖరారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం.. తాజా డీఏ 43.2 శాతంగా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ నాలుగు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం అన్ని విడతల డీఏలు చెల్లించటం విశేషం. 2024 జనవరి విడతకు సంబంధించి 3.9 శాతాన్ని తాజా వేతన సవరణలో భాగంగా చెల్లించనుండటం విశేషం. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఏకంగా ఏడు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండేవి. అయితే కార్మిక సంఘాల ఒత్తిడి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృషి ఫలితంగా తక్కువ సమయంలోనే ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లించింది. కొన్ని విడతలు మిగిలి ఉండగా, గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం వాటిని కూడా ప్రకటించింది. దీంతో మొత్తం బకాయిలు క్లియర్ అయి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు తాజా విడత కరువు భత్యం కూడా అందబోతోంది. -
గురుకుల బోర్డుకు కొత్త సారథులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లో మార్పులు జరగనున్నాయి. కీలకమైన చైర్మన్, కన్వినర్ పోస్టుల్లో త్వరలోనే కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా ఉన్న మల్లయ్య బట్టును రా ష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీచేసింది. సొసైటీ నూత న కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి బి.సైదులను నియమించింది. దీంతో గత వారం ఆయ న బాధ్యతలు స్వీకరించారు. అయితే టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా వ్యవహరించిన మల్లయ్య బట్టు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో కన్వినర్ సీటు ఖాళీ అయ్యింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అత్యంత కీలకంగా వ్యవహరించే కన్వినర్ సీటు ఖాళీ కావడంతో బోర్డు పరిధిలో పలు నియామకాలకు సంబంధించిన అంశాలు పెండింగ్ లో పడిపోయాయి. ఈ క్రమంలో వాటి భర్తీతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే బో ర్డుకు కన్వినర్ నియామకం అనివార్యం కానుంది. బోర్డు సభ్యులుగా సొసైటీల కార్యదర్శులు రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీని వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా టీఆర్‌ఈఐఆర్‌బీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల కార్యదర్శులు బోర్డులో సభ్యులుగా ఉంటారు. గురుకుల సొసైటీల్లో సీనియర్ కార్యదర్శి ఈ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో సభ్యుడు కన్వినర్‌గా ఉంటారు. బోర్డు సభ్యుల అంగీకారం, ప్రభుత్వ ఆమోదంతో సొసైటీల్లోని అదనపు కార్యదర్శుల్లో ఎవరినైనా కూడా కన్వినర్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు. ప్రస్తుత చైర్మన్‌గా ఆయేషా మస్రత్ ఖానమ్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానమ్ ఉన్నారు. కన్వినర్‌గా కొనసాగిన మల్లయ్య బట్టును టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా బి.సైదులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న గురుకుల సొసైటీ కార్యదర్శుల్లో ఈయనే సీనియర్ అధికారి. బోర్డు చైర్మన్‌గా సీనియర్ అధికారిని నియమించాల్సి ఉండటంతో ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న మస్రత్ ఖానమ్‌కు కూడా స్థాన చలనం తప్పదని అధికారులు అంటున్నారు. కన్వినర్ పోస్టు కూడా ఖాళీ కావడంతో చైర్మన్, కన్వీనర్ రెండు పోస్టుల్లోనూ కొత్త వారినే నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు అధికారులు ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శుల సీనియారీ్ట, తదితర పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత చైర్మన్, కన్వినర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
టెట్ ఫీజుపై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్‌కు ఒక్కో పేపర్‌కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్‌కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫీజు తగ్గించలేమా? ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచి్చనా, తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అన్యాయం లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి, టెట్ కోచింగ్ తీసుకున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజులను రూ. 400 నుంచి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం. ఆన్లైన్ ఫీజు పేరుతో పేదలపై భారం మోపడాన్ని ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతాం. –ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు) ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును రెండింతల నుంచి నాలుగింతలకుపైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోయలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీస కనికరం కూడా చూపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ప్రభుత్వం చెప్పిందేంటో? చేస్తున్నదేంటో? ప్రజలు అర్థం చేసుకోవాలి. –రావుల మనోహర్‌రెడ్డి (బీఈడీ, డీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు) -
ఫిరాయింపులకు కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరవాలి
దేవరుప్పుల: కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఫిరాయింపునకు గేట్లు తెరవకుండా, అన్నదాతల పంటల రక్షణకు ప్రాజెక్టుల గేట్లు తెరవాలని మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, కడియం శ్రీహరి హితవు పలికారు. ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చింతబాయితండాలో బోర్లు ఎత్తిపోయి, సాగునీరు అందక ఎండిపోయిన వరి పొలాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బృందం రైతులతో మాట్లాడింది. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు శివశంకర్ అనే రైతు అప్పులు చేసి మూడు నెలల్లో 6 బోర్లు, సత్యమ్మ 4 బోర్లు, నర్సింహ 3 బోర్లు, జంకు 9 బోర్లు, లక్ష్మి 6 బోర్లు, విజయ 4 బోర్లు వేశారు. అయినా ఫలితం లేదని రైతులు వాపోయారు. హరీశ్‌రావు, ఎర్రబెల్లి, కడియం వీరి కష్టాలను ప్రస్తావిస్తూ, సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి.. రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పలకరించిన పాపానపోలేదన్నారు. గోదావరి నదిలో నీళ్లున్నా ప్రభుత్వం రైతులకు అందించలేక చేతులెత్తేసిందని, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామని చెప్పి వంద రోజులు దాటినా నెరవేర్చలేదని, రైతుబంధు కింద రూ.15 వేలు ఇస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. గతంలో తామిచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వడం లేదని, కౌలు రైతులను సైతం దగా చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాల్వలకు పుష్కలంగా నీళ్లు ఇవ్వగా రెండు పంటలు పండించుకుని రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ వచ్చాక నీళ్లు, కరెంటుకు కష్టాలు ప్రారంభమయ్యాయని, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడమే కాకుండా.. వడగళ్ల వానలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. అయినా ముఖ్యమంత్రికి, మంత్రులకు పట్టడం లేదన్నారు. సత్వరమే దెబ్బతిన్న వరి పంటకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని, వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్రామిరెడ్డి వారి వెంట ఉన్నారు. -
సార్.. గిరాకీల్లేవ్!
కరీంనగర్ టౌన్: ‘సార్ మూడు నెలలుగా గిరాకీల్లేవు. ఫైనాన్స్ తెచ్చి ఆటో నడుపుతున్నాం. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. గిరాకీ అంతంత మాత్రమే వస్తోంది. బడి పిల్లలను తీసుకెళ్తుండటంతో వాళ్లిచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తోంది. ఎండాకాలం సెలవులొస్తున్నాయి. ఇక ఆ గిరాకీ కూడా ఉండదు. అప్పుల బాధ దేవుడెరుగు.. ఎట్లా బతకాలో అర్థం అయిత లేదు’అంటూ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎదుట కరీంనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు మొర పెట్టుకున్నారు. బండి సంజయ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్లను కలిశారు. వారితో కలసి చాయ్ తాగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇన్సూరెన్స్ చెల్లించే పరిస్థితి లేదన్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. రాబోయే రెండు నెలలపాటు స్కూళ్లు కూడా ఉండవని, ఇల్లు గడవడం కష్టమయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బండి మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదే అయినా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని వెల్లడించారు. -
అసత్యాలు ప్రసారం చేస్తే కేసులు పెడతాం
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగతంగా తనతోపాటు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్ చానళ్లు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న చానళ్లపై ఇప్పటికే యూట్యూబ్, గూగుల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై పరువునష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు. ఈ తరహా చానళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరిట పచ్చి అబద్ధాలను చూపిస్తున్నాయి. మాపై గుడ్డి వ్యతిరేకత లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలు, ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోంది. ప్రజలను అయోమయానికి గురిచేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యలుగా వీటిని భావిస్తున్నాం.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. వారిపై చర్యలు తప్పవు ‘గతంలో మాపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాం. కొన్ని యూట్యూబ్ చానల్స్ ప్రస్తుతం చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఇప్పటికైనా ఈ చానళ్లు తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు. -
789 టీఎంసీలు మాకే కావాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో ఉన్న 1,050 టీఎంసీల్లో 798 టీఎంసీలను తమకు కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238 టీఎంసీలు, భవిష్యత్‌లో కట్టబోయే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 36 టీఎంసీలు కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని నివేదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్(కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఇతర కేటాయింపులను.. ఏపీ, తెలంగాణల మధ్య పునః పంపిణీకి కృష్ణా ట్రిబ్యునల్–2కు అదనపు విధివిధానాలు (టీఓఆర్) జారీ చేస్తూ 2023 అక్టోబర్ 10న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీపై తమ వాదనలతో స్టేట్ ఆఫ్ కేసు (ఎస్ఓసీ) దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నెల 20తో గడువు ముగియగా, అదేరోజు తమకు 798 టీఎంసీలను కేటాయించాలని కోరుతూ తెలంగాణ ఎస్ఓసీ దాఖలు చేసింది. నది పరీవాహక ప్రాంతం(బేసిన్)ను ప్రామాణికంగా తీసుకుంటే 68 శాతం క్యాచ్మెంట్ ఏరియా తమ రాష్ట్రం పరిధిలో ఉందని తెలంగాణ స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలో 2 కోట్ల జనాభాతో పాటు అత్యధిక శాతం కరువు పీడిత ప్రాంతాలున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయమైన వాటాగా 789 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత(డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని నివేదించింది. భవిష్యత్‌లో కట్టే ప్రాజెక్టులకు 216 టీఎంసీలు భవిష్యత్‌లో కోయిల్‌కొండ, గండీడ్, జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాల్సి ఉందని, వీటికి 216 టీఎంసీల నీటిని కేటాయించాలని ట్రిబ్యునల్‌ను తెలంగాణ కోరింది. 1050 టీఎంసీల్లో సగానికి పైగా... ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ గంపగుత్తగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అదనంగా 194 టీఎంసీలు కేటాయించడంతో ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇవికాక పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా, నాగార్జునసాగర్ ఎగువన ఉండే రాష్ట్రాలకు 80 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునే వెసులుబాటు గతంలోనే బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. అందులో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలు కలుపుకొని మొత్తం 1050 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. ట్రిబ్యునల్ నివేదికకు 15 నెలల గడువు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్–3 కింద విచారణ జరిపి, నివేదిక ఇచ్చేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును ఇటీవల కేంద్రం మరో 15 నెలలు పొడిగించింది. 2025 జూలై 31లోపు ట్రిబ్యునల్ నివేదిక అందించాలి. ఏపీ సైతం తమ స్టేట్ ఆఫ్ కేస్‌ను దాఖలు చేస్తే ట్రిబ్యునల్ విచారణ ముందుకు సాగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ విచారణ చేసినందున, తీర్పు కూడా 15 నెలల్లోపే వస్తుందనే ఆశతో తెలంగాణ ఉంది. -
తడారిన తండాలు ..ఏజెన్సీ ప్రజల పాట్లు
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ నీరు వారం, పది రోజులకోసారి సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్తులు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వేకువనే కాలినడకన వెళ్లి తెచ్చుకోవలసిన దుస్థితి. పూనగూడ గ్రామస్తులు ఎడ్లబండిపై నాలుగైదు కి.మీ. దూరంలోని చెరువు, బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఆదివారం వేకువజామున కనిపించిన దృశ్యాలివి. – ఆదిలాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును ఏ1గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లు ధ్వంసం చేశారు. ప్రభాకర్‌రావు చెప్పిన మేరకే హార్డ్ డిస్క్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్ -
రేవంత్.. రైతులకు లీగల్ నోటీసులా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలను మర్చిపోయారని మండిపడ్డారు. రైతుల పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం వహిస్తూ.. రైతన్నలకు లీగల్ నోటీసులను పంపుతోందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను పచ్చి దగా, నయవంచనతో మోసం చేస్తోందన్నారు. ‘ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు.. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు. నేడు.. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం.. రైతన్నలకు లీగల్ నోటీసులు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన’ అని ఎమ్మెల్యే కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగట్టారు. ఇవి ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు.👇 ▶️బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దు. ▶️డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ▶️ఇప్పటివరకు లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా… pic.twitter.com/hxKapf2DYW — KTR (@KTRBRS) March 24, 2024 -
ఈ సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాపులు బంద్
హైదరాబాద్: మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయనున్నారు..ఎందుకంటే..రేపు సోమవారం 2024, మార్చి25న హోలీ సందర్భంగా నగర వ్యాప్తంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా మద్యం షాపులు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 26 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు. -
రసవత్తరంగా మారనున్న లష్కర్ పోరు
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఇప్పటికే బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్లను ఆ పార్టీలు ప్రకటించగా, తాజాగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.పద్మారావుగౌడ్ పేరును ప్రకటించారు. ముగ్గురూ ప్రజాబలంతో ఎదిగిన నేతలే. నాగేందర్, పద్మారావులకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువనే పేరుంది. ఇటీవలీ దాకా ఒకే పారీ్టలో, ఒకే నాయకత్వం కింద కలిసి పని చేసిన వారిద్దరు ఇప్పుడు నువ్వా? నేనా? అని తేల్చుకునేందుకు సిద్ధం కావడంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారింది. దానం నాగేందర్ అనగానే ఇంకా బీఆర్ఎస్లో ఉన్నట్లుగానే ప్రజలకు గుర్తుంది. ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిసినప్పటికీ, ఇంకా బలంగా నమోదు కాలేదు. దీంతో నాగేందర్, పద్మారావు అనగానే ఇద్దరూ ఒకే పార్టీ కదా .. అంటున్న వారు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారన్నది వేచి చూడాల్సిందే. గెలుస్తాం: కేసీఆర్ ధీమా పార్టీ అభ్యరి్థగా పద్మారావును ప్రకటించే సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నుంచి కేంద్రమంత్రి పోటీలో ఉన్నారని వెరవాల్సిన పనిలేదని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ 2004లో తొలిసారిగా పద్మారావు ఎమ్మెల్యేగా పోటీ చేసింది అప్పటి రాష్ట్ర కేబినెట్ మంత్రి పైనే (తలసాని శ్రీనివాస్‌యాదవ్) అయినా ఆయనను ఓడించారని గుర్తు చేసినట్లు తెలిసింది. పద్మారావు గురించి మీకు తెలియంది కాదు. ఇటీవలి ఎన్నికల్లో మీరంతా మీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆరింట (నాంపల్లి మినహా) మనమే గెలిచాం. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఇప్పుడు పార్టీ కోసం మరింత ఎక్కువగా కష్టపడి గెలిపించాలని హితబోధ చేసినట్లు సమాచారం. పద్మారావు అభ్యరి్థత్వానికి అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఆయన పేరు ప్రకటించారు. ఐదింట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో అంబర్‌పేట, ముషీరాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లిలో మాత్రం ఎంఐఎం అభ్యర్థి గెలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. వారిలో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన పద్మారావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో తలపడుతున్నారు. త్వరలోనే ప్రచారంలోకి.. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పద్మారావు ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. సోమవారం హోలీ ముగిశాక మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అదే సమావేశంలో జనరల్ బాడీ సమావేశ తేదీని నిర్ణయించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ లెక్కలు తేలాయి. 2017 వేతన సవరణను అములు చేయాలని వారం క్రితం ప్రభుత్వం నిర్ణయించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం తెలిసిందే. 2018 నుంచి 16 శాతం ఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్)ను కొనసాగిస్తున్నందున దాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త ఫిట్‌మెంట్‌ను చేర్చి ఏ ఉద్యోగికి ఎంత మేర వేతనాన్ని సవరించాలో తాజాగా అధికారులు లెక్కలు సిద్ధం చేశారు. డిపో మేనేజర్, ఆ పైస్థాయి అధికారులకు సంబంధించిన సవరణ లెక్కలను విడిగా ఖరారు చేయనున్నారు. డిపో మేనేజర్ స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న ఉద్యోగుల లెక్కలను సిద్ధం చేసి శనివారం ఆయా డిపోలకు పంపారు. కరువు భత్యంపై సందిగ్ధం.. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 82.6 శాతం కరువు భత్యం (డీఏ) అమలవుతోంది. ఇందులో 31.1 శాతం 2017 వేతన సవరణ గడువుకు పాతది. దీంతో తాజా వేతన సవరణలో ఈ 31.1 శాతాన్ని జోడించారు. 2017 వేతన సవరణ గడువు తర్వాత ఉద్యోగులకు వర్తింపజేసిన మిగతా 51.5 శాతం కరువు భత్యాన్ని మూల వేతనంలో కలిపే వీల్లేదు. దాన్ని ఎంత మేర వర్తింపజేయాలన్న విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆ వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రేడ్ పే కొనసాగింపు.. ప్రభుత్వ ఉద్యోగులకు లేని గ్రేడ్ పే వెసులుబాటు ఆర్టీసీలో అమలవుతోంది. ఆయా అధికారుల హోదాను బట్టి జీతం కాకుండా అదనంగా గ్రేడ్ పే పేరుతో కొంత మొత్తాన్ని ప్రతినెలా చెల్లిస్తారు. అది సూపర్వైజర్ స్థాయి అధికారుల నుంచి మొదలవుతుంది. ఆ దిగువ హోదాలో ఉండే కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు ఉండదు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ విధానాన్ని తొలగించాలని గతంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా వేతన సవరణ తర్వాత కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. హెచ్ఆర్ఏ తగ్గింపుపై ఆందోళన.. వేతన సవరణతో జీతాలు పెరుగుతాయన్న ఆనందం ఉద్యోగుల్లో ఓవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇంటి అద్దె భత్యం తగ్గిపోనుండటంతో అంçతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పలు రకాల సూచీల ఆధారంగా ఇంటి అద్దె భత్యంలో మార్పులు చేసింది. దాన్ని అమలు చేయాల్సి రావడంతో మూడేళ్ల క్రితమే ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ సమయంలో అమలులోకి తెచ్చింది. ఆర్టీసీలో వేతన సవరణ జరగకపోవటంతో అప్పటి నుంచి పాత హెచ్ఆర్ఏలే కొనసాగుతున్నాయి. తాజా వేతన సవరణ నేపథ్యంలో 2020 నుంచి హెచ్ఆర్ఏ తగ్గింపును అమలు చేయబోతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు ఇక నుంచి 30 శాతం బదులు 24 శాతమే హెచ్ఆర్ఏ అందుతుంది. దీనిప్రభావంతో చిరుద్యోగుల జీతాల్లో దాదాపు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కోత పడబోతోంది. హెచ్ఆర్ఏ సీలింగ్ పరిమితిని రూ. 43 వేలకు పెంచారు. ఇది ఉన్నతాధికారులకు మేలు చేయనుండగా ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడదు. -
వోల్వో.. వద్దు
సాక్షి, హైదరాబాద్: గరుడ ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగుకానున్నాయి. ఆ పేరుతో ఆర్టీసీలో తిరుగుతున్న ఒక్కో వోల్వో బస్సుకు నెలకు సగటున రూ.లక్షకు పైగా నిర్వహణ ఖర్చు వస్తోంది. పైగా చిన్న రిపేరు చేయాల్సి వచ్చినా.. కంపెనీకి తరలించాల్సి రావటం, ఒక్కో పనికి రూ.3–4 లక్షల వరకు బిల్లు వస్తుండటంతో వాటిని వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా 20 వరకు బస్సులను పక్కన పెట్టేసింది. త్వరలో మరికొన్నింటిని తుక్కు కింద మార్చబోతోంది. వాటి స్థానంలో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొంటున్న లహరి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడపబోతోంది. సామర్థ్యానికి మించి నడపటంతోనే.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆధునిక బస్సులు అందుబాటులోకి తెస్తుండటంతో ఆర్టీసీ కూడా ఆ శ్రేణి బస్సులను సమకూర్చటం అనివార్యమైంది. రెండు దశాబ్దాల క్రితం గరుడ పేరుతో బస్సులు ప్రారంభించారు. ఆకర్షణీయంగా ఉండేలా మెర్సిడస్ బెంజ్, ఇసుజు కంపెనీల బస్సులు నడిపారు. ఆ తర్వాత మల్టీ యాక్సెల్ బస్సులను గరుడ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ కేటగిరీలో వోల్వో, స్కానియా బస్సులు వాడారు. 2016–17లో కొత్త వోల్వో బస్సులు కొన్నారు. సాధారణంగా ఆ కంపెనీ బస్సులు ఏడెనిమిది లక్షల కిలోమీటర్ల వరకు తిప్పొచ్చని నిపుణులు చెబుతారు. అంతకంటే ఎక్కువ తిప్పితే సమస్యలు ఏర్పడతాయి. ఒక్కో బస్సు ధర రూ.1.3 కోట్ల వరకు ఉండటంతో వెంటవెంటనే కొత్తవి సమకూర్చటం కుదరదు. అంత ధర పెట్టి కొని తక్కువ కిలోమీటర్లు తిప్పి తుక్కు కింద మార్చటానికి ఆర్టీసీ అధికారులకు మనస్కరించటం లేదు. దీంతో ఏకంగా 14 లక్షల నుంచి 15 లక్షల కి.మీ. వరకు తిప్పుతున్నారు. దీంతో ఆ బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల మరమ్మతులను సొంత సిబ్బందే చేస్తుంటారు. కానీ వోల్వో కంపెనీలో ఆయిల్ మార్చటం లాంటి చిన్నచిన్న పనులు తప్ప మిగతా సాంకేతిక సమస్యలన్నీ ఆ కంపెనీ ఇంజనీర్లే సరిదిద్దాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్య తలిత్తితే బస్సును నిలిపివేసి ఆ కంపెనీ నిపుణులకు కబురు పెట్టాల్సిందే. వారొచ్చి మరమ్మతు చేసి రూ.మూడు నాలుగు లక్షల బిల్లు వేసి వెళుతున్నారు. ఇది ఆర్టీసీ చేతి చమురు వదిలిస్తోంది. ఒక్కో బస్సుకు ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో 14 లక్షల కి.మీ. దాటిన బస్సులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించి అమలు ప్రారంభించింది. ఆ కంపెనీ బస్సులు కొనటం ఆర్థికంగా ఇబ్బందిగా మారటంతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి సమకూర్చుకుంటున్న లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను వాటి బదులు తిప్పుతోంది. ఇటీవలే 16 లహరి బస్సులను వాటికి చేర్చింది. త్వరలో 40 వోల్వో బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించింది. మిగతా వాటిని దశలవారీగా ఆపేయనుంది. పోటీని తట్టుకోగలదా..? ప్రస్తుతానికి బహుళజాతి కంపెనీ బస్సులు కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించింది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంగళూరు, షిర్డీ, చెన్నై లాంటి దూర ప్రాంతాలకు బహుళజాతి కంపెనీలకు చెందిన ఆధునిక బస్సులు సమకూర్చుకుంటున్నాయి. ఆ కేటగిరీ బస్సులు ఆర్టీసీలో లేకపోవటం వెలితిగానే మారనుంది. ఇది ప్రయాణికుల ఆదరణపై ప్రభావం చూపే అవకాశముంది. అప్పటి పరిస్థితిని పరిశీలించి వాటిని కొనాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప ఇప్పట్లో వాటిని కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించటం గమనార్హం. -
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్‌ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్‌ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్‌ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్‌ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్‌సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఇసుక కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలోనూ వెసులుబాటు.. తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది. ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. -
ధాన్యం లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే!
ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ మిల్లు నుంచి గత సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో ప్రభుత్వం ఇచ్చిన 10 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను రికవరీ చేసుకునేందుకు ధాన్యం కాంట్రాక్టు పొందిన ఓ సంస్థ ప్రతినిధులు వెళ్లారు. తీరా అక్కడికి వెళితే మిల్లులో ధాన్యం నిల్వలు లేవు. మిల్లులో ఉన్న ధాన్యం చెడిపోతుందని అమ్మివేసినట్లు మిల్లర్ ఒప్పుకున్నాడు. దీంతో క్వింటాల్‌కు రూ. 2,259 లెక్కన 10 మెట్రిక్ టన్నులకు రూ. 2,25,900 చెల్లించాలని లెక్క చెప్పి వెళ్లారు. సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్లుగా సాఫీగా సాగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు మిల్లర్లకు దడపుట్టిస్తోంది. గత సంవత్సరం యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయలేమని రాష్ట్రంలోని మిల్లర్లంతా చేతులెత్తేయడంతో ఆగిపోయిన సీఎంఆర్ ప్రక్రియ ఇప్పుడు వారి మెడకే చుట్టుకుంది. కస్టమ్ మిల్లింగ్ చేయకుండా మిల్లుల్లోనే నిల్వ చేసిన ధాన్యం నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం వేలం వేసి, బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకు ధాన్యం కొనుగోలు కాంట్రాక్టులను అప్పగించింది. గన్నీ బ్యాగులతో కలిపి క్వింటాలుకు సగటున రూ. 2,007 లెక్కన ధాన్యం కాంట్రాక్టు పొందిన సంస్థలు తమకు కేటాయించిన జిల్లాల నుంచి ధాన్యం సేకరణకు శ్రీకారం చుట్టాయి. తీరా ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని మిల్లులకు వెళితే అక్కడ ధాన్యం కనిపించడం లేదు. దీంతో మిల్లర్ల నుంచి క్వింటాలు ధాన్యానికి బదులుగా రూ. 2,259 లెక్కన డబ్బులు వసూలు చేయాలని కాంట్రాక్టు సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించడంతో మిల్లర్లు బెంబే లెత్తుతున్నారు. వేలంలో 6 సంస్థలకు ధాన్యం అప్పగింత 2022–23 సంవత్సరం యాసంగిలో రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 20 ఎల్ఎంటీ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ కింద బాయిల్డ్ బియ్యంగా మిల్లింగ్ చేసి అప్పగించారు. మిగతా ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముడి బియ్యం (రా రైస్)గా సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా, మిల్లింగ్ చేయలేదు. దీంతో నిల్వ ఉన్న ధాన్యాన్ని గత ప్రభుత్వం వేలం వేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 12 లాట్ల కింద వేలం వేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో కేవలం ఏడు సంస్థలే బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అందులో ఓ సంస్థ తిరస్కరణకు గురికాగా మిగతా ఆరు సంస్థలు ఈ బిడ్లను దక్కించుకున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రీయ భండార్, నాకాఫ్ కూడా ఉన్నాయి. వేలంలో క్వింటాలు ధాన్యానికి సగటున రూ. 2,007 లెక్కన (గన్నీ బ్యాగులతో కలిపి) ప్రభుత్వానికి చెల్లించేలా బిడ్లు ఆమోదం పొందాయి. ఈ బిడ్డింగ్ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో సదరు సంస్థలు ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించాయి. ధాన్యం అమ్మేసుకున్న మిల్లర్లు.. గత యాసంగి సీజన్లో సీఎంఆర్ చేయ కుండా నిల్వ చేసినట్లు మిల్లర్లు చెప్పినప్పటికీ, ఏ మిల్లర్ దగ్గరా సరిపడా ధాన్యం నిల్వలు లేవు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశం సందర్భంగా మిల్లర్లే ఒప్పుకున్నారు. తడిసి న, నిల్వ ఉంచిన ధాన్యం పాడైపోతుందనే కార ణంగా చాలా వరకు విక్రయించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మీడియాకు కూడా చెప్పారు. అయి తే మిల్లర్ల నుంచి ధాన్యాన్ని రికవరీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వేలం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు క్వింటాలుకు బిడ్డింగ్‌లో రూ.1,852 నుంచి 2,260 వరకు ధర పలికింది. సగటున క్వింటాలుకు రూ.1879 కాగా, రూ.125 గన్నీ బ్యాగుల కింద .. మొత్తంగా క్వింటాలుకు రూ. 2,007 చొప్పున లెక్క చూపారు. ఆయా సంస్థలు ఎంతకు ధాన్యం కొనుగోలు టెండర్లు దక్కించుకున్నా య నే విషయాన్ని పక్కనబెట్టి క్వింటాలు ధాన్యం ఇవ్వకపోతే, దాని బదులు రూ. 2,259 చెల్లించాలని అల్టిమేటం ఇస్తున్నట్లు పలువురు మిల్లర్లు తెలిపారు. సన్న ధాన్యం టెండరును క్వింటాలుకు రూ. 2,260కి దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ నిజామాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంది. మిల్లర్లు సన్న ధాన్యం ఇవ్వని పక్షంలో క్వింటాలుకు రూ.2,500కు పైగా వసూలు చేసే ఆలోచనలో ఆ సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో 50 నుంచి 100 మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీకి కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వం నుంచి రిలీజింగ్ ఆర్డర్ పొందినట్లు చెపుతున్నారు. -
సరిహద్దు రాష్ట్రాల పోలీసుల అలర్ట్
భూపాలపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో ఆ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించుకున్నారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. మొదటగా రామగుండం పోలీస్ కమిషనర్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ, మంచిర్యాల డీసీపీ రామగుండం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లారు. సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఓఎస్డీలు, డీఎస్పీలు, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ చట్టం కింద విచక్షణారహితంగా వ్యాపారులను అరెస్టులు చేయడం మంచిది కాదని, నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అను మానాలు ఉన్నాయన్న కారణంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద నిర్బంధం సరికాదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంశంలో వ్యాపారులను అరెస్టు చేయడానికి అనుమతించే ముందు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (సౌత్‌జోన్), తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ పన్నుల సదస్సుకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం రెండు రకాల సంతోషానిచ్చింది. పన్ను అంశంపై అనుభవం ఉన్న న్యాయవాదిగా ఇంత మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్ల మధ్య పాల్గొనడం ఒకటైతే.. హైదరాబాద్‌ను సందర్శించడం మరొకటి. ఇక్కడ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో నగరంతో అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ వస్తే ఇంటికి వచి్చనట్లే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచి్చనప్పుడు వీలున్నంత వరకు నగరాన్ని సందర్శిస్తా’అని చెప్పారు. ఎవరైనా ఆదాయపు పన్ను నివేదిక సమరి్పస్తే.. అది తప్పుడు నివేదిక అని పూర్తిగా నమ్మితే మాత్రమే అసెస్మెంట్ను తిరిగి ప్రారంభించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని ఆయన వివరించారు. ‘ఆయుధాన్ని’దుర్వినియోగం చేయొద్దు.. ‘సీజీఎస్టీలోని సెక్షన్ 69, సెక్షన్ 83.. రాష్ట్ర జీఎస్టీలోని ఇవే నిబంధనలు అధికారులకు కఠిన అధికారాలను అందించాయి. ఈ రెండు నిబంధనలు రెవెన్యూ చేతిలో బలమైన ఆయుధాలు. వీటిని జాగ్రత్తగా, తక్కువగా ఉపయోగించాలి. ఆయుధాన్ని అతిగా ప్రయోగించినా.. దురి్వనియోగపరచినా.. దాని శక్తిని కోల్పోతుందని మనకు తెలుసు. ఇదే జరిగితే అధికారులపై నమ్మకం పోతుంది. ఒక నిబంధన ఎంత కఠినంగా ఉంటే న్యాయపరమైన పరిశీలన కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి’అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. ‘పన్ను వసూలు అనేది సమాజానికి నాడు, నేడు కీలకమైన అంశాల్లో ఒకటి. ఇది ఏ దేశంలో అయినా ప్రభుత్వాన్ని నడపడానికి ఎంతో అవసరం. శతాబ్దాల నుంచి పన్ను విధింపు చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఒక తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని ఎలా సేకరిస్తుందో పన్ను వసూలు కూడా అంతే సున్నితంగా జరగాలని కౌటిల్యుడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆధునిక భారత్‌లో కొత్త పన్ను విధానాలతో దేశం పురోగతిలో పయనిస్తోంది’అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి, జస్టిస్ అనిల్‌కుమార్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయ్‌దేవ్, టీటీపీఏ అధ్యక్షుడు కె.నర్సింగ్‌రావు, ఏఐఎఫ్‌టీపీ (సౌత్‌జోన్) చైర్మన్ రామరాజు శ్రీనివాస్‌రావు, సు«దీర్ వీఎస్, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
‘కరువు’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. కాలువల ద్వారా సాగునీటి సరఫరా అందడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. దీనితో చాలాచోట్ల సాగునీటికి కొరత ఏర్పడింది. దీనితో ముఖ్యంగా వరి పంట దెబ్బతింటోంది. పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతుంటే రైతులు ఆందోళన పడుతున్నారు. ఎలాగోలా పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాల్లో పోస్తున్నారు. ఇలా చేయలేనివారు కన్నీటితో పంటలను అలాగే వదిలేస్తున్నారు. పశువుల మేతకు వినియోగిస్తున్నారు. కొందరు రైతులు ఎండిన పంటలకు ఆవేదనతో నిప్పు పెడుతున్నారు. మూడో వంతు పంటలకు దెబ్బ వర్షాభావంతో కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండలేదు. దీనితో యాసంగి సీజన్లో ప్రాజెక్టుల నుంచి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దీనికితోడు భూగర్భజలాలు పడిపోవడం మరింత కష్టం తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మిగతా పంటలనూ కలుపుకొంటే యాసంగిలో సాగుచేసిన పంటల్లో దాదాపు 30 శాతం మేర ఎండిపోయాయని పేర్కొంటున్నారు. దీనితో గ్రామాల్లో రైతులతోపాటు కూలీలకు కూడా పనులు లేకుండా పోయాయి. ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఇది కరువు పరిస్థితేనని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా భావించడం లేదని పేర్కొంటున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు.. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు సగటున 7.34 మీటర్ల లోతులో ఉండగా.. ఈసారి ఫిబ్రవరి నాటికి 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. కామారెడ్డి జిల్లాలో 10.64 మీటర్ల లోతు నుంచి.. ఈసారి 12.92 మీటర్ల లోతుకు తగ్గిపోయాయి. ఖమ్మం జిల్లాలో 5.11 మీటర్ల నుంచి 6.22 మీటర్ల లోతుకు.. మేడ్చల్ జిల్లాలో 8.97 మీటర్ల నుంచి 11.45 మీటర్ల లోతుకు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 6.57 మీటర్ల నుంచి 9.52 మీటర్ల లోతుకు పడిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 6.93 మీటర్ల నుంచి ఏకంగా 10.19 మీటర్ల లోతుకు.. నల్లగొండ జిల్లాలో 6.15 మీటర్ల నుంచి 10.86 మీటర్ల లోతుకు.. వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. తగ్గిన పంటల సాగు విస్తీర్ణం సాగు నీటి వసతులు తగ్గడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగిలో 72.58 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి 66.30 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. సుమారు 6.28 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయశాఖ తేలి్చ, ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైతే.. ఈసారి 50.69 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 5.75 లక్షల ఎకరాల సాగు తగ్గింది. పప్పుధాన్యాల సాగు గత యాసంగిలో 4.33 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పుడు 3.18 లక్షల ఎకరాలకు తగ్గింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, మరోవైపు వేసిన పంటలు ఎండిపోతుండటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యవసాయశాఖ స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం తమకు భరోసా కల్పించే ప్రయత్నాలైనా చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. పంట నష్టంపై సర్వే చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని.. సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే.. పరిహారమో, సాయమో అందే పరిస్థితి ఉండేదని వాపోతున్నారు. మూడు జిల్లాల్లో ‘సాగు’ గోస! ► ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి కింద ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, ఇతర పంటలు సాగు చేశారు. మొత్తం 7,25,345 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 4,71,047 ఎకరాల్లో సాగైనట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ సాగునీరు అందక, బోర్లు వట్టిపోవడంతో ఇప్పటివరకు సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న పంటలు ఎండిపోయినట్టు ప్రాథమిక అంచనా. ► ఖమ్మం జిల్లాలో గత నాలుగేళ్లుగా యాసంగిలో మూడు లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవుతున్నాయి. నాగార్జునసాగర్ జలాలు అందుబాటులో ఉండటంతోపాటు బోర్లు, బావులు, చెరువుల కింద సాగు కొనసాగింది. కానీ ఈసారి కృష్ణా పరీవాహకంలో వర్షాభావంతో సాగర్ నిండలేదు. పంటల సాగుకు జలాలు విడుదల కాలేదు. దీనితో వరి, ఇతర పంటల సాగు తగ్గింది. చాలా మంది చెరువులు, బోర్లపై ఆధారపడి పంటలు వేశారు. దీంతో ఈ ఏడాది సాగు 1,47,389 ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వరి 80,025 ఎకరాల్లో, మొక్కజొన్న 57,342 ఎకరాల్లో వేశారు. సాగైన చోట కూడా పంటలు ఎండిపోతున్నాయి. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కాల్వల కింద ఏడాది నుంచి సాగునీరు అందలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో వందల సంఖ్యలో బోర్లలో నీరు రావడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు అంచనా. పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా యాతనా పడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. కొన్ని గ్రామాల్లో చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. పంట పశువుల మేతకు వదలాల్సి వచ్చింది నాకు ఊరు చెరువు వెనకాల రెండెకరాల పొలం ఉంది. యాసంగిలో వరిసాగు చేసేందుకు చెరువు నుంచి నీరు వదలడం లేదు. దీనితో జనవరిలో పొలంలో బోరు వేయించాను. నీరు బాగానే పడటంతో నా రెండెకరాలకు తోడు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. కానీ నెలన్నర రోజుల్లో బోరు ఎండిపోయింది. పంటను దక్కించుకునేందుకు 400 అడుగుల లోతుతో మరో బోరు వేయించా. అందులోనూ నీరు అడుగంటింది. దీనితో మరో రెండు బోర్లు వేయించినా ఫలితం లేకపోయింది. పొలం ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలిపెట్టా. నాలుగు బోర్లు, పంట పెట్టుబడికి ఏడు లక్షలదాకా అప్పులు అయ్యాయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చిన్నయ్య, రైతు, గాధిర్యాల్ గ్రామం, మహమ్మదాబాద్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి నందిగామ బ్రాంచి కెనాల్ కింద రెండెకరాల వరి వేశా. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. మునుపెన్నడూ లేనంతగా నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – మల్లెబోయిన సైదులు, రైతు, భైరవనిపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా నాలుగెకరాల పంటంతా ఎండి పోయింది నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. ఉన్న ఒక్క బోరులో నీళ్లు అడుగంటాయి. నీళ్లు సరిపోక పంటంతా ఎండిపోయింది. ఎస్సారెస్పీ నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేక పంటను వదలివేసిన. – ధరావతు సోమాని, రైతు, పాశ్చ్యానాయక్ తండ, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా రెండు బోర్లూ అడుగంటాయి రెండున్నర ఎకరాల భూమిలో వరి వేశాను. ఉన్న రెండు బోర్లలో నీళ్లు అడుగంటాయి. 15 రోజులైతే పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో పొలం ఎండిపోయింది. పంటకు పెట్టిన రూ.50 వేలు పెట్టుబడి నష్టపోయాను. – దొంతినేని జగన్రావు, వెంకటాద్రిపాలెం, తిప్పర్తి మండలం, నల్లగొండ జిల్లా -
ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. రేపు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పర్చునున్నారు. ప్రణీత్ రావును, భుజంగరావును శనివారం పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ పోలీసులు.. భుజంగరావు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. రేపు( ఆదివారం) మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎస్ఐబీలో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్‌ను పిలిచి విచారించారు. మరోవైపు ఎస్ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
BRS Party: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తమ అభర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను ఎంపీ అభ్యర్థిని ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ శనివారం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. కాగా ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చదవండి: Liquor Case: ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. నాగర్‌కర్నూల్ - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. మెదక్ - వెంకట్రామిరెడ్డి. మహబూబ్‌నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్- వినోద్ కుమార్. పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్. జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్ ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు. చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. మహబూబాబాద్- మాలోత్ కవిత. మల్కాజ్గిరి - రాగిడి లక్ష్మారెడ్డి ఆదిలాబాద్ - ఆత్రం సక్కు. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్. వరంగల్ - కడియం కావ్య -
Phone Tapping Case: నిఘా ముసుగులో చట్ట వ్యతిరేక పనులు
సాక్షి, హైదరాబాద్: ప్రణీత్‌రావు విచారణతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాలకు కర్త, కర్మ, క్రియ.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావే అని దాదాపుగా నిర్ధారణ అయ్యింది. నిఘా ముసుగులో ప్రభాకర్&టీం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లు తేలింది. ఇష్టానుసారం ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్‌లు చేయడమే కాకుండా.. పెద్ద ఎత్తున్న బ్లాక్ మెయిలింగ్ దందా నడిపి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత అధికార పార్టీతో అంటకాగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు.. 2018 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేపిస్తూ వచ్చారు. నల్లగొండ ఎస్పీగా ఉన్న టైంలో తనకు నమ్మకంగా ఉన్న కొందరు అధికారులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నారాయన. ప్రధానంగా స్పై పోలీసుల ముఠాలో.. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను కీలక సభ్యులుగా చేర్చారు. మరికొందరు పోలీసుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ఇక.. ట్యాపింగ్, ఇతర నిఘా పరికరాలపై అధ్యయనం కోసం ఇజ్రాయెల్, రష్యాలో సైతం పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ టీంకు రవి పాల్ సాంకేతిక సహకారం అందించారు. రవిపాల్ సూచన మేరకే సూట్‌కేసులో పట్టే పరికరంతో ఆనాటి ప్రతిపక్ష నేత ఇళ్ల వద్ద ఎస్ఐబీ టీం మాటు వేసేది. ట్యాపింగ్ ఎంత పక్కాగా జరిగేదంటే.. కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు నిబంధనల కన్నా తక్కువ సమయంతో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిందా బృందం. మరోవైపు నాటి విపక్ష నేతలే కాకుండా.. వ్యాపారస్తులను సైతం ప్రభాకర్ బృందం టార్గెట్ చేసింది. సుమారు 30 మందికిపైగా వ్యాపారుల ఫోన్లపై నిఘా వేసి.. అక్రమంగా ఫోన్ల ట్యాప్ చేసి బ్లాక్‌మెయిల్‌కి సైతం చేసినట్లు తెలుస్తోంది. అలా.. రూ. 500-600 కోట్ల దాకా వసూలు చేసినట్లు వెల్లడైంది. అందుకే ఆయా మాజీ అధికారుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సైతం సేకరించే దిశగా తాజా సోదాలు జరిగినట్లు సమాచారం. సంబంధిత వార్త: ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ప్రణీత్‌పై వేటుతో అప్రమత్తమై.. ప్రభాకర్‌రావు తెలంగాణ ఏర్పడ్డాక సీసీఎస్ డీసీపీగా పని చేశారు. 2020లో ఇంటెలిజెన్స్ ఐజీగా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఓఎస్డీలో బాధ్యతలు అప్పగించింది. గతేడాది ప్రభుత్వం మారాక ఓడీఎస్ పోస్టుకు ప్రభాకర్ రాజీనామా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావుపై వేటు పడింది. ప్రణీత్‌రావు ప్రభాకర్‌రావుకు బంధువు కూడా. వెంటనే ప్రభాకర్‌రావు అప్రమత్తం అయ్యారు. కుటుంబంతో విహరయాత్ర పేరుతో హైదరాబాద్ దాటారు. అటు నుంచి అటే ఆయన అమెరికా పరారైనట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా.. ప్రభాకర్‌రావు విషయంలోనూ దర్యాప్తు సంస్థ ఓ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. -
ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకకాలంలో పది చోట్లా.. అదీ మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రణీత్‌రావు వెల్లడించిన సమాచారం మేరకే ఈ సోదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురు అనుమానితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇంటితో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ అధికారి ఇంటి నుంచి 2 లాప్ టాప్ లు, 4 ట్యాబ్ లు, 5 పెన్ డ్రైవ్‌లు, ఒక హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ అధికారులతో పాటు మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సహకరించిన వారి అందరి పేర్లు ప్రణీత్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రణీత్‌రావు ఇచ్చిన స్టేట్మెంట్ను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీం. -
Liquor Case: ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు
Updates.. కవిత మేనల్లుడు మేకా శరన్ నివాసంలోనూ కొనసాగుతున్న సోదాలు కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు మేకా శరన్ ద్వార లావాదేవీలు జరిపినట్టు అనుమానం ఇద్దరికి ఉన్న కంపెనీల ద్వారా నగదు బదిలీ అయనట్టు ఈడీ అనుమానాలు అందుబాటులో లేని మేకా శరన్ మేకా శరన్ నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు ఈడీ అధికారులకు ఫోన్లో అందుబాటులో లేని మేకా శరన్ ముడుపుల చెల్లింపులో మేకా శరణ్ కీలక పాత్ర గా భావిస్తున్న ఈడీ లిక్కర్ స్కాంలో తెరపైకి కొత్త పేరు.. లిక్కర్ స్కాం కేసులో తెరపైకి మేకా శరణ్ పేరు. మేకా శరణ్ కవితకు అత్యంత దగ్గరి బంధువు. కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో శరణ్ ఫోన్ లభ్యం. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్‌దే కీలక పాత్ర. కవిత కేసులో ఈడీ ఆఫిడవిట్ దాఖలు. రెండు సార్లు పిలిచినా మేక శరణ్ విచారణకు హాజరుకాలేదని కోర్టుకు తెలిపిన ఈడీ. మేకా శరణ్ ఇంట్లో సోదాలు జరుపుతున్న ఈడీ. కవిత అరెస్ట్ సమయంలో ఇంట్లోనే ఉన్న శరణ్ లిక్కర్ స్కాంలో మేకా శరణ్‌పై ఈడీ ఫోకస్ జై తెలంగాణ నినాదం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న కవిత కస్టడీ పొడిగింపు తర్వాత ఈడీ ఆఫీస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరలింపు మూడు రోజులు కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు తరలించే టైంలో కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేసిన కవిత తన అరెస్ట్ రాజకీయ కుట్రగా అభివర్ణించిన కవిత ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల అరెస్టు కక్ష సాధింపే: కవిత కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి: కవిత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: కవిత ►కోర్టులో వాడీవేడి వాదనల అనంతరం.. కవితకు మరో మూడు రోజుల కస్టడీని పొడిగించింది. కవితకు మూడు రోజుల కస్టడీ పొడిగించిన కోర్టు ఈనెల 26 వరకు కస్టడీ పొడిగించిన కోర్టు. ఈనెల 26వ తేదీన ఉదయం 11:30 గంటలకు కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశం. ►కవితను మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఈడీ.. ►కోర్టులో ముగిసిన ఇరు వర్గాల వాదనలు.. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ.. తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన కవిత బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ ప్రస్తుతం బెయిల్‌కు విచారణ అర్హత లేదన్న ఈడీ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరిన కవిత తరపు న్యాయవాది కవిత కామెంట్స్.. కోర్టుకు తీసుకెళ్తుండగా మీడియాతో కవిత కామెంట్స్.. నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఈడీ అధికారులు అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు అక్రమ కేసులపై కోర్టులో పోరాటం చేస్తాను. ఈడీ వాదనలు.. ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదు మరో ఐదు రోజుల కస్టడీ కావాలి నలుగురు స్టేట్మెంట్స్ గురించి కవితని అడిగాం కిక్ బ్యాగ్స్ గురించి అడిగాం ఫోన్ల డేటా డిలీట్ చేశారు కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగాం కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు రేఖా శరణ్‌కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదు సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీనే కవితతో కలిపి సమీర్‌ను విచారించాలి. లిక్కర్ స్కాంలో రూ. వందల కోట్లు చేతులు మారాయి. ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయి. కవితకు వైద్య సూచనల మేరకు మందులు, డైట్ ఇస్తున్నాము. కవిత తరపు న్యాయవాది వాదనలు.. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారు? కవిత పిల్లలు మైనర్స్.. వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వండి. కస్టడీ పూర్తైన రోజే కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపండి. కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశాం. బెయిల్ పిటిషన్స్‌పై ఈడీకి ఆదేశాలు ఇవ్వండి. ► తనను బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టు కవిత పిటిషన్ దాఖలు. ►రౌస్ ఎవెన్యూ కోర్టుకు చేరుకున్న కవిత. కాసేపట్లో కోర్టుకు కవిత.. కాసేపట్లో కవితను కోర్టులో హాజరుపరుచనున్న ఈడీ అధికారులు. కాగా, కవిత హైబీపీతో బాధపడుతున్నారన్న ఆమె తరఫున నాయ్యవాది కవిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్టు ఇవ్వాలని కోర్టు ద్వారా కోరిన ఆమె న్యాయవాది. కస్టడీలో భాగంగా ప్రతీరోజు హెల్త్ రిపోర్టు కవితకు ఇవ్వాలని ఆదేశించిన కోర్టు. రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరచనున్న ఈడీ అధికారులు మరోవైపు కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్న ఈడీ వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవిత కవితను చూసేందుకు కోర్టుకు వచ్చిన ఆమె భర్త, తనయుడు.. బీఆర్ఎస్ ఎంపీలు వద్ధిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ, పలువురు జాగృతి, బీఆర్ఎస్ శ్రేణులు కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు.. ►ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారుల సోదాలు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచే సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు. మాదాపూర్‌లో అనిల్ సోదరి అఖిల నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు. కవిత కాల్ డేటా ఆధారంగా సోదాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. ►ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చనున్నారు. ►ఇక, కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ వివరించనుంది. కవితకు మరికొన్ని రోజులపాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశముంది. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం కూడా ఉంది. కాగా గత ఆరు రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. ►మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. కేజ్రీవాల్‌ను ఆరు రోజులు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరిన ఈడీ. ఈ క్రమంలో కేజ్రీవాల్, కవితను కలిపి విచారించేందుకు రెడీ అవుతున్న ఈడీ. ఈ వారం రోజుల్లో లిక్కర్ స్కాంలో కవితను విచారించిన ఈడీ. ►ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత పాత్ర, రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్‌తో ఒప్పందాలపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ►ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం(మార్చి 15) ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. కేజ్రీవాల్, కవిత అరెస్ట్‌పై కేసీఆర్ స్పందన.. ►కేజ్రీవాల్ అరెస్ట్‌ను కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజుగా పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ►ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోంది. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. -
బ్యారేజీల వైఫల్యం తర్వాత చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు ఏర్పడిన తర్వాత డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకున్న చర్యలేంటి? ఏమైనా కమిటీలు వేసి, విచారణ జరిపారా? వైఫల్యానికి కారణాలను నిర్ధారించారా?.. అని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం నిపుణుల కమిటీ ఎస్డీఎస్ఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) అధికారులతో సమావేశమై బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీసింది. 2024 ముగిసే వరకు బ్యారేజీల నిర్వహణ నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో వార్షిక మరమ్మతులపై ఎలాంటి నివేదికలు తమకు అందలేదని, బ్యారేజీల్లో లోపాలు ఉన్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందీ నివేదించలేదని అధికారులు బదులిచ్చినట్టు తెలిసింది. బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అనుసరించి పనులు చేశారా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అని కమిటీ అడగ్గా, డిజైన్ల ప్రకారమే నిర్మించినట్టు అధికారులు బదులిచ్చారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి వరదలకే మూడు బ్యారేజీల కింద సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్ దెబ్బతిన్నా నాణ్యత సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిటీ ప్రశ్నించింది. ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. కాగా, రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీని అయ్యర్ కమిటీ సందర్శించి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నమూనా బ్యారేజీల పనితీరును పరిశీలించింది. అత్యవసర రక్షణ చర్యలు సూచించండి వర్షాకాలం ప్రారంభానికి ముందే బ్యారేజీల రక్షణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాలని అయ్యర్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్ కుమార్ కమిటీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మంగళవారంలోగా తాము అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తే అత్యవసర పనులను సిఫారసు చేస్తామని అయ్యర్ వారికి హామీ ఇచ్చారు. బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన అత్యవసర పనులను ఈఎన్సీ అనిల్‌కుమార్ కమిటీకి ప్రతిపాదించి అభిప్రాయాన్ని కోరగా, పరిశీలించి చెప్తామని కమిటీ బదులిచ్చింది. ఆ పనులు ఇలా ఉన్నాయి.. ► ఒరిజినల్ డిజైన్లకు అనుగు ణంగా బ్యారేజీలను పున రుద్ధరించేలా.. సంబంధిత ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్) కోడ్స్ ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ పనులను నిర్మాణ సంస్థలు చేపట్టాలి. ► బ్యారేజీల పునాదుల (ర్యాఫ్ట్) కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన ఖాళీలను ప్రెజర్ గ్రౌటింగ్ ద్వారా భర్తీ చేసేందుకు తగిన పద్ధతులను అవలంబించాలి. ► బ్యారేజీలు పూర్తిగా నిండి ఉన్నప్పుడు గేట్లను తక్కువగా ఎత్తి స్వల్ప పరిమాణంలో నీళ్లను విడుదల చేసినప్పుడు తీవ్ర ఉధృతితో వరద బయటకు పొంగివస్తుంది. దీంతో బ్యారేజీల దిగువన భారీ రంధ్రాలు పడుతున్నాయి. ఇలా జరగకుండా స్వల్ప మోతాదుల్లో నీళ్లను విడుదల చేసేందుకు బ్యారేజీల్లో అనువైన చోట కొత్తగా రెగ్యులేటర్లను నిర్మించాలి. ► 3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ప్రవాహాలకు అడ్డంగా ఉండే రాళ్లను తొలగించాలి. ► బ్యారేజీలకి ఎగువ, దిగువ న పేరుకుపోయిన ఇసుకను నీటిపారుదల శాఖ పర్యవేక్షణ లో శాస్త్రీయంగా తొలగించాలి. ► వానాకాలంలో గేట్లన్నీ తెరిచే ఉంచాలి. ► మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లో జామ్ అయిన గేట్లను తొలగించాలి. ఈ బ్లాక్‌కు స్టీల్ షీట్ పైల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయాలి. సమాచారం అందిన తర్వాతే స్పష్టత: చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం బ్యారేజీలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని, అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే బ్యారేజీల వైఫల్యాల పై ఒక అంచనాకు రాగలమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశా రు. పర్యటన ముగి సిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మరికొంత సమాచారాన్ని కోరామని, అందిన తర్వాతే స్పష్టత వస్తుందన్నారు. -
జీహెచ్ఎంసీ మేయర్‌కు కాంగ్రెస్ ఆహ్వానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ‘రెండుసార్లు కార్పొరేటర్‌గా బంజారాహిల్స్ డివిజన్ ప్రజలు గెలిపించారు. దీపాదాస్ మున్షీ మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మా డివిజన్ ప్రజలు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో చర్చించిన తర్వాతనే నా నిర్ణయం ప్రకటిస్తాను’ అని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డిలు బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కేశవరావు ఇంటికి వెళ్లారు. అక్కడే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేశవరావులతో గంటపాటు చర్చించారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా, పార్టీని బలోపేతం చేయా ల్సిందిగా దీపాదాస్ వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్టు సమాచారం. -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులుగా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు హైకోర్టు శుక్రవారం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. వారంతా వచ్చే నెలలోగా స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేనెల (ఏప్రిల్ 16, 18, 19 తేదీలకు) వాయిదా వేసింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (బీఆర్ఎస్), జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్), ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి (బీఆర్ఎస్), మహబూబ్‌నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), దేవరకద్ర నుంచి జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థులు కొందరు వీరి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, సరైన సమాచారం ఇవ్వలేదని వాటిలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల ఎన్నికను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నందా తదితరులతో కూడిన వేర్వేరు ధర్మాసనాలు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశాయి. ఎవరెవరిపై పిటిషన్లు..? మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ వేశారు; జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్‌యాదవ్..; కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ అగర్వాల్..; ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత కోవ లక్ష్మి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్..; ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి..; దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జి.మధుసూదన్‌రెడ్డి ఎన్నిక రద్దు కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. -
సాగు చేస్తేనే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. సీజన్‌కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం. ఈ క్రమంలో సీజన్‌కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే. ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. పరిమితం చేసేందుకే మొగ్గు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్‌కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. పక్కాగా సాగు లెక్కలు తీసి.. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
నల్గొండలో యురేనియం ఉందా? ఎందుకింత సెర్చ్?
