ఉద్యోగుల స్థానంలో చాట్‌బోట్స్.. 20 రకాల ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమిస్తామన్న చాట్‌జీపీ-4

Gpt-4 Version Says It Will Replace These 20 Jobs - Sakshi

ఆర్టీఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్స్‌ వల్ల మనుషుల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఉద్యోగుల స్థానాల్ని ఏఐ చాట్‌బోట్‌లు ఆక్రమించగా.. భవిష్యత్‌లో భారత్‌ వంటి దేశాల్లో వీటి వల్ల నిరుద్యోగం పెరిగిపోతుందంటూ మార్కెట్ పరిశోధనా సంస్థ గార్ట్‌నర్ చెప్పింది. తాజాగా చాట్‌బోట్స్ వల్ల ఏయే రంగాల ఉద్యోగాలకు ఎసరు వస్తోందో తెలుపుతూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

బిజినెస్‌ లీడర్స్‌ ఏం చెబుతున్నారంటే 
రెస్యూమ్‌ బిల్డర్‌ అనే సంస్థ ఇటీవల అయా రంగాలకు చెందిన వ్యాపార వ్యవహారాల్లో విశేషంగా రాణిస్తున్న 1000 మంది బిజినెస్‌ లీడర్స్‌తో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో అమెరికాలో ఉన్న సగానికిపై కంపెనీలు ఉద్యోగుల స్థానాన్ని చాట్‌బోట్స్ భర్తీ చేసేందుకు ప్రయాత్నాలు చేస్తున్నట్లు తేలింది. 

ఉద్యోగుల్లో భయాలు
ఇలా ఒక్క యూఎస్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్నీరంగాల్లో చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు పట్టిపీడిస్తున్నాయి. కానీ చాటీజీపీటీని తయారు చేసిన దీని మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ మాత్రం..చాట్‌ జీపీటీ ఉద్యోగుల స్థానాల్ని ఆక్రమించబోదని, ఉద్యోగులకు సహాయం చేసేందుకు మాత్రమే ఉండగలదని పేర్కొంది.   

జీపీటీ- 4 విడుదల
ఈ నేపథ్యంలో ఓపెన్‌ ఏఐ సంస్థ చాట్ జీపీటీకి అప్‍డేటెడ్ వెర్షన్ జీపీటీ- 4ను విడుదల చేసింది. ప్రస్తుత చాట్‍జీపీటీ-3.5 కన్నా ఇది మరింత వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు చెబుతుండడంతో దాని పనితీరుపై యూజర్లలో ఆసక్తి మొదలైంది. అందుకే ఈ లేటెస్ట్‌ వెర్షన్‌ వల్ల ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందా? అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ట్విటర్‌ యూజర్‌ ప్రశాంత్‌ రంగస్వామి చాట్‌జీపీ-4ని అడిగారు. రంగస్వామి ప్రశ్నకు సమాధానంగా 20 రకాల ఉద్యోగాల్లో మనుషులకు ప్రత్యామ్నాయంగా చాట్‌జీపీటీ-4 పనిచేస్తుందని రిప్లయి ఇచ్చింది. 

చాట్‌జీపీటీ-4 చెప్పిన ఆ 20 రకాల ఉద్యోగాలు ఇవే 
డేటా ఎంట్రీ క్లర్క్‌, కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటీవ్‌, ఫ్రూఫ్‌రీడర్‌, పారా లీగల్‌, బుక్‌కీపర్‌, ట్రాన్సలేటర్‌, కాపీరైటర్‌, మార్కెట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌, సోషల్‌ మీడియా మేనేజర్‌, అపాయింట్మెంట్‌ షెడ్యూలర్‌, టెలీ మార్కెటర్‌, వర్చువల్‌ అసిస్టెంట్‌, ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్‌, న్యూస్‌ రిపోర్టర్‌, ట్రావెల్‌ ఏజెంట్‌, ట్యూటర్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ అనలిస్ట్‌, ఈమెయిల్‌ మార్కెటర్‌, కంటెంట్‌ మోడరేటర్‌, రిక్రూటర్‌ వంటి జాబుల్ని రిప్లేస్‌ చేస్తుందని చెప్పింది. టెక్‌ దిగ్గజ సంస్థలు మాత్రం ఏఐ ఆధారిత టెక్నాలజీ వల్ల ఉద్యోగులకు నష్టం వాటిల్లదని చెబుతున్నారు.    

ఉద్యోగులకు నష్టం లేదు
చాట్‌జీపీటీల వంటి లేటెస్ట్‌ టెక్నాలజీ వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం లేదని, ఏఐలు ఉద్యోగులకు సహోద్యోగ్యులుగా మాత్రమే ఉంటాయంటూ టీసీఎస్‌ సీహెచ్‌ఆర్‌వో మిలింద్‌ లక్కడ్‌ తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top