
ఏంటి బ్రో.. నిజమే..
చాట్‌బాట్‌లు చెప్పేవన్నీ నిజాలు కావట.. కొన్ని వాటికవే ఊహించేసుకుని మనకు చెప్పేస్తాయట.. నిజం.. ఎందుకంటే.. దీన్ని చెప్పింది మేం కాదు.. ప్రఖ్యాత చాట్‌బాట్ సంస్థ చాట్ జీపీటీ నిర్వహణ సంస్థ అయిన ఓపెన్ ఏఐలోని పరిశోధనా బృందం. చాట్‌జీపీటీ వంటి చాట్‌బాట్‌లను లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్‌ఎల్‌ఎం) అంటారు. ‘‘c?’’ అనే అంశంపై ఓపెన్ ఏఐ పరిశోధకులు ఆడమ్ టౌమన్ కలాయ్, ఓఫెర్ నచూమ్, ఎడ్విన్ ఝాంగ్ సహా జార్జియా టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంతోష్ ఎం.వెంపాల సంయుక్తంగా ఒక నివేదికను రూపొందించి ఇటీవల విడుదల చేశారు. అందులో చెప్పిందే ఈ విషయం. వాళ్లేమంటారంటే..
‘‘ఉదాహరణకు పాఠశాలల్లో పిల్లాడిని ఉపాధ్యాయుడు ఏదైనా ప్రశ్న అడిగితే.. సమాధానం కింద ఇచ్చే నాలుగు సమాధానాల్లో ఏదో ఒకటి చెబుతాడు. అయితే కరెక్ట్ అవుతుంది లేదంటే తప్పు. నాకు తెలీదు అని కూర్చుంటే ఉన్న ఒక్క మార్కు కూడా పోతుంది. అచ్చం అలాంటి పిల్లల్లాగే కృత్రిమ మేధ చాట్‌బాట్‌లు కూడా ప్రవర్తిస్తాయి. గతంలో తమ యూజర్లు ప్రాంమ్ట్ మాదిరిగా అందించిన సమాచారంలో ఈ కొత్త ప్రశ్న తాలూకు సమాచారం లేకపోతే చాట్‌బాట్ సొంతంగా ఒక తప్పుడు సమాచారాన్ని సృష్టించి యూజర్‌కు అందజేస్తుంది.
ఆ సమాధానంతో యూజర్ సంతృప్తి చెందితే తాను చెప్పిన అంశం వాస్తవానికి దగ్గరగా ఉందని చాట్‌బాట్ గుర్తుంచుకుంటుంది. లేదంటే మరోసారి మరో సమాధానం ఇస్తుంది. ఇలా చాట్‌బాట్‌లు ఎప్పటికప్పుడు కొత్త అంశాలపై సమీక్ష జరుపుకుంటూ తమను తాము మెరుగుపర్చుకుంటాయి. తప్పులను మనం ఆపలేం కానీ ఆ తప్పుల నుంచి పాఠాలను నేర్చుకోగలం అనే సిద్ధాంతంతో చాట్‌బాట్‌లు పనిచేస్తాయి’’
అది బ్రో.. చాట్‌బాట్ నిజం వెనకున్న అసలైన నిజం..
గంటకు రూ.5,000 ఇంతకీ దేనికి?
ఇంక దేనికి.. హిందీ చాట్‌బాట్‌ను సృష్టించేందుకు.. చాట్‌బాట్‌లను మనం తెగ వాడతాం. ఈ విషయం మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు హిందీ చాట్‌బాట్ కోసం క్రియేటర్లు, కాంట్రాక్టర్లను నియమించుకుంటున్నారు. ఇందుకోసం గంటకు దాదాపు రూ.5,000 చెల్లిస్తున్నారు. క్రిస్టల్ ఈక్వేషన్, ఆక్వెంట్ టాలెంట్ సంస్థల ద్వారా కొత్త ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. హిందీ, ఇండోనేషియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలు అనర్గళంగా మాట్లాడే వాళ్లకు తొలి ప్రాధాన్యం కలి్పస్తారు. కథలు చెప్పడం, పాత్రల సృష్టి, కృత్రిమమేధ కంటెంట్ తయారీ వంటి సృజనాత్మక రంగంలో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇన్‌స్ట్రాగామ్, మెసెంజర్, వాట్సాప్ యాప్‌లలో హిందీ భాషలో చాట్‌బాట్‌ను సృష్టించడం ఈ ఉద్యోగుల ప్రధాన విధి. కోడింగ్ మాత్రమే కాదు ఈ మూడు యాప్‌లలో ఏఐ పాత్రలను సృష్టించే నిపుణులకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. టాలెంట్ ఉందా.. మరి బీ రెడీ.