నాగార్జునసాగర్ : నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మళ్లీ మొదలైంది. కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తలు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథిగృహంలో బస చేస్తూ.. నాగార్జునసాగర్ రైట్‌బ్యాంక్ సమీపంలో ఆంధ్రా వైపున ప్లైటెక్ ఎరోడ్రమ్‌లో రెండు చాపర్లను పెట్టుకుని ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెబుతూ వస్తున్నారు. ఇటీవల కృష్ణా తీరాన తెలంగాణలోగల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో చాపర్ల ద్వారా సర్వే నిర్వహించారు. పది రోజులుగా యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో అన్వేషణ కొనసాగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. కృష్ణాతీరంలో యురేనియం నిక్షేపాలు గతంలోనే ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు వేల ఎకరాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. పెద్దవూర మండలంలోని పులిచర్ల సమీపంలోగల కేకేతండా వద్ద క్యాంపు ఏర్పాటు చేసుకుని పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టుపై డ్రిల్లింగ్ చేసి శాంపిల్స్ తీసి శాస్త్రవేత్తలకు పంపేవారు. ఆ విధంగా సంవత్సరాల తరబడి సర్వేలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గుట్టలు, పెద్దమూల గ్రామంలో వెయ్యి హెక్టార్లలో, పెద్దఅడిశర్లపల్లి మండలంలో 1104.64 ఎకరాల అటవీ భూమిలో, 196.71 ఎకరాల పట్టా భూముల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు యూసీఐఎల్ అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఇదే ప్రాంతంలోని మల్లాపురంలో రాతినుంచి యురేనియం వేరు చేసే కార్మాగారాన్ని నెలకొల్పేందుకు భూసేకరణ మొదలుపెట్టారు. ఇక్కడ ప్రభుత్వ భూమి లేకపోవడంతో ఈ కర్మాగారాన్ని దేవరకొండ మండలం శేరిపల్లి వద్ద పెట్టేందుకు 200 ఎకరాల భూమిని సేకరించారు. 2003 సంవత్సరంలలో పెద్దఅడిశర్లపల్లిలో ఆనాటి నల్లగొండ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. ఆ తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో సద్దుమణిగింది. ప్రజల్లో భయం యురేనియం వెలికితీతతో రేడియేషన్ బయటకు వచ్చి ప్రాణాలకే ప్రమాదం జరుగుతందని ప్రజల్లో భయం ఉంది. ఈ గుట్టల నుంచి వర్షపు నీరంతా నాగార్జునసాగర్ జలాశయంలో కలుస్తుంది. ఇక్కడ యురేనియం తీస్తే తాగు, సాగునీరు కలుషితమై ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. దీంతో యురేనియం వెలికితీతను వ్యతిరేకిస్తూ గతంలోనే పెద్ద ఉద్యమాలు చేపట్టారు. -
టీఎస్ ఐసెట్, ఈఏపీసెట్ షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలు ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. టీఎస్ ఈఏపీ సెట్‌తో పాటు ఐసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీసెట్ మే 7 నుంచి 11వరకు రీ షెడ్యూల్ చేసింది. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు.. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 4, 5న జరగాల్సిన ఐసెట్ జూన్ 5, 6 తేదీలకు మార్పు చేశారు. -
బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం.. మెదక్ లోక్‌సభ బరిలో ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. తాజాగా రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో రానున్న లోక్‌సభ ఎన్నికలకుగాను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవిత అరెస్టు కక్ష సాధింపే.. బీఆర్ఎస్ ఎంపీలు -
హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గూటికి వెళ్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. కాగా, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులపై దృషి సారించింది. దీంతో, తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతాను. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వేగవంతం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, అసంతృప్త నేతలను టార్గెట్ చేసి హస్తం గూటికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ గూటికి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్‌ను వీడిన నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. -
కవిత అరెస్టు కక్ష సాధింపే: బీఆర్ఎస్ ఎంపీలు
సాక్షి,ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, సురేష్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల ముందు కవిత అరెస్టు జరిగిందన్నారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తమను సరెండర్ చేసుకునేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టాలనే అనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఎంపీ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు ఉద్యమ సమయంలో కూడా ఇవే ప్రయత్నాలు చేశారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని తెలంగాణ సాధించామని, ఇప్పుడు కూడా కేసుల నుంచి క్లీన్‌గా బయటపడతామని చెప్పారు. ఎంపీ వద్దీరాజు రవిచంద్ర మాట్లాడుతూ కవిత బాధితురాలే తప్ప, నిందితురాలు కాదన్నారు. ఆమె కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవితను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ చర్యలను ప్రజలు ఎన్నికల్లో తిప్పి కొట్టడం ఖాయమన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను దొంగల్లా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు -
అజ్ఞాతంలోకి ప్రభాకర్‌రావు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రణీత్ రావు కేసును అక్కడి నుంచే నిశితంగా గమనిస్తున్న ప్రభాకర్‌రావు.. అతని పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క సిట్ అధికారులు ప్రణీత్ రావును ఐదో రోజైన గురువారమూ బంజారాహిల్స్ ఠాణాలో ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరో నలుగురు పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వీళ్లు గతంలో ‘ప్రభాకర్‌రావు సైన్యం’లో కీలక సభ్యులని సమాచారం. హోదా ఏదైనా బాధ్యత మాత్రం చీఫే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావును ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబీకి డీఐ జీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించింది. హోదా ఏదైనా ఎస్ఐబీ చీఫ్‌గానే కొనసాగారు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్‌రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల నేపథ్యంలోనే అడ్డదారి ఎస్ఐబీలో 2017 వరకు లీగల్ ఇంటర్సెప్షన్ (ఎల్ఐ)గా పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్‌రావు, అప్పటి కొందరు కీలక రాజకీయ నాయకులు.. అక్రమ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టారు. అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేర్వేరు నంబర్లతో సంప్రదింపులు జరుపుతుండటంతో ప్రభాకర్‌రావు బృందం రష్యా, ఇజ్రాయెల్‌లో పర్యటించి వచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక ట్యా పింగ్, ఇతర నిఘా పరికరాలను పరిశీలించి వచ్చింది. ఏవేవి ఖరీదు చేయాలో చెప్పాల్సిందిగా పేర్కొంటూ కొందరు పెద్దలకు నివేదిక సమర్పించింది. కొనుగోలులో కీలక పాత్ర పోషించిన రవి పాల్ టెక్నికల్ అనుభవం ఉన్న రవి పాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్, అడ్వైజర్‌గా పని చేశారు. ప్రభాకర్‌రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. రవి పాల్ సూచనల మేరకు ప్రభాకర్‌రావు ఇజ్రాయెల్ నుంచి సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే అక్రమ ట్యాపింగ్ పరికరం ఖరీదు చేశారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకుని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయం సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి 300 మీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. ‘ఆదిలాబాద్’కోసం వినియోగించారు 2018లో ఆదిలాబాద్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతారణం నెలకొన్న సమయంలోనూ ఎస్ఐబీ అధికారులు ఈ బ్రీఫ్‌కేస్ ఉపకరణాన్ని వినియోగించారు. రెండు వర్గాలకు చెందిన కీలక నేతలు ఇద్దరిని పట్టుకోగలిగారు. ఈ వ్యవహారాల్లో ప్రణీత్ రావుకు కుడిభుజంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులను సిట్ గుర్తించింది. వీరిలో ఇద్దరి నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేయగా.. మరో నలుగురికి విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. -
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల అధికారులతో గురువారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలా పనిచేశారో.. అదే స్ఫూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలసి సమన్వయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో కూడా వివిధ శాఖలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయన్నారు. ఇప్పటివరకు పోలీసు శాఖ రూ.10 కోట్ల నగదు, పలు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులను నిల్వ చేసేందుకు అవకాశమున్న 25 గోదాములను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. మరో 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ కేంద్రాలపై కూడా నిఘా ఉంచామన్నారు. మద్యం అక్రమ రావాణాకు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి మద్యం నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ డోబ్రియల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె. జైన్ పాల్గొన్నారు. -
వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా
ఖలీల్‌వాడి/నిజామాబాద్ /కామారెడ్డి నెట్వర్క్: వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు బీమా అమలు చేస్తామని, ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురు వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాల వరకు నష్టం జరిగిందన్నారు. అధికారులు సర్వే పూర్తి చేసిన తర్వాత ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు ఆధికారంలో ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు జీరో వడ్డీ, దళితులకు మూడెకరాల పంపిణీ వంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే బీఆర్ఎస్ సర్కార్ రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. వీటికి రూ.60 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు. దీనికోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహా అయితే ఒక సీటు రావొచ్చునని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అ«ధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులు అధైర్యపడవద్దు : వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్, పెద్దవాల్గోట్ గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం లింగుపల్లి, భిక్కనూరు మండలం అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి, బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
కరెంట్ కొంటారా .. లేదా ?
సాక్షి, హైదరాబాద్: రామగుండంలోని రెండో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నేషనల్ థర్మల్ పవర్‌కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమ్మతి తెలపకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తామని హెచ్చిరించింది. రెండో విడత విద్యుత్ కేంద్ర నిర్మాణంలో పురోగతిపై సమాచార హక్కుచట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వివరాలు కోరగా, ఎన్టీపీసీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎన్టీపీసీ విధించిన గడువు ముగిసినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధనశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మూడు లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద రామగుండంలో 1600(2గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. తొలి విడత ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్టీపీసీతో ఒప్పందం(పీపీఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగానే బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి తొలి విడత విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించింది. రెండో విడత కింద 2400 (3గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రుణాల సమీకరణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గతేడాది అక్టోబర్ 5న లేఖ రాసింది. స్పందన లేకపోవడంతో మళ్లీ గత జనవరి 9న రెండోసారి లేఖ రాసింది. అయినా స్పందన లేకపోవడంతో జనవరి 29న మూడోసారి రాసిన లేఖలో 12రోజుల్లోగా అనగా, గత ఫిబ్రవరి 10లోగా సమ్మతి తెలపాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మతి తెలపని పక్షంలో తెలంగాణ రెండో విడత ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదని భావించి ఇతరులకు ఆ విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఆసక్తి చూపిస్తే తొలి ఏడాది యూనిట్‌కు రూ.4.12 చొప్పున విద్యుత్ విక్రయిస్తామని తెలిపింది. దేశంలో గణనీయంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టూ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, సత్వరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.11,572 కోట్లు రెండో విడత ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం లభించిందని, టెక్నికల్ స్టడీ పురోగతిలో ఉందని ఎన్టీపీసీ తెలిపింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని వెల్లడించింది. శక్తి పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు కేటాయిస్తూ గత జనవరి 3న స్టాండింగ్ లింకేజీ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 1600 మెగావాట్ల తొలి విడత ప్రాజెక్టు నిర్మాణానికి గత జనవరి 31 వరకు రూ.11,572 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్‌లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్‌లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్‌ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్‌లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్‌పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్‌లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్‌తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్‌లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్‌లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్‌రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
బేగంపేటలో దొంగల బీభత్సం.. ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. బేగంపేటలో ఓ ఇంట్లోకి గురువారం తుపాకీతో అగంతకులు చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఇంట్లో చోరికి యత్నించారు. అయితే దుండగులును ఇంట్లోని తల్లీ కూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అగంతకుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని ఎదురు దాడికి దిగారు. ఊహించని పరిణామంలో దుండగులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. -
జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు వస్తే 11 లక్షల మాత్రమే జీహెచ్ఎంసీ కంప్యూటరైజ్ చేసింది. లేని దరఖాస్తులకు ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించింది. జీహెచ్ఎంసీ పరిధిలోనీ అన్ని జోన్లలో అభయహస్తం దరఖాస్తుల్లో గందరగోళం నెలకొంది. మ్యానువల్ డాక్యుమెంట్స్‌ను కంప్యూటర్ చేసినట్లు లెక్కలు చూపి ప్రైవేట్ ఏజెన్సీలు నిధులు కాజేసినట్లు సమాచారం. ప్రైవేట్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సహకరించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: హైకోర్టులో ప్రణీత్‌రావుకు చుక్కెదురు -
ఫోన్ ట్యాపింగ్ కేసు: హైకోర్టులో ప్రణీత్‌రావుకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, ఆయనకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. కాగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న(బుధవారం) వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై నేడు తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. గురువారం ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్బంగా కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇదిలా ఉండగా.. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. ఈ వాదనలను విన్న హైకోర్టు ఈరోజు ప్రణీత్ రావు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. -
5,348 పోస్టుల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా, ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్ ఉండొచ్చని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగం పరిధిలో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 1,255, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 575, డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలో 11, ఆయుష్ విభాగంలో 26, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 34, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో 212 పోస్టులు భర్తీ చేస్తారు. వివిధ విభాగాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు ► ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 351, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 193, స్టాఫ్‌నర్స్– 31 ► డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలోజూనియర్ ఎనలిస్ట్ – 11 ► ఆయుష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (ఆయుర్వేద)– 6, టెక్నికల్ అసిస్టెంట్ (యునాని) – 8, లెక్చరర్ (ఆయుర్వేద) –1, లెక్చరర్ (హోమియో) –10, మెడికల్ ఆఫీసర్ (యు) లీవ్ రిజర్వుడు–1 ► ఐపీఎంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 4, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 లోకల్ క్యాడర్ –6, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 స్టేట్ క్యాడర్ –1, లేబరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్– 7, వ్యాక్సినేటర్ –1, స్టాఫ్‌నర్స్–1, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) –1, జూనియర్ అనెలిస్ట్ (లోకల్ క్యాడర్)–2, జూనియర్ అనెలిస్ట్ (స్టేట్ క్యాడర్) – 11 ► డీఎంఈ పరిధిలో సీటీ స్కాన్ టెక్నీషియన్–6, డెంటల్ హైజినిస్ట్– 3, ఈసీజీ టెక్నీషియన్ – 4, ఈఈజీ టెక్నీషియన్ – 5, అనెస్థిషియా టెక్నీషియన్ – 93, ఆడియో విజువల్ టెక్నీషియన్ – 32, ఆడియో మెట్రీ టెక్నీషియన్– 18, బయో మెడికల్ ఇంజనీర్–14, బయో మెడికల్ టెక్నీషియన్– 11, డెంటల్ టెక్నీషియన్– 53, రేడియోగ్రఫీ టెక్నీషియన్– 19, ఆప్తోమెట్రిస్ట్– 20, స్టెరిలైజేషన్ టెక్నీషియన్–15, ఫిజియోథెరపిస్ట్–33, అసిస్టెంట్ ప్రొఫెసర్లు– 555, నాన్ మెడికల్ అసిస్టెంట్లు (జి)–17, రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ లెక్చరర్– 5, పర్ఫ్యూజనిస్ట్–3, లైబ్రేరియన్–14, ఫిజికల్ డైరెక్టర్ – 5, క్లినికల్ సైకాలజిస్ట్ – 2, స్పీచ్ పాథాలజిస్ట్– 1, చైల్డ్ సైకాలజిస్ట్– 21, ఇమ్యునోలజిస్ట్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు–80, మెడికో సోషల్ వర్కర్ (గ్రేడ్–2)– 95, స్టాఫ్‌నర్సులు–1,545, స్టాటిస్టిషియన్–20, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) – 125, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 420 ► తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఫిజియోథెరపిస్ట్– 13, ఏఎన్ఎంలు– 85, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు– 617, స్టాఫ్‌నర్సులు– 332, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు – 6, ల్యాబ్ టెక్నీషియన్లు– 136, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2)– 66 ► ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అనెస్థీషియా– 4, బయో కెమిస్ట్రీ –1, డెంటల్ సర్జరీ –1, ఈఎన్టీ– 1, గైనిక్ అంకాలజీ– 2, మెడికల్ ఆంకాలజీ (పీడియాట్రిక్ మెడికల్ ఆంకాలజీతో కలిపి)– 4, మైక్రోబయోలజీ – 1, మాలిక్యులర్ అంకాలజీ –1, న్యూక్లియర్ మెడిసిన్– 2, ఆప్తమాలజీ – 1, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్– 2, పాథాలజీ– 2, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ – 2, రేడియోలాజికల్ ఫిజిక్స్ – 4, రేడియాలజీ – 2, రేడియో థెరపీ – 4, సర్జికల్ అంకాలజీ – 6, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్–1. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్) – 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనెస్థీషియా)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సైటో పాథాలజీ)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పాథాలజీ) –2, లెక్చరర్ (న్యూక్లియర్ అంకాలజీ) – 1, లెక్చరర్ (న్యూక్లియర్ మెడిసిన్/న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)– 3, బయోమెడికల్ ఇంజనీర్ – 2, స్టాఫ్‌నర్స్–80, ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్–2 – 8, మౌల్డ్ టెక్నీషియన్ – 1, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ – 2, రేడియోథెరపీ టెక్నీషియన్ – 10, టెక్నీషియన్లు–5, టెక్నీషియన్లు (మెడికల్ ఇమేజింగ్)– 5, థియేటర్ అటెండెంట్లు–5, డెంటల్ టెక్నీషియన్ –1, ఈసీజీ టెక్నీషియన్– 2, ల్యాబ్ టెక్నీషియన్– 8, మెడికల్ ఫిజిసిస్ట్– 5, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్– 3, రేడియోగ్రాఫర్ సీటీ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ టెక్నీషియన్–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ ఆర్టీ టెక్నీషియన్– 5, రేడియోగ్రాఫర్–6, సోషల్ వర్కర్–6. -
అన్నారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీకి డిజైన్ లోపాలతో తీవ్ర ముప్పు పొంచి ఉందని నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్–విజేత–పీఈఎస్ జాయింట్ వెంచర్ తెలిపింది. ఎలాంటి డ్యామేజీలకైనా తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. బ్యారేజీలో లోపాలు తెలుసుకోవడానికి పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఫిబ్రవరి 7న నిర్వహించిన మోడల్ స్టడీలో డిజైన్‌లో లోపాలున్నట్టుగా తేలిందని పేర్కొంది. వచ్చే వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే బ్యారేజీకి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఫిబ్రవరి 10న నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు బ్యారేజీలు, డ్యామ్‌ల గేట్లు ఎత్తినప్పుడు వరద భీకర వేగంతో కిందికి దూకినట్టుగా ప్రవహిస్తుంది. ఆ వరద నేరుగా దిగువన (అప్రాన్ ఏరియా) ఉన్న కాంక్రీట్ బ్లాకులపై పడడంతో అవి కొట్టుకుపోయి భారీగా లోతైన గుంతలు పడే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికే బ్యారేజీ దిగువ ప్రాంతంలో తగిన స్థాయిలో నీళ్లు నిల్వ (టెయిల్ వాటర్ లెవల్) చేస్తారు. పైనుంచి పడే వరద ఆ నీటిలో పడటం వల్ల ఉధృతి తగ్గి కాంక్రీట్ బ్లాకులకు నష్టం జరగదు. అయితే అన్నారం బ్యారేజీకి దిగువన తగిన రీతిలో నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు. దీంతో గతంలో వచ్చిన వరదలతో దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి ఆ ప్రాంతంలో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. నిరంతర వరదలతో బ్యారేజీ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా ఉండే సెకెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. వీటివల్ల సెకెంట్ పైల్స్ దెబ్బతిని వాటికి, ర్యాఫ్ట్‌కు మధ్య అగాధం ఏర్పడి ఉండడానికి అవకాశం ఉంది. దీని వల్లనే బ్యారేజీలో బుంగలు పడి నీళ్లు లీక్ అవుతున్నాయని ఆఫ్కాన్స్–విజేత– పీఈఎస్ జాయింట్ వెంచర్ స్పష్టం చేసింది. కాగా స్టేట్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చైర్మన్ ఏబీ పాండ్య, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మోడల్ స్టడీలో పాల్గొన్నారు. సెకనుకు 15–30 మీటర్ల వేగంతో వరద వరదలు తగ్గుముఖం పట్టాక తక్కువ మొత్తంలో నీళ్లను కిందికి విడుదల చేసేందుకు వీలుగా బ్యారేజీ గేట్లను తక్కువ ఎత్తులో పైకి లేపుతారు. అయితే బ్యారేజీ పూర్తిగా నిండి ఉండడంతో పీడనం పెరిగి వరద భీకర ఉధృతితో గేట్ల కింద నుంచి దూసుకు వస్తుంది. అన్నారం గేట్లను 10–30 సెంటిమీటర్లు మాత్రమే పైకి ఎత్తినా, సెకనుకు 15–30 మీటర్ల భీకర వేగంతో వరద బయటికి వస్తోందని మోడల్ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలోనే బ్యారేజీ రక్షణకు ల్యాబ్ సూచనల మేరకు అత్యవసర చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థ లేఖలో కోరింది. మూడేళ్ల కిందే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అన్నారం బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2021 డిసెంబర్ 17లోనే ముగిసింది. నాటి నుంచి మూడేళ్ల పాటు కేవలం బ్యారేజీ నిర్వహణ కోసం రూ.6.42 కోట్ల అంచనాలతో అఫ్కాన్స్ –విజేత–పీఈఎస్ జేవీతో నీటిపారుదల శాఖ ‘ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్’ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కూడా ఈ ఏడాది డిసెంబర్ 16తో ముగియనుంది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో బ్యారేజీకి జరిగే నష్టాలకు నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత తీసుకుని పునరుద్ధరిస్తుంది. -
‘టీజీ’ స్మార్ట్ కార్డులేవీ ?
