Disney layoffs: 7వేల మందిని తొలగించిన డిస్నీ..  కారణం ఇదే..

Disney Laysoffs 7,000 Employees - Sakshi

ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలను ఆర్థిక మాంద్య భయాలు పడీస్తున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. లేఆఫ్స్‌ బాట పట్టిన యూఎస్‌ టెక్‌ కంపెనీల సరసన ప్రముఖ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ డిస్నీ నిలిచింది. 7 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తాజాగా తెలిపింది. గతేడాది సీఈఓ బాబ్‌ ఇగర్‌ తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. 

‘‘ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు.. ప్రపంచవ్యాప్తంగా అంకిత భావంతో పనిచేస్తున్నప్రతిభావంతులైన మా ఉద్యోగులపై నాకు గౌరవం, అభిమానం ఉన్నాయి’’ అని త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం తనతో మాట్లాడిన విశ్లేషకులతో సీఈఓ బాబ్‌ ఇగర్‌ ఇలా వ్యాఖ్యానించారు. 2021 వార్షిక నివేదిక ప్రకారం.. ఆ ఏడాది నవంబర్‌ 2 నాటికి డిస్నీ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1.90 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది శాశ్వత ఉద్యోగులు.

తగ్గిపోయిన సబ్‌స్క్రైబర్లు
డిస్నీ ప్లస్‌కు సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిపోయింది. అంతకు ముందు త్రైమాసికంతో పోల్చుకుంటే గతేడాది డిసెంబర్‌ 31 నాటికి చందాదారుల సంఖ్య 1 శాతం తగ్గి 168.1 మిలియన్లకు పడిపోయింది. దీంతో కాస్ట్‌ కటింగ్‌పై దృష్టి పెట్టిన యాజమాన్యం 7వేల మందిని తొలగించేందుకు సిద్ధమైంది. అయితే గడిచిన త్రైమాసికంలో విశ్లేషకులు ఊహించినదాని కంటే మెరుగ్గా డిస్నీ గ్రూప్‌ 23.5 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు చేసింది.

(ఇదీ చదవండి: మేనేజర్లు అయితే ఏంటీ.. పనిచేయకపోతే రాజీనామా చేయండి: జుకర్‌బర్గ్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top