కంటెంట్ ఈజ్ కింగ్..
కంటెంట్ క్రియేటర్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. కృత్రిమమేధ(ఏఐ) బ్రాండ్లు మార్కెట్లో మనుగడలో ఉండాలంటే కంటెంట్ క్రియేటర్లపై ఆధారపడక తప్పని పరిస్థితి. అందుకే కంటెంట్ స్ట్రాటజీ ఉద్యోగికి దాదాపు రూ.3.46 కోట్ల వార్షిక వేతనం ఇస్తామని తాజాగా ఓపెన్‌ఏఐ ప్రకటించింది. కంటెంట్ స్ట్రాటజీ, కాపీ రైటింగ్, గ్రోత్ మార్కెటింగ్ విభాగాల్లో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులని తెలిపింది. అక్షరాలు, ఆలోచనలకు వాస్తవరూపమిచ్చి కోట్లాది వినియోగదారుల మనసుల్ని చూరగొనే ఉద్యోగులే మాకు కావాలని చెప్పింది. ఇంతకీ జాబ్ ఎక్కడంటే.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో.. అందుకే కటౌట్ కాదు.. మన దగ్గరున్న కంటెంట్ ముఖ్యం అనేది..
ఏంటి భయ్యా ఇదీ..
మీరీ విషయం విన్నారా? తక్కువ వృత్తి నైపుణ్యాలున్న, కిందిస్థాయి(ఎంట్రీలెవల్) ఉద్యోగాలను కృత్రిమమేధ తుడిచిపెట్టేస్తుందని కృత్రిమమేధ భద్రతా, పరిశోధనా సంస్థ ‘ఆంథ్రోపిక్’ సీఈఓ డేరియో ఆమోడీ చెప్పారు. కన్సల్టింగ్, న్యాయసేవలు, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఎంట్రీలెవల్ ఉద్యోగులు ఒకటి నుంచి ఐదేళ్లలోపు కొలువుల్ని కోల్పోవడం ఖాయమని చెప్పారు. బీబీసీ పాడ్‌కాస్ట్ అయిన ‘‘బీబీసీ ర్యాడికల్ విత్ అమోల్ రాజన్’ ఆడియో ఇంటర్వ్యూలో డేరియో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘న్యాయసేవలు అందించే సంస్థలు మొదలు ఫైనాన్స్, అడ్మిని్రస్టేషన్ విభాగాల దాకా కొన్ని సంస్థల్లో డాక్యుమెంట్‌ల తనిఖీ అనేది మూస పద్ధతిలో సాగుతుంది. ఇలాంటి వైట్‌కాలర్ ఉద్యోగుల పనిని కృత్రిమమేధ సులభంగా చేయగలదు.
అందుకే ఇలాంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు త్వరలో మాయం అవుతాయి. కిందిస్థాయి ఉద్యోగుల్ని ఏఐతో భర్తీచేయాలని ఎన్నో కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. క్లరికల్ పనిని ఏఐతో చేయించాలని చూస్తున్నారు. ఎలాంటి సాఫ్ట్‌వేర్ కోడింగ్‌ను అయినా ఏఐ అనేది మూడు నుంచి ఆరు నెలల్లోపు నేర్చేసుకుంటుంది. దీంతో అత్యున్నతస్థాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు మినహా కిందిస్థాయి ఉద్యోగాలు డేంజర్‌లో పడనున్నాయి’’ అని ఆయన హెచ్చరించారు.