సాక్షి, హైదరాబాద్: వాహనాల నంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్ టీఎస్ నుంచి టీజీగా మారింది. ఈనెల 15 నుంచి రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ సీరీస్ కేటాయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ రోజుకు దాదాపు 10 వేల వరకు కొత్త వాహనాలు రాష్ట్రంలో రోడ్డెక్కుతాయి. ఇప్పటి వరకు ఏ వాహనానికి కూడా టీజీ సీరిస్ ఆర్‌సీబుక్ గానీ, కొత్త లైసెన్సు స్మార్ట్‌కార్డు గానీ జారీ కాలేదు. అయితే దీనిపై రవాణాశాఖ ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. స్మార్ట్ కార్డుల జారీ బాధ్యత ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, చిప్‌తో కూడి కార్డు సరఫరా చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో వీటికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వాటి జారీ ఆగిపోయింది. చార్జీల వసూలు సరే... ఆర్సీ, నంబర్ ప్లేట్, లైసెన్స్ బట్వాడా పేరిట చార్జీలు వసూలు చేస్తున్న రవాణాశాఖ వాటిని వారంరోజులుగా ఇవ్వకపోవడంపై వాహనదా రులు షోరూమ్ నిర్వాహకులనో, రవాణాశాఖ అధికారులనో ప్రశ్నిస్తే.. సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ఆమేరకు మార్పు చేయాల్సి ఉందని, అందుకే కొంత జాప్యం జరుగుతోందన్నారు. రెండుమూడు రోజుల్లో వాటి బట్వాడా మొదలవుతుందని చెబుతున్నారు. వాహనాల రాష్ట్ర కోడ్ మారినందున సాఫ్ట్‌వేర్‌ను కూడా యుద్ధప్రాతిపదికన మార్చాలి. ఈనెల 15 నుంచి రాష్ట్ర కోడ్ మారుతుందని రవాణాశాఖకు స్పష్టమైన అవగాహన ఉంది. వెంటనే సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయొచ్చు. కానీ వారం రోజులు గడుస్తున్నా అప్డేట్ కాలేదని పేర్కొంటుండటం విచిత్రంగా ఉంది. రాష్ట్ర కోడ్ మార్పు అమలులోకి రావటానికి మూడు రోజుల ముందు నుంచే కార్డుల జారీ నిలిచిపోయిందని తెలుస్తోంది. ఇన్ని రోజులుగా సాఫ్ట్‌వేర్‌ను ఎందుకు అప్డేట్ చేయటం లేదో..ఎందుకు జాప్యం జరుగుతోందో సమాచారం లేదు. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పందించటం లేదు. ఆర్సీ, లైసెన్స్ స్మార్ట్‌కార్డులు లేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తనిఖీ చేస్తే డౌన్లోడ్ చేసుకున్న పత్రాలను చూపండి అంటూ రవాణాశాఖ సిబ్బంది సలహా ఇస్తున్నారు. కానీ, రాష్ట్ర సరిహద్దులు దాటే చోట ఉండే చెక్‌పోస్టుల్లో సిబ్బంది ఆ కాగితాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని, చిప్ ఉన్న స్మార్ట్ కార్డులే చూపాలని పేర్కొంటున్నారని వాహన దారులు చెబుతున్నారు. -
డీఎస్సీ హడావుడి షురూ
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ హడావుడి మొదలైంది. మంచి కోచింగ్ కేంద్రాల కోసం టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు వెతుకుతున్నారు. అయితే వారిని ఆకర్షించేందుకు కోచింగ్ కేంద్రాలు లోతైన మెటీరియల్ ఇస్తామని, సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక క్లాసులు చెప్పిస్తామని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే జూలై 17 నుంచి 31 వరకూ ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. గత ఏడాది డీఎస్సీకి 1.70 లక్షల దరఖాస్తులు వస్తే, ఇవి కాకుండా కొత్తగా ఇప్పటి వరకూ మరో 25 వేల మంది వరకూ దరఖాస్తు చేశారు. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో గడువు ముగిసే నాటికి మరో లక్ష మంది వరకూ డీఎస్సీకి దరఖాస్తు చేసే అవకాశముంది. మొత్తంగా 3 లక్షల మంది ఈ ఏడాది డీఎస్సీకి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోచింగ్ తీసుకునేందుకు 1.50 లక్షల మందికిపైగా హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తేలికగా ఉండదని... ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఈసారి కఠినంగా ఉంటుందని కొన్ని కోచింగ్ కేంద్రాలు చెబుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని మరీ ఈ తరహా ప్రచారానికి తెరలేపాయి. 2017 నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడం, టెట్ ఉత్తీర్ణత సాధించినవారి సంఖ్య ఏటా పెరుగుతుండటంతో దరఖాస్తుదారుల సంఖ్య భారీగానే ఉంటుందని అనుకుంటున్నారు. పోటీ పెరిగిన నేపథ్యంలో వడపోత విధానాలపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టిందని వారు అంటున్నారు. గతంలో మాదిరి తేలికైన, సూటి ప్రశ్నలు వచ్చే వీల్లేదని అంచనా వేస్తున్నారు. మ్యాథ్స్, సైన్స్ సహా సైకాలజీ సబ్జెక్టుల్లోనూ కఠినమైన రీతిలో ప్రశ్నలు రూపొందించొచ్చని చెబుతున్నారు. నూతన విద్యావిధానం అమలులోకి వస్తున్న తరుణంలో బోధన పద్ధతుల నుంచి లోతైన ప్రశ్నలు ఉంటాయంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ బోధన మెళకువలను అభ్యర్థుల నుంచి తెలుసుకునే వ్యూహం డీఎస్సీలో ఉంటుందని నిపుణులూ అంటున్నారు. గత కొంతకాలంగా బీఈడీ, డీఎడ్‌లో ఇవన్నీ లేవని, కాబట్టి కొత్త విషయాలను అవగాహన చేసుకుంటే తప్ప డీఎస్సీ తేలికగా రాయడం కష్టమనే వాదనను కోచింగ్ కేంద్రాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, నిర్దేశించిన సిలబస్ నుంచే ప్రశ్నపత్రం ఉంటుందని, కాకపోతే నవీన బోధన విధానాలు, సైకాలజీ నుంచి సరికొత్త విషయాలతో ప్రశ్నపత్రం రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. దీనినిబట్టి అకడమిక్ పుస్తకాలకు అందని రీతిలో డీఎస్సీ ఉంటుందా? అనే సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పోటీ పెంచుతున్న కోచింగ్ సెంటర్లు కొత్త స్టడీ మెటీరియల్ రూపకల్పన, ఫ్యాకల్టీ ఎంపికపై కోచింగ్ కేంద్రాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. మూడు నెలల కాల పరిమితితో కూడిన డీఎస్సీ కోచింగ్ సిలబస్ రూపొందిస్తున్నాయి. సొంతంగా మెటీరియల్ తయారు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే 20 ప్రముఖ కోచింగ్ సెంటర్లు విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో ఉన్నాయి. మరో వంద వరకూ చిన్నాచితక సెంటర్లు వెలిశాయి. స్వల్పకాలిక కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పుల ఆధారంగా కోచింగ్ ఉంటుందని చెబుతున్నాయి. డీఎస్సీ రాసేవారిలో నాలుగేళ్ల ముందు బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణులైన వారున్నారు. ఒక్కసారిగా సిలబస్ మారుతోందనే ప్రచారంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొత్త తరహా ప్రశ్నపత్రం వస్తే కష్టమనే భావన బలపడుతోంది. అయితే, మెథడాలజీ, సబ్జెక్టులపై అవగాహన ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఏదేమైనా కోచింగ్ కోసం ఈ తరహా అభ్యర్థులు హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు. -
అందరి వాణి వింటా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలకు రాజ్‌భవన్ అత్యంత నిబద్ధతతో నిర్విరామ సహకారం అందిస్తుందని రాష్ట్ర నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. తాను అందరి వాణిని వింటానని, ప్రతి ఆందోళనను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఎల్లవేళలా సమర్థిస్తూ, గౌరవించేలా, అత్యంత శ్రద్ధతో తన విధులను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేశారు. న్యాయం, సమగ్రత, నిష్పాక్షికత సూత్రాలకు కట్టుబడి దృఢ నిబద్ధతతో పనిచేస్తానన్నారు. రాష్ట్రం, ప్రజల అభ్యున్నతికి అత్యంత అంకితభావం, చిత్తశుద్ధితో పని చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మూడో గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ గవర్నర్లు సీహెచ్ విద్యాసాగర్‌రావు, రామ్మోహన్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ ప్రసంగించడంతో పాటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఓ సందేశాన్ని విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రజల అవసరాలు, ఆకాంక్షలను పరిష్కరించడానికి ప్రాధాన్యతనివ్వాలని అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా సంఘాలకు రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, న్యాయం, కరుణ అనే సూత్రాల ఆధారంగా మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గొప్ప చరిత్ర, సంస్కృతి, పటిష్ట ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రమని, వ్యవసాయం, ఐటీ, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో విశేష ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ గవర్నర్‌గా పని చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా కొత్త గవర్నర్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గంతో గవర్నర్ గ్రూపు ఫోటో దిగారు. ఇంతకుముందు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్‌కు అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చార్మినార్: గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానంతరం బుధవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణితో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. యాదాద్రి మరో వెయ్యేళ్లు నిలుస్తుంది యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉందని గవర్నర్ అన్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని, మరో వెయ్యేళ్లు అద్భుతంగా నిలుస్తుందని చెప్పారు. గర్భాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఒళ్లు పులకరించిందని అన్నారు. అంతకుముందు గవర్నర్‌కు సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ హనుమంత్ కె.జండగే, ఇతర అధికారులు, అర్చకులు తూర్పు త్రితల రాజగోపురం ముందు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను గవర్నర్ దర్శించుకున్నారు. ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. సీఎస్ శ్రీస్వామి వారి చిత్రపటాన్ని అందజేయగా, ఈవో భాస్కర్‌రావు లడ్డూ ప్రసాదం ఇచ్చారు. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీపుష్ప యాగం వేడుకలో గవర్నర్ పాల్గొన్నారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద మొక్కి, సందర్శకుల పుస్తకంలో తన అనుభూతిని రాసి సంతకం చేశారు. -
హెచ్ఎండీఏ ఏపీఓ కృష్ణకుమార్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి పరిశీలన లేకుండానే టీడీఆర్ సర్టిఫికెట్ల జారీలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన శంకర్పల్లి జోన్ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి బీవీ.కృష్ణకుమార్‌ను హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ బుధవారం సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఉదంతంపై సంబంధిత ప్లానింగ్ అధికారులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నగరానికి పడమటి వైపున శంకర్పల్లి జోన్లో ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి. అనేక చోట్ల నిబంధనలను విరుద్ధంగా కొనసాగిన ఈ నిర్మాణాల్లో కృష్ణకుమార్ ప్రమేయం ఉన్నట్టు మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఈయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో కబ్జారాయుళ్లు, అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి కృష్ణకుమార్ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ♦ గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలో టీడీఆర్లపైన వచ్చిన దరఖా స్తులను పరిశీలించకుండానే ఉన్నతా«ధికారులను తప్పుదోవ పట్టించినట్టుగా తాజాగా రుజువు కావడంతో కమిషనర్ ఆయన్ను సస్పెండ్ చేశారు. ♦ పుప్పాలగూడలోని 330 నుంచి 332 వరకు సర్వేనంబర్లలో తమకు ఉన్న 11,698 గజాల్లో 100 ఫీట్ల రోడ్డుకు భూమిని గిఫ్ట్‌డీడ్ కింద గ్రా మపంచాయతీకి రిజిస్టర్ చేసినట్టు శ్రావణ్‌కుమా ర్తో పాటు, మరికొందరు తెలిపారు. ఈ మేరకు వారు టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ♦పుప్పాలగూడ గ్రామంలోనే వెంకటరమణ, మరికొందరు 314 నుంచి 317 వరకు సర్వేనంబర్లలో ఉన్న 22,046 గజాల్లో మాస్టర్‌ప్లా¯న్ కింద 100 ఫీట్ రోడ్డులో భూమి పోయిందంటూ టీడీఆర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ♦టీడీఆర్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కృష్ణకుమార్ తన పై అధికారులను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుతం ఈ ఒకటిరెండు ఉదంతాలే బయటకు వచ్చినా, ఇంకా వెలుగులోకి రాని అక్రమాలు పెద్దఎత్తునే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న సమయంలోనే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన అమెరికాకు వెళ్లడంతో ఏసీబీ దాడుల నుంచి తప్పించుకున్నాడని అప్పట్లో హెచ్ఎండీఏ వర్గాలు చర్చించుకోవడం గమనార్హం. -
టార్గెట్ కాంగ్రెస్!.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘టార్గెట్ కాంగ్రెస్’ వ్యూహంతో బీజేపీ ముందుకెళుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచిన, ఇటీవలి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్‌పైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల నుంచి రాష్ట్ర ముఖ్యనేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్ తదితరుల దాకా అంతా హస్తం పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీ లకు లోక్‌సభ ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు సీట్లు తగ్గేలా, అదే సమయంలో తాము మెజార్టీ స్థానాల్లో గెలిచేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. క్రమంగా విమర్శల దాడిని పెంచుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతోందని.. ఆ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు ఏమైందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’.. పేరిట క్యాంపెయిన్! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను నిలదీసేందుకు, వ్యతిరేక ప్రచారం చేసేందుకు.. ఆరు గ్యారంటీలు, వాటి అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వపరంగా, కాంగ్రెస్ పార్టీపరంగా చేసిన ప్రకటనలనే బీజేపీ వినియోగించుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు, గ్యారంటీలు పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందంటూ.. ప్రత్యేకంగా ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ..’ పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించింది. మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇలా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలైన పింఛన్ల పెంపు, గొర్రెల పంపిణీ, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలు తీరును ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ గ్యారంటీల అమలు కోసం ఒత్తిడి చేస్తూ.. ఆయా పథకాల కింద లబ్ధి ఆశిస్తున్న వారిని సమీకరిస్తోంది. వారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో ఇప్పటికే ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా ‘ప్రశ్నిస్తున్న రైతు..’ కార్యక్రమాన్ని కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ‘ప్రశ్నిస్తున్న మహిళ.. ప్రశ్నిస్తున్న నిరుద్యోగి.. ప్రశ్నిస్తున్న వ్యవసాయ కూలీ..’ అంటూ కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టోలలో పొందుపరిచిన అంశాలను ఎత్తిచూపేలా ప్రణాళికలను బీజేపీ రూపొందించింది. ఘాటు విమర్శలతో దాడి తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతోందని తమ సర్వేల్లో వెల్లడైందని హైదరాబాద్‌లో జరిగిన పార్టీ అంతర్గత భేటీలో అమిత్‌షా వెల్లడించారు. 12న ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ కమిటీలు, ఆపై అధ్యక్షులతో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో రైతులు, ఓబీసీలు, యువత, మహిళలు, పేదల అభ్యున్నతి గురించి కాంగ్రెస్‌కు ఏమాత్రం పట్టదంటూ విరుచుకుపడ్డారు. ఇక ఈనెల 4న ఆదిలాబాద్‌లో, 5న పటాన్చెరులో, 16న నాగర్‌కర్నూల్‌లో 18న జగిత్యాలలో జరిగిన సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ కూడా.. కాంగ్రెస్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులతో దోపిడీకి పాల్పడితే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ భూములు, ఇతర ఆస్తుల కైంకర్యానికి దిగుతోంది. తెలంగాణను మళ్లీ నాశనం చేసేందుకు కాంగ్రెస్‌కు ఐదేళ్లు చాలు..’’ అని ఆరోపణలు చేయడం గమనార్హం. అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీని 400 సీట్లలో గెలిపిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం చేయడం సాధ్యం కాదని, తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లలో బీజేపీ కమలం పువ్వును వికసించేలా చేయాలని కూడా పిలుపునిచ్చారు. డబుల్ డిజిట్ ఇవ్వాలంటూ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 15 చోట్ల అభ్యర్థులను బీజేపీ ఇప్ప టికే ప్రకటించింది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూనే.. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు హామీల అమల్లో విఫలమైందంటూ ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచి జాతీ య స్థాయిలో చేసేదేమీ లేదని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ అవి నీతి, అక్రమాల పాలన వస్తుందని ఆరోపిస్తున్నారు. బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికలప్పుడు బీజేపీ ఓట్ల శాతాన్ని ప్రజలు రెండింతలు చేశారని.. ఈసారి డబుల్ డిజిట్లో ఎంపీ సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కనీసం పది ఎంపీ సీట్లను కచ్చితంగా గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. అదనంగా మరో రెండు స్థానాల్లో గెలిచేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించింది. -
రద్దీ ప్రాంతాల్లో రోడ్ షోలకు అనుమతి లేదు: CEO వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో సీఈఓ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోసం లక్షా 80 వేల సిబ్బంది అవసరమని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8,58,491 ఓట్లు తొలగించామని అన్నారు. పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారన్నారు. ke\\రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల ఓటర్లు ఉంటే.. 8 లక్షల కొత్త యువ ఓటర్లు ఉన్నారు. ఈ సారి 85 ఏళ్ల పైబడిన వాళ్లకు హోం ఓటింగ్ అవకాశం ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణ తరువాత రోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ ఓటింగ్ కొత్త సాప్ట్ వేర్ ద్వారా ఈసారి నిర్వహిస్తున్నాం. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ప్రాసెస్ పూర్తి అయింది. EVM లు సిద్ధంగా ఉన్నాయి. రిజర్వ్ కూడా ఉంచాం. 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. 50వేల కంటే ఎక్కువ నగదు ఉంటే పేపర్స్ ఉండాలి లేదంటే సీజ్ చేస్తారు. ఫిర్యాదులు c - విజిల్ app లేదా 1950కి ఫిర్యాదు చేయొచ్చు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలకు అనుమతి సువిదా యాప్ ద్వారా తీసుకోవాలి. 7 లక్షల ఓటర్ కరెక్షన్స్ ఎమ్మెల్యే ఎన్నికల తరువాత చేశాంము. చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపి సెగ్మెంట్ మల్కాజిగిరి. రోడ్ షో లు సెలవు రోజుల్లోనే.. రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్ షో లకు అనుమతి లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి లేదు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను, స్కూల్ డ్రెస్‌లకు అనుమతి లేదు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రాసెస్ జరుగుతోంది...షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది. -
‘గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో తిరస్కరణ’.. దాసోజు శ్రవణ్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని మాజీ గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో తన రాజకీయ భవిష్యత్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని లేఖలో దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌గా ఉన్న తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా -
మల్లారెడ్డి కాలేజ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వివరాల ప్రకారం.. విద్యార్థుల ఆందోళనలతో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరీక్షలు ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో వారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. -
అమ్మో ‘రాజధాని’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని బస్సులు ఆర్టీసీ ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. విరిగిన కుర్చిలు, సరిగ్గా పనిచేయని ఏసీ, పరిశుభ్రత అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికుల నుంచి సంపూర్ణ ఆదరణ ఉన్నా, కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో కావాల్సినన్ని బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోలేకపోతోంది. గత సంవత్సరం ఖరారైన టెండర్లకు సంబంధించిన బస్సులు విడతల వారీగా సమకూరుతున్నాయి. కానీ, అది ఆర్టీసీ డిమాండ్‌కు తగ్గట్టుగా లేకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితిలో డొక్కు బస్సులను ఆర్టీసీ కొనసాగించాల్సి వస్తోంది. ఇటీవల 750 వరకు కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసింది. పాత సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని వినియోగించుకుంటూ, మిగతా వాటిని ఎక్స్‌ప్రెస్ బస్సులుగా, సిటీ బస్సులుగా అధికారులు మార్చారు. కానీ, రాజధాని కేటగిరీకి మాత్రం కొత్త బస్సులు లేక, పాత వాటినే వినియోగిస్తున్నారు. డిమాండ్ ఉన్నా.. రాజధాని బస్సులకు బాగా డిమాండ్ ఉంది. గరుడ బస్సుల్లో టికెట్ ధర ఎక్కువగా ఉన్నందున, టికెట్ ధరలు తక్కువగా ఉండే ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. రైలు నెట్వర్క్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అంతగా తిరగని దూర ప్రాంతాల్లో ఈ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో అయితే, విజయవాడ లాంటి రైలు కనెక్టివిటీ మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కూడా వీటిల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంది. 2016లో కొన్న బస్సులే... ప్రస్తుతం 235 రాజధాని బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. అవన్నీ 2016లో కొన్న బస్సులు. సాధారణంగా ఐదు లక్షల కిలోమీటర్లు తిరగ్గానే బస్సులను మార్చేస్తారు. కానీ, ఇవి 10 లక్షల కి.మీ. తిరిగినా వాటినే వాడాల్సి వస్తోంది. పాతవాటి స్థానంలో కొత్తవి కొనాల్సి ఉన్నా నిధుల లేమితో ఆర్టీసీ సమకూర్చుకోలేకపోయింది. గతేడాది 46 బస్సులకు టెండర్లు పిలిచారు. తాజాగా అవి సమ కూరాయి. దీంతో వాటి సంఖ్య 281కి చేరింది. వాస్తవానికి పాత 235 బస్సు లను తొలగించి అంతమేర కొత్తవి సమకూర్చుకోవాల్సి ఉంది. నిధులు లేక కొత్తవి కొనలేకపోతున్నారు. అన్నీ సమస్యలే.... పాత బస్సుల్లో ఏవీ సక్రమంగా ఉండటం లేదు. సీట్లు పాడైనా మరమ్మతు చేయకుండానే ట్రిప్పులకు పంపుతున్నారు. ఆది, సోమవారాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. సీట్లు విరిగినా.. ఆన్లైన్లో అడ్వాన్స్ రిజర్వేషన్లో ఉంచుతున్నారు. వాటిని బుక్ చేసుకున్నవారు వాటిల్లో కూర్చోలేక నానా తిప్పలు పడుతున్నారు. కొందరు మధ్యలోనే దిగిపోతున్నారు. ఇక వాటిల్లో ఏసీ వ్యవస్థ పాతబడి సరిగ్గా పనిచేయటం లేదు. మధ్యాహ్నం వేళ ఏసీ ప్రభావం అంతగా లేక ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగటంతో ఈ బస్సులెక్కాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్సుల్లో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం నిత్యకృత్యమైంది. -
కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను దానం నాగేందర్‌కు కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుడ్ బై చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
వంద రోజుల్లో.. వంద తప్పులు.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ‘వంద రోజుల్లో.. వంద తప్పులు.. పదేళ్ల తరువాత.. రైతులకు తిప్పలు.. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ వంద ప్రశ్నలు సంధించారు. 1. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? 2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు? 3. రైతుబంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారు? 4. వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది? 5. ప్రతి మహిళకు రూ.2500 హామీ మరిచిపోయారా? 6. మూడు నెలలైనా పెన్షన్లను రూ.4000 కు ఎందుకు పెంచలేదు? 7. ఒకటో తేదీన జీతాలన్నారు. అందరికీ ఎందుకు అందడం లేదు? 8. 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి? 9. గృహజ్యోతికి ఏటా 8 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2400 కోట్లే ఎందుకు పెట్టారు? 10. దళితబంధు పథకాన్ని అర్థాంతకరంగా ఎందుకు నిలిపివేశారు? 11. అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు? 12. ఒకే ఒక్క రోజు ప్రజాభవన్‌కు వెళ్లి.. ఆ తరువాత ఎందుకు ముఖం చాటేశారు? 13. చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేశారు? 14. కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు? 15. భూగర్భ జలాలు అడుగంటుతున్నా చెరువులు ఎందుకు నింపడం లేదు? 16. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లివ్వకపోవడం ఘోరం కాదా? 17. పదేళ్ల తరువాత పచ్చని పంటలు ఎండిపోవడం మీరు చేసిన పాపం కాదా? 18. వేళాపాళా లేని కోతలు, కరెంట్ షాకులతో ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారు? 19. సమైక్యరాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపడం నేరం కాదా? 20. పంజాబ్‌ను తలదన్నిన తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా ఎందుకు మార్చారు? 21. యాసంగి సాగు గణనీయంగా తగ్గినా ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి? 22. వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే దుస్థితిని ఎందుకు కల్పించారు? 23. బోర్ల రాంరెడ్డి ఎదుర్కొన్న ఆనాటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎందుకొచ్చింది? 24. పల్లెలు పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు? 25. నాణ్యత లేని కరెంట్ వల్ల కాలిపోతున్న మోటర్లకు బాధ్యులెవరు? 26. మళ్లీ యూరియా కోసం క్యూలైన్ లో నిలబడే సంస్కృతి ఎందుకు తెచ్చారు? 27. సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారు? 28. మిషన్ భగీరథను మూలనపడేసి.. మళ్ళీ ట్యాంకర్ల రాజ్యమా? 29. ఫ్రీ బస్సు అని ఆశపెట్టి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారా? 30. ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి.. ఏటా ఇస్తామన్న రూ.12 వేలు ఎగ్గొడతారా? 31. పదేళ్లు సంతోషంగా ఉన్న నేతన్నల జీవితాలను ఎందుకు ఆగం చేశారు? 32. ఆర్డర్లు ఇవ్వకుండా సాంచాల సంక్షోభాన్ని ఎందుకు సృష్టించారు? 33. ఆత్మగౌరవంతో బతుకుతున్న నేతన్నలను అవమానిస్తారా? 34. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి చేస్తారా? 35. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులను మీ ఖాతాలో వేసుకుంటారా? 36. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కంపెనీ చెన్నైకి తరలిపోతున్నా గుడ్లప్పగించి చూస్తారా? 37. కేన్స్ సెమీ కాన్ సంస్థను గుజరాత్ రాష్ట్రానికి ధారాదత్తం చేస్తారా? 38. ప్రపంచం మెచ్చిన టీఎస్ ఐపాస్‌ను కాదని.. కొత్త పాలసీ పాట పాడతారా? 39. గురుకుల నియామకాల్లో వెయ్యి బ్యాక్ లాగ్ పోస్టులు మిగలడం మీ వైఫల్యం కాదా? 40. పచ్చని వికారాబాద్ అడవులపై రాడార్ చిచ్చు పెడతారా? 41. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తెరతీస్తారా ? 42. శంషాబాద్ మెట్రోను ముందుచూపు లేకుండా ఎలా రద్దుచేస్తారు ? 43. దేశానికే తలమానికం లాంటి ఫార్మా సిటీని ముక్కలు చేస్తారా ? 44. కల్యాణలక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైంది ? 45. Free LRS పై మాటతప్పి ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకుంటారా ? 46. రక్షణ భూముల అప్పగింతలో బీఆర్ఎస్ కష్టాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారా ? 47. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు పాతరేసి ఆ రూట్లో శాశ్వతంగా మెట్రో లేకుండా చేస్తారా ? 48. గొర్రెల పథకం లబ్దిదారులు డీడీలు కట్టినా ఇంకెప్పుడు పంపిణీ చేస్తారు ? 49. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని ఇంకెప్పుడు పూర్తి చేస్తారు ? 50. సాక్షాత్తు ప్రియాంకా గాంధీ హామీఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైంది ? 51. కేసిఆర్ కిట్ - రూ.13 వేల ఆర్థిక సాయాన్ని ఇస్తారా ? లేదా ? 52. గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ పథకం ఏమైంది ? 53. వెంటనే తెల్ల కార్డులను అందిస్తామన్న హామీ అమలు ఇంకెప్పుడు ? 54. విద్యార్థుల బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ఎందుకు బ్రేకులు వేశారు ? 55. ధరణి పోర్టల్‌ను దెబ్బతీయడం దళారుల రాజ్యం కోసమేనా ? 56. ధూపదీప నైవేద్యం పథకాన్ని కొండెక్కించడం సమంజసమేనా ? 57. 33 జిల్లాలను కుదించాలని కుట్ర చేయడం తిరోగమన చర్య కాదా ? 58. వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములపై కన్నేయడం తప్పు కాదా ? 59. సొంత ప్రభుత్వంలోని దళిత ఉపముఖ్యమంత్రిని అవమానిస్తారా ? 60. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు ? 61. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన 30 వేల ఉద్యోగాల భర్తీని మీ ఖాతాలో వేసుకుంటారా ? 62. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లలో నష్టపరుస్తారా ? 63. ఉద్యోగాలకు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి.. ఫీజు వసూలు చేస్తారా ? 64. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న పెండింగ్ డిఏలు ఇంకెప్పుడు ఇస్తారు ? 65. మూడు నెలలుగా పీహెచ్ సీల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి జీతాలు ఇవ్వరా ? 66. 38 మందికి పైగా ఆటోడ్రైవర్ల బలిదానాలకు బాధ్యులు మీరు కాదా ? 67. 175 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా ? 68. సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలకు తెరతీసింది మీరు కాదా ? 69. గురుకులాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు మీకు కనిపించడం లేదా ? 70. పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్లకు పాలన అప్పగిస్తారా ? 71. అప్పు చేయడం తప్పు అని.. మీరే వేల కోట్ల రుణాలు ఎలా తీసుకుంటారు ? 72. అధికారంలోకి రాగానే మళ్లీ ఇసుక మాఫియాకు దారులు తెరిచారా ? 73. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా ? 74. సచివాలయం ముందు తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు ? 75. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తారు ? 76. జై తెలంగాణ అని నినదించిన పాపానికి లాఠీలతో రెచ్చిపోతారా ? 77. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న బీజేపీతో చీకటి ఒప్పందాలెందుకు ? 78. గుజరాత్ మోడల్‌ను మెచ్చుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా ? 79. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు తెలంగాణను ఏటీఎంగా మార్చేశారా ? 80. పరిపాలనను గాలికొదిలేసి.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటారా ? 81. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి ఇంకెన్ని అక్రమ కేసులు పెడతారు ? 82. పచ్చని తెలంగాణను కరువుకు కేరాఫ్‌గా మార్చింది మీరు కాదా ? 83. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండని అన్నదాతలను అవమానిస్తారా ? 84. కౌలు రైతులకు ఎకరానికి 15 వేల హామీని ఇంకెప్పుడు నిలబెట్టుకుంటారు ? 85. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న మాట మరిచిపోయారా ? 86. విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అడ్రస్ ఎక్కడ ? 87. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాల హామీని గాలికి వదిలేశారా ? 88. సాగునీరు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండినా.. నష్టపరిహారం అందించరా ? 89. 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడిస్తారు ? 90. యూత్ కమిషన్ ఏర్పాటు - రూ.10 లక్షలు వడ్డీ లేని రుణ హామీ ఏమైంది ? 91. తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారా ? 92. ఎస్సీ విద్యార్థులకు ఇస్తామన్న విద్యా జ్యోతులు పథకం గుర్తుందా ? 93. పవర్ లూమ్స్, ఇతర పరికరాలపై 90 శాతం సబ్సిడీ గ్యారెంటీ ఏమైంది ? 94. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసేదెప్పుడు ? 95. మైనిఫెస్టోలో రూ.1.70 లక్షల కోట్ల హామీలిచ్చి.. బడ్జెట్లో నిధులు కేటాయించరా ? 96. పదేళ్లలో పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని వందరోజుల్లోనే దెబ్బతీస్తారా ? 97. ఎన్నికలకు ముందు మీ పార్టీ ఇచ్చిన ఐదు డిక్లరేషన్లను మీరే కాలరాస్తారా ? 98. బాబుతో కలిసి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే కుతంత్రాలు చేస్తారా ? 99. విభజన హామీలు నెరవేర్చని కేంద్రంపై అంత ప్రేమ ఎందుకు ? 100. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా ? వంద రోజుల్లో.. వంద తప్పులు.. పదేళ్ల తరువాత.. రైతులకు తిప్పలు.. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన " అబద్ధాల హస్తం " @INCTelangana 1. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది ? 2. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు ? 3. రైతుబంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారు ? 4. వరి పంటకు… — BRS Party (@BRSparty) March 17, 2024 -
