జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కాంగ్రెస్‌ ఆహ్వానం | GHMC Mayor Vijayalakshmi to Join in Congress | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కాంగ్రెస్‌ ఆహ్వానం

Mar 23 2024 4:20 AM | Updated on Mar 23 2024 5:18 PM

GHMC Mayor Vijayalakshmi to Join in Congress - Sakshi

కేశవరావు ఇంటికి వెళ్తున్న దీపాదాస్‌ మున్షీ

కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం చెబుతా:  గద్వాల విజయలక్ష్మి

కె.కేశవరావు ఇంట్లో కలిసిన కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ‘రెండుసార్లు కార్పొరేటర్‌గా బంజారాహిల్స్‌ డివిజన్‌ ప్రజలు గెలిపించారు.  దీపాదాస్‌ మున్షీ మా ఇంటికి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మా డివిజన్‌ ప్రజలు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో చర్చించిన తర్వాతనే నా నిర్ణయం ప్రకటిస్తాను’ అని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు.

శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డిలు బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ కేశవరావు ఇంటికి వెళ్లారు. అక్కడే జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కేశవరావులతో గంటపాటు చర్చించారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా, పార్టీని బలోపేతం చేయా ల్సిందిగా దీపాదాస్‌ వారిని ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీలో విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement