సంచలనం:దేశీయ తొలి చాట్‌బాట్‌ ‘లెక్సీ’ వచ్చేసిందిగా..!

India first ChatGPT powered AI chatbot Lexi launched - Sakshi

న్యూడిల్లీ: ఒకవైపు ఓపెన్‌ ఏఐ చాట్‌బాట్‌ చాట్‌ జీపీటీ సంచలనం కొనసాగుతుండగానే దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థ వెలాసిటీ  లాంచ్‌ చేసింది. ఈ చాట్‌బాట్‌కు కంపెనీ 'లెక్సీ' అని పేరు పెట్టింది. వినియోగదారులకు సులువైన, మెరుగైన సేవలు అందిస్తామని వెలాసిటీ సంస్థ కో ఫౌండర్‌ అభిరూప్‌ మెధేకర్‌ పేర్కొన్నారు. 

కంపెనీ ప్రకారం, వెలాసిటీ ఇన్‌సైట్‌లను ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌యాప్‌  వాట్సాప్‌ ఇంటర్‌ఫేస్‌లో ChatGPTని ఇంటిగ్రేట్ చేసింది.  తద్వారా ఈ-కామర్స్‌ వ్యాపారులకు వారి వ్యాపారాలపై విశ్లేషణలు ,రోజువారీ వ్యాపార నివేదికలు  (ఇన్‌సైట్స్‌ )పంపిస్తుందనీ,  క్లిష్టమైన వ్యాపార విధుల కోసం సమయాన్ని ఖాళీ చేస్తుందని కంపెనీ తెలిపింది. లెక్సీ  ప్రారంభించినప్పటి నుండి వెలాసిటీ  ఇన్‌సైట్స్‌  తమ బ్రాండ్ ఆదాయాన్ని మార్కెటింగ్ ఖర్చులను పర్యవేక్షించడంలో సహాయపడిందని నేచర్‌ప్రో  సీఈవో, పౌండర్‌ వ్యవస్థాపకుడు మోహిత్ మోహపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top