చల్లటి కబురు: తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈరోజు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇక, ఇప్పటికే ఉత్తర తెలంగాణలో పలుచోట్ల వర్షం కురిసింది. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలో వాతావరణం కొంత చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలో మోస్తురు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్‌లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. కామారెడ్డిలో పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందినట్టు తెలుస్తోంది. Good Summer Rains ☔ in #Telangana . Thank God.@Rajani_Weather @balaji25_t pic.twitter.com/ED4qNYMsim — Mohd Abdul Sattar (@SattarFarooqui) March 16, 2024 #24HrWx North and adjoining West #Telangana districts most likely to see thunderstorms today. pic.twitter.com/BMGJt6h8uw — Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) March 16, 2024 Weather update!! #Telangana Now scattered thunderstorms rains going in North telangana Asifabad karimnagar bhupalpally Medak warangal will see heavy thunderstorms rains activity ⛈️ pic.twitter.com/Z9BLY4Isfy — Telangana state Weatherman (@tharun25_t) March 16, 2024 -
సబ్సిడీ ఇచ్చాకే ‘జీరో బిల్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే విద్యుత్ సబ్సిడీ నిధులను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విడుదల చేయాలని.. అలా చేస్తేనే వినియోగదారులకు ‘జీరో’ బిల్లులు జారీ చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం–2003లోని నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ అందించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ‘గృహజ్యోతి’ పథకానికి షరతులతో ఆమోదం తెలిపింది. ముందుగా ఇవ్వాలి.. లేదా రిఫండ్ చేయాలి.. అర్హులైన పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే ‘గృహజ్యోతి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు జీరో బిల్లుల జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ అనుమతి కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఈఆర్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టం ప్రకారం.. ఫ్రంట్ లోడెడ్ లేదా బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులకు సబ్సిడీ చెల్లింపు జరగాలని తెలిపింది. ఫ్రంట్ లోడెడ్ విధానంలో.. డిస్కంలు బిల్లింగ్ చేపట్టడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదే బ్యాక్ లోడెడ్ విధానంలో వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత వారికి రాష్ట్ర ప్రభుత్వం రిఫండ్ చేస్తుందని వివరించింది. సకాలంలో రాబట్టుకోవాలి.. గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇంధన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఈఆర్సీ ఆమోదించింది. ఒక నెలకు సంబంధించి అందాల్సిన సబ్సిడీ వివరాలను తదుపరి నెల 20వ తేదీలోగా డిస్కంలు అందజేస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని మార్గదర్శకాల్లో ఇంధన శాఖ పేర్కొన్నట్టు తెలిపింది. అయితే సకాలంలో సబ్సిడీ రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక టారిఫ్ సవరణ ప్రతిపాదనలను కూడా సత్వరమే సమర్పించాలని కోరింది. -
వరంగల్‌లో ఏసీబీ ప్రత్యేక కోర్టు
వరంగల్ లీగల్: వరంగల్‌లో ఏసీబీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో సంతోషపడటమే కాకుండా సమగ్రంగా సద్వినియోగం చేసుకునే విధంగా న్యాయవాదులు తర్ఫీదు పొందాలని అన్నారు. ఏసీబీ కోర్టుతోపాటు హనుమకొండ జిల్లాకు సబ్ కోర్టు, ఉభయ జిల్లాలకు ఈ– సేవా కేంద్రం, రాష్ట్రంలోనే తొలిసారి పాత రికార్డులను భద్రపర్చడం కోసం డిజిటైజేషన్ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఇక్కడ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.వినోద్‌కుమార్, ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ ఎన్.రాజేశ్వర్‌రావు, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, ఎం.కృష్ణమూర్తి, బార్ అసోసియేషన్ల అధ్యక్షులు ఆనంద్‌మోహన్, శ్యాంసుందర్‌రెడ్డి, సభ్యులు జయాకర్, జనార్ధన్, డాక్టర్ యాకస్వామి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కవిత అరెస్ట్‌పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెల్లి అధికారంలోకి వచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ పాలన రేపటికి వంద రోజులు కానున్న సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ వంద రోజుల పరిపాలన నాకు సంతృప్తినిచ్చింది. కానీ ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కరించాల్సిఉంది. 8 లక్షల కుటుంబాలు 500 గ్యాస్‌ను వాడుకోగా..ఇప్పటికే నగదు బదిలీ చేశాం. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయం పెంచాం. నిషేదిత ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చాం. సచివాలయంలోకి సాధారణ ప్రజలు వచ్చేందుకు స్వేచ్ఛను ఇచ్చాం. ధర్నా చౌక్‌ను రద్దు చేసిన బీఆర్ఎస్, అదే ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ ధర్నా చేసుకునేందుకు అవకాశం ఇచ్చాం. భేషజాలకు పోకుండా ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర హక్కు రావాల్సిన వాటిని రాబట్టగలిగాం. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. హంగులు, ఆర్భాటాలు లేకుండా పాలన సాగుతుంది. వైబ్రెంట్ తెలంగాణ 2050తో ముందుకు వెళ్తున్నాం. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు. ఈ అరెస్ట్ సీరియల్ లాంటిది. అరెస్ట్‌తో ఈ డ్రామా పతాక స్థాయికి వచ్చింది. సానుభూతి కోసం బీజేపీ,బీఆర్ఎస్ పాకులాడుతున్నాయి. కవితను అరెస్ట్ చేస్తుంటె తండ్రిగా కేసీఆర్ ఎందుకు రాలేదు. పార్టీ ఎమ్మెల్సీ అయిన కవిత అరెస్ట్‌ను కేసీఆర్ ఎందుకు ఖండించలేదు. తెలంగాణకు ఈడీ, మోదీ కలసే వచ్చారు. తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి మోదీ ఎందుకు మాట్లాడడం లేదు. కాంగ్రెస్ దెబ్బతీయడానికి బీజేపీ,బీఆర్ఎస్లు నాటకం ఆడుతున్నాయి. మోదీ, కేసీఆర్ ఇద్దరు కవిత అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు’ అని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్లో ఎవ్వరూ మిగలరు.. తమ కుటుంబంలోని గందరగోళాన్ని హరీశ్‌రావు పరోక్షంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ పెద్దలు మన ప్రభుత్వమే రాబోతుందని వాళ్ల ఎమ్మెల్యేలకు చెప్తున్నారట. ఈ విషయాన్ని నన్ను కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు నాకు చెప్తున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలకు మంత్రి పదవులు పంచేస్తున్నారట. మేము జాయినింగ్స్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే బీఆర్ఎస్ నలుగురు, అయిదుగురు కంటే మిగలరు. మమ్మల్ని మా పనిచేసుకోనిస్తే..ప్రతిపక్షం పని ప్రతిపక్షం పని ప్రతిపక్షం పని చేసుకోనిస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే బీఆర్ఎస్లో ఎవ్వరూ మిగలరు. మా దగ్గర వ్యూహం ఉంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. నల్లగొండ సభలో నన్ను విమర్శించిన విషయం మర్చిపోయారా. భాష గురించి కేసీఆర్‌కు ఇప్పుడైనా గుర్తుకు రావడం మంచిదే. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మా ప్రభుత్వంకు రెఫరెండం. మా పరిపాలనను చూసి ఓటేయాలని ప్రజలను కోరుతున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. -
మెట్రోపై ‘మహాలక్ష్మి’ఎఫెక్ట్!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లపైన ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ పడింది. ప్రతిరోజు కిక్కిరిసి పరుగులు తీసే మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు కొంతమేరకు సిటీ బస్సుల్లోకి మారారు. దీంతో గతేడాది 5.10 లక్షలు దాటిన మెట్రో ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతున్నట్లు ఎల్అండ్టీ అధికావర్గాలు పేర్కొన్నాయి. ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మహాలక్ష్మి పథకం కారణంగా ఈ ఏడాది మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నాయి. నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రతి రోజు 1034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో మాత్రం ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతో ఈ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తరువాత మహిళా ప్రయాణికులు తగ్గారు. ఈ ఏడాదిలో ఆరున్నర లక్షలు దాటవచ్చునని అధికారులు అంచనా వేయగా, అందుకు భిన్నంగా మహాలక్ష్మి కారణంగా సుమారు 5 నుంచి 10 శాతం ప్రయాణికులు తగ్గడం గమనార్హం. గతేడాది రికార్డు స్థాయిలో రద్దీ... గత సంవత్సరం జూలై మొదటి వారంలో రికార్డుస్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రహదారులపైన వాహనాల రద్దీ, కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేనివిధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణాన్ని అందజేయడంతో కూడా ఇందుకు మరో కారణం. నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనులపైన హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు సైత మెట్రోల్లోనే ఎక్కువగా పయనిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రతిరోజు 2.60 లక్షల మంది పయనించగా, నాగోల్–రాయదుర్గం కారిడార్‌లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. జూబ్లీస్ బస్‌స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్లలో కలిపి 30 వేల మందికి పైగా మహిళలు సిటీబస్సుల్లోకి మారినట్లు అంచనా. ప్రత్యేకంగా ఈ రెండు నెలల్లోనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అని ఎల్అండ్టీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పాటు మరికొన్ని అంశాలు కూడా కారణం కావచ్చునన్నారు. మరోవైపు మెట్రోస్టేషన్లలో రాయదుర్గం, ఎల్బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్ల నుంచి అత్యధిక మంది రాకపోకలు సాగిస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ కూడా... నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇంకా ‘వర్క్‌ప్రమ్ హోమ్’ను కొనసాగిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా మెట్రోల్లో ప్రయాణం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు వేయగా వివిధ కారణాల వల్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. -
Hyderabad: టీజీ 09 0001 నెంబర్‌కు రూ.9.61 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ కొత్త సిరీస్ ‘టీజీ’పైన శుక్రవారం మొటి రోజే వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్లపైన రూ.30.49 లక్షలు లభించింది. ‘టీజీ 09 0001’ నెంబర్ కోసం రుద్రరాజు రాజీవ్ కుమార్ అనే వాహన యజమాని బిడ్డింగ్‌లో ఏకంగా రూ.9.61 లక్షలు చెల్లించి సొంతం చేసుకోవడం గమనార్హం. అలాగే ‘టీజీ 09 0909’ నెంబర్‌కు భవ్యసింధు ఇన్ఫ్రా సంస్థ రూ.2.30 లక్షలు చెల్లించి నెంబర్ దక్కించుకుంది. ‘టీజీ 09 0005’ నెంబర్ కోసం శాని్వతారెడ్డి అనే వాహన యజమాని రూ.2.21 లక్షలు చెల్లించారు. ‘టీజీ 09 0002’ నెంబర్ కోసం దుశ్యంత్ రెడ్డి అనే వాహనయజమాని రూ.1.22 లక్షలు చెల్లించారు. అలాగే ‘టీజీ 09 0369’ నెంబర్‌కు రూ.1.20 లక్షలు, ‘టీజీ 09 0007’ నెంబర్ కోసం రూ.1.07 లక్షల చొప్పున చెల్లించి సొంతం చేసుకున్నారు. అలాగే ఆర్టీఏ బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మొదటి రోజు ప్రత్యేక నెంబర్లపైన రూ.3.32 లక్షల ఆదాయం లభించింది. పశి్చమ మండలం టోలిచౌకి కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో రూ.5.38 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. అలాగే సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో ప్రత్యేక నెంబర్లపైన రూ.8.52 లక్షలు లభించినట్లు పేర్కొన్నారు. -
సమగ్ర కులగణనకు సై!
సాక్షి, హైదరాబాద్: సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయాల్లో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీల స్థితిగతులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్ర కులగణనకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం సమగ్ర కులగణనకు సంబంధించిన జీఓ ఎంఎస్ 26ను జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించనున్నారు. నిర్వహణకు రూ.150 కోట్లు...: ఈ సర్వే చేపట్టేందుకు కనీసంగా రూ.150కోట్లు బడ్జెట్ అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సర్వే ఖర్చు కోసం నిధులను 2024–25 వార్షిక బడ్జెట్లో కేటాయించింది. ఈమేరకు తాజా ఉత్తర్వుల్లో బడ్జెట్ అంశాన్ని పొందుపర్చింది. సర్వే నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వం ఉత్తర్వుల్లో వెల్లడించారు. సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అందిస్తారు. జీఓ విడుదల హర్షణీయం: జాజుల శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమగ్ర కులగణన జీఓ విడుదల చేయడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల జనాభా లెక్కలను సేకరింంచేందుకు ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. -
ఎల్లుండి నుంచే టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తర గతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు దాదా పు పూర్తయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరు కా నున్నారు. ఇందులో బాలురు 2,57,952 మంది. బాలికలు 2,50,433 మంది ఉ న్నారు. అధికారులు మొత్తం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అధికా రులు పరీక్షలు రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు, ప్రింటెడ్ నామినల్ రోల్స్‌ను పంపిణీ చేశారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఈ హాల్‌టికెట్లను పొందే వీలు కల్పించారు. అంతే కాకుండా ‘బీఎస్ఈ.తెలంగాణ.జీవోవీ.ఇన్’ అనే వెబ్సైట్ ద్వారా కూడా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. 5 నిమిషాల వరకు అవకాశం పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పరీక్షల విభాగం స్పష్టం చేసింది. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, మరో ఐదు నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. ఆ తర్వాత అనుమతించబోరని తెలిపింది. -
కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడం అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. కవిత అరెస్టును బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని.. ఇది బీఆర్ఎస్ పారీ్టని, పార్టీ అధినేత కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగమేనని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధిపొందడానికే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై కుట్ర పన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో శుక్రవారం రాత్రి తెలంగాణభవ న్లో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాది ఉద్యమ పార్టీ, వేధింపులు, అరెస్టులు, కుట్రలు మాకు కొత్త కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలు, అక్రమ కేసులు, అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కవిత అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలపాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. ఎన్నికల ముందు కుట్ర: సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగా శుక్ర, శనివారాల్లో సెలవు ఉంటుందని తెలిసి మరీ కవితను అరెస్టు చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో, కుట్రతో ఈ అరెస్టు జరిగింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఇతర నేతలు అనేకమార్లు కవితను అరెస్టు చేస్తామంటూ ఈడీ అధికారుల తరహాలో మాట్లాడారు. శనివారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న నేపథ్యంలో కవితను అరెస్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర పన్నింది. బీఆర్ఎస్పై రాజకీయ కక్ష సాధింపు ఈడీ కేసు అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకురాగా.. 19వ తేదీకి వాయిదా వేసింది. ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడబోమని సుప్రీంకోర్టుకు ఈడీ హామీ ఇచి్చంది. ఆ హామీని పక్కనపెట్టి శుక్రవారం సాయంత్రం కవితను అరెస్టు చేయడం అక్రమం. రాజకీయ ప్రేరేపితం. కవిత కోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తనిఖీలంటూ ఈడీ అధికారులు వచ్చారు. ప్రణాళిక ప్రకారం ముందే విమానం టికెట్లు కూడా బుక్ చేశారు. శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవులు కాబట్టి అక్రమ అరెస్టుకు ప్లాన్ చేశారు. ఇది ఎమర్జెన్సీని మించిన పరిస్థితి. గతంలో మా పార్టీకి చెందిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ సహా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద ఈ తరహా ప్రయత్నాలు జరిగాయి. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఏడాదిన్నర క్రితం కవితను సాక్షిగా పేర్కొంటూ నోటీసులిచి్చ, ప్రస్తుతం నిందితురాలిగా చేర్చడం వెనుక రాజకీయ దురుద్దేశం దాగి ఉంది. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు, కుట్రలను బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది..’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్‌ను లొంగదీసుకునే ప్రయత్నం: జగదీశ్‌రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన కేసీఆర్‌ను బెదిరించి, లొంగదీసుకుని రాజకీ య లబ్ధి పొందే ఉద్దేశంలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో తమకు అడ్డుగా ఉన్న ప్రతిపక్ష పారీ్టల నేతలకు నోటీసులిచ్చి, బీజేపీలో చేరిన వెంటనే వెనక్కి తీసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. -
కాసేపు టీచర్‌గా మారిన హైదరాబాద్ కలెక్టర్
నాంపల్లి: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికార హోదాను కాసేపు పక్కన పెట్టి టీచర్‌గా మారిపోయారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. టీచర్లలో ఉత్తేజం నింపారు. ఈ సన్నివేశం గురువారం మల్లేపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక తెలుగు, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదు లను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. విద్యా ర్థులు చదువుతున్న తీరును గమనించారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయులతో బోధనలు చేయించారు. ‘పాఠం అర్థమైందా పిల్లలూ..’అని ఆరా తీశారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, డీఈఓ రోహిణి, తహసీల్దార్ జ్యోతి పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్కు చురకలు.. మల్లేపల్లి ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపులను ఆకతాయి లు రాత్రివేళల్లో పగులగొట్టి లోనికి చొరబడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీచర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనూ స్కూల్లోని కంప్యూటర్లు ఎత్తుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడే ఉన్న హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ టంగుటూరి రాంబాబును పిలిచి ‘దొంగలు పడితే ఏం చేస్తున్నారు’ అని కలెక్టర్ చురకలు అంటించారు. వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్ నాంపల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. -
లిక్కర్ కేసు.. కవిత పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీం కోర్టులో గతంలోనే సవాల్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ నుంచి కవిత నోటీసులు అందుకున్నారు. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనని సీబీఐ, ఈడీలకు కవిత లేఖలు రాశారు. కాగా, లిక్కర్ కేసులో కవిత గత ఏడాది మార్చిలో ఈడీ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. సీబీఐ మాత్రం హైదరాబాద్‌లోని నివాసంలోనే ఆమెను సాక్షిగా విచారించింది. ఇటీవలే అనూహ్యంగా లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41 ఏ కింద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది. దీంతో కవిత సీబీఐ, ఈడీల ముందు మళ్లీ హాజరవ్వాలా లేదా అన్న విషయంలో సుప్రీంకోర్టులో 19న జరగనున్న విచారణ కీలకంగా మారనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇటీవల వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈకేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయ్యారు. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
ఆరుకు నూరు మార్కులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. శుక్రవారంతో కాంగ్రెస్ పాలనకు వంద రోజులు పూర్తి కానుండటంతో, ప్రభుత్వ పనితీరుపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంత స్వల్ప వ్యవధిలో ప్రభుత్వ పనితీరును అంచనా వేయడం సరికాక పోయినా, ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటన చేయడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల పేరుతో 13 హామీలను పొందుపరిచింది. ఈ 13 పథకాల అమలుకు ఏటా దాదాపు రూ.1.30 లక్షల కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేశారు. కానీ ప్రభుత్వం వీటికి బడ్జెట్లో రూ.53 వేల కోట్లే కేటాయించింది. దీనిపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా ఇప్పటివరకు ఐదు హామీలను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఇంకా ఎనిమిది హామీలు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం తీవ్రమవుతున్న తాగునీరు, విద్యుత్ సమస్యలను కూడా ప్రభుత్వం అధిగమించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వంద రోజుల్లో తాను సాధించిన విజయాలను వివరిస్తూ ప్రభుత్వం గురువారం ప్రగతి నివేదిక విడుదల చేసింది. ఎన్నికల తర్వాతే మిగతా హామీల అమలు? అధికారంలోకి వచ్చిన రెండోరోజే డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత 50 రోజులకు పైగా సమయం తీసుకుని ఫిబ్రవరి 28న మరో రెండు పథకాలు షురూ చేసింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించింది. అనంతరం 12 రోజుల సమయం తీసుకుని మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పార్లమెంటు ఎన్నికల కోడ్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో, ఆరు గ్యారంటీల్లో అమలు కాకుండా మిగిలిన 8 హామీల అమలు లోక్‌సభ ఎన్నికల తర్వాతేనని అర్థమవుతోంది. వ్యతిరేకత రాలేదేమో కానీ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు విషయమై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా ఒకింత అసంతృప్తి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు అందరికీ పథకాలు అందజేస్తామని చెప్పి.. ఇప్పుడు తెల్ల రేషన్‌కార్డు, ప్రజాపాలన దరఖాస్తు పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి లబ్ధీ పొందనివారు, భవిష్యత్తులో ప్రారంభించే పథకాల్లోనైనా తమకు లబ్ధి కలుగుతుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల అమలుకు ఏదో ఒక కొలబద్ధ ఉండాలి కదా... అందుకే తెల్ల రేషన్‌కార్డు నిబంధన అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం వివరణ ఇవ్వడం గమనార్హం. ఒక్క మహాలక్ష్మికే రూ.40 వేల కోట్లకు పైగా రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ప్రకటించింది. మహాలక్ష్మి పేరుతో రూపొందించిన తొలి గ్యారంటీలోని మొదటి అంశం ఇదే. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.65 కోట్ల మంది మహిళలున్నారు. వీరిలో పింఛన్లు పొందుతున్న 26 లక్షల మంది పోను మిగిలిన వారికి నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.41,700 కోట్లు కావాల్సి ఉంటుంది. వరికి బోనస్ వచ్చే సీజన్ నుంచా? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరో ప్రధాన గ్యారంటీ రైతు భరోసా. రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలతో పాటు క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇందులోని ప్రధాన హామీలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసినా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వలేదు. అయితే వచ్చే వర్షాకాలం సీజన్ నుంచి దీనిని అమలు చేయవచ్చని తెలుస్తోంది. రైతు భరోసా అమలు చేయాలంటే ఏటా కనీసం రూ.34 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. చేయూత.. ఎప్పుడో? రాష్ట్రంలోని పేదలు అత్యంత ఆతురతతో ఎదురుచూస్తున్న మరో గ్యారంటీ చేయూత. ఈ గ్యారంటీ కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచాల్సి ఉంది. దీని కోసం 46 లక్షలకు మందికి పైగా పేదలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా చేయూత పథకాన్ని అమలు చేయాలంటే ఏటా రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి రానుంది. యువ వికాసం... గందరగోళం యువ వికాసం గ్యారంటీలో భాగంగా ఇంటర్ నుంచి వృత్తి విద్యా కోర్సుల వరకు అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు ఫీజుల నిమిత్తం రూ.5 లక్షల విలువైన విద్యాభరోసా కార్డులు ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ కార్డు ఎలా ఇస్తారు? ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా? వడ్డీ ఎవరు భరిస్తారు? లాంటి వాటిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటివరకు ఇవీ.. ఆరు గ్యారంటీల్లో భాగంగా తొలుత ప్రారంభించింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి. ఈ పథకం ప్రారంభించే నాటికి ఆర్టీసీ బస్సుల్లో సగటు ఆక్యుపెన్సీ రేషియో 66 శాతం మాత్రమే. కానీ పథకం ప్రారంభమయ్యాక అది క్రమంగా వంద శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళల సంఖ్య 25 కోట్లను మించిపోయింది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక గృహజ్యోతి కింద తొలి నెలలో లబ్ధి పొందిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న గృహ కనెక్షన్ల సంఖ్య 95.23 లక్షలు కాగా, తెల్ల రేషన్‌కార్డు, ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో లబ్ధిదారుల సంఖ్య సగానికి పైగానే తగ్గిందని తెలుస్తోంది. మరోవైపు ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రంలోని 20 లక్షల మందికి ఇళ్ల సౌకర్యం కల్పించాలన్నది లక్ష్యం కాగా, ప్రస్తుతం సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల నగదు సాయం పథకాన్ని ప్రారంభించారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోని వారి పరిస్థితేమిటి? ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో డూప్లికేషన్లు, ఇప్పటికే లబ్ధి పొందిన దరఖాస్తులు కూడా ఉన్నాయని ప్రభుత్వం చెపుతోంది. ఇదిలావుంటే అసలు చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేదు. దీంతో తెల్ల రేషన్‌కార్డు ఉన్నప్పటికీ పథకాల లబ్ధి పొందలేకపోవడం గమనార్హం. ప్రతి నాలుగు నెలలకోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం చెపుతోంది. ఈ లెక్కన ఏప్రిల్ నెలాఖరులో మరోమారు ప్రజాపాలన నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఆరు గ్యారంటీల అమలుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 100 రోజుల్లో అమలు సాధ్యం కాదని తెలిసీ ఎందుకు గ్యారంటీ ఇచ్చారని ప్రశి్నస్తున్నాయి. వంద రోజులు పూర్తయిన తర్వాత పోరాట కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నాయి. -
మే 20 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మే 20 నుంచి జూన్ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్‌ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్‌లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్‌ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్లైన్ మోడ్‌లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్‌లో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. -
ప్రజాసంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
హుజూర్నగర్, పాలకవీడు: ప్రజాసంక్షేమం.. అభి వృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఫణిగిరి గుట్ట వద్ద రూ.74.80 కోట్లతో 2,160 సింగిల్ బెడ్రూం ఇళ్ల పునర్నిర్మాణ పైలాన్ ఆవిష్కరించారు. రూ.50 లక్ష లతో క్రిస్టియన్ సిమెట్రీ, రూ.కోటితో టౌన్హాల్లో అభివృద్ధి పనులు, రూ.33.83 కోట్లతో పాలకవీడు మండలం బెట్టెతండ గ్రామం వద్ద మూసీనదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పనులకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లా డుతూ.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ఇప్పుడు మరోసారి అవకాశం రావడంతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయ న్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వంలో ధరణి పేరుతో వేలాది కోట్ల ఆస్తులు ఎలా దోచుకుని దాచుకున్నారో..ఆ లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం అభివృద్ధిపై పెట్టలేద ని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లలో అర్హుల ఎంపికకు రాజకీయాలకతీతంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇళ్లు అందించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్షా 12 వేల ఇళ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందిస్తామని చెప్పారు. వంద రోజుల్లో ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అనేక రంగాల్లో అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభు త్వంలో ఎన్నో లిఫ్ట్‌లు, రహదారులు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. త్వరలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లత, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు. -
సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ కేటగిరిలో.. మేనేజ్మెంట్ ట్రైనీ (ఈ అండ్ ఎం) పోస్టు లు 42, మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) పోస్టులు 7, నాన్ ఎగ్జి క్యూటివ్ కేడర్ కేటగిరీలో జూనియర్ మైనింగ్ మేనేజర్ ట్రైనీ పోస్టులు 100, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (మెకానిక ల్) పోస్టులు 9, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు 24, ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రిషన్ ట్రైనీ పోస్టులు 98 అందులో ఉన్నాయి. ఈనెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నా రు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్సైట్ www.scclmines.com ను సంప్రదించాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. -
త్వరలోనే ఇంటి నుంచి పార్శిళ్ల సేకరణ, డెలివరీ
సాక్షి, హైదరాబాద్: టికెటేతర ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వ సహకా రంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింత గా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. విని యోగదారులకు వేగవంతమైన సేవలను అందజేసేందుకు త్వరలో ఇంటి నుంచే పార్శిళ్ల సేక రణ, డెలివరీ సేవలను అందుబాటులోకి తేను న్నట్లు వెల్లడించారు. దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన లాజి స్టిక్స్ మోడల్ కౌంట ర్ను గురువారం ఆయ న ప్రారంభించారు. లాజిస్టిక్స్ విభాగం కొత్త లోగో, బ్రోచర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారు లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం విని యోగించే కొత్త వాహనాన్ని కూడా ఎండీ జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ లాజి స్టిక్స్ విభాగం ద్వారా ప్రతిరోజూ సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నట్లు వివరించా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శి ళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామన్నారు. దీంతో ఈ ఏడాది తమకు సుమారు రూ.120 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రాంతంలో మాత్రమే విని యోగదారుల ఇంటి నుంచి వస్తువుల సేకరణ, డెలివరీ సేవలు అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు... నగరవాసులు ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040–69440069 కు సంప్రదించవచ్చు.లేదా ఆర్టీసీ వెబ్సైట్ జ్టి్టpట://ఠీఠీఠీ.్టటట్టఛి ౌజజీట్టజీఛిట.జీnలో కూడా లాగిన్ కావచ్చు. -
