ఇక చైనా ‘చాట్‌బాట్‌’.. రేసులో ఆలీబాబా!

China Chatbot Alibaba Joins Global Chatbot Race - Sakshi

చాట్‌జీపీటీ.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రంగంలో మారుమోగుతున్న పేరు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ తర్వాత చైనీస్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా కూడా ఈ రేసులోకి వచ్చింది. తాము కూడా చాట్‌ జీపీటీ తరహా సాధనం తీసుకొస్తున్నామని, ఇప్పటికే దీనిపై తమ ఉద్యోగులు టెస్టింగ్‌ ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఆలీబాబా సంస్థ ప్రతినిధి ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు తెలియజేశారు. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించేది స్పష్టం చేయలేదు. 

ఏఐ చాట్‌బాట్‌పై తమ టెస్టింగ్‌ వచ్చే మార్చిలో పూర్తవుతుందని మరో చైనీస్‌ సంస్థ.. సెర్చ్‌ ఇంజిన్‌ బైదు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆలీబాబా నుంచి ఈ  ప్రకటన వచ్చింది. మరోవైపు గూగుల్‌ కూడా ఈ చాట్‌ జీపీటీకి పోటీగా  ‘బార్డ్‌’ పేరుతో ఏఐ చాట్‌బాట్‌ సర్వీస్‌ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. 

సంచలనం సృష్టించిన ఈ చాట్‌బాట్‌ సర్వీస్‌ను శాన్‌ఫ్రాన్సిస్‌కోకు చెందిన ఓపెన్‌ఏఐ సంస్థ రూపొందించింది. కోరిన అంశాలపై వ్యాసాలు, పద్యాలు, ప్రోగ్రామింగ్‌ కోడ్స్‌ను ఇది సెకండ్ల వ్యవధిలో అందిస్తోంది. మరోవైపు దీని ద్వారా విద్యార్థులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రొఫెసర్లు, విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆర్థిక నేరాలు, వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే కూడా వ్యక్తమవుతున్నాయి.

(ఇదీ ‍చదవండి: Disney layoffs: 7వేల మందిని తొలగించిన డిస్నీ..  కారణం ఇదే..)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top