మేనేజర్లు అయితే ఏంటీ.. పనిచేయకపోతే రాజీనామా చేయండి: జుకర్‌బర్గ్‌

Zuckerberg Warning To Managers - Sakshi

మెటా కంపెనీ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ రానున్న రోజుల్లో మరికొంత మంది ఉద్యోగులను తొలగించేలా ఉన్నారు. తాజాగా ఆయన కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు ఇచ్చిన వార్నింగ్‌ చూస్తే లేఆఫ్స్‌పై హింట్‌ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గతేడాది నవంబర్‌లో ట్విటర్‌ సగం మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని రోజులకే జుకర్‌బర్గ్‌ కూడా మెటా సంస్థలో 11 వేల ఉద్యోగాలను పీకేశారు.  జుకర్‌బర్గ్‌ తాజా హెచ్చరికలతో ఉద్యోగుల్లో మళ్లీ లేఆఫ్‌ భయాలు నెలకొన్నాయి.

గత వారం కంపెనీలో జరిగన అంతర్గత సమావేశంలో సీఈఓ జుకర్‌బర్గ్‌.. మేనేజర్లు, డైరెక్టర్ల స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పలు హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ కనబర్చాలన్నారు. కేవలం సిబ్బందితో పనిచేయించడమే కాదు.. పనిలో వ్యక్తిగత పాత్ర కూడా ఉండాలని, లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు.  లేఆఫ్స్‌ ప్రారంభ దశలో జుకర్‌బర్గ్‌ మరింత ఎఫీషియన్సీ దిశగా పనిచేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. 

బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. రానున్న రోజుల్లో మెటా కంపెనీలో సీనియర్‌ మేనేజర్లు సైతం కింద స్థాయి ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కోడింగ్‌, డిజైనింగ్‌, రీసెర్చ్‌ వంటి వాటిపై దృష్టి పెట్టకుండా కేవలం ఇన్‌చార్జ్‌లుగా ఉంటామంటే కుదరదు. ఉద్యోగుల పనితీరుపై కంపెనీలో నిరంతర సమీక్షలు కొనసాగుతున్నాయి. పనితీరు బాగా లేని ఉద్యోగులపై లేఆఫ్స్‌ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్‌.. భారీగా జీతం వదులుకున్న సీఈఓ!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top