నేటి నుంచే టీజీ రిజిస్ట్రేషన్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలోని వాహనాలు శుక్ర వారం(నేటి) నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, రోడ్డు రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాడాలనే ఆకాంక్షతో పాల్గొన్న ఉద్యమకారులు, ప్రజలు తమ వాహనాలపై ఆరోజే టీజీ ఆని రాసుకున్నారని గుర్తు చేశారు. అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ టీజీకి బదులు టీఎస్‌ను తెచ్చి వారి ఆకాంక్షలు, మనోభా వాలను అణచివేసిందని విమర్శించారు. గురువారం హను మకొండ కలెక్టరేట్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌తో కలి సి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు నెరవేరేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖ పంపించామని, శుక్రవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలన్నీ టీజీ మీదనే అవుతాయని, ఇప్పటివరకు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్లు అలాగే ఉంటాయని చెప్పారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు ఫిట్నెస్ టెస్టులు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయంలో నిబంధనలను కఠిన తరం చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు కూడా ఫిట్నెస్ టెస్టులు నిర్వహించాలనే నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి కొత్తబస్సులు తెచ్చామని, త్వరలోనే మరో వెయ్యి బస్సులు తేనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని కేడర్లకు చెందిన 3,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కార్మికులు సంతోషంగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక మూడు సిరీస్‌ల ముచ్చట సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలకు శుక్రవారం నుంచి టీజీ రిజిస్ట్రేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఇకపై మూడు సిరీస్‌లతో తెలంగాణ వాహనాలు కనిపించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వాహనాలకు ఏపీ సిరీస్ కొనసాగింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 జూన్‌లో టీఎస్ సిరీస్ అందుబాటులోకి వచ్చినా, అప్పటివరకు ఏపీ సిరీస్‌తో ఉన్న వాహనాలకు పాత సిరీస్‌నే కొనసాగించొచ్చని నాటి ప్రభుత్వం పేర్కొంది. దీంతో 2014 జూన్(టీఎస్‌గా మారకముందు)కు ముందు నాటి వాహనాలు ఏపీతో, ఆ తర్వాతవి టీఎస్‌తో కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి టీజీ సీరీస్ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. దీంతో మూడు సిరీస్‌లతో వాహనాలు కనిపించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,91,666 వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 70,81,345 వాహనాలు ఏపీ సిరీస్‌తో ఉండగా, 98,10,321 వాహనాలు టీఎస్ సిరీస్‌తో నడుస్తున్నాయి. రాష్ట్ర సిరీస్ తప్ప జిల్లా సిరీస్‌లు యధాతథంగా కొనసాగుతాయి. టీజీ జెడ్ ఆర్టీసీ వాహనాలకు, టీజీ09 పీ పోలీసు వాహనాలకు, నంబర్ల పక్కన టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లు రవాణా వాహనాలకు కొనసాగుతాయి. -
ప్రపంచంలో అత్యుత్తమంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వేదికపై అత్యుత్తమ నగరంగా నిలపాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇంధన సామర్థ్య సాధన ద్వారా ప్రపంచంలోనే పెట్టుబడులకు సురక్షిత నగరంగా హైదరాబాద్ త్వరలో రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా మూసీ నది పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలు ఇందులో భాగమని స్పష్టం చేశారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి హైదరాబాద్‌లో మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్) పోస్టర్‌ను గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, నగర సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థల్ని మెరుగుపరచడం కూడా ప్రభుత్వ లక్ష్యమని దానకిశోర్ చెప్పారు. ఇవన్నీ పూర్తయితే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈసీబీసీతో విస్తృత ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో), బీఈఈ సంయుక్త భాగస్వామ్యంతో ఇంధన శక్తి సామర్థ్య నిర్వహణ, పర్యావరణ లక్ష్యాల్ని అందుకునేందుకు దానకిశోర్ నేతృత్వంలో చర్చించి, పలు నిర్ణయాల అమలుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నగరంలో ఇకపై ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)కు అనుగుణంగానే కొత్త ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు. బీఈఈ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈసీబీసీ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు ఆర్థిక, తదిత విస్తృత ప్రయోజనాలను అందిస్తుందని భావిస్తున్నారు. బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవ్రా, బీఈఈ డైరెక్టర్లు సౌరభ్ దీదీ, ఎస్కే వర్ణా, బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్ ఫిల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారు. పార్టీలోకి సీఎం రేవంత్ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ మా ఇంటికి వచ్చాడు అని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్ర పెద్దలపై జితేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి పలు సెటైరికల్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్ చేయడంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ జితేందర్ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy met former MP BJP leader Jithender Reddy at his residence.#RevanthReddy • @revanth_anumula • @apjithender • @mpponguleti • @Drpmahendereddy pic.twitter.com/biQVwz2R3w — Congress for Telangana (@Congress4TS) March 14, 2024 -
తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
Phone Tapping Case: కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్‌రావు
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) ప్రణీత్ రావు అరెస్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్‌లు చేశానని, ఆ సమాచారాన్ని ధ్వంసం కూడా చేశానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని స్పెషల్ టీం భావిస్తోంది. ‘‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశా. పూర్తి సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్ఐబీ చీఫ్ దాకా ఆ సమాచారం అందజేశాను. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశా. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్‌లపై నిఘా పెట్టాను.. .. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చాను. అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాల మేరకు ఆ సమాచారం మొత్తం ధ్వంసం చేశా. సెల్ఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు వేల సంఖ్యలో పత్రాలు ధ్వంసం చేశాను’’ అని ప్రణీత్‌రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ మీద చంచల్‌గూడ జైల్లో ఉన్న ప్రణీత్‌రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక టీం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఆయన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ తో పాటు పలువురు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు సిద్ధమవుతోంది. -
కేసీఆర్ అన్న కొడుకుపై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, ఆదిభట్ల: తెలంగాణలో భూ కబ్జాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో, ఈ భూ కబ్జా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, అతడి గ్యాంగ్ ప్రయత్నించినట్టు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ అంశంపై ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదులో తమ భూమి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్ళు పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో, కన్నారావుతో పాటు అతని అనుచరులు బీఆర్ఎస్ నాయకులు 38 మందిపై 307,447,427.,436,148,149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 38 మందిలో ముగ్గురని పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోగా మరో 35 మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కన్నారవు బెంగుళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. -
ప్రధాని మోదీ తెలంగాణ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల నగారా మోగనుందనే సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఈ నెల 15న మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ..మల్కాజ్గిరి స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. సిట్టింగ్ సికింద్రాబాద్ స్థానం సహా మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై ఫోకస్ పెట్టిన కమలదళం..ప్రచారపర్వంలోకి జాతీయ నేతలను రంగంలోకి దించుతోంది. రెండు రోజుల క్రితం హోం మంత్రి అమిత్‌షా నగరంలో పర్యటించగా..పది రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి రాష్ట్రానికి వస్తుండడం గమనార్హం. ఇటీవల నగర శివార్లలోని పటాన్చెరులో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తోంది. మల్కాజ్‌గిరిలో సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. పీఎం పర్యటన నేపథ్యంలో ఆంక్షలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ నెల 15న మల్కాజ్‌గిరిలో జరగనున్న సభలో మోదీ పాల్గొననున్నారు. దీంతో మీర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు 5 కి.మీ. మేర పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగరవేయడానికి అనుమతి లేదని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188, 121, 121 (ఏ), 287, 336, 337, 338 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ► రేపు సాయంత్రం 4.55కి బేగంపేట విమానాశ్రయంకు చేరుకోనున్న ప్రధాని ► సాయంత్రం 5.15 నుంచి 6.15 వరకు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టే రోడ్ షోలో పాల్గొననున్నారు. ► 6.40 గంటలకు రాజ్ భవన్ చేరుకోనున్న ప్రధాని.. రాజ్‌భవన్‌లో బస. ► ఈ నెల 16న ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని ► 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నాగర్ కర్నూల్ వెళ్లనున్న మోదీ ► 11.45 నుంచి 12.45 వరకు నాగర్ కర్నూల్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ ►ఒంటి గంటకు నాగర్ కర్నూల్ నుంచి గుల్బర్గా వెళ్లనున్న ప్రధాని. -
ఇంటర్ స్పాట్ షురూ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియ మరింత ఊపందు కుంటుందని అధికారులు తెలిపారు. నెల రోజు ల పాటు ఇది కొనసాగుతుందని, పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాల (స్పాట్ వాల్యూయేషన్)కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన కేంద్రాలనూ పెంచారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో మరో కేంద్రం అదనంగా ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలు గు రువారం ముగియనున్న నేపథ్యంలో మూల్యాంకనం చేపట్టాల్సిన అధ్యాపకులు కొందరు ఇంకా ఇన్విజిలేషన్ విధుల్లోనే ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే వీరు కూడా ‘స్పాట్’లో భాగస్వాములవుతారని ఇంటర్ పరీక్షల విభాగం తెలిపింది. ఈ ఏడాది నుంచి మూల్యాంకనాన్ని ఆన్లైన్లో పూర్తిస్థాయిలో చేపట్టాలని భావించారు. కానీ ప్రభు త్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఎప్పటిలాగే సాధారణ పద్ధతిలో మూల్యాంకనం చేపడుతున్నారు. నిరంతర పర్యవేక్షణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సమాధాన పత్రాలు 60 లక్షల వరకూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మూల్యాంకన కేంద్రానికి చేరుకోగానే ఓఎంఆర్ షీట్లో ఉన్న విద్యార్థి వ్యక్తిగత సమాచారం తొలగిస్తారు. దీని స్థానంలో కోడ్ నంబర్ ఇస్తారు. కోడింగ్ మొత్తం ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా అనుసంధానమై ఉంటుంది. తద్వారా సమాధాన పత్రం ఎవరిది అనే విషయం మూల్యాంకనం చేసే వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఆయా కేంద్రాల్లో నిర్దేశిత సబ్జెక్టు అధ్యాపకులు సమాధాన పత్రాలను పరిశీలించి మార్కులేస్తారు. వీటిని మూడు దఫాలుగా అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కుల వివరాలు ఆన్లైన్ ద్వారా బోర్డుకు అందుతాయి. మార్కులు కంప్యూటరైజ్ చేసిన తర్వాత అధికారులు డీ కోడ్ చేస్తారు. అన్ని సబ్జెక్టు మార్కులను క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు సగటున కొన్ని పేపర్లను మరోసారి పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ అంతటిపై ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఆయా దశలను దాటిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. వారం ముందుగానే ఫలితాలు? ఇంటర్ పరీక్ష ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. ప్రతి ఏటా ఏ ప్రిల్ నాలుగోవారంలో వెల్లడించడం ఆనవాయితీ. అయితే ఈసారి ఇంతకన్నా ముందే రిజల్ట్స్ ఇవ్వాలని అధికారులు అనుకుంటున్నారు. మూల్యాంకన ప్ర క్రియతో పాటు డీకోడింగ్ విధానాన్ని వేగంగా పూర్తి చేసి మూడో వారంలోనే ఫలితాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటించేందుకు కృషి చేస్తున్నామని ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి జయప్రదాభాయ్ తెలిపారు. -
ఇంజనీరింగ్ కొలువుల భర్తీ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) ఉద్యోగాల భర్తీలో ముందడుగు పడింది. ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలు నిర్వహించి ఏడాది కావస్తుండగా... తాజాగా కేటగిరీల వారీగా ప్రాథమిక ఎంపిక జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 సెపె్టంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 11 ప్రభుత్వ విభాగాల్లో 1,540 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకుగాను గతేడాది జనవరిలో అర్హత పరీక్షలను కమిషన్ నిర్వహించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ... ఆ తర్వాత గతేడాది మే నెలలో మరోమారు అర్హత పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలో తాజాగా ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కమిషన్ వెల్లడించింది. 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఏఈఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కూకట్‌పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ)లోని పరిపాలన విభాగంలో ఈ పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను తెరిచి చెక్‌లిస్టు డౌన్లోడ్ చేసుకోవాలని, అప్లికేషన్ పత్రాలను రెండు కాపీలు ప్రింట్ తీసుకోవాలని, అదేవిధంగా అటెస్టెషన్ పత్రాలను కూడా రెండు సెట్లు ప్రింట్ తీసుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. చెక్‌లిస్టులో నిర్దేశించినట్లుగా అభ్యర్థులు అన్నిరకాల సర్టిఫికెట్లుతో హాజరు కావాలని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించకుంటే తదుపరి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చేది లేదని కమిషన్ తేల్చిచెప్పింది. వెబ్సైట్లో డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ పరీక్షల తేదీలు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(హెచ్‌డబ్ల్యూఓ) ఉద్యోగ అర్హత పరీక్షల తేదీలను కూడా కమిషన్ వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. డీఏఓ ఉద్యోగ ఖాళీలు 53, హెచ్‌డబ్ల్యూఓ ఖాళీలు 581 ఉన్నాయి. -
ఆ ఎంపీ సీటుపై అయోమయం.. ముగ్గురు మంత్రుల ‘సై’
కాంగ్రెస్ అధిష్టానంకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సవాల్‌గా మారిందా?.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు సీరియస్‌గా టికెట్ ట్రై చేస్తూ ఉండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అయోమయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందా?.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏ పార్లమెంటు సెగ్మెంట్లో లేని పోటి అక్కడే ఉండటానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయా?...కాంగ్రెస్‌కు కొంత తలనొప్పులు తెచ్చిపెడుతున్న ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాలలో మిగత 13చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే 13 స్థానాలల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ తలనోప్పిగా మారింది మాత్రం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయాలు అన్నిఇన్ని కావు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయలంతా ఖమ్మం చుట్టే తిరిగాయని చెప్పాలి. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పాలిటిక్స్ ఖమ్మం వైపే టర్న్ అయ్యాయనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకే మళ్లీ టికెట్ ప్రకటించింది...అయితే బీఆర్ఎస్ లో పెద్దగా పోటి లేకపోవడంతో మళ్లీ నామా కే టికెట్ ఇచ్చారు.. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితితి లేదు. టికెట్ కోసం తీవ్రమైన పోటి ఉండటంతో కొత్త కొత్త ఈక్వేషన్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ముగ్గురు మంత్రులు సై అంటే సై అంటున్నారు. బయటకు కనిపించకపోయిన టికెట్ ఎపిసోడ్ లో లోలోపల కత్తులు దూసుకుంటున్నారన్న ప్రచారం నడుస్తుంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్‌ను ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు పోటి పడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలేదన్నట్లు టికెట్ కోసం పట్టుపడుతూ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లలు పడుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానంను కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పనిచేసిన కారణంగా పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉన్న సమయంలో పొంగులేటి చేరికతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి...కేసీఆర్ పై తీవ్రస్తాయిలో విమర్శలు చేస్తు దూకుడు గా ముందుకు వెళ్లారు పొంగులేటి...పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానంలో కూడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలవనియ్యను. అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పొంగులేటి చేసిన శపథం పెద్ద సంచనలనానికే దారీతీసింది. ఎవరినా కదిలించిన పొంగులేటి శపథంపైనే చర్చ జరిగింది. దీంతో గత ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకోని టికెట్ తన సోదరుడుకి ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. మరోవైపు డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని సైతం తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దీంతో భట్టి విక్కమార్క సైతం తన సతీమణికి టికెట్ ఇప్పించేందుకు అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక కీలకంగా తను పనిచేశానని చెప్పుకుంటు భట్టి విక్కమార్క సైతం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది. అటు మల్లు నందిని సైతం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికే అధిష్టానం ప్రయార్టీ ఇస్తుందనే దీమాతో ఉన్నారు. టికెట్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కొడుకు తుమ్మల యుగేంధర్ సైతం కమ్మ కోటాలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు..తెరవెనుక చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు టర్న్ అవ్వడంలో తుమ్మల కీలకంగా వ్యవహరించారన్న ఈక్వేషన్స్ తో వారు కూడ రేసులో ముందు వరుసలో ఉన్నామంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముగ్గురు మంత్రులు పనిచేశారు...గ్రూపు పాలిటిక్స్ ను పక్కనే పెట్టి అంత ఒక్కటిగా ముందుకు వెళ్లడంతో ఫలితాలు సైతం కాంగ్రెస్‌కు అనుకులంగా వచ్చాయి. సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోయాయి. ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు టికెట్ కోసం పోటి పడుతుండటంతో లెక్కలు తప్పుతున్నాయి..ప్రస్తుతం పైకి అందరు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న టికెట్ విషయంలో చాలా సీరియస్‌గా ఎవరికి వారు వారి వారి రూట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వస్తదంటే తమకు వస్తుందని ముగ్గురు దీమాతో ఉన్నారు. ముగ్గురు సీనియర్ నేతలు కావడంతో ముగ్గురు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ముగ్గురులో అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎ పార్లమెంట్ స్థానంకు ఇంత తీవ్రస్తాయిలో పోటి లేదనే చెప్పాలి...అయితే ఒక మంత్రికి సంబంధించిన వారికి టికెట్ ఇస్తే మిగత ఇద్దరు మంత్రులు వారికి సపోర్ట్ చేస్తారా లేదా అన్న ఆసక్తికర చర్చ సైతం నడుస్తుంది. వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ స్థానంకు మొదట నలుగురు మద్య పోటి ఉండేది. కానీ ఇందులో రేణుక చౌదరికి రాజ్యసభ ఖారారు చేయడంతో కొంత పోటి తగ్గింది అది మూడుకు చేరింది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానంకే సవాల్‌గా మారిన ఖమ్మం పార్లమెంట్ ఎంపిక విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని తెలిపారు. దేవుడిపై భక్తి భావంతోనే అలా చేశానని పేర్కొన్నారు. ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన్నట్లు ట్రోల్ చేస్తున్నారని అన్నారు. తనను ఎవరూ అవమానించలేదని, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంత మంది భావించారని.. తనను ఎవరూ అవమానించలేదన్నారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదని తెలిపారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక వంటి మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. అయితే యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్‌పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి స్టూల్‌పై కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సహా ఇతర పార్టీల నేతలంగా భట్టిని అవమానించారని కాంగ్రెస్ పార్టీపై మండిపడిన విషయం తెలిసిందే. చదవండి: కాంగ్రెస్, బీఆర్ఎస్ అజెండా ఒక్కటే: కేంద్ర మంత్రి అమిత్ షా -
కాంగ్రెస్, బీఆర్ఎస్ అజెండా ఒక్కటే: కేంద్ర మంత్రి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: భాగ్యలక్ష్మి అమ్మవారికి, భద్రాద్రి రాముడికి నమస్కారాలు తెలుపుతూ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎవరు అధికారంలో ఉండాలో తేలిపోతుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా.. బీజేపీ సోషల్‌మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.‘ఇళ్లు ఇళ్లు తిరిగి ప్రచారం చేసే కార్యకర్తకు ఎంత హక్కు ఉందో సోషల్ మీడియాకు అంతే. మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రాబోతుంది.దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ పేరు తప్ప వేరే పేరు వినిపించడం లేదు. తెలంగాణలో 12 కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలవాలి. 10ఏళ్లలో మోదీ సర్కార్ అవినీతిని అంతం చేసింది. దేశం సురక్షితంగా ఉంది అంటే కారణం మోదీ సర్కార్. మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. 5 వందల ఏళ్ల కల నెలవెర్చిన ఘనత మోదీ సర్కార్‌ది. గతంలో కాంగ్రెస్ సర్కార్ చేయని పని మోదీ చేసి చూపించాడు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మోదీ... కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం మాత్రమే చేసింది. మోదీ సర్కార్ చేసి చూపించింది. ట్రిపుల్ తలాక్ తీసివేసిన వ్యక్తి మోదీ. మహిళ రిజర్వేషన్ కల్పించారు. సీఏఏ నిర్ణయం కూడా మోదీ సర్కార్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేయని పనిని మోదీ సర్కార్ చేసి చూపించింది. సీఏఏని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మీ చేతిలో మెక్ ఇన్ ఇండియా ఫోన్ ఉంది.దీని ఘనత మోదీది. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు వేరు ఎజెండా ఒక్కటే, మజ్లిస్ ఎజెండా లో మిగితా పార్టీలు నడుస్తాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మొత్తం కుటుంబ పార్టీలే... అవినీతి పార్టీలే ఈ మూడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్న కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. రూ. 12లక్షల కోట్ల అవినీతి చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అభివృద్ది మోదీ తోనే సాధ్యం.ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తి మోదీ. మోదీ జీవితం మొత్తం ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాడు. మోదీ విరామం లేకుండా పని చేస్తున్నాడు..రాహుల్ బాబా విశ్రాంతి కోసం విదేశాలకు వెళతాడు. సీఎం రేవంత్‌రెడ్డిని అడుగుతున్న గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రూ. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క తెలంగాణకు మోదీ రూ. 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల భరతం పట్టాడు మోదీ. ఇండియా అలయన్స్, బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరు. 400 స్థానాల్లో 12 కంటే ఎక్కువ స్థానాలు తెలంగాణ నుండి ఉండాలి’ అని అమిత్ షా అన్నారు. -
జోరుగా బోర్ల తవ్వకం
కౌటాల: సాగు, తాగునీటి అవసరాల కోసం రైతులు, ఇతరులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూగర్భంలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వందల ఫీట్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇలా డ్రిల్లింగ్ చేసిన వాటిలో 70శాతానికి పైగా విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అవగాహన కల్పించాలి్సన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అవసరానికి మించి.. నీటి లభ్యత, వాడకంపై అవగాహన లేని కొంతమంది రైతులు పంటలకు అవసరానికి మించి నీరందిస్తున్నారు. దీంతో నీటి కొరత ఏర్పడుతుండడంతో బోర్లు తవ్వాలని ఆరాటపడుతున్నారు. బోరు వేసేందుకు నిపుణులైన జియాలజిస్టులను సంప్రదించకుండా బాబాలు, గురువులను ఆశ్రయిస్తున్నా రు. టెంకాయ, తంగెడు పుల్లలతో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ అప్పుల పాలవుతున్నారు. బోరులో నీళ్లు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అవస్థలు పడుతున్నారు. బోర్వెల్ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కో బోరుబావిని దాదాపు 200 మీటర్ల లోతు వరకు తీస్తున్నారు. అందుకు రూ. 50వేల నుంచి రూ. 60 వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారు. పరీక్షలకు స్వస్తి.. భూగర్భ జలాల లభ్యతపై ప్రతీ మండలంలో అధికారులు ఏటా పరీక్షలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, అంతకు ముందు నమోదైన వర్షపాతంపై ఆధారపడి భూగర్భ జలమట్టం మారుతుంది. నీటి లభ్యత పరీక్షల అనంతరం, అధికారులు తక్కువ నీళ్లున్న గ్రామాల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉన్న జీపీల్లో కొత్త బోరుబావుల తవ్వకాన్ని నిషేధించాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా అసలు ఈ పరీక్షలే నిర్వహించడం లేదు. నిబంధనల ప్రకారం బోర్లు, బావులు తవ్వాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. మీ సేవ ద్వారా చలానా తీసి రెవెన్యూ అధికారులు, రక్షిత మంచినీటి శాఖ అధికారుల ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. నీటి లభ్యత వంద గజాల దూరంలో ఉంటేనే అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే రూ. లక్ష జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. అనుమతులు తీసుకోకుండానే.. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా బోరుబావులు తవ్వకూడదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బోరు లారీలు వచ్చి మండలాల్లోని ఆయా గ్రామాల్లో జోరుగా అనుమతి లేకుండా బోర్లు వేస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్లు వేసే యజమానులు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు స్పందించి అనుమతుల్లేని బోరు తవ్వకాలు నియత్రించి రాబోయే తరాలకు నీటి కరువు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు డ్రైవ్‌ను కొనసాగించాలంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, ఇంకా మిగిలిపోయిన దరఖాస్తులను క్లియర్ చేయడమే లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీసీఎల్ఏ సూచించారు. ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే: కోదండరెడ్డి, సునీల్ ధరణి పోర్టల్ విషయంలో తాము ఇప్పటివరకు ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక చికిత్స) మాత్రమే ఇస్తున్నామని, అసలు ట్రీట్మెంట్ను ఇంకా ప్రారంభించలేదని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, భూమి సునీల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్లో వారు విలేకరులతో మాట్లాడారు. గతంలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారం కోసమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్‌ను ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించిందని చెప్పారు. అయితే ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం నిరంతరం జరగాల్సిందేనన్నారు. గతంలో కలెక్టర్లు మాత్రమే ఈ దరఖాస్తులను పరిష్కరించేవారని, ఇప్పుడు తహశీల్దార్, ఆర్డీవోల స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరపడమే కాకుండా, పరిష్కారానికి నిర్దేశిత టైంలైన్ విధించామని తెలిపారు. ధరణి పోర్టల్ విషయంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, చట్టాలు, వ్యవస్థ, సాంకేతికతలో మార్పులు తీసుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాల పరిధిలో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదికలిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నా రు. ప్రస్తుతం చేపడుతున్నవి తాత్కాలిక చర్య లు మాత్రమేనని, 2, 3 నెలల్లో శాశ్వత పరిష్కారాలు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మాజీ ఎంపీ సంతోశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, నిషేధిత జాబితాలోని భూములను కూడా రాత్రికి రాత్రి బదలాయించుకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. -
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రేవంత్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. సోమవారం నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సతీమణి గీతారెడ్డితో కలసి తొలిపూజలో పాల్గొన్నా రు. తొలుత తూర్పు త్రితల రాజగోపురం వద్ద సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దీపజ్యోతి వద్ద సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం వెంట పూజల్లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. 12 గంటలకు భద్రాచలం వెళ్లారు. స్వర్ణ తాపడం పూర్తి చేయించండి యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం రేవంత్‌ను ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు పూర్తి చేయించాలని ఆలయ ఈవో రామకృష్ణారావు కోరారు. కొంత బంగారంతో ధ్వజస్తంభం బంగారు తాపడం చేయించామని తెలిపారు. నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం యాదగిరిగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమ వారం పంచరాత్ర ఆగమం ప్రకారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఉదయం నిత్యారాధనల అనంతరం శ్రీవిష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను మొదలుపెట్టారు. స్వస్తి వచనం, రక్షాబంధన కార్యక్రమాలు, పారాయణలు నిర్వహించారు. ప్రొటోకాల్ వివాదం సీఎం పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. దేవస్థానం అధికారులు సీఎంకు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో డిప్యూటీ సీఎంకు.. మంత్రులకు వేసిన పీటల కంటే చిన్నపీట వేయడం వివాదాస్పదమైంది. సీఎం పక్కన ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ సమానమైన ఎత్తు పీటలపై కూర్చున్నారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖను ఆశీర్వచనం ఇస్తున్న అర్చకుల వెనుక కూర్చోబెట్టారు. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు స్పందిస్తూ, సీఎంతో పాటు మంత్రులందరికీ పీటలు వేశామని, ఇందులో ప్రొటోకాల్ వివాదమేమీ లేదన్నారు. -
చేతులెత్తి మొక్కుతున్నాం..
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్ గేట్లకు మొక్కారు. రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా, 55 రోజుల తర్వాత కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారని దాసోజు శ్రవణ్ మీడియాకు తెలిపారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటాలో కోదండరాం, అమేర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారన్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల కాగా, కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను నామినేట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని హైకోర్టు పేర్కొందన్నారు. అట్టడుగు కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలని దాసోజు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము ఇద్దరూ గతంలో బీజేపీ, దాని అనుబంధ విభాగాల్లో పనిచేశామని దాసోజు, కుర్రా సత్యనారాయణ తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. -
డూప్లెక్స్ ‘ఇందిరమ్మ’!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లలో ఈసారి డూప్లెక్స్ తరహా నిర్మాణాలు దర్శనమిస్తాయా? పేద వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి ఆధారంగా ప్ర భుత్వం ఆ దిశగా యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. దిగువ అంతస్తులో కొన్ని గదులు, పై అంతస్తులో కొన్ని గదులు నిర్మించటం దీని ఉద్దేశం. కాదంటే పెద్ద సంఖ్యలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు చేజారే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం 400 చదరపు అడుగుల్లో... గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు చిన్నవిగా ఉండటంతో ఈసారి విశాలమైనవి సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ప్రతి ఇంట్లో కచ్చితంగా వంటగది, టాయిలెట్ నిర్మించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇవికాకుండా మరో రెండు గదులు ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం ఇల్లు సమకూరాలంటే కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మించాల్సి ఉంటుంది. అందుకు 60 గజాల వరకు స్థలం అవసరం. కానీ, చాలామంది నిరుపేదలకు అంతమేర స్థలం లేదు. 30 గజాలలోపు స్థలం ఉన్నవారు ఎందరో. అందులో నిర్మించాలంటే, నిబంధనల ప్రకారం ఖరారు చేసిన విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం అసాధ్యం. ఇరుకు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. అందుకు నిర్ధారిత యూనిట్ కాస్ట్ రూ.5 లక్షల కంటే తక్కువ మొత్తం విడుదల చేయాల్సి ఉంటుంది. ఇది తమ హామీకి విరుద్ధంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం రూ.5 లక్షలు కచ్చితంగా అందించాలంటోంది. అంత మొత్తంతో ఇంటిని నిర్మించాలంటే 60 గజాల స్థలం ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో తక్కువ స్థలం ఉన్న నిరుపేదల్లో ఆందోళన మొదలైంది. తమకున్న చిన్న స్థలంలో నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించాలంటే కచ్చితంగా డూప్లెక్స్ తరహాలో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పడక గదులను పైన నిర్మించుకుని, వంటిల్లు, హాలు, మరుగుదొడ్డిని దిగువ అంతస్తుల్లో నిర్మించాలి. ఈ నమూనాకు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆడబిడ్డల పేరిట ఇందిరమ్మ ఇళ్లు
మహిళల పేరిటే ‘ఇందిరమ్మ’ ఇళ్లు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే. ఇంటి పెత్తనం తమ చేతిలో ఉంటే చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టా మహిళల పేరుతోనే ఉంటుంది. తద్వారా ఆ ఇల్లు బాగుంటుంది. పిల్లలు చదువుకుంటారు. ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతుకుతుందనేది మా ప్రభుత్వ భావన. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని.. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టేనని, అందుకే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే ఇస్తామని చెప్పారు. సోమవారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. తర్వాత ఇక్కడి వ్యవసాయ మార్కెట్ మైదా నంలో నిర్వహించిన సభలో ఇందిరమ్మ ఇళ్ల పథ కాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. రేవంత్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘భద్రాచలం రాముడి సాక్షిగా ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. పేదల చిరకాల కోరిక ఇది. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్లు. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే, పది మందిలో తలెత్తుకొని నిలబడాలంటే సొంతిల్లు ఉండాలని ఆలోచించి నాడు వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాశమే హద్దుగా లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. పేదలు నేటికీ ఆ ఇళ్లలో ఉంటున్నారు. నాటి పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. పెళ్లయి పిల్లలతో కుటుంబంగా మారారు. వారు కూడా సొంతింట్లో ఆత్మగౌరవంతో బతకాలనే ఆశయంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ అబద్ధాలకు కాలం చెల్లింది 2014 ఎన్నికలకు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బె డ్రూం ఇల్లు ముద్దు అంటూ పేదల సొంతింటి కలలతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారు. పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఇదే కథ మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాల కు కాలం చెల్లడంతోనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. మేం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేస్తాం. డబుల్ బెడ్రూం ఇళ్లున్న ఊళ్లలో కేసీఆర్ ఓట్లు వేయించుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లలోనే మేం ఓట్లు వేయించుకుంటాం. ఇందుకు కేసీఆర్ సిద్ధమా? ఆ ఊళ్లలో ఓట్లు వేయించుకోండి ప్రధాని మోదీ మాటలకు హద్దే లేదు. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసి తీయని మాటలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదు. 2022 నాటికి దేశంలోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని గత ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి కేంద్రం రాష్ట్రంలో ఎక్కడ ఇళ్లు కట్టించిందో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ చెప్పాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లున్న చోట బీజేపీ నాయకులు ఓట్లు వేయించుకోవాలి. మేం అక్కడ ఓట్లు అడగబోం. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ పెట్టుబడి కూడా రాక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. భద్రాచలం రిటైనింగ్ వాల్‌కు రూ.500 కోట్లు గోదావరి ముంపు నుంచి భద్రాచలం పట్టణాన్ని రక్షించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.500 కోట్లు మంజూరు చేశాం. ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. రాముల వారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి తుమ్మల అడిగారు. అన్నింటినీ పరిశీలిస్తాం. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నందునే ముగ్గురు మంత్రులను ఇచ్చాం. ఇటీవల రేణుకాచౌదరిని రాజ్యసభకు ఎంపిక చేశాం..’’అని రేవంత్ చెప్పారు. సభలో పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు చెందిన పలువురు మహిళలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రులతో కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా సీఎం భద్రాచలం పర్యటన సందర్భంగా కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాములవారిని దర్శించుకున్న సీఎం, మంత్రులు భద్రాచలం అర్బన్: భద్రాచలం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్, మంత్రులు తొలుత శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న సీఎం, మంత్రులకు అర్చకులు పరివట్టం కట్టి పూర్ణకుంభంతో ఆహ్వనించారు. గర్భగుడిలో సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి, బెల్లంతో చేసిన రాముల వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. పేదలు గుర్తుంచుకునే రోజు ఇది..: భట్టి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన, పేదలు గుర్తుంచుకునే సందర్భం ఇది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘‘పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం సీతారామచంద్రస్వామి పాదాల సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద, బలహీన వర్గాల వారు రాములవారి సన్నిధిలో ఇంటి పత్రాలు పొందడం శుభకరం. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని అటకెక్కిస్తే.. మేం అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ప్రారంభించాం. దళిత, గిరిజనులు ఇల్లు కట్టుకోవడానికి రూ.6 లక్షలు, మిగతా వర్గాలకు రూ.5 లక్షలు ఇస్తాం. బీఆర్ఎస్లా హామీలిచ్చి విస్మరించకుండా.. బడ్జెట్లో నిధులు కేటాయించాకే పథకాలను ప్రారంభిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తొలి దఫాగా రూ.7,740 కోట్లు కేటాయించాం..’’అని చెప్పారు. -
47% కొలువులు మహిళలకే
సాక్షి, హైదరాబాద్: గడిచిన మూడు నెలల్లో మొత్తం 28,942 కొలువులను భర్తీ చేయగా, అందులో 13,571 (47 శాతం) కొలువులను మహిళలు, 15,371 (51 శాతం) ఉద్యోగాలను పురుషులు దక్కించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్గా అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.3 జారీ చేయగా, దీనితో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో మహిళలు, పురుషులకు లభించిన పోస్టుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కోటా మాత్రమే ఉన్నా, వారు ఏకంగా 47 శాతం ఉద్యోగాలను దక్కించుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాల మేరకు 2022 లోనే రాష్ట్ర ప్రభుత్వం 7593 మెమో జారీ చేసిందని, దాని ఆధారంగానే ప్రభుత్వం ఇటీవల జీవో నం. 3 జారీ చేసిందని అధికారవర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్ మెట్రో రైల్ సక్సెస్.. ఒక కేస్‌స్టడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రాజె క్టుపై ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ప్రశంసలు కురిపించింది. విశ్వవిద్యా లయానికి చెందిన మేనేజ్ మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీ షనర్లకు మెట్రో ప్రాజెక్టు విజయగాథ ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే స్టాన్ఫోర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్ఎస్ఐఆర్) తాజా సంచికలో (స్ప్రింగ్–2024) ప్రచురించింది. ఇది ఒక భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవం అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావలసిన నాయకత్వ లక్షణాలు, తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్ అందజేస్తుంది. ఈ క్రమంలో వివిధ దేశాల్లోని పలు ప్రాజెక్టులపైన విస్తృత అధ్యయనాల్లో భాగంగా ఐఎస్బీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రామ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపైన క్షుణ్ణంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ఒక కేస్ స్టడీగా ఎంపిక చేసుకొని ప్రచురించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు సంస్థ ఎండీ ఎన్వీఎస్రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబరిచినట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఒకదశలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ క్రమంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దాన్ని సుసాధ్యం చేశారని జర్నల్‌లో ప్రశంసించారు. ప్రాజెక్టును విజయపథంలో నడిపించారని, ఇది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని ఈ కేస్ స్టడీ తెలియజేసింది. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ విస్తృత ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకొని అన్ని సమస్యల్లో సమర్ధవంతమైన నాయకత్వ ప్రతిభను ఎన్వీఎస్ కనబరిచినట్లు జర్నల్‌లో ప్రచురితమైంది. -
2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని, 71రోజుల్లో ఇప్పటికే 31వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేశారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో సుమారు రూ.47కోట్లతో నిర్మించిన కె–హబ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీసీ ఆచార్య తాటికొండ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు ధనసరి అనుసూయ(సీతక్క), కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కె–హబ్‌లో మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే నాలుగు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు యూనివర్సిటీల్లోని యువతను రెచ్చగొట్టి దాదాపు పదేళ్లు అ«ధికారంలో ఉన్న గత ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించకుండా విస్మరించిందని విమర్శించారు. -
12కిపైగా స్థానాలు మనవే
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ డజనుకు పైగా స్థానాల్లో పైచేయి సాధిస్తుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన ఓట్లు సాధిస్తుందని, ఓట్ల శాతం కూడా చాలా మెరుగవుతుందన్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో ఆదివారం జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు పార్టీ నేతలు, కేడర్ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో పాలన ముందుకు సాగడం లేదు ‘కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వంద రోజులు కావస్తున్నా పాలన ముందుకు సాగడం లేదు. అవగాహన లేమితో అధికార పార్టీ నేతలు రాష్ట్రానికి నష్టం జరిగేలా వరుస తప్పులు చేస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న తప్పులు, ఆగడాలను ప్రజల్లో ఎండగడుదాం. పార్టీ నుంచి బయటకు వెళ్లే వారి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్న ఘటనలు ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉండే వారికి ఆత్మ విశ్వాసం అవసరం. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై పనిచేసే వారిని ఆశీర్వదిస్తూనే ఉంటారు.’ అని కేసీఆర్ పేర్కొన్నారు. జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్? జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ పేరు దాదాపు ఖరారైంది. ఒకటి రెండు రోజుల్లో అనిల్ పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఈ మేరకు జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీఆర్ఎస్ కీలక నేతలతో జరిగిన భేటీలో కేసీఆర్ సూచన ప్రాయంగా వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే లింగాయత్ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ సరైన అభ్యర్థి అవుతారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. 2019 ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. హరీశ్‌కు సమన్వయకర్తల నియామకం బాధ్యతలు జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయకర్తల నియామకం బాధ్యతను మాజీ మంత్రి హరీశ్‌రావుకు అప్పగించినట్లు సమాచారం. కాగా మెదక్ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్న సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ నేత బీరయ్య యాదవ్ ఆదివారం కేసీఆర్‌ను కలిశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తనకు పోటీ అవకాశం కల్పించాలని కోరారు. కేసీఆర్‌తో జరిగిన భేటీలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.5 లక్షల బీమా!
సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) కింద స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ఎస్‌హెచ్‌జీ మహిళలు మరణిస్తే వారికి సంబంధించిన రుణాలను సైతం మాఫీ చేయనుంది. మరణించిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు సంబంధించిన రుణ బకాయిలను ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేస్తున్నారు. కానీ ఇకపై ఆ బకాయిలను పూర్తిగా మాఫీ చేయనున్నారు. ఎస్‌హెచ్‌జీ మహిళలను పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి ఐకేపీ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ మినీ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు, పోలీసుల యూనిఫామ్‌లను కుట్టే బాధ్యతను సైతం ఎస్‌హెచ్‌జీ మహిళలకే అప్పగించనుంది. వీరి ద్వారానే ప్రభుత్వ బడుల్లోని బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారితో నాప్కిన్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన యంత్ర పరికరాలను కూడా పరిశీలించింది. మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని ఆ పరిధిలోని ఎస్‌హెచ్‌జీలకు యూనిఫామ్‌లు కుట్టడం, శానిటరీ నాప్కిన్ల తయారీలో శిక్షణ ఇప్పించాలని భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం లక్ష మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎస్‌హెచ్‌జీలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చాన్స్ ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ 2018 నుంచి నిలిచిపోగా, త్వరలో మళ్లీ పునరుద్ధరిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ లేని రుణాలతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులను స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తే వారి ఆర్థిక, కుటుంబ స్థితిగతులు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వడ్డీ లేని రుణాల పంపిణీ పునః ప్రారంభించడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా మహిళలకు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీమా ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళల కోసం రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని రైతు బీమా పథకం తరహాలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి బీమా కంపెనీలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏటా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించనుంది. అన్ని తరహా మరణాలకు జీవిత బీమా వర్తించనుంది. మహిళ మరణించిన పక్షంలో నామినీ ఖాతాలో రూ.5 లక్షలను బీమా కంపెనీ జమ చేస్తుంది. 61 లక్షల మంది మహిళలకు బీమా 18–60 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు మాత్రమే ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో సభ్యులుగా ఉండడానికి అర్హులు కాబట్టి వారికే ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రంలో 6.1 లక్షల ఎస్‌హెచ్‌జీ గ్రూపులుండగా, ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మొత్తం 61లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 1.74 లక్షల గ్రూపుల్లో 17.40 లక్షల మంది, గ్రామీణ ప్రాంతాల్లోని 4.36 లక్షల గ్రూపుల్లో 43.6 లక్షల మంది సభ్యులుగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి చింతకాని: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇవ్వని మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో నిర్వహించే మహిళా సదస్సులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. ఏడాదికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలను వడ్డీ లేకుండా అందించనున్నట్లు..ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని పేదలు దశాబ్ద కాలానికి పైగా ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిసోయారని, అయితే ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సోమవారం భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని భట్టి తెలిపారు. -
డీఏపై కేబినెట్లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుతో పాటు ఇతర అంశాలపై ఈ నెల 12న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై కక్ష గట్టి రద్దు చేస్తే, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేశారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందేనని, మంత్రివర్గ ఉప సంఘం శాఖల వారీగా సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఆదివారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనసాగింపుపై త్వరలో నిర్ణయం గత పదేళ్లుగా తమ సమస్యలను చెప్పుకోవడానికి ఉద్యోగులకు అవకాశం లభించలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే వ్యవహరించారని విమర్శించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గవర్నర్‌ను సంప్రదించి ప్రొఫెసర్ కోదండరాంను శాసనమండలికి పంపుతామని, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికి గౌరవమన్నారు. బడులు, కళాశాలలకు ఉచిత విద్యుత్! ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలన్నారు. తెలంగాణ బాపు జయశంకరే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ, తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారని, శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారని తెలిపారు. తెలంగాణ బాపు తానే అని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని విమర్శించారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకరే అని, తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని అన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలన ను గాడిలో పెడుతున్నామని, తాము పదేళ్లు అధి కారంలో ఉండటం ఖాయమని సీఎం అన్నారు. -
అక్రమాల టై‘టానిక్’
సాక్షి, హైదరాబాద్: ఎలైట్ పేరుతో మద్యం వ్యాపా రంలోకి ప్రవేశించిన టానిక్ గ్రూపు ఏకంగా రాష్ట్రంలోని లిక్కర్ దందాను కబ్జా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండు షాపులు పెడతామని, విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముతామని నమ్మబలికి ఎంట్రీ ఇచ్చిన ఆ సంస్థ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఏకంగా గొలుసు వ్యాపారానికి (చైన్ బిజినెస్) సిద్ధమైంది. నాటి ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలక వ్యక్తుల (ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక మాజీ ఉన్నతాధికారి) సాన్నిహిత్యం, సంపూర్ణ సహకారంతో నిబంధనలను తన కనుసన్నల్లో రూపొందించుకుని, తనకు మాత్రమే సాధ్యమయ్యేలా రూల్స్ పెట్టి ఇంకెవరూ ఎలైట్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న టానిక్ సంస్థ గత ఆరేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్నాయంటూ ‘టెండర్’ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.... రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో భాగంగా 2016–18 సంవత్సరాల్లో లాటరీ పద్ధతిన 2,216 ఏ4 షాపులకు లైసెన్సులిచ్చే ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టానిక్ గ్రూపు రంగంలోకి దిగింది. అప్పట్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 70 వరకు షాపులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించింది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ అండ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామంటూ లిక్కర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎలైట్ స్టోర్ పేరుతో కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముకునేందుకు వీలుగా తమకు మాత్రమే సాధ్యమయ్యేలా నిబంధనలను రూపొందించేలా మరీ అడుగుపెట్టింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారే ఎక్సైజ్ శాఖ అధిపతిగా ఉండడం, టీఎస్బీసీఎల్కూ ఆయనే బాస్ కావడంతో ఆయన్ని మచ్చిక చేసుకుని ఎలైట్ స్టోర్ ఏర్పాటు కోసం ప్రత్యేక జీవోను వచ్చేలా చేసింది. కనీసం ఎక్సైజ్ శాఖకు సమాచారం లేకుండానే ఆ జీవో ముసాయిదాను బయట తయారుచేయించి ఆ ముసాయిదాతోనే ఫైల్ నడిపించిందని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారంటే టానిక్ సంస్థ ముందస్తు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎలైట్ షాపు ఏర్పాటు చేసేందుకు గాను ప్లింత్ ఏరియా 10వేల చదరపు అడుగులు ఉండాలనీ, సదరు షాపును సూపర్మార్కెట్లు, మాల్స్‌లో ఏర్పాటు చేయాలంటే ఆయా మాల్స్ మొత్తం వైశాల్యం 25వేల చదరపు అడుగులు ఉండాలని, కనీసం 100 ఇంపోర్టెడ్ బాటిళ్లు ఎప్పుడూ డిస్ప్లే ఉండాలని... ఇలా తమకు మాత్రమే సాధ్యమయ్యే నిబంధనలను జీవోలో పెట్టించి ఇంకెవరూ ఈ ఎలైట్ షాపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వీలులేకుండా చూసుకుంది. 2016, అక్టోబర్ 26న వచ్చిన జీవోనెం:271 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం, వారం రోజుల్లో అనిత్‌రాజ్ లక్ష్మారెడ్డి పేరిట లైసెన్సు ఇవ్వడం కూడా పూర్తయిపోయాయి. చైన్ బిజినెస్ స్థాయికి ప్రణాళిక.. ముందుగా రెండు షాపులు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న టానిక్ సంస్థ తొలుత ఒక్క దుకాణాన్ని మాత్రమే తెరిచింది. కొన్నిరోజుల పాటు విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మిన తర్వాత ఇండియన్ ప్రీమియం లిక్కర్ కూడా అమ్ముతామంటూ ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంది. టానిక్ అడిగిందే తడవుగా ఎక్సై జ్ శాఖ అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో ఈ ఒక్క షాపు ద్వారానే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుండడం, ఎప్పుడో వస్తుందని ఊహించిన ఆదాయం తొలి ఏడాది నుంచే రావడంతో గొలుసు వ్యాపారం చేయాలనే ఆలోచన టానిక్ యాజమాన్యానికి తట్టింది. పుల్లారెడ్డి స్వీట్లు, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లు, నారాయణ, చైతన్య కళాశాలల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్ దుకాణాలు తెరుస్తామని ప్రతిపాదించింది. కానీ అప్పటికే ఏ4 షాపుల టెండర్లు పూర్తి కావడంతో సదరు షాపుల లైసెన్సీల నుంచి ప్రతికూలత వస్తుందని, న్యాయపరంగా అడ్డంకులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గింది. క్యూ/టానిక్‌గా పేర్లుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళిక దెబ్బతినడంతో వైన్స్‌షాపుల వైపు టానిక్ దృష్టి మళ్లింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లాటరీ పద్ధతిలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. అడపాదడపా షాపులు వచ్చినా టెండర్ ఫీజు భారీగా కట్టాల్సి వస్తుండడంతో లైసెన్స్ పొందిన ఏ4 షాపులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలోనికి వచ్చే దాదాపు 10 షాపుల్లో భాగస్వామ్యం తీసుకుంది. తమ వాటా ఉన్న వైన్‌షాపులకు క్యూ/టానిక్‌గా పేర్లు మార్చుకుంది. అచ్చం మాతృ టానిక్ షాపులాగానే ఎలైట్గా వీటిని తయారు చేసి విదేశీ మద్యంతో పాటు ఇండియన్ ప్రీమియం లిక్కర్‌ను మాత్రమే విక్రయించేది. చీప్ లిక్కర్‌తో పాటు తక్కువ ధర ఉండే బ్రాండ్లు అమ్మేందుకు వైన్స్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ఈ టానిక్ చైన్షాపుల్లో మాత్రం లభించేవి కావు. ఇలా భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియలో, తనిఖీల విషయంలో తమకు సహకరించిన ఆరుగురు అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మంచి పోస్టింగులే కాదు... ఆమ్యామ్యాలను కూడా సమర్పించుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న ఒకరి బంధువులు కూడా ఈ టానిక్ చైన్షాపుల్లో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. ఏకంగా ఐదేళ్లకు లైసెన్సు... ఆ తర్వాత రెన్యువల్ సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏ4 షాపులు (వైన్స్), వాకిన్ స్టోర్లకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులిస్తారు. బార్లకు కూడా రెండేళ్లకే లైసెన్స్ ఇచ్చినా గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, టానిక్ ఎలైట్ వాకిన్ స్టోర్‌కు ఏకంగా ఐదేళ్ల లైసెన్సు మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలా ఐదేళ్ల పాటు లైసెన్సు ఇవ్వడమే కాదు మళ్లీ ఆ లైసెన్సును రెన్యువల్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇదే కాదు... రాష్ట్రంలోని అన్ని వైన్స్‌షాపులకు ఉన్న టర్నోవర్ ట్యాక్స్ (టీవోటీ)లోనూ ఈ ఎలైట్ షాపునకు మినహాయింపులిచ్చారు. మూడేళ్ల పాటు ఎంత వ్యాపారం చేసినా టీవోటీ వసూలు చేయవద్దన్న వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనతోనే రూ.వందల కోట్ల వ్యాపారాన్ని యథేచ్ఛగా టానిక్ చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్ శాఖకు అదనపు పన్ను చెల్లించే పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఈ పన్నుల కోసమే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ఎక్సైజ్ శాఖ కూడా నోటీసులు జారీ చేస్తూ గత తప్పిదాలను సవరించుకునే పనిలో పడింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు 21శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చే యాల్సిన రెండు వేతన సవరణ బకాయిల్లో ఒకదా న్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. 2017లో జరగాల్సిన వేతన సవరణకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ఫిట్మెంట్ కాకుండా మధ్యంతర భృతితో సరిపెట్టింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 21 శా తం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ న అందుకోబోయే మే నెల వేతనంతో దీని చెల్లింపు ప్రారంభం కానుంది. ఈ ఏడేళ్లకు సంబంధించిన బ కాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లించను న్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ లేకుండా బకా యిలను మాత్రమే చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. ఇలా పేరుకుపోయి: రాష్ట్ర విభజనకు ముందు 2013లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, నాటి విభజన హడావుడిలో ఉమ్మడి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ ఏకంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ లో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉంటుంది. 2013 వేతన సవరణ తర్వాత 2017లో, మళ్లీ 2021లో జరగాల్సి ఉంది. ఈ రెండూ అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. 2017 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలు 2018లో సమ్మె నోటీసు ఇచ్చాయి. అప్ప టి ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న ఉద్దేశంతో ప్రభు త్వం దాన్ని అమలు చేయలేదు. కార్మిక సంఘాలతో చర్చించేందుకు నాటి మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. పలు దఫాల చ ర్చల అనంతరం 16 శాతం మధ్యంతర భృతిని కమిటీ ప్రకటించింది. 2018 జూన్ నుంచి అది కొనసాగుతోంది. ఈలోపు 20 21లో మరో వేతన సవరణ గడువు దాటి పోయింది. గత కొన్ని రోజులుగా కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు బకాయిల చెల్లింపుపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. త్వరలో పార్ల మెంటు ఎన్నికలు కూడా ఉండటంతో ప్రభుత్వం, ఒక వేతన సవరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బస్‌భవన్‌లో ప్రకటించారు. ఎంత పెరుగుతుందంటే..: గత ఆరేళ్లుగా 16 శాతం ఐఆర్‌ను లెక్కగడుతూ ఆర్టీసీ చెల్లిస్తోంది. ఇప్పుడు దాన్ని తొలగించి 21 శాతం ఫిట్‌మెంట్‌ను లెక్కగట్టి చెల్లిస్తారు. ఉద్యోగుల మూల వేతనంపై మాత్రమే ఐఆర్‌ను లెక్కిస్తారు. దీంతో ఆ పెరుగుదల తక్కువ గా ఉంటుంది. ఫిట్‌మెంట్‌ను మూలవేతనంతో పా టు కరువు భత్యం, ఇంక్రిమెంట్లపై లెక్కిస్తారు. దీంతో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీపై రూ.418.11కోట్ల భారం పడనుందని అంచనా. కాగా, ఆర్టీసీ ఉద్యో గుల్లో 41.47 శాతం మంది కండక్టర్లు, 35.20 శాతం మంది డ్రైవర్లు, 5 శాతం మంది మెకానిక్‌లు, 3.34 శాతం మంది శ్రామిక్లున్నారు. వీరి వేతనాల్లో పెరుగుదల ఎలా ఉండబోతుందో పరిశీలిద్దాం. స్వాగతిస్తున్నాం: టీఎంయూ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్మెంట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆశ్వత్థామరెడ్డి తెలిపారు. కార్మికులకు సంబంధించిన పే స్కేలు, బాండ్స్ డబ్బులు ఇచ్ఛిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌కు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నిర్ణయం: ఎన్ఎంయూ ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేయడం గొప్ప నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్షుడు పి.కమల్‌రెడ్డి, నరేందర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా పీఎఫ్ వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిల సమస్యను పరిష్కరించాలని కోరారు. ‘30 శాతం అనుకుంటే.. 21 శాతమే ఇచ్చారు’ వేతన సవరణ 30 శాతం చేస్తుందనుకుంటే 21శాతంతో సరిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణగౌడ్, సుద్దాల సురేశ్ ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. -
కాళేశ్వరం ఇంజనీర్లకు.. క్రాస్ ఎగ్జామినేషన్!
సాక్షి, హైదరాబాద్: ‘బ్యారేజీలను డిజైన్ల ప్రకారమే కట్టారా. డిజైన్లను ఉల్లంఘించి ఏమైన పనులు చేశారా? నిర్మాణంలో డిజైన్లు మార్చితే ఆమోదం తీసుకున్నారా? సరైన ఇన్వెస్టిగేషన్లు చేశారా ? భూసార పరీక్షల కోసం డైమండ్ డ్రిల్లింగ్ చేశారా ? ప్లానింగ్ ఏ విధంగా చేశారు ? క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి ముందు పరీక్షలు జరిపారా? క్వాలిటీ, ఎగ్జిక్యూషన్ విభాగాలు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాయా? ..అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాల్లో పాల్గొన్న ఇంజనీర్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రిటైర్డ్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనం కోసం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ శనివారం మూడో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:40 గంటల వరకు జలసౌధలో నిర్మాణం(ఎగ్జిక్యూషన్), క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్ విభాగాల ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థతో విడివిడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో వారి పాత్రపై ప్రశ్నలను సంధించింది. ఒక విభాగం ఇంజనీర్లు అందించిన సమాచారంలో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి మరో విభాగం ఇంజనీర్లకు సంబంధిత ప్రశ్నలు వేసి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన 2016 నుంచి ఇప్పటి దాకా వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, బదిలీ అయిన ఇంజనీర్లను కమిటీ ప్రశ్నించింది. కమిటీ ఇంజనీర్లను ప్రశి్నస్తున్న సమయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, ఇతర ఉన్నత స్థాయి అధికారులను సైతం లోపలికి అనుమతించలేదు. డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం.. బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున వాటితో సంబంధం ఉన్న వారంతా సంబంధిత ఫైళ్లతో ఢిల్లీకి రావాలని చంద్రశేఖర్ అయ్యర్ ఆదేశించారు. భారీ సంఖ్యలో ఫైళ్లు, ఉద్యోగులను ఢిల్లీకి పంపించడం సాధ్యం కాదని, నిపుణుల కమిటీలో నుంచి ఎవరైనా మళ్లీ హైదరాబాద్‌కు వస్తే ఇంజనీర్లందరినీ పిలిపించి అవసరమైన ఇతర సమాచారాన్ని అందిస్తామని నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేయగా, అయ్యర్ సానుకూలంగా స్పందించారు. కమిటీకి ఈఆర్టీ, జీపీఆర్ టెస్టుల నివేదికలు.. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని గతంలో ఎన్డీఎస్ఏ కోరింది. తాజాగా నిపుణుల కమిటీ మొత్తంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఇదే 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని కోరగా, నీటిపారుదల శాఖ అందించింది. దాదాపు 90శాతం సమాచారాన్ని వెంటనే నాలుగు బ్యాగుల్లో నింపి అప్పగించామని, వాటి బరువు 100 కేజీల కంటే ఎక్కువే ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వండి: ఈఎన్సీ(జనరల్) అనిల్ ప్రాణహిత నదికి ఏటా మే నుంచే వరదలు ప్రారంభమవుతాయని, బ్యారేజీలకి మరింత నష్టం జరగకుండా ఆ లోపే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, మరమ్మతులను సూచిస్తూ సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదికను అందించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేయగా, కమిటీ సానుకూలంగా స్పందించింది. నీటిపారుదల శాఖ అందించిన సమాచారంపై లోతుగా అధ్యయనం జరపడానికే కమిటీకి కనీసం నెల రోజుల సమయం పట్టనుందని అధికారులు అంటున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం వేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూప్యానల్(డీఎస్ఆర్పీ) తయారుచేసిన నివేదికను ఎన్డీఎస్ నిపుణుల కమిటీకి అందించారు. అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌటింగ్ చేయాలని, మేడిగడ్డ బ్యారేజీ అప్/ డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాకులతో పాటు బ్యారేజీ కుంగిన చోట అదనంగా సీకెంట్ పైల్స్, స్టీల్ పైల్స్ వేసి... తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక వానాకాలంలో బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని, వరదలన్నీ పూర్తిస్థాయిలో తగ్గాకే గేట్లు దించాలని కమిటీ గుర్తు చేసింది. మాజీ ఈఎన్సీలు దూరం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన రిటైర్డ్ ఇంజనీర్లు సైతం నిపుణుల కమిటీ ముందుకు హాజరు కావాలని నీటిపారుదల శాఖ ఆదేశించగా, ఇద్దరు మాజీ ఈఎన్సీలు సి. మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు దూరంగా ఉన్నారు. నిపుణుల కమిటీ పిలిస్తే వస్తానని పూర్వ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ సమ్మతి తెలిపి... హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండగా, ఆరోగ్యం బాగాలేదని మాజీ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరు కాలేదు. -
వ్యవసాయ కార్పొరేషన్లపై ఏసీబీ నిఘా
సాక్షి, హైదరాబాద్: ఆయన వ్యవసాయశాఖలోని ఒక కార్పొరేషన్ ఎండీ.. టెండర్లు, పనుల్లో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటారని ఆరోపణలున్నాయి. ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు మొదలు అన్నింటిలోనూ వసూళ్లేనని.. ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఆయన హైదరాబాద్‌లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక విల్లా, హైదరాబాద్ పరిసరాల్లో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ♦ ఇదేశాఖలోని ఓ కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు రెండు విల్లాలు, రెండు ప్లాట్లు, నగర శివారులో ఐదెకరాల ఫాంహౌస్ ఉందని సమాచారం. మరో కార్పొరేషన్‌కు చెందిన జనరల్ మేనేజర్‌కు ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, ఐదుచోట్ల ఇళ్ల స్థలాలు, నగర సమీపంలో రెండెకరాల భూమి ఉన్నాయి. ఒక కార్పొరేషన్‌లోని డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారికి ఒక విల్లా, రెండు ఖరీదైన ఫ్లాట్లు, స్థలాలు ఉన్నాయి. ♦ ..వ్యవసాయశాఖ పరిధిలోని కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనే జర్లపై వస్తున్న ఫిర్యాదుల్లోని అంశాలివి. దీనిపై దృష్టిపెట్టిన ఏసీబీ కొందరు పెద్ద ఎత్తున ఆస్తులు కూడ బెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. రెండు కార్పొరేషన్ల ఎండీలపై నేరుగా ఫిర్యాదులు అందడంతో.. ఏసీబీ అధికారులు లోతుగా పరిశీల న చేపట్టి, రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవసరమైతే ఆయా ఉద్యోగులను పిలిపించి విచారించేందుకు, సోదాలు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆయా కార్పొరేషన్ల జనరల్ మేనేజర్లు, మేనేజర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వ్యవసా య ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారు. ఐఏఎస్‌ల విచారణతో.. వ్యవసాయశాఖలోని 11 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఇద్దరు ఐఏఎస్‌లను విచారణ అధికారులుగా నియమించారు కూడా. దీంతో భారీగా దండుకున్న అధికారుల్లో దడ మొదలైంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, దీని నుంచి బయటపడేందుకు పలువురు ఎండీలు, జనరల్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. మార్క్‌ఫెడ్‌లో భారీగా ఉల్లంఘనలు! వ్యవసాయశాఖ పరిధిలో మార్క్‌ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్, హాకా, టెస్కాబ్, సీడ్ కార్పొరేషన్ వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో వందల కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. మార్క్‌ఫెడ్ లోనైతే ఏటా వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. దానిద్వారానే రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రైతుల పంటలను కూడా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకురావడం, రైతుల నుంచి కొన్న పంటలను విక్రయించాక వచ్చే డబ్బును బ్యాంకులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. అధికా రులు ఆయా లావాదేవీలను ప్రభుత్వ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకులతో నిర్వహిస్తుండటంపై విమర్శలు న్నా యి. ఈ వ్యవహారంలో కమీషన్లు చేతులు మారుతు న్నట్టు ఆరోప ణలు న్నాయి. ఎరువుల నుంచి గన్నీ బ్యాగుల దాకా.. ఎరువుల రవాణా టెండర్లు అధికారులకు వరాల జల్లు కురిపిస్తాయని.. రూ.వంద కోట్లకు పైబడి ఉండే ఈ టెండర్లను ఒకే కంపెనీకే వచ్చేలా నిబంధనలు రూపొందించి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కంపెనీకే టెండర్ దక్కుతూ వచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇక గన్నీ బ్యాగుల టెండర్లలోనూ కొందరు అధికారులు కంపెనీల నుంచి కమీషన్లు అందుకుంటున్నారన్న సమాచారం ఉంది. ♦ 2019–20లో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నను టెండర్ల ద్వారా తక్కువ ధరకు విక్రయించాల్సి రావడంతో దాదాపు రూ.1,200 కోట్లు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఎండీ స్థాయి అధికారి నుంచి మేనేజర్ల వరకు కోట్లలో కమీషన్లు ముట్టినట్లు ఫిర్యాదులున్నాయి. మార్క్‌ఫెడ్‌కు రూ.3 వేల కోట్ల అప్పులుంటే, ఈ స్కాం వల్లే సగం అప్పు పేరుకుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అసలు పదేళ్లుగా మార్క్‌ఫెడ్ జనరల్ బాడీ సమావేశం జరగలేదంటే నిబంధనల ఉల్లంఘన ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నాయి. మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి తన పోస్టును కాపాడుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ♦ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లోనైతే జిల్లా మేనేజర్లు కూడా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారు. వీరిలో కొందరిని అడ్డుపెట్టుకొని పైస్థా యి అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమా లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవే ట్ గోదాములతో సంబంధాలు పెట్టుకుని.. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌ను దివాలా తీయిస్తున్నా రన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పనులకు టెండర్లకు వెళ్లకుండా పాత వాటినే కొనసాగిస్తూ నష్టం కలిగిస్తున్నారని అంటున్నారు. ♦ ఆయిల్‌ఫెడ్‌లో సిద్దిపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతుల టెండర్‌ను తక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీకి కాకుండా మరో కంపెనీకి ఇవ్వడం వివాదం రేపింది. కోర్టులో ఈ వివాదం ముగిసింది. కానీ ఈ వ్యవహారంలో కొందరు అధికారులు పాత్ర పోషించారని.. కోట్లు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ♦ నిబంధనలకు విరుద్ధంగా ఆయిల్‌ఫెడ్‌లో రూ.కోటిన్నర, వేర్‌హౌజింగ్ కార్పొరేషన్లో రూ.కోటి మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద కేటాయించారు. ♦ హాకాలో శనగల కొనుగోలు వ్యవహారం విమర్శలకు దారితీసింది. ఇందులో ఎండీ పాత్ర కంటే అప్పటి ఒక ప్రజాప్రతినిధి జోక్యమే అన్ని విధాలుగా హాకాను భ్రష్టుపట్టించిందనే విమర్శ లున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి శనగలు సరఫరా చేసే బాధ్యత తీసుకొని వాటిని విని యోగదారులకు కాకుండా వ్యాపారులకు కమీష న్లకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. ♦ ఇక ఆగ్రోస్‌ను పెద్దగా అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ యాంత్రీకరణ అమలుకాకపోవడంతో ఆగ్రోస్ కునారిల్లిపోయింది. ♦ ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన ఒక ప్రజాప్రతినిధి తన పదవిని అడ్డుపెట్టుకొని రూ.500 కోట్ల దాకా వెనకేసుకున్నట్టు ఆరోపణ లున్నాయి. అధికారం ద్వారా అనేక వ్యాపారాలు చేసి కమీషన్లు వసూలు చేశారని, అధికారులు తనకు నచ్చినట్టుగా వ్యవహరించేలా చేశాడని సమాచారం. అదే ఇప్పుడు సదరు కార్పొ రేషన్‌ను బోనులో నిలబెట్టిందని అంటున్నారు. ఇప్పటికీ చక్రం తిప్పుతున్న మాజీ చైర్మన్లు గత ప్రభుత్వంలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేసినవారు ఇప్పుడు మాజీలుగా మారినా కొత్త ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారు. ఆయా కార్పొరేషన్ ఎండీలు, ఇతర మేనేజర్లు, ఉద్యోగులపై ఒత్తిడి చేస్తూ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే పార్టీ మారి మళ్లీ ఇదే కార్పొరేషన్‌కు చైర్మన్‌గా వస్తామనీ బెదిరిస్తున్నట్టు సమాచారం. కొందరు ఇప్పటికీ కార్పొరేషన్ల డ్రైవర్లను వాడుకుంటున్నట్టు తెలిసింది. సదరు మాజీ చైర్మన్లతో కలసి అక్రమాలకు పాల్పడిన పలువురు ఎండీలు వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
65 ఐటీఐల్లో స్కిల్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అధికారులు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పవన్ భగేరియాతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విస్తరిస్తున్న పరిశ్రమల అవసరాలకు, ఇప్పుడున్న కోర్సులకు మధ్య భారీ అంతరముందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంతరాన్ని తగ్గించి యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. రూ.2,700 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐలలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అవసరమైన వర్కషాప్ల నిర్మాణం, యంత్రపరికరాల సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెడతారు. అన్ని రంగాల్లో యువత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను ఎంపిక చేశారు. ప్రతి ఏడాదీ వీటితో 9000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు లక్ష మందికి షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తారు. ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి మొదలయ్యే అకడమిక్ సెషన్‌కు వర్క్ షాప్‌లను అందుబాటులో ఉంచాలని, సరిపడేంత మంది ట్యూటర్లను నియమించాలని ముఖ్యమంత్రి టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సూచించారు. కేవలం శిక్షణనివ్వటమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యాంపస్ ప్లేస్మెంట్లపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్లేస్‌మెంట్‌సెల్ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్ సూచించారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు హైదరాబాద్‌ను స్కిల్ డెవెలప్మెంట్హబ్గా తయారు చేసేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. -
కాళేశ్వరం అధికారులపై NDSA కమిటీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులు, ఇంజనీర్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చీఫ్, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సీరియస్ అయ్యారు. శనివారం ప్రాజెక్టు పరిశీలన అనంతరం జలసౌధలో జరిగిన కీలక సమావేశంలో ఇది చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే క్రమంలో అధికారుల తీరుపై అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో కమిటీ అడిగిన ప్రశ్నలకు.. కొంతమంది అధికారులు క్లారిటీ లేని సమాధానాలిచ్చారు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలు లేవంటూ నేరుగా చెప్పడంతో కమిటీ నిర్ఘాంతపోయింది. ఈ క్రమంలో.. ఇంజనీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో చంద్రశేఖర్ అయ్యర్ వాళ్లపై గరం అయ్యారు. ఇలా సమావేశంలో మూడుసార్లు ఆయన అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం. ఈ మీటింగ్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఈ మూడు బ్యారేజీలకు పని చేసిన వర్క్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అలాగే.. 2016 నుంచి ప్రస్తుతం (ఈనెల 8వ తేదీ దాకా) బ్యారేజీల ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీ, మోడల్ స్టడీస్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో పాల్గొన్నవారు.. ఆయా విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు బదిలీ అయినవారు, పదవీ విరమణ చేసినవారు కూడా విధిగా ఈ మీటింగ్‌కు హాజరు కావడంతో ఎన్డీఎస్ఏ కమిటీ కీలక సమాచారాన్నే రాబట్టే ప్రయత్ని చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక తమ పర్యటన నేటితో ముగియడంతో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ బృందం ఢిల్లీకి పయనం అయ్యింది. అంతకు ముందు.. గురు, శుక్ర వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ సందర్శించింది. భద్రత నడుమ.. కుంగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించింది. నాలుగు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. -
TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. కాగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నాం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16 శాతం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. కొత్త పీఆర్సీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తాం. 21 శాతం పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా నడుస్తోంది అని వ్యాఖ్యలు చేశారు. -
ఉక్కపోత పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలకు సమాంతరంగా రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అదేస్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వేగంగా నపమోదవుతోంది. శుక్రవారం రాష్ట్రంలోని గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 38.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా... ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతా చోట్ల ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతోంది. -
వైఎస్ విజన్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విజన్, విధానాల వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ అధికారంలోకి రాక ముందు హైదరాబాద్‌లో స్థిరాస్తి మార్కెట్ పూర్తిగా క్షీణ దశలో ఉండేదని, ఆయన సీఎం పదవి చేపట్టాక దూరదృష్టితో నగరాభివృద్ధి కోసం చేపట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే వంటి విప్లవాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని గుర్తుచేశారు. దీంతో అప్పుడు పుంజుకున్న స్థిరాస్తి మార్కెట్ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉందని చెప్పారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ 13వ ప్రాపర్టీ షో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో బిల్డర్లు కూడా భాగస్వాములేనన్నారు. బిల్డర్లు ఎంత వ్యాపారం చేస్తే రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బిల్డర్లను వ్యాపారస్తులుగా చూసే విధానాలకు స్వస్తిచెప్పి పరిశ్రమ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటామని పొంగులేటి హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మరింత పెంచి హైదరాబాద్ దాహార్తిని తీరుస్తామని, నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. నిర్మాణ అనుమతులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందని పేర్కొన్నారు. ధరణిలో 8.5 లక్షల దరఖాస్తులు పెండింగ్.. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వం ఎన్నో విధ్వంసాలకు పాల్పడిందని, సామాన్యులకు కలిగిన ఇబ్బందులను కళ్లారా చూస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రస్తుతం ధరణిలో 8.5–9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిలో 5.8 లక్షల దరఖాస్తులను సహేతుక కారణాల్లేకుండానే తిరస్కరించారని విమర్శించారు. స్పెషల్ డ్రైవ్‌లతో గత వారం రోజులలో 80 వేల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించామని పొంగులేటి చెప్పారు. రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఉన్న లొసుగులను గుర్తించి సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామన్నారు. పారదర్శక రెవెన్యూ వ్యవస్థను సామా న్యుల చెంతకు తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైఎస్సార్ లాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి అన్నారు. మూసీ రిఫర్‌ఫ్రంట్, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లతో ప్రధాన నగరంలో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ జాతీయ మాజీ అధ్య క్షుడు సి.శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి. రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు నుంచి ట్రైబల్ వర్సిటీలో క్లాసులు
ములుగు, రాయదుర్గం: సమ్మక్క–సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో తొలి ఏడాది బీఏ (ఇంగ్లిష్), బీఏ (సోషల్ సైన్స్) కోర్సులను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా జాకారం సమీపంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క, ఎంపీ మాలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అటవీశాఖ అభ్యంతరాలతో మధ్యలోనే నిలిచిన 50 ఎకరాల స్థలాన్ని త్వరితగతిన అప్పగించినట్లయితే పీఎం మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ చేసుకుందామని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో ఆ లస్యమైనప్పటికీ 337 ఎకరాలను రాష్ట్రం కేటాయించిందని చెప్పారు. అన్ని రకాల క్లియరెన్స్ వస్తే కాంపౌండ్ వాల్, డీపీఆర్, టెండర్ ప్రక్రియలను ప్రారంభిస్తామని తెలిపారు. ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యువతలో గేమ్ చేంజర్‌గా మారనుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలో 33 శాతం రిజర్వేషన్లను గిరిజనులకే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిరిజన ఆచారాలు, సంస్కృతి, వైద్యపరమైన మూలికలు, అడవి జీవన విధానాలు రీసెర్చ్‌లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మెంటార్ యూనివర్సిటీగా గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని తెలిపారు. యూజీసీ అ«దీనంలోని వెళ్లేంతవరకు హెచ్‌సీయూ అసోసియే ట్ ప్రొఫెసర్ వంశీ కృష్ణారెడ్డిని ఓఎస్డీగా నియమించినట్టు వివరించారు. అనంతరం వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శరత్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, కంట్రోలర్ ఎగ్జామినేషన్ పోరిక తుకారాం తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి హనుమకొండ కల్చరల్: పవిత్రమైన మహాశివరాత్రి రోజున వేయిస్తంభాల కల్యాణ మండపాన్ని మహాశివుడికి అంకితం చేస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో కల్యాణమండపాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా శ్రీరుద్రేశ్వరశివలింగానికి అభిõÙకం నిర్వ హించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం
లక్డీకాపూల్ (హైదరాబాద్): తెలంగాణను హెల్త్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పేద ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ, సంస్థకు మంచి గుర్తింపు తేవడానికి నిమ్స్ వైద్యులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శుక్రవారం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డీఎస్ఏ ల్యాబ్, యూఎస్ ఎయిడ్ సంస్థ సహకారంతో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ స్కిల్ ల్యాబ్‌లతో పాటు రూ.2 కోట్ల విలువైన సీటీఐసీయూను ప్రారంభించారు. స్కిల్ ల్యాబ్‌లో సీపీఆర్ విధానాన్ని ఆయన స్వయంగా చేసి మెళకువలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్‌కు జాతీయస్థాయిలో బ్రాండ్ ఇమేజ్ ఉందని.. దాని కొనసాగింపునకు తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాం«దీ, కాకతీయ, ఆసుపత్రులతో పాటు నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య, వైద్య రంగాలు మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను రూపొందిస్తోందని వివరించారు. నిమ్స్‌లో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ సిమ్యులేషన్ సిల్క్ లాబ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం కొత్తగా నియుక్తులైన 39 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 300 మంది స్టాఫ్ నర్సులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ విభాగం అధిపతి సాయి సతీశ్, యూఎస్ ఎయిడ్ డాక్టర్ వరప్రసాద్, హైదరాబాద్‌లోని అమెరికా కౌన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నిమ్స్, ప్రభుత్వ అనుసంధానకర్త డాక్టర్ మార్త రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలి. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. మహిళలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశమందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం ఉందని సీఎం అన్నారు. ఇదీ చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి? -
ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత
దుండిగల్: మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్(ఐఏఆర్ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు. జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పనులను అడ్డగించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపివేయడంతో పాటు పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తరువాత మరో సారి కూల్చివేతలు కొనసాగించగా కళాశాల యాజమాన్యం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూల్చివేతలను నిలిపివేశారు. కళాశాలకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐఏఆర్ఈ కళాశాలలో కూల్చివేతలు జరుగుతున్న విషయం తెలుసుకున్న వెంటనే కళాశాల చైర్మన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కళాశాలకు వచ్చి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. 20 రోజుల్లోపే చర్యలు.. దుండిగల్‌లోని చిన్న దామెర చెరువును ఫిబ్రవరి 20వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ స్వయంగా పరిశీలించారు. సుమారు 8.24 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారు లు అప్పట్లోనే ఆయనకు నివేదిక ఇచ్చారు. అదే నెల 22వ తేదీన ఎఫ్టీఎల్ సరిహద్దులను ఏర్పాటు చేసి షెడ్డులు, ఇతర నిర్మాణాలను తొలగించారు. తాజాగా ఐదు అంతస్తుల శాశ్వత భవనంలో రెండు అంతస్తుల మేర కొంత భాగాన్ని కూల్చారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్నా...ఆగలేదు: మర్రి రాజశేఖర్‌రెడ్డి 25 సంవత్సరాల నుంచి కళాశాలను నడిపిస్తున్నాం. అప్పటి నుంచి ఏ ఒక్క అధికారి కూడా నోటీసు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే అనుమతులు తీసుకున్నాం. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చిన తరువాత రెగ్యులరైజేషన్ చేసుకోవాలని సూచించడంతో 2015లోనే రెగ్యులరైజ్ కోసం రూ.90 లక్షలు చెల్లించాం. కేసు సుప్రీం కోర్టులో నడుస్తుంది. ఇది మా పట్టా భూమి. మేము కొనుగోలు చేశాం. చిన్న చిన్న డీవియేషన్లు ఉంటే రెగ్యులరైజ్ చేసుకుంటాం. వారం క్రితం నోటీసు ఇచ్చారు.. కోర్టు ద్వారా సమాధానం ఇస్తామని చెప్పినా కనీసం సమయం కూడా ఇవ్వలేదు. -
రయ్ రయ్‌మనేలా
కంటోన్మెంట్: ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కానుంది. రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు తీరిపోనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు రూ.2,232 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఆరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గిపోవడంతో ఇంధన రూపంలో వ్యయం తగ్గిపోనుంది. కారిడార్ నిర్మాణం ఇలా రాజీవ్ రహదారిపై నిర్మించనున్న కారిడార్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ సమీపంలోని ప్యా ట్నీ సెంటర్ నుంచి మొదలై కార్ఖానా, తిరు మలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్ సమీపంలోని ఓఆర్ ఆర్ జంక్షన్ వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 11.12 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.3 కి.మీ ఉంటుంది. మొత్తం 287 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్ వద్ద), అల్వాల్ వద్ద (0.310 కిలోమీటర్ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ పర్ డే –పీసీయూ) పయనిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 35,825గా ఉంది. ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో ఈ మా ర్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలి పోతున్నారు. సమయం హరించుకుపోవడంతో పా టు ఇంధన వ్యయం పెరుగుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలి సిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ బాధలు తొలగిపోతాయి. ముఖ్యాంశాలు... ♦ మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ. ♦ ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ. ♦ అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ. ♦ పియర్స్: 287 ♦ అవసరమైన భూమి: 197.20 ఎకరాలు ♦ రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు ♦ ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు ♦ ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లు ఇవీ ప్రయోజనాలు ♦ రాజీవ్ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు చెల్లు ♦ కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణం ♦ ఇంధనం మిగులుతో వాహనదారులకు తగ్గనున్న వ్యయం ♦ సికింద్రాబాద్ నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ఆర్ వరకు చేరుకునే అవకాశం ♦ మేడ్చల్–మల్కాజిగిరి–సిద్దిపేట–కరీంనగర్–పెద్దపల్లి–మంచిర్యాల, కొమురం భీం జిల్లా ప్రజలు లబ్ధిపొందనున్నారు. -
సింగరేణికి తాడిచెర్ల–2 బొగ్గు గని
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థకి తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడానికి అన్ని అనుకూలతలున్నాయని భట్టి వివరించారు. త్వరలో సింగరేణికి బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామని ప్రహ్లద్ జోషీ హామీ ఇచ్చారని భట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్‌లోనూ ఉత్పత్తిని ప్రారంభించే నిమిత్తం అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా రాష్ట్రంలోని సబ్స్టేషన్ల పరిసరాల్లో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సహకరించాలని విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌ను కోరామన్నారు. ఈ అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి వెంట ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సింగరేణి ఇన్చార్జీ సీఎండీ బలరామ్ ఉన్నారు. కాగా, తాడిచెర్ల బ్లాక్–2 గనిని సింగరేణికి కేటాయిస్తే సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి ఏటా 5మిలియన్ టన్నులకు పెరగనుంది. తాడిచర్ల బ్లాక్ 2 గని ద్వారా 30 ఏళ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదు మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేరు చేస్తే సరిపోతుందని చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంజనీర్లు కాదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఎవరికి వారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లనే అవి కూలిపోయాయని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్తు ఆలోచనా జ్ఞానం కోల్పోయారని భట్టి మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ అధికారులు చెప్పినట్లు చేయడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం చర్చలు జరుపుతోందని, సమయం, సందర్భాన్ని బట్టి జాబితా ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరో ముందుగా ప్రకటించారని తాము తొందరపడబోమని వ్యాఖ్యానించారు. -
మహా జాతర షురూ
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున ఆ ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. ఉద యం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాక మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్న ను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ గౌతమి, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. -
20 రకాల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందజేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. మొత్తం 20 రకాల సమాచారం కావాలని అడిగింది. మూడు బ్యారేజీల డిజైన్లు, వాటి నిర్మాణంపై అధ్యయనం జరిపి లోపాలను గుర్తించి పరిష్కారాలను సిఫారసు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలను సందర్శించి పరీశీలన జరిపింది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోవడంతో అప్పట్లో ఎన్డీఎస్ఏ నియమించిన మరో నిపుణుల కమిటీ, ఆ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని అప్పట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. తాజాగా చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకులకు సంబంధించిన అదే విధమైన 20 రకాల సమాచారాన్ని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. పగుళ్లు, పునాది పరిశీలన అయ్యర్ నేతృత్వంలో సైంటిస్టులు యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, డైరెక్టర్లు శివకుమార్‌శర్మ, రాహుల్‌కుమార్, అమితాబ్ మీనాలతో కూడిన బృందం మేడిగడ్డను తనిఖీ చేసింది. బ్యారేజీ అప్ స్ట్రీమ్‌లోకి దిగి 6, 7, 8 బ్లాక్‌లను నిశితంగా పరిశీలించింది. డౌన్ స్ట్రీమ్‌లోకి కూడా కాలినడకన వెళ్లి బ్యారేజీ కుంగిన తీరు, పగుళ్లు, పునాది ఎలా ఉందీ చూసింది. కుంగినప్పటి నుంచి ఎలాంటి పరీక్షలు జరిపారు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయత్రం 6.30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజినీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే మీడియా ప్రతినిధులను బ్యారేజీ లోపలికి అనుమతించ లేదు. కాగా నేడు సుందిళ్ల బ్యారేజీని కమిటీ సందర్శించనుంది. ఎట్టకేలకు ‘జియో’ సెక్షనల్ డ్రాయింగ్స్ మేడిగడ్డ బ్యారేజీ కింద భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’ డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించిన ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్స్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంపై గతంలో ఎన్డీఎస్ఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. లోతైన పరిశీలన కోసం జియోలాజికల్ వివరాలతో కూడిన బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్ (సెక్షనల్ డ్రాయింగ్స్)ను సమర్పించాలని కోరింది. అయితే ఇలాంటి డ్రాయింగ్స్‌ను తయారు చేయకుండానే బ్యారేజీని నిర్మించడంతో అప్పట్లో అధికారులు వాటిని సమర్పించలేకపోయారు. కానీ ఎన్డీఎస్ఏ పదేపదే కోరుతుండడంతో ఇటీవల జియోలాజికల్ వివరాలతో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్‌ను రూపొందించి ఎన్డీఎస్ఏకు నీటిపారుదల శాఖ పంపించింది.